Aa Voori Pakkane Oka eru - 16 in Telugu Thriller by sivaramakrishna kotra books and stories PDF | ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 16

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 16

ఆ ఊరి పక్కనే ఒక ఏరు

(ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్)

శివ రామ కృష్ణ కొట్ర

నేను నివ్వెరపోయాను. నాకేం చెయ్యాలో బోధపడలేదు. అన్నానే కానీ ఆ పద్మనాభం తో ఆ విషయం ఎలా చెప్పాలో అర్ధంకాలేదు. అంతే కాకుండా నేనొప్పుకోక పోతే ఆవిడ అంత పనీ చేస్తుందని అనిపించింది.

"నాక్కొంత సుఖం ఇచ్చి, నువ్వు కొంత సుఖం అందుకుంటే ఏ సమస్యా వుండదు. దీనికి ఎందుకింత ఆలోచన?" దగ్గరగా వచ్చి నన్ను గట్టిగ కౌగిలించుకుంటూ అంది.

"నేను ఇది కూడా నిజమే చెప్తున్నా. తనలా వచ్చి నన్నలా కౌగిలించుకున్న తరువాత  నేను వేరే ఏ విషయం ఆలోచించ లేకపోయాను. బహుశా తనకి పెళ్ళికి ముందు కూడా ఆ విషయం లో మంచి అనుభవం వుండి ఉండాలి. రకరకాలుగా నేను తనని అనుభవించేలా చేసింది. సెక్స్ లో అంత కోరిక వున్న ఆమెని యాభైయేళ్ల పద్మనాభం సుఖపెట్టలేకపోవడంలో ఆశ్చర్యంలేదు.

పద్మనాభం వచ్చేవరకూ అక్కడే వుండి ఆ కుటుంబానికి అన్నిరకాలుగా అండగా ఉండాలని మరీ మరీ చెప్పి పంపించాడు అన్నయ్య. పద్మనాభం రావడానికి ఒక వారం పట్టింది. ఆ వారం రోజులు, నీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా. నన్నలా బ్లాక్ మెయిల్ చేసి నాతొ సెక్స్ చేయించుకుంది. నాకలా ఆ విషయంలో అనుభవం వచ్చింది."

"ఇదంతా నన్ను నమ్మమంటావా?" వంశీ మోహంలో జెన్యూన్ ఎక్స్ప్రెషన్ వంశీ చెప్తున్నది నిజమే అని చెప్తూన్నా అడిగింది తనూజ. అందులో నిజానికి నమ్మకపోవడానికి ఏమీ లేదు. అలాంటి ఆడదానికి వంశీలాంటి మగాడు కావాలనిపించడంలో ఆశ్చర్యం ఏమీ లేదు.

"మరోసారి పద్మనాభానికి అలాంటి అవసరమే వచ్చి మళ్ళీ నన్ను పంపమన్నాడు. అన్నయ్య నన్ను వెళ్ళమని బలవంతం చేసాడు. మామూలుగా అయితే చెప్పదలుచుకోలేదు. కానీ అప్పుడు అక్కడ ఏం జరిగిందీ అంతా చెప్పాసాను. నేను చెప్పినది నిజమో కాదో నువ్వు మీ బావని అడిగి తెలుసుకో. అప్పటివరకూ నువ్వు నన్ను నమ్మొద్దు."

"నో నువ్వు అబద్ధం చెప్తున్నావని నాకనిపించడం లేదు." దీర్ఘంగా నిట్టూరుస్తూ అంది తనూజ. "అలాంటి సెక్సువల్ మేనియాక్ లు వుంటారు."

"జరిగినదాంట్లో నా తప్పు ఉందని నాకు అనిపించలేదు. అందుకనే నీకు ప్రత్యేకంగా చెప్పలేదు. ఆమెతో శృంగారాన్ని నేను ఆనందించలేదు అని చెప్పలేను. కాకపోతే తప్పని పరిస్థితుల్లో మాత్రమే ఆలా చేసాను."

"ఓకే" తలూపింది తనూజ. "ఎనీహౌ ఆ విషయం నువ్వు ఇంకెవరికన్నా చెప్పవా?" అడిగింది.

