The shadow is true - 25 in Telugu Fiction Stories by LRKS.Srinivasa Rao books and stories PDF | నీడ నిజం - 25

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

నీడ నిజం - 25

సా గర్ అసహనం, కోపం తెలుసు గనుక విద్యా తను లాడ్జ్ లో డైరీ మరిచి పోయినట్లు అతడి తో చెప్పలేదు . సాగర్ కూడా ఆ విషయం తెలీనట్లే ఉన్నాడు . రాహుల్ ఫోన్ చేసినట్లు చెప్పలేదు . తన సహజావేశం తో విద్యాను నిలదీయ లేదు . డైరీ వెలుగు లోకి వస్తే రాహుల్ ప్రసక్తి వస్తుంది . రాహుల్ ‘అమ్మ సెంటిమెంట్ తో విద్యాను కదిలిస్తాడని సాగర్ భయం . పూర్వ జన్మ బంధాలు

విద్యా జీవితాన్ని , ప్రశాంతతను కలవర పెట్టడం సాగర్ కు ససేమిరా ఇష్టం లేదు . కానీ---రాహుల్ , జస్వంత్ రాక తో అతడు ఉలిక్కి పడ్డాడు . వాళ్ళను కూల్ గా రిసీవ్ చేసుకున్నాడు . పైగా విద్యధరి గారి డైరీ రిసీ వ్ చేసుకున్నాడు . ఇంటి గుమ్మం తొక్కిన వారిని గెంటి వే య లేడుగా.

“ కూర్చోండి.” మొహం లో ఏ భావం లేదు ....నిశ్శబ్దం----ఓ పది క్షణాలు.

“ ఫోను లో అన్ని వివరాలు మాట్లాడు కోలేము . అందుకే ఇలా రావలసి వచ్చింది . పైగా విద్యాధరి గారి డైరీ చదివానని చాలా కోపంగా ఉన్నారు . “

“ ఒకరి వ్యక్తిగత వివరాలు తెలుసుకోవటం తప్పనిపించ లేదా ?”

“ తప్పు అని తెలిసినా కూడా డైరీ చదివానంటే విద్యాధరి మానసిక స్థితి ఎంత తీవ్రంగా ఉందో ఒక్కసారి ఊహించండి . అమెది split personality . పూర్వజన్మ

గుర్తుకు రావటం ఆమె సమస్య లో మొదటి దశ.

సాగర్ వ్యంగ్యం గా నవ్వాడు .

“ మీరు జర్నలిస్ట్. సైకియాట్రిస్ట్ కాదు . మీరు ఏదోదో చెబితే ఎలా నమ్ముతాను ?”

జస్వంత్ కు కోపం వచ్చింది. తమాయించుకున్నాడు .

“ఆమే సైకియాట్రిస్ట్ లా తన సమస్య అనలైజ్ చేసుకుంది . జర్నలిస్ట్ కాదు, ఒక టీనేజ్ బాయ్ కూడా అర్థం చేసుకోగలడు . ముందు డైరీ చదవండి. మీకూ అర్థం అవుతుంది .”

జస్వంత్ సమాధానం తో సాగర్ కు చురుక్కుమనిపించింది .చిరుకోపం తో చూశాడు .

“ ఒక్కసారి విద్యా గారిని పిలవండి . ...తన సమస్య ఏమిటో ఆమే చెబుతారు .

తప్పలేదు సాగర్ కు.విద్యా వచ్చింది . జస్వంత్, రాహుల్ ను క్షణం పరిశీలన గా చూసింది . ఆమెకు వారెవరో తెలిసి పోయింది . చూసిన క్షణం లోనే రాహుల్ కళ్ళలో భావాలు చదవగలిగింది . లిప్తకాలం ఆమె లో ఉలికిపాటు , కలవరం .

ఇంత త్వరగా రాహుల్ ను కలిసే క్షణం వస్తుందనుకోలేదు .

జస్వంత్ విద్యాధరి ఒకరినొకరు అభివాదం చేసుకున్నారు . రాహుల్ లో చలనం లేదు . తలవంచుకుని మౌనం గా ఉండి పోయాడు .

