Aa Voori Pakkane Oka eru - 15 in Telugu Thriller by sivaramakrishna kotra books and stories PDF | ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 15

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 15

ఆ ఊరి పక్కనే ఒక ఏరు

(ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్)

శివ రామ కృష్ణ కొట్ర

"ఐ యాం సారీ బావా. నేను నా రూమ్ లో పడుకోడానికి వెళుతూన్న సమయంలో అక్క తనూ మాట్లాడుకుంటూ వున్నారు. అలా వాళ్ళు ఇంకాస్సేపు మాట్లాడుకుంటారు కాస్సేపాగాక నేను తన రూమ్ లోకి వెళ్లి తనతో ఉండొచ్చు అనుకున్నాను." రిగ్రెట్ఫుల్ ఎక్స్ప్రెషన్ తో అంది తనూజ.

"సుస్మిత తన రూమ్ లోకి పడుకోడానికి వెళ్ళగానే తనకి చెప్పమని తనూజ నాకు చెప్పింది. నేనే మర్చిపోయాను. తన తప్పేమీ లేదు." వనజ అంది. "అంతే కాదు సుస్మిత తో ఎవరో ఒకరు ఎప్పుడూ ఉండడం కూడా అవసరమని తను నాకు చెప్పింది. అందుకనే సుస్మితని ఎప్పుడూ నాతోనే వుంచుకుంటున్నాను కూడా."

"కానీ ఇప్పుడు చిట్టిరాణి తన శరీరంలోకే వచ్చేసిందంటోంది, ఏం చేద్దాం?" తనూజ మొహంలోకి చూస్తూ ఆందోళనగా అడిగాడు మదన్.

"ఇప్పటికి ఇప్పుడుగా మనం ఏం చెయ్యలేం. మాణింగ్ ఆలోచిద్దాం. అనవసరంగా ఆందోళన పడకుండా వెళ్లి పడుకో." సుస్మిత చుట్టూ చెయ్యివేసి దగ్గరికి తీసుకుంటూ అంది తనూజ.

"నాకిప్పుడు వెళ్లి పడుకున్నా నిద్ర పట్టదు. ఏం చేస్తే బావుంటుందో ఏమిటో ఇప్పుడే చెప్పు." అక్కడ వున్న బెడ్ మీద కూలబడుతూ మొండిగా అడిగాడు మదన్.

"నో, బావా. అలాగా అవ్వదు." తనూ అంత మొండిగానూ అంది తనూజ. "అసలు ఏం జరిగిందో, ఎలా జరిగిందో నేను తనతో చాలా క్లియర్ గా మాట్లాడి తెలుసుకోవాలి. మీరిద్దరూ వెళ్లిపడుకోండి."

"నేనుండగా అడిగితె ఏమవుతుంది?" మదన్ కోపంగా అడిగాడు.

"కుదరదని చెప్పాగా. మీరుండగా నేనేం మాట్లాడను. అదంతే."

మదన్ ఇంకా ఎదో అనబోతూ ఉంటే కల్పించుకుని అంది వనజ. "నీకు తన మొండితనం గురించి తెలుసు కదా. ఒక విషయంలో పట్టుదలకు వచ్చిందంటే ఎవ్వరి మాట వినదు. కావాలని తీసుకొచ్చి అప్పగించేవు కదా. ఇక సుస్మిత తన బాధ్యత. పద మనం వెళ్లి పడుకుందాం."

చేసేది లేక, బెడ్ మీద నుండి లేచి తలూపి, ఆ రూమ్ లోనుండి వెళ్ళిపోయాడు మదన్. సుస్మిత, తనూజ మొహాల్లోకి ఒకసారి చూసి వనజ కూడా ఆ రూమ్ లోనుండి వెళ్ళిపోయింది.    

&&&

"థాంక్ యూ వెరీ మచ్. నువ్వు చేస్తూన్న సహాయం మర్చిపోలేను." వాళ్లిద్దరూ వెళ్ళిపోగానే తనూజని కౌగిలించుకుంటూ అంది సుస్మిత.