"ఇంక ఎవ్వరికీ ఆ విషయం ఎట్టిపరిస్థిల్లోనూ చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకున్నాడు అన్నయ్య. ఆ మాట తప్పి, నేను నీకు చెప్పాల్సి వచ్చింది." విచారంగా అన్నాడు వంశీ. "అన్నయ్యకి ఆ పద్మనాభం చాలా మంచి ఫ్రెండ్. అతనికి అలాంటి భార్య దొరికినందుకు అన్నయ్య చాలా విచార పడ్డాడు."

"ఐ యాం సారీ. నేనూ నిన్ను ఆలా చెప్పమని బలవంతపెట్టకుండా ఉండాల్సింది." విచారంగా అంది తనూజ.

"అసలు నా మీద నీకలాంటి అనుమానం ఎందుకు వచ్చింది?" ఆశ్చర్యంగా అడిగాడు వంశీ.

తన క్లోజ్ ఫ్రెండ్ ప్రతిమ చెప్పిన విషయం చెప్పింది తనూజ. "రాత్రి నిద్రపోవడానికి ట్రై చేస్తూంటే తట్టింది నాకు. ఇంతకూ ముందే అనుభవం లేకపోతే నువ్వలా చెయ్యలేవూ అని."

"ఆల్రైట్. నీ అనుమానం తీరింది కదా." నవ్వాడు వంశీ.

అంతలో సడన్గా తనకి వంశీ తో ముందురోజు అనుభవం గుర్తుకు వచ్చింది తనూజాకి. నిజానికి ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్ళికి ముందు ఆ అనుభవం మరోసారి వద్దనుకుంది. వంశీకి ఎలా వుందో తెలియదు కానీ తనకి మాత్రం వళ్లంతా ఆ సుఖం కోసం పీకేస్తోంది.

"ఇంక వెళదామా? పొలంలో చాలా పనివుంది. నువ్వలా అన్నవని, ఆ పనంతా పక్కన పెట్టి నీతో మాట్లాడడానికి ఇలా వచ్చాను."బెడ్ మీద నుండి దిగినిలబడి అన్నాడు వంశీ.

తనూ కిందకి దిగింది తనూజ. ఏం చేస్తూందో అర్ధం అయ్యేలోపు తలుపులు గడియపెట్టి, వంశీ దగ్గరికి వచ్చి గట్టిగా కౌగలించుకుని అతని పెదవుల మీద ముద్దు పెట్టింది. ఆ తరువాత అంత క్రితంరోజు మాదిరిగానే జరిగింది. నిజానికి ఆల్రెడీ ఒకళ్ళ శరీరానికి ఒకళ్ళు అలవాటు పడ్డం వల్ల, ముందురోజుకన్నా కూడా ఎక్కువ సుఖమే అనుభవించారు.

&&&

"ఉదయాన్నే విషయాలన్నీ మాట్లాడతానన్నావు. ఇప్పటివరకూ కనిపించనే లేదు. వంశీ తో ఫ్రెండ్షిప్ అయ్యాక నీకు నేను కనిపించకుండా పోయాను." నిష్టూరంగా తనూజ మొహంలోకి చూస్తూ అన్నాడు మదన్.

"సారీ బావా. ఉదయాన్నే అలా పొలంలోకి వెళ్ళాను. నేను తిరిగి వచ్చేసరికి నువ్వు లంచ్ చేసి పడుకున్నావు. నిన్ను డిస్టర్బ్ చెయ్యడం ఎందుకులే అని ఊరుకున్నాను."

కాస్సేపటి క్రితమే మదన్ రూమ్ లోకి వెళ్ళింది తనూజ.

"సరే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిని ఎలా తీసుకోవాలి? తనేమో ఆ చిట్టిరాణి తన శరీరంలోకి ప్రవేశించేసింది అంటోంది." మళ్ళీ ఆందోళన మొదలైంది మదన్ లో.