“ జస్వంత్ గారికి మన అడ్రస్ ఎలా తెలిసిందో చెప్పు. “ అతడి గొంతులో తీవ్రతకు విద్యా తల వంచుకుంది . జవాబు ఆమెకు తెలుసు.

“నువ్వు లాడ్జ్ లో మరిచిపోయిన డైరీ లో చూశారు . ...అయినా నీ మనసుకు reflection లాంటి డైరీ ని ఎలా మరిచి పోయావు ? నాకు ముందే చెప్పి వుంటే ఏదో విధంగా డైరీ తెప్పించేవాడిని.”

విద్యా భంగిమ లో మార్పు లేదు .

“ మీరు చెప్పింది నిజం. డైరీ ఆమె మనసుకు reflection. ఆ అద్దంలో ఆమె మనసును చూశాను. మరో ముఖ్యమైన విషయం . ---విద్యాగారు లాడ్జ్ లో డైరీ మరిచిపోవటం ఆమె నిర్లక్ష్యం కాదు. పొరపాటు కాదు ఈ సంఘటన తప్పక జరగాలన్న ‘సూత్రం పైనే డైరీ మరిచిపోవటం జరిగింది . ఈ మాట నేను కాదు—భరత్ రామ్ జీ అన్నారు.”

“అంకుల్ ను మీరు కలిశారా ?” విద్యా స్వరం లో ధ్వనించిన ఆశ్చర్యం .

“ కలిశాను. డైరీ చూపాను. మీతో ఫోను లో మాటలాడిన తర్వాత ఆయనకు మీ సమస్య పై పూర్తీ అవగాహన వచ్చింది. ఆయన నా అభిప్రాయం తో ఏకీభవించారు . సాగర్ గారూ ! విద్యా గారి పూర్వ జన్మ స్మృతి వల్ల ఆమె సమస్య ను గుర్తిన్చగలిగాము . అంతే ---సమస్య అలాగే ఉండిపోయింది . మీకు తెలియవలసిన నిజం ఒకటి ఉంది . ఎవరో వచ్చి విద్యా గారి లో ప్రవేశించ లేదు .

కోమలా దేవి సమస్య ---విద్యాగారు సమాధానం . తనకు జరిగిన అన్యాయానికి కోమల సామాజిక న్యాయం కోరుకుంటుంది . తనను కాల్చి బూడిద చేసిన అజయ్ సింహ్ ,సాధువు ……..లోకం ముందు నేరస్తుల్లా తలవంచుకోవాలి . అప్పుడే ఆమెకు ఆత్మశాంతి . విద్యాగారికి మానసిక శాంతి –విశ్రాంతి. భరత్ రామ్ ఒక మాట అన్నారు.

----డైరీ ఒక జర్నలిస్ట్ కు దొరకటం ముందు జరగబోయే సంఘటన ల కు నాంది . .. ఇంతకు మించి నేను చెప్పవలసిని ఏమీ లేదు . “

విద్యా జ స్వంత్ ను అలాగే ప్రసన్నం గా చూస్తుండి పోయింది. తన సమస్యను ఆయన చక్కగా విశ్లేషించారు . ఆయన రాక తో సాగర్ తన పరిస్థితి ని అర్థం చేసుకుంటే చాలు . ...భరత్ రాం వివరణ తో చిక్కుముడి విడిపోతుంది . ఓ మార్గం ఏర్పడుతుంది .

సాగర్ ఆవేశం,కోపం తగ్గాయి . ఆలోచిస్తూ ఉండి పోయాడు .

“ విద్యా గారూ ! మీరు డైరీ లో

ప్రొ జెక్ట్ చేసిన అజయ సింహ్ , నేను చూసిన అజయ్ సింహ్ ఒకరు కారు . కోమలాదేవి సహగమనం జరిగి పాతిక సంవత్సరాలైంది . ఈ సుదీర్ఘ కాలం ఎలాంటి వారి లో నైనా తప్పక మార్పు తీసుకు వస్తుంది . ఆలోచన లో, వ్యక్తిత్వం లో , నమ్మకాల లో .... అజయ్ మారాడు . ఆయన భార్య రూపాదేవి ఆయనను మనిషిగా మార్చింది . వయసు తో పెరిగిన లోకానుభవం అజయ్ ఆలోచనా విధానం లో మార్పు తెచ్చింది . నా