"చంపేస్తాను మరోసారి థాంక్స్ చెప్పావంటే. క్లోజ్ ఫ్రెండ్స్ కి ఎవరన్నా థాంక్స్ చెప్తారా?" కోపం అభినయిస్తూ అడిగింది తనూజ.

"సారీ. మర్చిపోయి చేప్పాను." విచారం అభినయిస్తూ అంది సుస్మిత.

"క్లోజ్ ఫ్రెండ్స్ కి సారీలు కూడా చెప్పారు." ఇంకా కోపాన్ని అభినయించబోయి నవ్వేసింది తనూజ.

"నీలా ఆనందంగా నవ్వాలని వుంది. కానీ నవ్వలేను. ఆ చిట్టిరాణి విపరీతంగా భయపడుతూంది నన్ను." సుస్మిత మొహం సడన్ గా భయంతో నిండిపోయింది మళ్ళీ.

"ఆ చిట్టిరాణి విషయం మర్చిపో. ఆ సమస్య అదే సాల్వ్ అవుతుంది."

"ఎలా సాల్వ్ అవుతుంది? ఎంతగా ప్రేమించింది మదన్ ని తను. కానీ మదన్ తనని అలా అవమానించాడు. ఆలా నీళ్ళల్లో పడి కొట్టుకుపోతున్నా కూడా తనని కాదన్నట్టుగా ఊరుకున్నాడు.” సుస్మిత ఎమోషనల్ అయింది. "ఎంత తను నన్ను ప్రేమిస్తూవున్నాకూడా ఈ విషయంలో అంగీకరించలేకపోతున్నాను."

"అది నేనూ ఒప్పుకుంటాను. మదన్ తన ప్రేమని అంగీకరించి ఉండాల్సింది." వెళ్లి అక్కడ బెడ్ మీద కూచుంటూ అంది తనూజ. "కొంతవరకూ చిట్టిరాణి కోపంలో న్యాయం వుంది."

మదన్ ని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుందని అనుకున్న తనూజ అలా అన్నాక సుస్మిత డిప్రెస్ అయిపోయింది. "కానీ మొదటినుండి ఎప్పుడూ చిట్టిరాణిని ప్రేమించానని మదన్ చెప్పలేదు. తను తనని ప్రేమించలేనని చెప్తూన్నా కూడా అలా వెంటపడడం కూడా తప్పే కదా."

"నీలో ఏం చూసి ప్రేమించాడు, తనలో ఏం చూడక ప్రేమించలేదు? ఇలా మాట్లాడడానికి నాకు కష్టంగానే వుంది. కానీ నిజం మాట్లాడకుండా ఉండలేను. చిట్టిరాణి నీ అంత అందగత్తె కాదు. అంతే కాకుండా చిన్నతనం నుండి నువ్వే కావాలని వాడి వెంట పడింది. అందుకనే మదన్ ప్రేమించలేదు." సుస్మిత మొహంలోకి చూస్తూ అంది తనూజ.

"నేనొప్పుకోను. వెంటపడితేనే ప్రేమించాలని మాట అయితే తన వెంట అంతగా పడుతున్న ఆ నాగరాజుని చిట్టిరాణి ఎందుకని ప్రేమించలేదు?" సుస్మిత కోపంగా అడిగింది.

"ఓహ్, అయితే నీకా నాగరాజు విషయం కూడా తెలిసిందన్న మాట." తనూజ నవ్వింది. "వాడో పెద్ద వెధవ. తిరుగుబోతు. తాగుబోతు. వాడు చిట్టిరాణి వెంట పడ్డ విషయం నిజమే కానీ వాడికి కావాల్సింది చిట్టిరాణి మనసు కాదు, శరీరం. వాడిని చిట్టిరాణి ప్రేమించకపోవడంలో ఏ తప్పూ లేదు."

