Aa Voori Pakkane Oka eru - 10 in Telugu Thriller by sivaramakrishna kotra books and stories PDF | ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 10

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 10

ఆ ఊరి పక్కనే ఒక ఏరు

(ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్)

శివ రామ కృష్ణ కొట్ర

"నేను నీ గురించే పొలాలనన్నీ వెదుక్కుంటూ ఇక్కడివరకూ వచ్చాను. నువ్వెక్కడా కనిపించలేదు. ఫామ్ హౌస్ లో వున్నావేమోనని అక్కడికి వెళదామనుకుంటూ ఉంటే నువ్వు నా వెంకాతలే వున్నావు." ఎందుకో తెలీలేదు బుగ్గలు రెండూ సిగ్గుతో కందిపోయాయి తనూజకి.

అచ్చం తను ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే వున్నాడు వంశీ. ఏపుగా కండలు తిరిగిన శరీరంతో, నల్లటి వత్తైన జుట్టుతో వున్నాడు. కాకపోతే పల్లెటూరివాళ్లలాగా గడ్డం, మీసాలు మాత్రం పెంచలేదు. నున్నగా షేవింగ్ చేసుకుని వున్న ఆ బుగ్గల్ని ఒకసారి ముట్టుకుని చూస్తే ఎలా ఉంటుందా అన్న ఆలోచన వచ్చింది తనూజకి. అలా ధృడంగా వున్న ఆ శరీరంతో వంశీ తనని ఒకసారి బలంగా కౌగలించుకుంటే ఎలావుంటుంది అన్న ఇంకో ఆలోచన వచ్చి శరీరం అంతా ఎదో తెలియని ధ్రిల్ తో నిండిపోయింది.

తను పది పన్నెండు సంవత్సరాల కిందట చూసిన ఆ సమయంలోనే తనూజ ఏపుగా ఇంకా పెద్దమనిషి కాకపోయినా అయినట్టుగా ఉండేది. ఆమె వేసుకున్న షర్ట్ లోనుంచి కొంచెం కొంచెం గా పెరుగుతూ వున్న ఆమె పాలిండ్లు స్పష్టంగా కనిపిస్తూ ఉండేవి. ఆమె పెద్దమనిషై పది సంవత్సరాల పైనే అయివుండొచ్చు. యవ్వనం చాపకింద నీరులా వచ్చి చేరింది. బలంగా ముందుకు పొడుచుకు వస్తూన్న వక్షోజాలని అదిమిపట్టి ఆపుతున్నాయి ఆమె వేసుకున్న బ్లౌజ్ ఇంకా లోపల వేసుకున్న బ్రా. తెల్ల రంగు సిల్క్ చీర కింద, అదే రంగు బ్లౌజ్ కింద అదే రంగుతో వున్న ఆమె బ్రా అవుట్ లైన్ తెలుస్తూంది వంశీకి. ఆమె కంఠం కింద, బ్లౌజ్ బ్రా వల్ల వచ్చిన రెండు వక్షోజాల మధ్య కాలువ వద్దనుకున్నా చూడకుండా వుండలేకపోతున్నాడు వంశీ. వేసుకున్న రెండు జడల వల్ల తప్పితే అన్నివిధాలుగా సంతరించుకున్న పెద్దరికం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది వంశీకి తనూజ లో.

"నా గురించి చూస్తున్నావా? దేనిగురించో తెలుసుకోవచ్చా?"  ఆమె అందాలనుండి అతికష్టం మీద దృష్టి మరల్చడానికి ప్రయత్నిస్తూ అడిగాడు వంశీ.

"ఐ యాం సారీ." చిన్న గొంతుతో అన్నావంశీకి మాత్రం బాగానే వినిపించింది. "నీకు సారీ చెప్పాలనే వచ్చాను."

"నాకు సారీ చెప్పాలని వచ్చావా? దేనికి ఇంతకీ?" వంశీ మొహం ఆశ్చర్యంతో నిండిపోయింది. తనూజ సారీ చెప్పడమా, అందులోనూ తనకి.