"ఆ రోజు ఆ చిట్టిరాణి ని మామిడి చెట్టు మీద చూడడం అయినా, తరువాత తన ముందుకి వచ్చిందని అన్నా, ఈ రోజు అది తన శరీరంలోకి ప్రవేశించిందని చెప్తూన్నా, అన్నీ కూడా తన భ్రమలు మాత్రమే కానీ నిజం కాదు." కాస్త ఆగి మళ్ళీ మదన్ ఎదో అనబోయేలోగా అంది. "అలాని అది ప్రమాదకరం కాదని మాత్రం చెప్పలేను."

"చాల చిత్రంగా మాట్లాడుతున్నావు. ఒక పక్క అవి భ్రమలు అంటూనే, ప్రమాదకరం అంటున్నావు." చిరాగ్గా అన్నాడు మదన్.

"కొన్ని సందర్భాల్లో భ్రమలే వాస్తవాలకన్నా ఎక్కువ ప్రమాదకరం" కుర్చీలో అడ్జస్ట్ అవుతూ అంది తనూజ. "నా దృష్టిలో త్వరలోనే తనలో స్ప్లిట్ పెర్సనాలిటీ ప్రాబ్లెమ్ స్టార్ట్ అవుతుంది. అంటే తను చిట్టిరాణిలా బిహేవ్ చెయ్యడం ప్రారంభిస్తుంది."

"అలా కాకుండా మనం ఆపలేమా?"

"ముందు ఆ  స్ప్లిట్ పర్సనాలిటీ ఏమిటో బయటపడనివ్వడం మంచిది. అప్పుడు డీల్ చెయ్యడమే తేలిక. సప్రెస్ చెయ్యడానికి ట్రై చేస్తే ఇంకా ఎక్కువ ప్రాబ్లమేటిక్ కావచ్చు."

"ఏమిటో చాలా ఆందోళనగా వుంది నాకు. ఏం చెయ్యాలో బాధపడడం లేదు."

"కంగారు పడి మనం చెయ్యగలిగినది ఏమీ లేదు బావా. ముందు ఆ సమస్య పూర్తిగా బయటపడనీ. నా వల్ల కాదనిపిస్తే నాకు తెలిసిన చాలా మంది సైకాలజిస్టులు, ఇంకా సైకియాట్రిస్టులు వున్నారు. ఈ సమస్యనుండి తనని పూర్తిగా బయటపడేలా చేసే పూచీ నాది." ధైర్యం చెప్తూ అంది తనూజ.

మదన్ ఇంకా ఎదో మాట్లాడబోతూ ఉండగా ఆ రూమ్ లోకి  వచ్చాడు వంశీ. "సుస్మిత బయటకి ఎక్కడికో వెళ్లినట్టుగా వుంది. ఎక్కడికి వెళుతూందో నీకేమన్నా చెప్పిందా?" మదన్ ని అడిగాడు.

"లేదే. అయినా ఈ వూరిలో తనకెవరూ తెలియదు. ఎక్కడికి వెళుతుంది." ఆశ్చర్యంగా అన్నాడు మదన్.

"కిందకెళ్ళి అక్కని అడిగి చూద్దాం. తనకేమైనా చెప్పి వెళ్ళిందేమో." తనూజ అంది.

తరువాత అందరూ వంటింట్లో పనిచేసుకుంటూన్న వనజ దగ్గరికి వచ్చారు.

"ఆ రోజు తనని ఊళ్లోకి తీసుకెళ్లి మనకి తెలిసిన వాళ్ళని కొంతమందిని పరిచయం చేశాను. అలాగే ఒక రెండు టెంపుల్స్ కి కూడా వెళ్ళాం. బహుశా ఆ టెంపుల్స్ కి వెళ్లి ఉంటుంది. తనకి అంతసేపూ ఇంట్లోనే కూచుంటే బోర్ కొడుతుంది కదా." వనజ అంది.

"కానీ ఎవరికీ చెప్పకుండావెళ్లడమే ఆశ్చర్యంగా వుంది. తనెక్కడికి వెళుతున్నది ఎవరికో ఒకరికి చెప్పాలికదా. అందులోనూ తన మానసిక ఆరోగ్యపరిస్థితి కూడా అంత బాగోలేదు." చిరాగ్గా అన్నాడు మదన్.