ఏం మాట్లాడాలో తెలియక తల దించుకుంది సుస్మిత. తనూజ మాటలు తనకు ఊరడింపుగా వుంటాయనుకుంటే ఇలా బాధ పెడుతుందనుకోలేదు.

"అనవసరంగా బాధపడకు. చిట్టిరాణి అంతగా వెంటపడిందని అన్నాను కానీ ఏ మనిషికీ ఇంకో మనిషిని ప్రేమించమని బలవంతం చేసే అధికారం లేదు. ఎమోషనల్ గా ఆలోచిస్తే అనిపిస్తుంది తప్ప, మదన్ లో తప్పు పట్టడానికి ఏమీ లేదు. తనకి ప్రేమించాలనిపించిన వాళ్లనే ప్రేమించే అధికారం తనకి వుంది. నీ అందం చూసి ప్రేమించాడన్నది నా వూహ మాత్రమే. అది నిజం అవ్వాలని ఏముంది? ఇంకా నీలో ఎదో నచ్చే నిన్ను ప్రేమించి ఉంటాడు. ప్రేమలు అన్నవి కిందటి జన్మలో సంబంధాలతో పుట్టుకుని వస్త్తాయి. మీ ఇద్దరికీ గత జన్మలో కూడా ఎదో సంబంధం వుంది కాబట్టే ఈ జన్మలో ఇలా దగ్గరయ్యారు." సుస్మిత భుజాల చుట్టూ కుడిచెయ్యి వేసి అంది తనూజ.

"నువ్వు ఒక సైకాలజిస్ట్ లా మాట్లాడటం లేదు." నవ్వుతూ అంది సుస్మిత.

"సైకాలజిస్ట్ కావడం కన్నా ముందు నేనొక మనిషిని. మామూలు ఆడపిల్లని." తనూజ అంది. "నిజం చెప్పాలంటే నా మూడ్ కూడా ప్రెజెంట్ ఏమీ బాగా లేదు."

"మూడ్ బాగాలేకపోతే షేర్ చేసుకోవడానికి నీకొక క్లోజ్ ఫ్రెండ్ ఉందని మర్చిపోయావా?" కోపం అభినయిస్తూ అడిగింది సుస్మిత.

"జస్ట్ సమయం కోసం వెయిట్ చేస్తున్నాను. నీతో కాకపోతే ఇంకెవరితో షేర్ చేసుకుంటాను." దీర్ఘంగా నిట్టూర్చి అంది తనూజ. "నేను నా ప్రేమని వంశీ దగ్గర ఎక్ష్ప్రెస్స్ చేసేసాను."

"ఖచ్చితంగా యాక్సప్ట్ చేసే ఉంటాడు. నీలాంటి అందమైన ఆడపిల్ల ప్రేమని ఎవరు వదులుకుంటారు?" మోహంలో ఆనందంతో అంది సుస్మిత.

"అఫ్ కోర్స్, ఎస్. ముందు కొంచెం తటపటాయించాడు కానీ అల్టిమేట్ గా అదే జరిగింది." సుస్మిత చుట్టూ వున్నా చెయ్యిని తీసేసి బెడ్ మధ్యలో బాసిపట్టు వేసుకుని కూచుని అంది తనూజ.

"తటపాటయింపు దేనికి?" ఆశ్చర్యంగా చూస్తూ తనూజకి ఎదురుగుండా తనూజాలాగే కూచుని అడిగింది సుస్మిత.

"తను నా అంత అందంగా లేడట. నాలా చదువుకోలేదట. ముఖ్యంగా మా మామ్ ఒప్పుకోదని భయం. ఆ సందేహాలన్నీ తీర్చి లైన్లో పెట్టుకొనేసరికి సమయం పట్టింది. మా ఇద్దరి మధ్య అది కూడా అయిపోయింది." బుగ్గలు రెండూ సిగ్గుతో ఎర్రబడిపోతూ ఉంటే అంది తనూజ.