"నిన్ను చాలా ఇన్సల్ట్ చేసి మాట్లాడాను. నిన్ను బాధపెట్టాను. అందుకు." ఇంక వంశీ మొహంలోకి చూడలేక తలదించుకుంది.

"నన్ను ఇన్సల్ట్ చేశావా? బాధ పెట్టావా? ఎప్పుడు?" వంశీ మోహంలో ఆశ్చర్యం ఇంకా అలాగే వుంది.

"అంత మర్చిపోయినట్టుగా నటిస్తావేం? నావల్లే కదా ఆరోజు ఇంట్లో అంత గొడవ జరిగి అక్క నిన్ను కొట్టింది." వంశీ మొహంలోకి మళ్ళీ చూసింది తనూజ.

"నిన్నయితే రెండు చెంపలూ వాయించి పారేసింది కదా. మీ అమ్మకి కోపం వచ్చి మళ్ళీ ఎప్పుడూరామని ఒట్టుపెట్టుకుని మరీ నిన్నక్కడనుండి తీసుకుని వెళ్ళిపోయింది." నవ్వుతూ అన్నాడు వంశీ.

"ఆరోజు అది పూర్తిగా నా తప్పే. నాకలా జరగాల్సిందే." కాస్త ఆగి మళ్ళీ అంది తనూజ. "ఆ రోజే కాదు, అంతకు ముందు కూడా నిన్నుచాలాసార్లు ఇన్సల్ట్ చేసి బాధపెట్టాను. నన్ను క్షమించు."

ఆ మాట వినగానే పగలబడి నవ్వాడు వంశీ. "నువ్వు చాలా చిన్నపిల్లవి అప్పుడు. ఎదో తెలియక అన్నావు. నేనదంతా ఎప్పుడో మర్చిపోయాను. నువ్వూ మర్చిపో."

"నువ్వు నన్ను క్షమించానని చెప్తే కానీ మర్చిపోలేను."

"నీకు కావాల్సిందల్లా నేను క్షమించడమే అయితే, ఆల్రైట్ క్షమించాను. ఇంక అప్పటి సంఘటనలన్నీ మర్చిపోయి హాపీ గా వుండు." వంశీ అన్నాడు.

"సరే అయితే." ఆనందంగా తలూపింది తనూజ. "ఈ పొలాలన్నీ చూసి ఎంతకాలం అయిందో! ఇక్కడ నిలబడి ఇలా అంతా చూస్తూవుంటే మైమరచిపోతున్నా. ఒకసారి వీటన్నిటినీ తిరిగి చూద్దామా?"

"నా అభ్యంతరం ఏమీ లేదు. కానీ మన పొలాలనన్నిటినీ ఇప్పుడే చూసేయడం సాధ్యమయ్యే పనికాదు. నువ్వు రేపు కూడా రావాల్సివుంటుంది. మీ బావ పొలాలనన్నిటినీ చూడాలంటె నువ్వు ఒకరోజంతా కేటాయించాల్సి ఉంటుంది." అక్కడనుండి నడుస్తూ అన్నాడు వంశీ.

" నేనిక్కడ వున్నంతకాలం రోజూ వస్తాను. నాకది చాలా ఇష్టం." వంశీని వెనకాతలే అనుసరిస్తూ అంది తనూజ.

"అంటే నువ్విక్కడ కొన్ని రోజులపాటు వుండబోతున్నావా?" మనసులో ఏంటో ఆనందం కలిగింది వంశీకి.

"ఆ. మాడ్ రమ్మన్నాడు. తను లవ్ చేసిన సుస్మితకి ఎదో సైకాలాజికల్ ప్రాబ్లెమ్ వచ్చింది కదా. నేను సైకాలజీ చదివాను కాబట్టి నేను తన ప్రాబ్లెమ్ సాల్వ్ చేయగలనని, ఇంక కొంతకాలం పాటు తనకి తోడుగా కూడా ఉంటానని రమ్మన్నాడు."