వనజ ఎదో అనబోతూ ఉండగా అక్కడికి వచ్చింది సుస్మిత. అంత చిరాకుగా ఉన్నమదన్ కి సుస్మితని చూడగానే మనసు ప్రశాంతంగా అయిపొయింది.

"దేవిగారు ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారేమిటి? ఇంతకీ ఎక్కడికి వెళ్లి వస్తున్నారేమిటి?" వెటకారంగా అడిగాడు మదన్.

ఆ ప్రశ్న వినగానే అయోమయంగా, ఎదో గుర్తుచేసుకోవడానికి ప్రయ్సత్నిస్తున్నట్టుగా అయిపోయింది సుస్మిత మొహం.

"ఇంక ఎక్కడికి వెళ్లి ఉంటుంది? ఆ టెంపుల్స్ కే వెళ్లి ఉంటుంది." వనజ అంది.

"అవును. ఆ టెంపుల్స్ కే వెళ్ళాను." తలూపుతూ అంది సుస్మిత. కానీ ఆమె మొహం ఎదో అయోమయంగానే వుంది. 

"ఆలా ఆ కుర్చీలో కూచో. అందరితోపాటుగా నీకూ కాఫీ ఇస్తాను." వనజ అంది.

"లేదు. నాక్కొంచెం హెడేక్ గా వుంది. నేను నా రూంలోకి వెళ్ళిపోతాను." ఆలా అన్నాక ఇంక వనజ చెప్పేది వినకుండా అక్కడనుండి వెళ్ళిపోయింది సుస్మిత.

"తన ప్రవర్తన కొంచెం చిత్రంగా లేదూ?" తనూజ కి, వంశీ కి, ఇంకా మదన్ కి కాఫీ కప్పులు ఇస్తూ అంది వనజ.

"అవును. కొంచెం చిత్రంగానే వుంది." కొంచెం ఆందోళనగానే అన్నాడు మదన్.

వాళ్ళలా మాట్లాడుతూ ఉండగా అక్కడికి ముకుందం వచ్చాడు. "సమయానికి వచ్చారు. వచ్చి కూచోండి. మీకూ కాఫీ ఇస్తాను." మళ్ళీ గ్యాస్ స్టవ్ దగ్గరికి వెళుతూ అంది వనజ.

"ఈ రోజు మన తోటలోకి వచ్చింది సుస్మిత." వనజ ఇచ్చిన కాఫీని అందుకుంటూ అన్నాడు ముకుందం.

"వాట్? సుస్మిత మన తోటలోకి వచ్చిందా?" అదిరిపడుతూ అడిగాడు వంశీ.

"అదేకదా చెప్తున్నది. అంతేకాదు తానెక్కడైతే చిట్టిరాణిని చూశానని చెప్పిందో అక్కడే కనిపించింది నాకు. నేను పిలుస్తున్నావినిపించనట్టుగా బయలుదేరి వచ్చేసింది అక్కడనుండి. తన వెనకే వచ్చాను నేను. తరువాత ఆలా వచ్చి తను చిట్టిరాణి ఇంట్లోకి వెళ్ళింది."

"ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చిట్టిరాణి ఇంట్లోకి తనెందుకు వెళ్తుంది?" అరిచినట్టుగా అన్నాడు మదన్. ఇదంతా చాలా షాకింగా వుంది తనకి.

"ఎందుకు వెళుతుందంటే నేనేం చెప్పగలను? నేను చూసింది చెప్పాను అంతే." ముకుందం అన్నాడు. తమ్ముడి పరిస్థితి తనకి బాధాకరంగా వుంది. కానీ ఏం చేయలేకపోతున్నాడు.

"సుస్మితా, దీనికి ఏమంటావ్? మనం ఇప్పుడు ఏం చెయ్యాలి?" ఆందోళనగా సుస్మిత మొహంలోకి చూస్తూ అడిగాడు మదన్.

"ఇదీ ఒకందుకు మంచిదే బావా. ఆ స్ప్లిట్ పెర్సనాలిటీ ఎక్సపోజ్ అవుతున్నట్టుగా వుంది. అది అంతో ఇంతో ఎక్సపోజ్ అయితేనే దానితో మనకి డీల్ చెయ్యడానికి అవుతుంది." తనూజ అంది.