ఆ ర్టికల్ లో ‘సతి పై అజయ్ అభిప్రాయాలు చదివారుగా ? జరిగిన ఆనాటి సంఘటన దృష్టి లో ఆయన అప్రోచ్ హిపోక్రసీ అనిపించినా ‘మారాడు అన్న మాట నిజం. ... అప్పటికీ, ఇప్పటికీ మారని వ్యక్తి ఒక్కరే......రాహుల్ బాబు .! “ క్షణం ఆగాడు జస్వంత్. ఆ స్వల్ప వ్యవధి లో నే విద్యా రాహుల్ ను చూసింది . అతడి భంగిమ లో మార్పు లేదు . ---అలాగే తల వంచుకుని. విద్యా అతడి లో పొంగే భావాల వెల్లువ అంచనా వేయగలదు . ఆమెలో అమ్మకు రాహుల్ హృదయ స్పందన తెలుసు . అతడిని మొదటి సారి చూసినప్పుడే ఆమెలో అమ్మ కదిలింది .

---కరిగింది .

“ వయసు లో , చదువు లో, విజ్ఞానం లో, అనుభవం లో, అతడు మూడు పదులు దాటిన యువకుడు . అమ్మ తలపుకు వస్తే పదేళ్ళ పసి బాలుడే ! విద్యా గారి లో అమ్మను చూడ గల మమత, సంస్కారం రాహుల్ బాబు లో ఉన్నాయి . చితి మంటల్లో బూడిదైన అమ్మ తిరిగి రాదనీ తెలుసు . ఆ నిజాన్ని జీర్ణించు కున్నా వాస్తవం తో అమ్మ ‘లేదన్న భావం ఓ భరించలేని ఊహ. ఇలా ఊహకు , వాస్తవానికి నడుమ త్రిశంకు లా ఇప్పటి వరకు కాలం దొర్లిస్తూ వచ్చాడు . అమ్మకు ఘోరమైన అన్యాయం జరిగిందని ఆక్రోశం, కోపం ! కోమలా దేవి పునర్జన్మ అతడి కి దేవుడిచ్చిన వరం . అమ్మ కోసం అతడు ఏదైనా చేయ గలడు . ఆమెకు న్యాయం జరగాలని ఎంతకైనా తెగిన్చగలడు . పోరాడగలడు . అమ్మకు అతడు రక్షణ వలయం . అజయ్ అన్న కొడుకును ఎదిరించ లేడు . ఒక్క అడుగు ముందుకు వేయలేడు . సాగర్ గారూ ! నేను చెప్పిన ప్రతి మాట ఒకసారి మననం చేసుకోండి . ప్రశాంతం గా ఆలోచించండి . భరత్ రామ్ గారు మిమ్మలిని కలిసిన తర్వాత నా మాటల్లో యదార్థం మీకు అర్థమవుతుంది . మీరొక నిర్ణయానికి వస్తారు . నన్ను, రాహుల్ ను తప్పక కలుస్తారు . అప్పుడు , నాది ప్రొఫెషనల్ ట్రిక్ సో , సిన్సియర్ efforts మీకు తెలుస్తుంది . శెలవు.” చేతులు జోడించాడు జస్వంత్ .సాగర్ కు బుర్ర తిరిగి పోయింది . జస్వంత్ మాట తీరు, విశ్లేషణ అతడి మతి ని పోగొట్టాయి . జస్వంత్, రాహుల్ లేచారు . డో ర్ వైపు రెండడుగులు వేశారు .

“ రాహుల్ బాబు ! “ రాహుల్ వెనక్కి తిరిగి విద్యాధరిని చూశాడు . ఆమెలో లీల గా కోమల కనిపించింది . గుండె లయ తప్పింది .

“ నాన్నమ్మ ను అడిగానని చెప్పు ! ఆమె మాట కాదని సహగమనం చేశాను . నిన్ను దూరం చేసుకున్నాను . ...నేను మా అత్త గారిని కలవాలి. కాళ్ళు పట్టుకుని క్షమించమని అడగాలి!” కళ్ళు తుడుచుకుంది విద్యాదరి .