"మాడ్ నీకు సుస్మిత గురించి అంత చెప్పాడా?"

"అంతా చెప్పేసాడు. అంతే కాదు. ఆ సుస్మిత తో కూడా మాట్లాడాను. తనూ అంతా చెప్పేసింది. ఆ రోజు తను మామిడి తోటలో ఆలా ఒంటరిగా విడిచిపెట్టబడ్డ తరువాత ఏం జరిగిందో చాలా క్లియర్ గా చెప్పింది."

చటుక్కున ఆగి తనూజ మొహంలోకి చూసాడు వంశీ. "నువ్వు సుస్మితతో మాట్లాడావా? తను నీకు అంతా చెప్పేసిందా?"

"అంతా చెప్పేసింది. అంతే కాదు, తను నీకు, నా అక్కాబావలకి కూడా అంతా చెప్పేసానని, మీ ముగ్గురూ తనకి ప్రాబ్లెమ్ నుండి బయటపడడానికి పూర్తి సాయం చేస్తామని మాట ఇచ్చారని కూడా చెప్పింది." తనూజ అంది.

"మాట ఇవ్వకుండా ఎలా ఉంటాం? కానీ ఈ సమస్య చాలా పెద్దది." నిస్సహాయంగా తలూపుతూ అన్నాడు వంశీ. "మాడ్ చాలా పెద్ద సమస్యలో ఇరుక్కున్నాడు."

"మదన్ కన్నా కూడా పెద్ద సమస్యలో సుస్మిత వుంది. తనగురించి తలుచుకుంటూ ఉంటే నాకు చాలా బాధగా వుంది." బాధతో నిండిపోయింది సుస్మిత మొహం.

"నువ్వు చెప్పింది నిజమే. ఇప్పుడు మన హెల్ప్ వాళ్ళకి చాలా అవసరం."

"ఈ సమస్య పూర్తిగా తీరేవరకూ నేనిక్కడనుండి వెళ్ళను." దృఢస్వరంతో అంది తనూజ. "మాడ్ నాకు చాలా కావాల్సిన మనిషి."

"ఇది చాలా ఆనందించాల్సిన విషయం." మొదటిసారిగా మదన్ కి అలాంటి సమస్య వచ్చినందుకు ఆనందం కలిగింది వంశీకి. తనూజ అది సాల్వ్ అయ్యేవరకు వెళ్ళదు. ఎప్పుడైతే తనూజ ఆలా ప్రత్యేకంగా క్షమాపణ అడిగిందో ఆమె వల్ల వున్న అనీజీనెస్ పూర్తిగా తొలగిపోయి హాపీ గా ఫీలవ్వడం ప్రారంభించాడు వంశీ. ఇంక తను ఎప్పటికీ ఇక్కడే ఉండిపోతే బావుంటుందనిపిస్తూ వుంది. "మనమందరం ఈ సమస్య సాల్వ్ చెయ్యడానికి పూర్తి సహాయం చేద్దాం." మళ్ళీ నడవడం ప్రారంభిస్తూ అన్నాడు వంశీ.

"కానీ చిట్టిరాణి చాలా పగబట్టి వుంది మదన్ మీద. తనంత తేలిగ్గా మదన్ ని విడిచిపెట్టదు." మళ్ళీ మదన్ వెనకాతలే నడుస్తూ అంది  తనూజ.

"అదే నాకూ భయంగా వుంది." నడుస్తూనే అన్నాడు వంశీ.

"కానీ తను నదిలో పడిపోయాక మాడ్ ఆలా వదిలేసి వుండకూడదు. తను కనీసం.........."

"ఇంక ఆ విషయం గురించి మాట్లాడకు. ఎవ్వరు విన్నాచాలా ప్రమాదం." చటుక్కున ఆగి, పెదాల మధ్య చూపుడు వేలు పెట్టి, సుస్మిత మొహంలోకి చూస్తూ అన్నాడు వంశీ.