"ఈ పనికిమాలిన కబుర్లు ఆపి తనని ఎప్పటికి నీకు పూర్తిగా బాగుచెయ్యడం అవుతుందో చెప్పు. ఒకవేళ నీ వల్ల  కాదు అంటే చెప్పు వేరే ఇంకెవరిదగ్గరికైనా తీసుకెళతాం." వనజ అంది.

"మీరెంత ఫేమస్ సైకాలజిస్ట్ లేదా సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్లినా అతను కూడా ఈ సమస్యని వెంటనే తీర్చేలేడు. దీనికి పట్టాల్సిన సమయం పడుతుంది. నా ప్లాన్ నాకుంది. నేను తనని పూర్తిగా నయం చేయగలనని కాన్ఫిడెంట్ గా వున్నాను. మీరు నాకు ఛాన్స్ ఇవ్వాలి అంతే." తనూజ అంది.

"నేను నీకు పూర్తి ఛాన్స్ ఎప్పుడో ఇచ్చాను. అంతే కాకుండా నీ మీద నాకు నమ్మకం కూడా వుంది. ఇంతకీ నీ నెక్స్ట్ స్టెప్ ఏమిటన్నది చెప్పు?" మదన్ అడిగాడు.

"మొట్టమొదటగా చెయ్యాల్సినది, సుస్మితకి తానొక సైకలాజికల్ ప్రాబ్లెమ్ తో బాధపడుతూందని తెలిసేలా చెయ్యడం. తన సహకారం లేకుండా తనలోని స్ప్లిట్ పెర్సనాలిటీని క్యూర్ చెయ్యడం అవ్వదు. నా అభిప్రాయం ప్రకారం తనలోని స్ప్లిట్ పెర్సనాలిటీ త్వరలోనే పూర్తిగా ఎక్సపోజ్ అవుతుంది. అప్పటికి మనం తనని ట్రీట్మెంట్ కి సిద్ధం చెయ్యాలి." 

"ఇప్పటికే నువ్వు తానొక మానసిక సమస్య తో బాధపడుతోంది అని అర్ధమయ్యేలా చెయ్యాల్సింది." ముకుందం  అన్నాడు.

“తనని మామూలు మాటలతో, తానొక సైకలాజికల్ పేషెంట్ ని అనుమానం రాకుండా ట్రీట్ చేద్దాం అనుకున్నాను. అది సాధ్యం కాదని తేలిపోయింది. ఇంక తను బాధపడ్డా విషయం అర్ధమయ్యేలా చెప్పక తప్పదు."

"ఆల్రైట్ నేను అంగీకరిస్తున్నాను. నువ్వు బావుందనిపించినట్టుగా చెయ్యి." మదన్ అన్నాడు.

"ముఖ్యంగా నీకు చెప్పేది. తనమీద నువ్వెంత మాత్రం కోపం, చిరాకు చూపించకు. మనమంతా ముఖ్యంగా గుర్తువుంచుకోవాల్సినది. తననొక సైకలాజికల్ పేషెంట్ గా మనమెవరం చూడకూడదు. తాను చాలా చిన్న సమస్యతో బాధపడుతోందన్నట్టుగానే మనం ఉండాలి."

"తప్పకుండా అలాగే." మదన్ తలూపాడు.

"తనెక్కడికి వెళ్లినా ఆపొద్దు. కానీ తను ఏం చేస్తూంది అన్నది మాత్రం జాగ్రత్తగా గమనిస్తూండాలి. ఈ బాధ్యత నేనే తీసుకుంటున్నాను. తనని అనుక్షణం నీడలా కనిపెట్టి వుంటాను."

"థాంక్ యూ వెరీ మచ్." అనకుండా ఉండలేకపోయాడు మదన్.

"బావా...." కోపంగా చూసింది మదన్ వైపు తనూజ.

"మరిచిపోయి చెప్పాను. క్లోజ్ ఫ్రెండ్స్ మధ్య థాంక్స్ లు వుండకూడదు." నవ్వాడు మదన్.

