Aa Voori Pakkane Oka eru - 3 in Telugu Thriller by sivaramakrishna kotra books and stories PDF | ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 3

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 3

ఆ ఊరి పక్కనే ఒక ఏరు

(ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్)

శివ రామ కృష్ణ కొట్ర

"తను మనింట్లో నలభై రోజులు కాదు, ఎప్పటికీ ఇక్కడే ఉంటానన్న నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. తను అంత బాగా నచ్చేసింది నాకు." మదన్ చెప్పింది వినగానే మదన్ మొహంలోకి చూస్తూ అంది వనజ. "కానీ నాకు నచ్చనిదల్లా నీకొక లవర్ ఉందని మాకు ఎందుకు చెప్పలేదు? మాకు కావాల్సిందల్లా నీ ఆనందమే కదా."

ఆ సమయం లో కిచెన్ లో ముకుందం, వనజ ఇంకా వంశీ కూడా వున్నారు.

"అలా చెప్తే మీరు వెంటనే పెళ్లి చేసేసుకోమంటారని చెప్పలేదు. నాకింకా ఒకటి రెండు సంవత్సరాలు బాచిలర్ గానే ఉండాలని వుంది." అలా చెప్పాలని తట్టినందుకు ఆనంద పడ్డాడు మదన్.

"నేను ఇప్పుడూ అదే మాట అనబోతూ వున్నాను. మీరిద్దరూ లవర్స్ అయితే వెంటనే పెళ్లి చేసుకోండి. ఆ అమ్మాయి వయసు విషయం నాకు తెలియదు కానీ నీకప్పుడే ఇరవై ఐదు." మదన్ అన్నయ్య ముకుందం అన్నాడు.

"ఏమైనా బ్రదర్ నీకు చక్కగా సరిపడే అమ్మాయిని ఎంచుకున్నావు, కంగ్రాట్యులేషన్స్." వంశీ అన్నాడు.

"అది సరే కానీ మదన్. తను సడన్గా ఇలా మనింట్లో ఫార్టీ డేస్ ఉంటాననడమేమిటి? ఇది కొంచం అయోమయంగా వుంది." కంఫ్యూజన్గా అంది వనజ.

"నేనూ అడిగి చూసాను వదిన. కానీ తనేం చెప్పలేదు. బహుశా ఎదో ప్రాబ్లమ్ వచ్చివుంటుంది." అది మదన్ కి కూడా చాలా కంఫ్యూజన్గానే వుంది.

"ఏం ప్రాబ్లెమ్ రా? ఆమె తల్లి తండ్రులు ఎవరు? ఈ అమ్మాయి ఇలా ప్రాబ్లెమ్ లో ఇరుక్కుంటే వాళ్ళేం చేస్తున్నారు?" ముకుందం ఆశ్చర్యంగా అడిగాడు.

"మేమిద్దరం  లవర్స్ అన్నమాట నిజమే కానీ ఇంకా అన్ని విషయాలూ షేర్ చేసుకోలేదు. తనని అడిగి తెలుసుకుంటాను." అనీజీ గా అన్నాడు మదన్.

"ఆశ్చర్యంగా వుంది. లవర్స్ కానీ ఒకళ్ళ గురించి ఒకళ్ళకి పూర్తిగా తెలీదు." వంశీ ఆశ్చర్యంగా అన్నాడు.

"ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. ఇంతకన్నా ప్రస్తుతానికి నేను ఏమీ చెప్పలేను." తనలో అనీజీనెస్ ఇంకా ఎక్కువ అయిపోతూవుంటే అన్నాడు మదన్.