"నువ్వు చెప్పింది నిజమే." తలూపింది తనూజ.

ఆ తరువాత కొంతసేపు పొలాల్లో తిరిగాక ఇంటికి వచ్చేసారు తనూజ, వంశీ.

&&&

"ఎదో కష్టపడి తను నీ వెనకాతలే కూచునే ఏర్పాటు చేశాను. నువ్వు కాస్త చూపిస్తే చాలు, పాసయిపోతుంది. ఈ రోజుల్లో పదవ తరగతి కూడా పాసవ్వక పోతే ఎవరు పెళ్లి చేసుకుంటారు?" తన మొహంలోకి ప్రాధేయపూర్వకంగా చూస్తూ ఆనందరావు, చిట్టిరాణి తండ్రి అడిగిన విధానం మదన్ కి ఇప్పటికీ గుర్తుంది. ఆమె తల్లి తండ్రి ఆ రోజు తన ఇంటికి వచ్చేసారు ప్రత్యేకంగా ఆ విషయం అడగడానికి.

"తను చదివి రాయగలిగితే రాయమనండి, లేకపోతే లేదు. ఇలా అడగడానికి సిగ్గుగా లేదు మీకు?" కోపంగా అన్నాడు మదన్.

"తను చదివి రాయగలిగే మాటే అయితే నిన్ను ఇలా రిక్వెస్ట్ చెయ్యాల్సిన అవసరం ఏముంది? ఎదో ఈ ఒక్క సాయం చేసిపెట్టు చాలు." తనూజ తల్లి మాలతీ తనతో అన్నాక తన వదిన వనజ మొహంలోకి చూసింది రెక్వెస్టింగా. "మీరైనా కొంచెం చెప్పండి."

"నేనేం చెప్పనండి. ఇది నాకు సరిగ్గా అనిపించడం లేదు. అయినా తనలా మీ అమ్మాయికి చూపిస్తున్నట్టుగా తెలిస్తే తనని ఎగ్జామినేషన్ హాల్ లోనుంచి బయటకి పంపిచేస్తారు." తన వదిన అంది.

"ఎదో తను పాసవ్వడానికి తగినట్టుగా కొంచెం చూపించరా. మనకి కావాల్సిన వాళ్ళు." వాళ్లిద్దరూ అలా తన మొహంలోకి కూడా రెక్వెస్టింగా చూసినతరువాత తన అన్నయ్య ముకుందం అన్నాడు.

"ఎదో ట్రై చేస్తాలే." ఎంతో ఇరిటేటింగా అనిపిస్తూవున్నా అనక తప్పలేదు మదన్ కి.

కానీ ఆ చూసిరాయడం కూడా చేతకాలేదు చిట్టిరాణి కి. మదన్ ఫస్ట్ క్లాస్ లో పాసయితే తను అన్ని సబ్జెక్ట్స్ లోనూ తప్పింది.

"నేను నీవల్లే పదోతరగతి తప్పాను. ఇంక నన్నెవ్వరూ పెళ్లి చేసుకోరు. నన్ను పెళ్లిచేసుకునే బాధ్యత నీదే." చిట్టిరాణి అంది.

"సరిగ్గా చూసి రాయడం కూడా నీకు చేతకాకపోతే ఆ తప్పు నాదా? నేను నిన్నెప్పుడూ పెళ్లి చేసుకోను. అలాంటి ఆశలేమీ పెట్టుకోకు." కోపంగా అన్నాడు తను.

నిజానికి చిట్టిరాణి తనమీద ఆశ పడడం అప్పటికి చాలా రోజుల కిందటినుండే మొదలైంది. తనకి చిట్టిరాణి మీద అటువంటి ఆలోచనే పూర్తిగా లేదనడం కూడా నిజంకాదు. తనని సెక్సువల్ గా మొట్టమొదట అట్ట్రాక్ట్ చేసిన మనిషి చిట్టిరాణే.