" అంటే, నాకు అర్ధం కాలేదు." అర్ధం అయినా కానట్టుగా అడిగింది సుస్మిత.

"మేమిద్దరం ఆ శృంగార అనుభవం పొందాం. సరేనా?" చిరుకోపంతో అంది తనూజ.

"ఇక్కడ నిన్నంత పూర్తిగా సపోర్ట్ చెయ్యదలుచుకోలేదు." తనూ చిరుకోపంతో అంది సుస్మిత. "కాస్త పెళ్లయ్యేవరకూ ఆగలేక పోయారా?"

"ఆగుండాల్సింది. నాకు అదే గిల్టీ గా వుంది. కానీ తనని పూర్తిగా నా లవ్ గురించి కన్విన్స్ చెయ్యడానికి అదే మార్గం అనిపించింది. అందుకనే....." ఏం చెప్పాలో తెలియక ఆగి పోయింది తనూజ.

"ఆల్రైట్. జరిగిందేదో జరిగింది. పెళ్లయ్యేలోగా ఇంకోసారి అది వద్దు. నువ్వు నా అంత ఆర్థోడాక్స్ కాదని నాకు తెలుసు. కానీ ఈ క్లోజ్ ఫ్రెండ్ మాట విను."

"వింటాను. నేనూ అదే అనుకుంటున్నాను. ఒక సోషల్లీ ప్రొహిబిటెడ్ థింగ్ చేసిన తరువాత గిల్టీ ఫీలింగ్ వస్తుందని నాకు తెలుసు. కానీ ఆ పని చేసిన తరువాత గిల్టీ ఫీలింగ్ భరించలేక పోతున్నాను. పెళ్లయ్యేలోపు మా ఇద్దరి మధ్య అది ఉండదు. ఐ యాం స్యూర్."

"దట్స్ గుడ్. ఒక స్ట్రాంగ్ డెసిషన్ కి వచ్చావు కదా. ఇంకా అనీజీగా ఫీలవ్వడానికి ఏముంది?"

"అఫ్ కోర్స్, అలా పెళ్లి కాకుండా అనుభవం పొందినందుకు నాకు ఇప్పటికీ గిల్టీ గానే వుంది. కానీ అంతకన్నా బాధిస్తూన్న విషయం ఇంకొకటి వుంది." అంటూ తన క్లోజ్ ఫ్రెండ్ ప్రతిమ తనకి చెప్పిన విషయం చెప్పింది. "వాడు అంత సీజన్డ్ గా నన్ను అనుభవించిన తీరు చూస్తే వాడికి ఇంతకూ ముందే అమ్మాయిలతో సంబంధం వుండివుండాలి. కనీసం ఒక్క అమ్మాయితోనైనా సరే వాడికి సంబంధం వుండి తీరాలి. లేకపోతే అలా చెయ్యలేడు."

"వంశీ మనసులో విషయం ఏమిటో కూడా తెలుసుకోకుండా తనని బలవంతపెట్టి కమిట్ చేయించావు. ఇప్పుడు ఎవర్ననగలవు?" చిరాకుగా అంది సుస్మిత.

"ఇప్పటికే తాను ఎవరితోనన్న ప్రేమలో ఉంటే నాకు చెప్పాలిగా." ఇంకా కోపంగానే వుంది తనూజ.

"నో, నో, తను ఎవరితోనన్నాప్రేమలో వున్నాడని నేననుకోను. ఒకవేళ ఆలా ఉండివుంటే నీ ప్రేమని ఆలా అంగీకరించి, నీతో సెక్స్ పంచుకునేవాడే కాదు. సాలోచనగా అంది సుస్మిత. “మరి తనకి ఇంతకుముందే ఎవరన్నా అమ్మాయితో లేదా అమ్మాయిలతో సెక్స్ అనుభవం వుందా అన్నది, నీ ఇంకో క్లోజ్ ఫ్రెండ్ అన్న మాటల్ని బట్టి చూస్తే అనుమానించాల్సిందే."