"ఆల్రైట్. దీనికి నేనేమి అనదలుచుకోలేదు." తలూపి అన్నాడు ముకుందం. "ఈ రోజు సాయంత్రం మన తోటలోకి నీతో పాటుగా ఈ అమ్మాయిని కూడా తీసుకుని వెళ్ళు. అక్కడ ఆ అమ్మాయికి సంబంధించిన ప్రతి విషయం ఇంకా ఆ అమ్మాయి ప్రాబ్లెమ్ ఏమిటి అన్నది పూర్తిగా తెలుసుకుని మాకు చెప్పు. ఒకవేళ ఆ విషయాలన్నీచెప్పడానికి ఆ అమ్మాయి ఆలోచిస్తే, ఆ అమ్మాయి ఈ ఇంట్లో వుండాలా వద్దా అని  మేము ఆలోచించాల్సి ఉంటుంది."

"సరే అన్నయ్యా. అలాగే చేస్తాను." తలూపి అన్నాడు మదన్.

ఒకవేళ తను ఆ విషయాలన్నీ తనకి చెప్పడానికి ఇష్టపడకపోతే, తన అన్న వదిన ఆ అమ్మాయి ఇంట్లోనుంచి వెళ్లిపోవాలని బలవంతపెడితే, తను ఆపలేడు. అప్పుడు తను చెప్పినంత పని చెయ్యదు కదా? నిజంగానే ఆ విషయం బయటకి తెలిస్తే ఎవరూ చిట్టిరాణి పొరపాటున నదిలోకి పడిపోయిందనుకోరు. తనే తోసేసాడు అనుకుంటారు.  

&&&

తమ తోటలోకి కలిసి వెళదాం అనగానే ఆనందంగా ఒప్పుకుంది సుస్మిత. తనమీద ఎంత కోపంగా వున్నా ఆకుపచ్చ చీరలో, అదే రకం బ్లౌజ్ లో అప్సరస లా తయారయిన ఆమెవైపు ఆకర్షించపడకుండా ఉండాలేకపోతున్నాడు మదన్.

"బాగా లేటయ్యాక బయలుదేరారు. ఎక్కువసేపు అక్కడ ఉండకుండా ఇంటికి వచ్చేయండి." ఇంటి బయటకి వస్తూవుంటే వనజ అంది.

"ఈమె వల్లే. మేక్ అప్ అవ్వడానికి ఇంతసేపు చేసింది. లేకపోతే ప్రతిరోజూ నేను ఈపాటికే మన తోటలో ఉండేవాడిని." కోపంగా అన్నాడు మదన్.

"తనకి  మేక్ అప్ అవ్వాల్సిన అవసరం ఏముంది? ఏ మేక్ అప్ లేకుండానే తను అద్భుతంగా ఉంటుంది." సుస్మితని నిశితంగా గమనిస్తూ అంది వనజ.

తనేం చెప్పకుండా ముసిముసిగా నవ్వుతూ మదన్ తో పాటుగా బయటకి నడిచింది సుస్మిత. అలాగ తనతో పాటుగా నడుస్తూ ఉంటే ఎదురుగా వచ్చే గ్రామస్తులు అందరూ ఆశ్చర్యంగా గమనిస్తున్నారు వాళ్ళిద్దరిని. అది కేవలం మదన్ కె కాదు, సుస్మితకి కూడా చాలా ఇబ్బందిగా వుంది.

"ఎంత దూరం నడవలేంటి మీ తోటలోకి వెళ్ళడానికి?" చిన్న గొంతుతో అడిగింది సుస్మిత.

"ఒక్క పావుగంట. ఆ నదిని క్రాస్ చేసుకునే మనం మా తోటలోకి వెళ్ళాలి." మదన్ అన్నాడు.

సుస్మిత ఇంకా ఎదో అనేలోపు బవురు గెడ్డం తో ఒక వ్యక్తి వాళ్ళకి ఎదురుగా వచ్చాడు. సరిగ్గా మదన్ కి ఎదురుగా వచ్చి నిలబడడం వల్ల మదన్ ఆగిపోవలసి వచ్చింది. సుస్మిత కూడా ఆగి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే వాడు అన్నాడు.

"చిట్టిరాణి గురించి నీకేమైనా తెలిసిందా?" వాడడిగాడు.

"తన గురించి నాకేమైనా తెలిసివుంటుందని నువ్వెందుకు అనుకుంటున్నావు?" మదన్ చిరాగ్గా అడిగాడు.