తన చిన్నప్పుడు తను, వంశీ, చిట్టిరాణి, మాధురి ఇంక అప్పుడప్పుడు తనూజ కలిసి చాలా చిత్రమైన ఆటలు ఆడుకుంటూ ఉండేవారు తమ తోటలో వున్నఫామ్ హౌస్ లో. అప్పుడు ఆడిన ఆ చిత్రమైన ఆటలన్నీ తలుచుకుంటూ ఉంటే ఇప్పుడు చాలా తమాషాగా ఇంక ఎంబరాసింగా కూడా అనిపిస్తూ ఉంటుంది.

అప్పుడప్పుడు చిట్టిరాణి వచ్చి తనని గట్టిగా పట్టుకుంటూ ఉండేది. అలా పట్టుకున్నప్పడు తనకీ చాలా హాయిగా అనిపించి విడిపించుకోవాలనిపించేది కాదు. కొన్ని సమయాల్లో తనూ, తనని గట్టిగా పట్టుకునే వాడు. ఒకసారి వదిన తామిద్దరినీ అలా చూసి గట్టిగా కోప్పడింది. అప్పటినుండి తామిద్దరి మధ్య అటువంటి ఇంటిమసీ తగ్గిపోయింది. కానీ ఒక చాలా ముఖ్యమైనది కూడా జరిగింది తామిద్దరి మధ్య తామిద్దరూ  చిన్నపిల్లలుగా వున్నప్పుడే.

తన పన్నెండో ఏట కాబోలు చిట్టిరాణి పెద్దమనిషి అయింది. నెమ్మది, నెమ్మది గా వచ్చి చేరుతూన్న యవ్వనంతో అట్రాక్టీవ్ గానే ఉండేది. అప్పటికీ చిట్టిరాణి తనతో చాలా ఇంటిమేట్ గా ఉండడానికి ట్రై చేస్తూండడంతో తను కొన్ని సందర్భాల్లో టెంప్ట్ అయి కొంత అడ్వాంటేజ్ కూడా తీసుకున్నాడు. కాకపోతే చిట్టిరాణి చదువుకోలేదు ఇంక మరీ అంత అప్సరస కూడా కాదు. తనకి చిట్టిరాణి కన్నా మంచి ఛాయస్ దొరుకుతుందని అనిపించింది. అందుకనే చిట్టిరాణి ని దూరం పెట్టడం మొదలు పెట్టాడు. తనని ప్రేమించడం కానీ, పెళ్లి చేసుకోవడం కానీ కుదరదని చాలా స్పష్టంగా చెప్పేసాడు. చాలా అనీజీగా అనిపించి బెడ్ మీద పడుకోలేక లేచికూచున్నాడు మదన్. తను నిజంగానే చాలా స్వార్ధంగా అలోచించి చిట్టిరాణి ప్రేమని కాదన్నాడు. తన మనసులోతుల్లో తనకి తెలుసు, చిట్టిరాణి ది నిస్వార్థమైన ప్రేమ. తను తనని మాత్రమే నిజంగా కావాలనుకుంది. తను మాత్రం అందం కావాలనుకున్నాడు. అందుకనే చిట్టిరాణి అంత ప్రాధేయపడ్డా కాదన్నవాడు, సుస్మిత లాంటి సౌందర్యరాశి కంటపడగానే ప్రేమలో పడిపోయాడు. సుస్మిత మీదనైనా తనది నిజంగా ప్రేమేనా, లేకపోతే కేవలం వ్యామోహమేనా? ఆలోచిస్తూంటే అనీజీగా వుంది.

పొలంలోకి వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా సుస్మిత అలాంటి కండిషన్ పెట్టడంతో చాలా చిరాగ్గా వుంది. తలంతా పనికిమాలిన ఆలోచనలతో బద్దలైపోతూంది.

"మాడ్. ఎదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టున్నావు." ఆ రూమ్ లోకి వచ్చి మదన్ బెడ్ కి ఎదురుగ వున్న కుర్చీలో కూలబడుతూ అడిగింది తనూజ.