"అనుమానించడం కాదు, గట్టి నమ్మకం. ఆ రాస్కేల్ కి అంతకు ముందే మంచి అనుభవం వుండి ఉండాలి. లేకపోతె ఆలా చెయ్యలేడు." ఇంకా కోపగించుకుంటూ అంది తనూజ.

"కావచ్చు. కానీ అంత మాత్రానికే నువ్వింత కోప్పడాల్సిన అవసరం లేదు. నేను ఆర్థోడాక్స్ గా ఆలోచిస్తూన్నా, ఇలా సెక్స్ కాంటాక్ట్స్ చాలా కామన్. ఇంక మగాళ్ల విషయంలో అసలే చెప్పక్కర్లేదు. ఒకవేళ వంశీకి సెక్స్ లో ఎవరితోనన్నా ఇప్పటికే అనుభవం వుండివున్నానువ్వేమి వెలి వేసేయక్కర్లేదు. నువ్వు తనని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నావు, తనూ నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు. ప్రేమ అన్నిటిని జయించడమే కాదు. అన్నిటినీ క్షమిస్తుంది కూడా."

కింద పెదవిని రెండు పళ్ళవరుసలలో బిగబట్టి కాసేపు ఆలోచనలో పడింది తనూజ. "సరే అయితే. నువ్వు చెప్పింది బాగానే వుంది." కొన్ని సెకన్ల తరువాత పెదవిని రిలీజ్ చేస్తూ అంది.

"అయినా ఎందుకు ఈ అనవసరపు ఆలోచనలు? రేపు వంశీని కలిసి విషయం అడిగేసేయ్. నీ మీద ప్రేమవుంటే అబద్ధం చెప్పొద్దని చెప్పు. నీది కేవలం అనుమానంగానే తేలిపోవచ్చు కూడా."

"నాకలా అనిపించట్లేదు." బెడ్ మీద పడుకుని అడ్జస్ట్ అవుతూ అంది తనూజ. "ఎనీహౌ నువ్వూ పడుకో. నాకు నిద్ర వస్తూంది."

సుస్మిత కూడా తనూజ పక్కనే బెడ్ మీద పడుకుని అడ్జస్ట్ అయింది. ఆ తరువాత పెద్దగా ప్రయత్నించకుండానే ఇద్దరికీ నిద్ర పట్టేసింది.

&&&

"నీతో ఒక విషయం అర్జెంట్ గా మాట్లాడాలి." పొలంలోకి వెళ్లి, వంశీని కలిసి, అతని మొహంలోకి సూటిగా చూస్తూ అంది తనూజ.

"మాట్లాడు. నాకు అభ్యంతరం ఏమీ లేదు." ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు వంశీ.

"ఇక్కడ కాదు. వేరే ప్లేస్ కి ఎక్కడాకన్నా వెళ్ళాలి. మనకి ఒక అరగంట డిస్టర్బన్స్ వుండకూడదు." అదే సీరియస్ నెస్ తో అంది తనూజ.

వంశీ పెదవులమీదకి చిన్న చిరునవ్వు ముంచుకు వచ్చింది. "నీకప్పుడే అదింకోసారి కావాలనిపిస్తూంది కదూ. నాకూ అలాగే వుంది."

"పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. పళ్ళు రాలగొడతాను. నేనొచ్చింది అందుకు కాదు. నీతోటి నిజంగానే చాలా సీరియస్ విషయం మాట్లాడాలి." సీరియస్ నెస్ ఏమాత్రం తగ్గకుండా అంది.

"ఆల్రైట్" విషయం నిజంగానే సీరియస్ అన్న విషయం వంశీకి అర్ధం అయిపొయింది. "పద. ఆ ఫామ్ హౌస్ లోకే వెళదాం. అక్కడైతేనే మనకి ఏ డిస్టర్బన్స్ ఉండదు."