"సారీ. నిన్ను ఇబ్బంది పెట్టాలని నాకు లేదు. కానీ తను నిన్నెంత ఇష్టపడేదో నీకు తెలుసు."

"కానీ తనని నేనాడు ఇష్టపడలేదని, ఆ విషయం తనకి చాల స్పష్టంగా చాలా రోజుల కిందటే చెప్పానని నీకూ తెలుసు." మదన్ చిరాకు అలాగే వుంది.

"నేనేం కాదనడం లేదు. నువ్వంత ఇష్టపడనప్పుడు నీ వెంట తను పడకూడదు." కాస్త ఆగాడు వాడు. "ఈ రోజుకి వారం అవుతూంది. తానెక్కడికి వెళ్ళింది, ఏమైంది అన్నది తెలియడం లేదు. తన అమ్మ, నాన్నచాలా కంగారుగా వున్నారు. నీకేమైనా ఫోన్....."

"లేదు నాకేం ఫోన్ చెయ్యలేదు." వాడు చెప్పకుండానే అన్నాడు మదన్. "తను నన్నేమైనా కాంటాక్ట్ చేస్తే తప్పకుండా మీకు చెప్తాను." తరువాత వాడు చెప్పబోయేది వినకుండా అక్కడనుండి నడిచాడు మదన్.

"మై గాడ్! ఎంత ఉధృతంగా వుంది ప్రవాహం!" వంతెన మీదకి వచ్చాక, వంతెన గోడని అనుకుని నిలబడి కిందని భయంకరంగా ప్రవహిస్తూన్న నదిని చూస్తూ అంది సుస్మిత. "ఇలాంటి ప్రవాహంలో పడిపోయిందా తను? అయితే తను బ్రతికే అవకాశం ఉంటుందని నాకనిపించడం లేదు."

"ఇక్కడినుంచి వెళదామా ప్లీజ్" మదన్ గొంతు చాలా అనీజీగా వుంది. "ఇప్పటికే చీకటి పడుతూంది. మనం వేగంగా ఇంటికి తిరిగి రావాలి."

సుస్మిత తలూపి వంతెన మధ్యలోకి రాగానే మదన్ మళ్ళీ నడవడం మొదలు పెట్టాడు. ఆ తరువాత తోటలోకి చేరుకోవడానికి పదినిమిషాలు కన్నా ఎక్కువ పట్టలేదు.

"మై గాడ్! ఇంత పెద్ద తోటా? ఏ ఏ చెట్లు వున్నాయేమిటి ఈ తోటలో?" ఆ పెద్ద, దిట్టమైన తోటలో నడుస్తూ సంభ్రంగా అంది సుస్మిత.

"అన్ని రకాల చెట్లు వున్నాయి. కానీ మామిడి చెట్లు ఎక్కువ." మదన్ అన్నాడు. "ఈ తోటలోనే మాకు ఒక ఫామ్ హౌస్ కూడా వుంది." ఆ గొంతులో సడన్గా కొంచెం గర్వం కూడా కనిపించింది.

"ఐ సీ" అర్ధం అయినట్టుగా తలూపుతూ అంది సుస్మిత.

"మనం ఇక్కడ ఎక్కడో అక్కడ సెటిల్ అయితే మాట్లాడుకోవాల్సిన విషయాలు వున్నాయి."

"ఏం మాట్లాడాలి?" మదన్ మొహంలోకి సూటిగా చూస్తూ అంది సుస్మిత. "నాతొ మాట్లాడాల్సిన విషయాలు నీకేం వున్నాయి?" మళ్ళీ అదే గర్వం.