"నువ్వు నన్ను మాడ్ అని పిలిచావంటే పళ్ళు రాలగొడతానని చాలా సార్లు చెప్పాను." కోపంగా అన్నాడు మదన్.

"ఐ యాం సారీ. ఇప్పుడు నీ ముందే మరిచిపోయే అలా పిల్చేసాను." నవ్వేసింది తనూజ.

"అంటే నా వెనకతలంతా నువ్వు నన్నలాగే పిలుస్తున్నావన్నమాట."

"నో, నో, లేదు లేదు. ఎదో అలా అనేశాను." కంగారుగా అంది తనూజ.

"ఆల్రైట్." తలూపాడు మదన్. "చాలా సేపు తనతో మాట్లాడవు కదా, విషయం ఏం తేలింది? తనది కేవలం భ్రమే అని ఒప్పుకుందా?"

"నో మాడ్." అనేసి మళ్ళీ కంగారుగా అంది. "నో బావా. తనలా ఒప్పుకోవడం లేదు. తను చూశానని చెప్తున్నది పూర్తిగా నిజమే అని నమ్ముతూవుంది."

"ఇప్పుడేం చేద్దాం అయితే? నేనెంతకాలం ఇలా ఉండిపోవాలి పొలంలోకి వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా." చిరాగ్గా అన్నాడు మదన్.

"తను చాలా పవర్ఫుల్ హల్యూసీనేషన్ కి సబ్జెక్ట్ అయింది బావా. నువ్వు చెప్పిన తరువాత ఆ చిట్టిరాణి గురించి బాగా అలోచించి ఉంటుంది. అందులో అప్పుడు తను వున్న ఎన్విరాన్మెంట్ కూడా తగినట్టుగా ఉండడంతో ఆ హల్యూసీనేషన్ కూడా చాలా స్ట్రాంగ్ గా వుంది. ఎంత కౌన్సెలింగ్ చేసినా తనది కేవలం హల్యూసీనేషన్ అని నమ్మే పరిస్తితుల్లోలేదు."

"ఇంతకీ తన విషయంలో నువ్వేమైనా చెయ్యగలుగుతావా లేదా?" ఇంకా చిరాకు పడ్డాడు మదన్.

"నేనేమీ చేయలేనని నీకు చెప్పలేదే? కాకపోతే తనని ఆ భ్రమలోనుండి బయటకి తీసుకురావడానికి కొంత సమయం కావాలి. నువ్విలా అసహన పడితే, ఐ యాం సారీ, నేనేం చెయ్యలేను." తనూజ కూడా కోపంగా అంది.

"ఐ యాం సారీ. తనలా అంత గట్టిగా నమ్ముతూ వుంటే నాకు ఇరిటేటింగా వుంది. ఇట్స్ ఆల్రైట్. నీ పద్ధతిలో నువ్వు చెయ్యి. కానీ సాధ్యమైనంత త్వరలో తను ఆ భ్రమలో నుండి బయటకి వచ్చేలా చెయ్యి." సుస్మిత మొహంలోకి ప్రాధేయపూర్వకంగా చూస్తూ అన్నాడు మదన్.

"నువ్వా విషయం నాకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు బావా. ఐ డూ మై లెవెల్ బెస్ట్." కుర్చీలో అడ్జస్ట్ అవుతూ అంది తనూజ. "నేనాల్రెడీ ఒక ప్లాన్ తో వున్నాను. ఆ ప్లాన్ లో భాగంగా నేను తనని ఎక్కడైతే చిట్టిరాణి ని చూసాను అంటూందో అక్కడకి తీసుకు వెళతాను. అక్కడ ఎలా రియాక్ట్ అవుతుందో చూస్తాను."

"పరవాలేదంటావా? తను అక్కడ మామిడి చెట్టుమీద చిట్టిరాణి ఉందని చాలా బలంగా నమ్ముతూంది."