"ఒకే. ఇప్పుడే సుస్మిత రూమ్ లోకి వెళ్లి తనతో మాట్లాడదాం. ఈ విషయంలో ఆలస్యం వద్దు." కుర్చీలోనుంచి లేచింది తనూజ కాఫీ కప్పులో లాస్ట్ సిప్ తీసుకుని టేబుల్ మీద పెడుతూ.

"అలాగే చేద్దాం." మదన్ కూడా కుర్చీలోనుంచి లేచాడు. తను కాఫీ సగం తాగి కప్పు టేబుల్ మీద ఎప్పుడో పెట్టేసాడు. తక్కిన ముగ్గురూ కూడా ఫినిష్ చేసిన కాఫీ కప్పులు డైనింగ్ టేబుల్ మీద పెట్టి పైకి లేచారు. 

అందరూ అక్కడినుండి వెళదామనుకుంటూన్న సమయంలో సుస్మిత అక్కడికి వచ్చింది.

" మేమే నీ దగ్గరికి వద్దాం అనుకుంటూండగా నువ్వే వచ్చావు." మదన్ అన్నాడు.

"మీరే నా దగ్గరికి వద్దామనుకుంటున్నారా, దేనికి?" ముఖం చిట్లించి ఆశ్చర్యంగా అడిగింది సుస్మిత.

"మనం హాలులో కూచుని మాట్లాడుకోవడం బావుంటుంది."వంశీ అన్నాడు.

"మీరంతా అక్కడకి పదండి. సుస్మితకి నేను కాఫీ తీసుకుని వస్తాను." వనజ అంది.

వనజ గ్యాస్ స్టవ్ దగ్గరికి నడిస్తే, తక్కిన అందరూ హాల్ లోకి నడిచారు.

&&&

"మేమందరం నీ శ్రేయోభిలాషులం, నీ మంచికోరుకునే వాళ్ళం అని నువ్వు నమ్ముతున్నావా?" అందరూ హాల్ లో సెటిల్ అయ్యాక, సుస్మితని అడిగింది తనూజ.

"మీకన్నా నా మంచి కోరుకునే వాళ్ళు ఎవరు వుంటారు? అయినా ఇదేమి ప్రశ్న?" ఆశ్చర్యంగా అడిగింది సుస్మిత.

"మా అందరి అభిప్రాయంలో నువ్వొక సైకలాజికల్ ప్రాబ్లెమ్ తో బాధపడుతున్నావు. దానికి అట్టే ఆలస్యం కాకుండా ట్రీట్మెంట్ చెయ్యాలి. నువ్వు అంగీకరిస్తే నీ ప్రాబ్లమ్ ని సాల్వ్ చెయ్యడం చాలా ఈజీ అవుతుంది." తనూజ అంది

"నేను ఏ సైకలాజికల్ ప్రాబ్లెమ్ తో బాధపడడం లేదు. నేను మానసికంగా చాలా ఆరోగ్యంగా వున్నాను." కోపంగా అంది సుస్మిత.

"నువ్వు కోపం తెచ్చుకోకుండా లాజికల్ గా ఆలోచించు. అసలు దెయ్యాలు, భూతాలూ ఉన్నాయా? అలాంటిది చిట్టిరాణి దెయ్యంగా మారి నీకు కనిపించిందని ఎలా అంటావు?" 

"మరి నాకు కనిపించిన చిట్టిరాణి ఎవరు?" కోపంగా అడిగింది సుస్మిత.

"నువ్వు మానసిక భ్రమకి లోనయ్యావు. దటీజ్ హల్యూసీనేషన్. నువ్వేదో కారణం వాళ్ళ ఆ చిట్టిరాణి గురించి బాగా ఆలోచించడం వల్ల అలా జరిగింది. అంతే కానీ నువ్వక్కడ ప్రత్యేకంగా ఏమీ చూడలేదు."

"భ్రమకి, వాస్తవానికి తేడా తెలియని స్థితి లో లేను." అదే కోపంతో అంది సుస్మిత. "నేనేం చిట్టిరాణి గురించి బాగా ఆలోచించడం వల్ల అలా జరగ లేదు."