ముంచుకొస్తూన్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ తన అన్నయ్య చెప్పిన విషయాన్నిచెప్పాడు మదన్. "నీకున్న ఆ ప్రాబ్లెమ్ ఏమిటో, నువ్వెందుకు మా ఇంట్లోనే ఫార్టీ డేస్ వుండాలనుకుంటున్నావో ఇప్పుడు చెప్పే తీరాలి. లేకపోతే నువ్వెంత మా వాళ్లకి నచ్చిన నువ్వు మా ఇంట్లో ఉండడానికి మా అన్నయ్య ఒప్పుకోడు. ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవలసి వచ్చినా మా అన్నయ్య ఒప్పుకోక పొతే నువ్వు మా ఇంట్లో ఉండేలా నేను చెయ్యలేను."

కింద పెదవిని రెండు పెదాల మధ్య నొక్కిపట్టి దీర్ఘంగా ఆలోచనలో పడింది సుస్మిత. తనని బలంగా కౌగలించుకుని ఆ పెదాలమీద ముద్దు పెట్టుకోవాలన్న ఆలోచనని అతిప్రయత్నం మీద అణుచుకున్నాడు మదన్.

" సరే అయితే. మనం ఎక్కడో అక్కడ కంఫర్టుబుల్  గా సెటిల్ అయి ఎందుకు మాట్లాడుకోకూడదు?" కొన్ని నిమిషాల నిశబ్దం తరువాత అంది సుస్మిత.

" నాతో రా." ఆలా అని నడుస్తూవున్న మదన్ వెనకాలే నడిచింది సుస్మిత.

ఇద్దరూ పెద్ద పెద్ద బండరాళ్లతో వున్నఒక ఓపెన్ ప్లేసులోకి చేరుకున్నారు. ఇద్దరూ చెరొక రాయిమీద పేస్ టు పేస్ సెటిల్ అయ్యాక మదన్ మళ్ళీ అడక్కుండానే చెప్పడం మొదలు పెట్టింది సుస్మిత. "మా డాడ్ పెద్ద బిజినెస్ మాన్. తన స్వంత తెలివితేటలోతోనే కోట్ల కొద్దీ విలువ చేసే ఆస్తులు సంపాదించారు. మా పేరెంట్స్ కి నేనొక్కత్తినే కూతుర్ని కావడంతో ఆ ఆస్తికంతటికి నేనే వారసురాల్ని. కాకపోతే మా వంశంలో ఒక పిచ్చి అలవాటు వస్తూ వుంది. మా వంశంలో అమ్మాయిలకి ఇరవై రెండు సంవత్సరాలు నిండి పెళ్లి అయితేకాని తండ్రి సంపాదించిన ఆస్తిమీద హక్కురాదు. ఒకవేళ ఇరవై రెండు సంవత్సరాలు నిండకుండా పెళ్లి చేసుకుంటే వాళ్ళకి తండి ఆస్తి మీద హక్కు పూర్తిగా పోతుంది. మా వంశంలో కొంతమంది అమ్మాయిలు మెచూరిటీ లేకుండా పెళ్లి చేసుకుని ఆస్తులు తగలేస్తే, ఇంకొంతమంది అమ్మాయిలు చాలా కాలంపాటు పెళ్లి చేసుకోకుండా వుండి ఆస్తులు పాడుచేసారుట. అలా జరక్కుండా వుండడానికి అటువంటి వీలునామాలు రాయడం ఆచారంగా వస్తూంది మా వంశంలో.  ఇప్పటివరకు మా వంశంలో ఏ అమ్మాయికైనా ఇబ్బంది వచ్చిందోలేదో కానీ నాకు మాత్రం పీకలమీదకి వచ్చింది.” అంటూ ఆగింది సుస్మిత.

"ఇంకా నయం. కట్టుకున్న మొగుడికే అస్తన్తా వెళ్ళిపోతుందని విల్లులో రాయలేదు." నవ్వాడు మదన్. "ఎనీహౌ అది నీకు ప్రమాదం ఎలా తెచ్చిపెట్టింది?"

"నాకు పదహారు ఏళ్ల వయసు వున్నప్పుడు నా పేరెంట్స్ ఫ్లైట్ ఆక్సిడెంట్లో పోయారు. నా ఖర్మ కాళీ అప్పటికే మా డాడ్ అలాంటి విల్లు రాసి, రిజిస్ట్రేషన్ కూడా చేయించేశారు."