"నో ప్రాబ్లెమ్ ఎటాల్. నేను అక్కడకి పగటిపూట తీసుకు వెళతాను. అందులోనూ నేను కూడా వుంటాను కాబట్టి ఇబ్బందేమీ ఉండదు."

"పోనీ నేనూ కూడా రానా?"

"వద్దు. నువ్వు రావడానికి సుస్మిత ఒప్పుకోదు. ఎందుకంటే ఆ చిట్టిరాణి నీకు హాని చెయ్యాలని చాలా చూస్తూందని తన అభిప్రాయం. అందులోనూ నువ్వు లేకపోవడమే మంచిది కూడా. తన మనసులో ఫీలింగ్స్ అన్నీ నాతొ ఫ్రీగా షేర్ చేసుకోగలుగుతుంది."

"సరే అయితే. అలాగే కానీ." తలూపి అన్నాడు మదన్. అంతలోనే చిన్న చిరునవ్వు వచ్చింది మదన్ పెదాల మీదకి. "నిన్నవంశీ, నువ్వు కలిసి వచ్చారు ఇంటికి. మీ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయిపోయినట్టువున్నారు."

"అఫ్ కోర్స్ బావా. వుయ్ బోత్ హేవ్ బికేమ్ గుడ్ ఫ్రెండ్స్." అలా చెప్పేటప్పుడు తనూజ బుగ్గలు ఎర్రబడిపోయాయి సిగ్గుతో.

"చదువుకోలేదు, కొంచెం మోటుగా ఉంటాడు కానీ వంశీ చాలా మంచివాడు. నాకు చాలా కావాల్సిన వాడు కూడా." తనూజ మొహంలోకి సూటిగా చూస్తూ అన్నాడు మదన్.

"ఆ విషయం నువ్వు నాకు చెప్పక్కర్లేదు బావా." నవ్వుతూ అంది తనూజ.

"ఈ సారి నువ్వు తనని ఏమైనా ఇన్సల్ట్ చేసినా, హర్ట్ చేసినా నీ చెంపలు పగలుకొట్టేది కేవలం నీ అక్క మాత్రమే కాదు, ఆ విషయం గుర్తుపెట్టుకో." హెచ్చెరికగా చూస్తూ అన్నాడు మదన్.

"అలాగ జరగనే జరగదు బావా." కుర్చీలోనుంచి లేస్తూ అంది తనూజ. "నేను నా ప్లాన్ లో మొదటి పార్ట్ ఆచరణలో పెట్టబోతున్నాను. సుస్మితని తీసుకుని ఇప్పుడే తోటలోకి తీసుకువెళతాను."

"ఐ విష్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ అజ్. జస్ట్ గో." మదన్ అన్నాడు.

తరువాత ఆ రూమ్ లోనుండి బయటికి వచ్చేసింది తనూజ.  

&&&

"సో, నువ్వు చిట్టిరాణి ని చూసింది ఇక్కడే. ఈ మామిడి చెట్టు దగ్గరే. అవునా?" సుస్మితని తీసుకుని తోటలో తను చిట్టిరాణిని చూసానన్న దగ్గరికి తిన్నగా తీసుకుని వచ్చింది తనూజ.

"నేను నీకు అంతా చెప్పాను. నాది హల్యూసీనేషన్ కాదని నీకు బాగా తెలుసు. ఇంక ఈ కొచిన్స్ అవసరమా?" కోపంగా అడిగింది సుస్మిత. "అసలు ఇక్కడకి రావడం కూడా అవసరమా?"

"నేను కేవలం........" తనూజ ఇంకా ఎదో చెప్పబోయింది.

"నేనిక్కడ ఉండలేను. వెళ్ళిపోతున్నాను." తనూజ పూర్తిచెయ్యకుండానే అక్కడనుండి బయలుదేరేసింది సుస్మిత.

(ఇక్కడివరకూ నచ్చిందని భావిస్తా. తరువాతి భాగం సాధ్యమైనంత త్వరలోనే పబ్లిష్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మర్చిపోవద్దు.)