ఆమె మాట్లాడింది శుద్ధ గ్రామీణ రాజస్తానీ.

ముగ్గురూ---జస్వంత్, రాహుల్, సాగర్ ఉలిక్కి పడ్డారు . సాగర్ లో కంగారు.భయం ; రాహుల్ లో ఆనందం, ఆశ్చర్యం ; జస్వంత్ లో విస్మయం , సంభ్రమం ; జీవితం లో మొదటి సారి split personality చూసిన వింత అనుభవం

************************

లా డ్జ్ రూమ్ లో జస్వంత్, రాహుల్ రిలాక్స్ అయ్యారు .” చూశావా ? నా మాటలకు ఆమెలో అమ్మ కదిలింది .మీ ఇద్దరి అనుబంధం వయసు, కాలం హద్దుల్ని చెరిపేసింది . ఆమె లో కోమల స్పష్టం గా కనిపించింది . విద్యా మనసు పై అంత గాఢమైన ముద్ర వేసిన కోమల తన జన్మ లక్ష్యం నెరవేర్చుకుంటుంది .

ఇక జరగబోయే అద్భుతాన్ని ఎవరూ ఆపలేరు . “ జస్వంత్ మాటల్లో ఆత్మ విశ్వాసం .

“ అమ్మ నన్ను మరిచి పోలేదు . కదిలిస్తే పలుకుతోంది . ఒకరిలో మరొకరు నీడలా కదలటం ఎంత విచిత్రం గా ఉంది . split personality అన్న అద్భుతాన్ని పుస్తకాల్లో చదివాం . సినిమాల్లో చూశాం . “

But .....real ఎక్స్పీరియన్స్ . .....most thrilling . !!...రాహుల్ ! ఆమె లో అమ్మ నీకు మరింత దగ్గర కావాలి .

“దగ్గర కావటం అంటే :? అర్థం కానట్లు చూశాడు

“ విద్యాధరి గా ఆమెకు కొన్ని లిమిట్స్ ఉన్నాయి . వయసు తేడా, సాగర్ భార్య గా కొన్ని బాధ్యతలు , చుట్టూ ఉన్న సమాజం----ఇలాంటివే మరి కొన్ని . వీటిని ఆమె దాటాలంటే , నీ పట్ల ఆమె కమిట్మెంట్ పూర్తీ స్థాయి లో establish కావాలంటే నీ మనసు ఆమెకు తెలియాలి . అమ్మ కోసం ఇన్నాళ్ళు అనుభవించిన మూగబాధ ఆమెను కదిలించాలి . నీ మనసు, మమత, బాధ, నీ ఆలోచనలు,లక్ష్యం, లాజికల్ గా , రీజనబుల్ గా కాగితం మీద పెట్టు . ఓ సుదీర్ఘ లేఖ రాయి ....... నీ మనసుకు అడ్డం లాంటిది . అప్పుడే ఆమె మనతో కలిసి అడుగు వేస్తుంది .” చివరి మాట ముగించి జస్వంత్ ఆవులిస్తూ బెడ్ పై వాలాడు . టేబుల్ ముందు కాగితాల బొత్తి తో రాహుల్ కూర్చున్నాడు . ముఖం గంభీరం గా ఉంది . మనసు లో అలజడి కళ్ళలో కనిపిస్తోం ది . టేబుల్ లైట్ కాంతి మొహం పై క్రీనీడలు పరిచింది . కాగితాలపై కాలం అవిరామం గా సాగిపోతోంది . మనసులో భావాలు అక్షరాలై కాగితాలలో ఒ ది గిపోతున్నాయి . అలా ఎంతసేపు గడిచిందో .

జస్వంత్ కు మెలకువ వచ్చింది . రాహుల్ వంచిన తల ఎత్తకుండా రాస్తూనే ఉన్నాడు . టైం చూశాడు .---నలుగు. జస్వంత్ పెదవులపై చిరునవ్వు. మళ్ళీ పడుకున్నాడు .

******************************

కొనసాగించండి 26 లో