తను ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా చెప్పినా తన పేరెంట్స్ ఇద్దరూ తన పదహారు సంవత్సరాల వయస్సులోనే పోయారని వినగానే మదన్ మనస్సంతా బాధతో నిండిపోయి ఆ బాధంతా మోహంలో ఎక్ష్ప్రెస్స్ అయింది. "నీ పేరెంట్స్ ఇద్దరూ నిజంగానే నీ పదహారేళ్ళ వయసులో చనిపోయారా?" అడక్కుండా ఉండలేక పోయాడు మదన్.

"లేదు. మనం ఇద్దరం కాలక్షేపం అవ్వక ఇక్కడ కూర్చున్నాం కదా. నిన్ను ఎంటర్టైన్ చేద్దామని కల్పించి చెప్తున్నాను." చిరాగ్గా అంది సుస్మిత. "ఇలాంటివి ఎవరైనా అబద్ధాలు చెప్తారా?"

"నాకు నాలుగేళ్ళ వయసు వున్నప్పుడు మా అమ్మ చనిపోయింది హార్ట్ ఎటాక్ తో. ఆరేళ్ళ వయసులో మా నాన్నగారు పొలంలో పాము కాటుతో చనిపోయారు. అప్పటినుండి నా అన్న వదిన నన్ను నా పేరెంట్స్ కన్నా ఎక్కువగా చూసుకుంటూ వున్నా, నా పేరెంట్స్ తో వున్న జ్ఞాపకాలు ఇప్పటికీ నన్ను బాధిస్తూనే వున్నాయి. అలాంటిది నువ్వు పదహారేళ్ళపాటు వాళ్ళతో వాళ్ళ జ్ఞాపకాలతో వున్నావు. అది నీకెంత బాధగా వుండి ఉంటుంది?" మోహంలో అదే ఎక్స్ప్రెషన్ తో అన్నాడు మదన్.

"నువ్వు నన్ను చాలా చక్కగా అర్ధం చేసుకున్నావు." తలూపింది సుస్మిత. "కాకపోతే నా కష్టాలు అంతటితో ఆగలేదు. అదేసందుగా గుంటనక్క లాంటి మా మామయ్య, అదే  మా మామ్ అన్నయ్య, తన భార్య, కొడుకు నా ఇంట్లో ప్రవేశించారు. నాకున్న రెలెటివ్స్ కేవలం వాళ్ళు మాత్రమే. నాకు నా ఆస్తికి గార్డియన్ గా మారిపోయాడు నా అంకుల్. నా అంకుల్, నా ఆంటీ ఇంకా నా కజిన్ చాలా సిస్టమాటిక్ గా నా ఆస్థి అంతా కాజేయడానికి అప్పటినుండి ప్రయత్నాలు ప్రారంభించారు." నిట్టూర్చింది సుస్మిత.

"కాస్త పెద్ద దానివయ్యాక వాళ్ళకి అడ్డుకట్ట వెయ్యకపోయావా?"

"నాకు ఎవరూ లేకపోవడంతో కోర్ట్ నుండి నాకు నా ఆస్తికి గార్డియన్షిప్ సంపాదించాడు మా మామయ్యా. మోరోవర్ అలాంటి వింత కండిషన్లతో మా డాడ్ రాసిన విల్లు కూడా నాకు పెద్ద అడ్డంకిగా మారిపోయింది. వాళ్ళు నన్ను నిలువునా దోచేయడానికి చేస్తూన్న ప్రయత్నాలు తెలుస్తూవున్నా నిస్సహాయంగా ఉండిపోయాను."

"ఐ సీ" తలూపాడు మదన్.