"ప్లీజ్ సుస్మితా. మేం చెప్పేది అర్ధం చేసుకో. దయ్యాలు భూతాలు లేవు. నువ్వు అంగీకరిస్తేనే నీకు ట్రీట్మెంట్ చెయ్యడానికి వీలవుతుంది." తనూజ అనునయంగా  అంది.

"నేను చెప్పేది మీరంతా ఎందుకు అర్ధం చేసుకోరు?" కుర్చీలోనుంచి ఆవేశంగా, కోపంగా పైకి లేచింది సుస్మిత. "అక్కడ మామిడి చెట్టుమీద మాత్రమే కాదు. నేను ఈ ఇంట్లో కూడా ఆ చిట్టిరాణి ని చూసాను. నిజానికి...నిజానికి..." కాస్త ఆగి అంది మళ్ళీ. "అది నాలో ప్రవేశించేసింది. అదిప్పుడు నా వంట్లోనే వుంది.”

తనూజ ఇంక ఎదో మాట్లాడబోతూండగా మదన్ తనని ఆగమని చెప్పి సుస్మిత దగ్గరగా వచ్చి తన భుజాలచుట్టూ కుడిచేతినివేసి దగ్గరికి తీసుకున్నాడు. "నీ మీద నాకున్న ప్రేమని నువ్వు నమ్ముతున్నావా?" అని అడిగాడు.

"హండ్రెడ్ పర్శంట్ నమ్ముతున్నాను. అయినా అది నువ్వు నన్ను అడగాలా?" చిరాగ్గా అంది సుస్మిత.

"నీకు నామీద వున్న ప్రేమ కూడా అంతే నిజం కదా."

"ఈ పిచ్చి ప్రశ్నలు ఆపుతావా? నీ మీద ఎంత ప్రేమలేకపోతే నిన్నే వెతుక్కుంటూ ఇక్కడికి వస్తాను?" ఇంకా చిరాకు పడుతూ అంది.

"అయితే నువ్వు మేము చెప్పింది నమ్మాలి. ఈ ట్రీట్మెంట్ కి అంగీకరించాలి." ధృడంగా అన్నాడు మదన్.

"కానీ మదన్....." ఎదో చెప్పబోయింది సుస్మిత.

"నో వే. నా మీద నీకు, నీ మీద నాకు వున్న ప్రేమ నిజమే అయితే నువ్వుఇది కాదనకూడదు. అంతే." అంతే ధృడత్వంతో అన్నాడు మదన్.

"ఆల్రైట్. సరే అయితే." ఒక హెల్ప్లెస్స్ ఎక్స్ప్రెషన్ తో తలూపుతూ అంది సుస్మిత. "ఇంతకీ ఏ ట్రీట్మెంట్? ఎవరు నాకు ఆ ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నారు?" మళ్ళీ తన కుర్చీలో కూలబడుతూ అంది సుస్మిత.

"ఇంకెవరు? ద గ్రేట్ సైకాలజిస్ట్ తనూజగారే నీకా ట్రీట్మెంట్ ఇవ్వబోయేది." సుస్మిత కి కాఫీ కప్పు అందిస్తూ అంది అప్పుడే అక్కడకి వచ్చిన వనజ.

"నిజంగానా? ఇంతకీ ఎప్పుడు ఇవ్వబోతున్నారు మీరు నాకు ట్రీట్మెంట్?" కాఫీని సిప్ చేస్తూ అడిగింది సుస్మిత తనూజ మొహంలోకి చూస్తూ.

"నా అభిప్రాయంలో నీలో స్ప్లిట్ పెర్సనాలిటీ డెవలప్ అవుతూంది. అది కొంచెం బలపడగానే నా ట్రీట్మెంట్ ప్రారంభిస్తాను. అదింకా నీలో ఇనిషియల్ స్టేజి లోనే ఉందని నాకనిపిస్తూంది." తనూజ చెప్పింది.

(ఇక్కడివరకూ నచ్చిందని భావిస్తా. తరువాతి భాగం సాధ్యమైనంత త్వరలోనే పబ్లిష్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మర్చిపోవద్దు.)