"నువ్వు నిజం చెప్తే నేను అప్రిసియేట్ చేస్తాను. నువ్వు అబద్ధం చెప్తే నాకు తెలిసిపోతుంది. ఈ జన్మలో మళ్ళీ నీ మొహం చూడను. గుర్తుంచుకో." ఫామ్ హౌస్ లోకి వచ్చాక వంశీ మొహంలోకి చూస్తూ అదే సీరియస్ నెస్ కంటిన్యూ చేస్తూ అంది తనూజ.

"ఏ చదువూ లేకపోయినా నన్ను ప్రేమించావు. నువ్వు నాకు ప్రాణం కన్నా ఎక్కువ. ఎవరికన్నా అబద్ధం చెప్తానేమో కానీ నీకు చెప్పను. అదేమిటో అడుగు." తనూ సీరియస్ గా అన్నాడు వంశీ.

"నాకన్నా ముందే వేరే అమ్మాయితో నీకు ఆ అనుభవం వుంది కదా? నాకెందుకు ఈ డౌట్ వచ్చిందని అడక్కు. వుందో లేదో నిజం చెప్పు?"

తలదించుకున్నాడు వంశీ.

"అంటే దానర్ధం వుంది, అవునా? నీకు వేరే అమ్మాయితో రేలషన్ షిప్ వుంది. కానీ అది దాచిపెట్టి నేను ప్రేమించాననగానే, నాతో ప్రేమలో పడ్డావు." కోపంగా అరిచింది తనూజ.

"నాకు సెక్స్ లో అనుభవం ఉన్నమాట వాస్తవమే. అది చాలా రోజుల కిందట. కానీ నాకు వేరే ఏ అమ్మాయితోటి రేలషన్శిప్ లేదు. ఇది నిజం." తల ఎత్తి తనూజ మొహంలోకి చూస్తూ అన్నాడు వంశీ.

"మై గాడ్! ఇట్ ఈజ్ షాకింగ్!" తనూజ అంది నిజంగానే షాక్ ఫీలవుతూ. నిజంగా ఎంత ఇలాటిది ఎక్స్పెక్ట్ చేసిన డైరెక్ట్ గా ఇలా వినేసరికి షాకింగానే వుంది. "అసలు నీకు ఎవరితోనైనా సెక్స్ చెయ్యాలని ఎందుకు అనిపించింది? అది తప్పని నీకు అనిపించలేదా?"  

"నేను కావాలని చెయ్యలేదు. నన్ను ఆమె బలవంతం చేస్తే ఆలా చేయాల్సివచ్చింది. నేను తప్పించుకోలేకపోయాను." విచార వదనంతో అన్నాడు వంశీ.

"అసలు ఏం జరిగిందో పూర్తిగా చెప్పు. నిన్ను నమ్మాలో వద్దో నేను ఆలోచిస్తాను." అక్కడవున్న బెడ్ మీదకి వెళ్లి కూచుంటూ అంది తనూజ.

తనూ వెళ్లి తనూజ పక్కగా బెడ్ మీద కొంచెం దూరంలో కూచున్నాడు వంశీ. "మా ఫైనాన్సియల్ వ్యహారాలన్నీ చూసే ఆడిటర్ పద్మనాభం చాలా రోజులుగా ఈ ఫ్యామిలీ కి క్లోజ్ ఫ్రెండ్. అతని మొదటి భార్య చనిపోతే మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. ఒకసారి తనకి వేరే అర్జన్ట్ పనిమీద ఊరెళ్లాల్సి వచ్చింది. నన్ను వాళ్ళింటి దగ్గర తన భార్యకి ఇంక పిల్లలకి సహాయంగా ఉండేలా పంపించమని అన్నయ్యని రిక్వెస్ట్ చేసాడు. అందులో అభ్యంతర పెట్టాల్సినది ఏమీ లేక అన్నయ్య అంగీకరించాడు. నాకు అందులో వద్దనడానికి ఏమీ కనిపించలేదు." కాస్త ఆగాడు వంశీ.