"మా డాడ్ దగ్గర మా మామ్ అసిస్టెంట్ గా చేస్తూ ఉండేది. తాను చాలా అందంగా ఉండేది. మా డాడ్ తనని లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు. మా మామ్ తన అన్నని చాలా నమ్మేది, అభిమానించేది. వాడికి ఒక్కగానొక్క చెల్లెలు. అందువల్ల మా ఫ్యామిలీతో చాలా స్ట్రాంగ్ రేలషన్శిప్ తో ఉండేవాడు మా మామయ్య. మా మామ్ వాడిని ఆలా గుడ్డిగా అభిమానించడం, నమ్మడం వాడికి చాలా అడ్వాంటేజ్ గా మారింది. చుట్టూవున్న వాళ్ళని కూడా మాకు తనెంతో కావాల్సిన వాడిగా నమ్మించాడు. ఇంక మా ఆస్తికి, నాకు గార్డియన్ కావడానికి వాడికి కష్టమేముంటుంది?"

"యు ఆర్ రైట్" తలూపాడు మదన్.

"నన్ను పతనం చెయ్యడానికి ఆ ఫామిలీ అంతా రకరకాలుగా ప్రయత్నించారు. నేను చాలా జాగ్రత్తగా వాళ్ళ ప్రయత్నాలేవీ ఫలించకుండా చూసుకుంటూ వచ్చాను. కాకపోతే కొద్దిరోజుల కిందట నా మామయ్య ఇంకా వాడి పెళ్ళాం, కొడుకు చేస్తూన్న భయంకరమయిన ఆలోచన నాకు తెలిసింది."

"ఏమిటది?" తనకి తెలియాకుండానే కూర్చున్న రాతిమీద స్ట్రెయిట్ అయిపోయాడు మదన్.

"నేను అమాయకురాలిని కాదు, నాకు ఇరవై రెండేళ్లు రాగానే ఎవర్నో ఒకళ్ళని పెళ్లి చేసుకుని ఆస్తిమీద హక్కు సంపాదించడానికి ప్లాన్ వేసుకునే వుంటాను అన్న ఆలోచనలో పడ్డారు వాళ్ళు. అందుకని అలా జరిగే లోపే సాధ్యమైనంత త్వరలో నన్నీ ప్రపంచంలోనుండి పంపించేయాలన్న ఆలోచనతో వున్నారు." సడన్గా సుస్మిత మొహం భయం తో నిండిపోయింది.

"మై గాడ్! నింజంగానా?" మదన్ మోహంలో కూడా భయం కనిపించింది.

"నేనిది నీకు ఎంటర్టైన్మెంట్ కోసం చెప్తున్నా స్టోరీ కాదు. ఇప్పుడు నీకు నిజాలు తప్ప అబద్హాలు చెప్పను." దీర్ఘంగా నిట్టూర్చి చిన్నగా నవ్వింది సుస్మిత.

"మరి నువ్వు వెంటనే ఏ పోలీస్ స్టేషన్ కో వెళ్ళాల్సింది కదా."

"డబ్బు మాదే అయినా చుట్టుపక్కలంతా చాలా పరపతి సంపాదించాడు మా మామయ్య. నాకేదో మతి భ్రమించి ఆలా అనుకుంటున్నానని అందర్నీ యిట్టె నమ్మించగలడు. వాడి మాటల్లో ఇంకా నాకు తెలిసిందేమిటంటే పోలీస్ కమిషనర్ తో కూడా వాడికి మంచి ఫ్రెండ్షిప్ వుంది. నన్ను ఏ లారీ తోనో గుద్దించేసి అది కేవలం ఆక్సిడెంట్ అని యిట్టె అందరిని నమ్మించగలడు. అంతేకాకుండా ఇప్పటికి ఐదు సంవత్సరాలుగా నాకు నా ఆస్తికి గార్డియన్ గా వుంటూవున్నాడు. వాడిని ఇమ్మీడియేట్ గా నేనెలా తప్పించేగలను?"

"ఒన్స్ అగైన్ యు ఆర్ రైట్." మరోసారి తలూపాడు మదన్.

"అప్పుడు బాగా ఆలోచించాక నేను ఈ ప్రమాదం నుండి బయటపడి నా డాడ్ ఆస్తులన్నిటిమీద నాకు హక్కు వచ్చేవరకు నా మామయ్య ఫ్యామిలీకి నా ఆచూకీ తెలియకుండా నేను ఎక్కడైనా రహస్యంగా ఉండడం మంచిదనిపించింది. అందుకనే మీ ఇంటికొచ్చాను."

"ఇదే నాకు అస్సలు బోధపడని విషయం. నువ్వు మా ఇంటికే ఎందుకు వచ్చావు? నీకు ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ వుండి వుంటారుగా ఈ కొద్దీ రోజులు ఆశ్రయం ఇవ్వడానికి." ముడిపడిన భృకుటితో ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు మదన్.

"యు ఆర్ అబ్సోల్యీట్లీ రైట్." తలూపింది సుస్మిత. "నాకు ఇక్కడే కాదు, అబ్రాడ్లో కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వున్నారు. మా మామయ్య కుటుంబానికి తెలియకుండా అజ్ఞాతవాసం చెయ్యడం నాకేమీ కష్టమైనా విషయం కాదు. కానీ నేను నీ దగ్గరకే ఎందుకువచ్చానో తెలుసా?"

"తెలియదు." ఒక కన్ఫ్యుజింగ్ ఎక్స్ప్రెషన్ తో తలూపాడు మదన్.

"నా ఆస్తులన్నిటిమీద నాకు సర్వహక్కులు రావాలంటే నాకు ఇరవై రెండేళ్లు వస్తే సరిపోదు. నేను ఎవర్నో ఒకర్ని పెళ్లి కూడా చేసుకోవాలి. అప్పుడు నువ్వు నాకు తట్టావు. నేను కేవలం నీ ఇంట్లో ఆశ్రయం కోసం మాత్రమే కాదు, నిన్ను పెళ్లిచేసుకోవాలన్న ఆలోచనతో కూడా ఇక్కడికి వచ్చాను." అలా చెప్తూన్నప్పుడు సుస్మిత బుగ్గలు సిగ్గుగో ఎర్రబడిపోయాయి.  

"అంటే నీ ఆస్తులమీద హక్కు సంపాదించడానికి నువ్వు నన్ను పెళ్లి చేకోవాలనుకుంటున్నావన్న మాట." సుస్మిత అసలు ఆలోచన తెలిసాక మదన్ మనసంతా ఆనందంతోనూ, ఎదో థ్రిల్ ఫీలింగ్ తోనూ నిండిపోయింది. అలా అనడం కష్టంగానే వున్నా, అనకుండా ఉండలేకపోయాడు.

ఆ రాయి దిగిపోయి కింద నిలబడింది సుస్మిత.  "మొదటిసారి చూసినప్పుడే నువ్వు నాకెంతో నచ్చేసావు. నీతో మాట్లాడి ఫ్రెండ్షిప్ చెయ్యాలనుకున్నా కానీ అప్పటికి ఎప్పుడూ కేవలం బాయ్స్ వాళ్లే వచ్చి నాతో మాట్లాడడానికి పాకులాడడానికి అలవాటు పడిన దాన్ని. ఆలా చెయ్యాలనిపించలేదు. నిజానికి నువ్వే వచ్చి నాతో మాట్లాడినప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. కానీ ఆలా తిప్పికొడితే నీ దగ్గర నా వేల్యూ ఇంకా పెరుగుతుంది ఇంకా తక్కిన బాయ్స్ లాగా నువ్వూ మళ్ళీ, మళ్ళీ వచ్చి నాతో మాట్లాడతావు, నిన్ను ఆలా కొన్ని సార్లు రిజెక్ట్ చేసాక ఫ్రెండ్షిప్ చెయ్యొచ్చులే అనుకున్నాను. కానీ నువ్వు చాలా అపోజిట్ గా ప్రూవ్ అయ్యావు. " చిరుకోపంతో అంది సుస్మిత.

(ఇక్కడివరకూ నచ్చిందని భావిస్తా. తరువాతి భాగం సాధ్యమైనంత త్వరలోనే పబ్లిష్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మర్చిపోవద్దు.)