తనూజ వింటూంది. కొంత అర్ధం అయినట్టుగానే వుంది.

"నాకు అప్పుడు ఇరవై మూడు ఉంటాయి. ఆ పద్మనాభం రెండో భార్యకి ముప్ఫయి ఆలా ఉండొచ్చు. అతని మొదటి భార్యకి ఒక కూతురు తనకి ఒక కూతురు వున్నారు. అది మొదటి రోజు. నేను ఆ కుటుంబానికి చెయ్యాల్సిన సహాయం అంతా చేసిన తరువాత నా గదిలోకి వెళ్లి నా బెడ్ మీద పడుకున్నాను. తలుపులు దగ్గరికే వేసాను కానీ లోపలినుండి గడియ పెట్టడానికి లేదు. నాకు కావాలనే అలాంటి గది ఇవ్వబడింది అని తరువాత కానీ అర్ధం కాలేదు. రాత్రి పదకొండు ఆలా అవుతూంటే నా పక్కనే ఎవరో పడుకుని నన్ను పట్టుకున్నట్టుగా అనిపించి ఉలిక్కిపడి లేవబోయాను." మళ్ళీ కాస్సేపాగి మొదలు పెట్టాడు వంశీ.

"ఉష్, లేవకు. ఇది నేనే." అది పద్మనాభం భార్య గొంతు.

"ఏమిటి? ఏం కావాలి నీకు?" నేను షాక్ తో అడిగాను.

"మరీ చిన్న పిల్లాడిలా మాట్లాడకు. నేను ఏం కావాల్సి వచ్చి నీ దగ్గరికి వచ్చానో నీకు తెలియదా?" గుసగుస గా అంది నా చెవిలో.

"చాల్లే నోర్ముయ్." నేను కోపంగా బెడ్ దిగి పోయాను. "పెళ్లయి ఒక కూతురు వున్నదానివి. పరాయి మగాడి దగ్గరికి దాని గురించి వస్తావా? నీకూ చెట్టంత మొగుడు వున్నాడు కదా."

"ఏంటి లాభం వాడు నాకు సుఖాన్నివ్వలేకపోయాక. వాడి మగతనం ఇలా నాలోకి వస్తుందో లేదో తెలియదు అంతా అయిపోతుంది. ఎంత కాలంగానో నన్ను సుఖపెట్ట గలిగిన మగాడి గురించి చూస్తున్నాను. రా నాకు సుఖాన్నిచ్చి నువ్వు కూడా అనుభవించు." తనూ బెడ్ మీదనుండి దిగి, నా దగ్గరికి వచ్చి నా మొహంలోకి చూస్తూ అంది. ఆ బెడ్ లైట్ కాంతిలో తను స్పష్టంగా కనిపిస్త్తూ వుంది.

"అదెప్పటికీ జరగదు. నువ్వు వెంటనే ఇక్కడినుండి వెళ్లకపోయావంటే నేను నీ మొగుడు రాగానే విషయం అంతా చెప్పేస్తాను." నేను కోపంగా అన్నాను.

"నా మొగుడు వారం వరకూ రాడు. కానీ నువ్వు నేను చెప్పినట్టుగా చెయ్యకపోతే ఇప్పుడే అందరికీ నువ్వు నన్ను రేప్ చెయ్యబోయావని చెప్తాను. ఆ సుఖం కోసం తెగించి నీ దగ్గరికి వచ్చినదాన్ని. ఆలా చెయ్యలేనా?" బెదిరింపుగా నా మొహంలోకి చూస్తూ అంది.

(ఇక్కడివరకూ నచ్చిందని భావిస్తా. తరువాతి భాగం సాధ్యమైనంత త్వరలోనే పబ్లిష్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మర్చిపోవద్దు.)