The shadow is true - 10 in Telugu Fiction Stories by LRKS.Srinivasa Rao books and stories PDF | నీడ నిజం - 10

Featured Books
  • રૂપિયા management

    પુરુષ ની પાસે રૂપિયા હોય તો સ્ત્રી નગ્ન થઈ જાય અને પુરુષ પાસ...

  • આપણા ધર્મગ્રંથો - ભાગ 1

    વાંચક મિત્રો સહજ સાહિત્ય ટીમ ધાર્મિક બાબતો વિશે માહિતી લઈ અવ...

  • સેક્સ: it's Normal! (Book Summary)

                                જાણીતા સેકસોલોજિસ્ટ ડોક્ટર મહેન્...

  • મેક - અપ

    ( સત્ય ઘટના પર આધારિત )                                    ...

  • સોલમેટસ - 11

    આરવ અને રુશીને પોલીસસ્ટેશન આવવા માટે ફોન આવે છે. આરવ જયારે ક...

Categories
Share

నీడ నిజం - 10

ఈ విషయం పనివారి ద్వారా విక్రమ్ తల్లి కి తెలిసింది.ఆమెకు కొడుకు-కోడలి అవస్థ అర్థ మైంది.పర్వం పేరు తోనో,పండుగ పేరుతో నో రాహుల్ ను కొంతకాలం వారిద్దరి కీ దూరంగా వుంచాలనుకుంది. అందుకు దైవికంగా అవకాశం వచ్చింది.

రాహుల్ ను ఎలాగో ఒప్పించి, ఆ పసివాడిని తీసికొని పక్క వూరికి ప్రయాణమైంది.మొదట రానని మొరాయించాడు. కాని నాయనమ్మ మాటల గారడీ కి పడి పోయాడు. పైగా అప్పుడు వేసవి శెలవులు. స్కూల్ బెడద కూడా లేదు.రాహుల్ కూడా హాలిడే మూడ్ లో వుండటంతో ఆమె పని సులువైంది. తల్లి సమయస్ఫూర్తి కి విక్రమ్ మనసులో నవ్వుకొన్నాడు. కోమల కూడా మనసులో నే కృతజ్ఞతలు చెప్పుకుంది. కోరినంత ఏకాంతం . కోమలా

విక్రమ్ సింగ్ ల ను శారీరకంగా ఒకటి చేసింది. అంకిత భావం, ఆర్ద్రత, అనురాగం త్రివేణీ సంగమమై కోమల రూపంలో విక్రమ్ ను వరదలా ముంచెత్తాయి.

ఇలా రోజులు క్షణాల్లా కు గడచిపోతున్న నేపథ్యం లో ఒక విచిత్రం జరిగింది.

ఒకరోజు బాగా పొద్దెక్కిన మీదట , విక్రమ్ ఏదో పని వుందంటూ ఊర్లో కి వెళ్ళాడు.ఇంట్లో కోమలి ఒంటరి గా వుంది. పనివారు బయట ఏదో పనిలో తీరిక లేకుండా ఉన్నారు. వాతావరణం ప్రశాంతంగా, చల్లగా వుంది. కోమల కూనిరాగం తీస్తూ ఇంటి పని లో వుంది.

ఇంతలో బయట ఏదో గోల.పిల్లలు, పెద్దలు అందరూ కలిసి కలివిడిగా అరుస్తున్న రణగొణ ధ్వని. వారి ధోరణి చూస్తుంటే వెర్రిగా అరుస్తూ అటూ,ఇటూ పరుగెడుతున్నట్లుంది.

కోమల ఒక్క వుదుటన వాకిట్లోకి వచ్చింది. అక్కడి దృశ్యం చూసి కంగారు పడింది. ఎవరోఓ వింత వేషధారిని ఊరి వారందరూ తరుముకుంటూ వస్తున్నారు. అతడు వారికి అందకుండా మెరుపులా తప్పించుకుంటున్నాడు. అతడి ఒంటిపై అంగవస్త్రం తప్ప ఏ ఆచ్ఛాదన లేదు.పొడవాటి గడ్డం,భుజాలపై జీరాడే కేశాలు తైల సంస్కారం లేక చిక్కు పడి వున్నాయి.అతడి చుట్టూ వలయం లా చేరిన జనం ' అఘోరి ! అఘోరి ! అంటూ వెర్రిగా అరుస్తున్నారు.

అఘోరి క్షణ కాలం ఆమె కళ్ళలో భయం. అతడు ఎలాంటి వాడో తనకు తెలీదు.కాని , మరి కాస్త ఆలస్యం చేస్తే అతడి చుట్టూ చేరిన వెర్రి జనం అతడి నుండి నిలువునా చీల్చే లా వున్నారు.

కోమల ముందు కొచ్చి చొరవ గా ఆ జనాన్ని ఒక్క మందలింపు తో ఆపగలిగింది. మంత్రం వేసిన పాముల్లా అందరూ ఆగిపోయారు. విక్రమ్ సింహ్ భార్య హోదా లో కోమలా దేవి ని గౌరవించటం వారి కనీస ధర్మం.

విషయం తెలుసుకున్న కోమల వారికి నచ్చే చెప్పే ప్రయత్నం చేసింది.” చూడండిఆతడు చెడ్డ వాడే కాదనను.కాని ఇంతవరకు అతడి వల్ల ఏ ప్రమాదం జరగా లేదు కదా ? ఏదో జరుగుతుందన్న భయం తో అతడిని హింసించటం పాపం. అలా చేస్తే అతడికి , మనకు తేడా ఏమిటి ? దయ చేసి ఊరి పెద్దలకు అతడిని అప్పగించండి. చెడ్డ వాడో కాదో వారే నిర్ణయిస్తారు . “ ఆమె ఆలోచన వారికి సబబుగా అనిపించింది. పైగా ఠాకూర్ ఇల్లాల్ని ఖాతరు చేయక పోవటం ధర్మం కాదు కదా ? ఎటు చూసినా వారికి వేరే మార్గం లేదు. అందుకే అఘోరిని పెడరెక్కలు విరిచి కసిగా తీసుకు పోయారు. వారితో వెళుతూ అఘోరి కొమలను చూసాడు. అగ్ని గోలాల్లాంటి అతడి కళ్ళలో కృతజ్ఞత తలుకుమంది. ఆ చూపులు ఆమెపై అయస్కాంతం లా ప్రభావం చూపాయి.

విక్రం సింహ పెద్దగా పంచాయతీ జరిగింది. ఊరి ప్రజలందరూ ముక్తకంఠం తో అతడిని కిరాతకుడని తీర్మానించారు. కఠినం గా దండించాలని పంచాయతీ పెద్దలపై ఒత్తిడి తీసుకువచ్చారు. జనాభిప్రాయాన్ని ఎవరు కాదనగలరు ?

విక్రం అఘోరిని క్షణం పరిశీలన గా చూసాడు. అతడి చూపుల్లో భీతి లేదు. కంగారు లేదు.ముఖం లో ఏదో వింత కాంతి. అతడి పై ఎవరు ఏ రీతి లోఅభియోగం చేస్తున్నా మౌనం గా , ప్రతిమ లా నిలుచుండి పోయాడు. “ ఇలాంటి స్టితి లోకూడా ఇంత నిగ్రహం, గాంభీర్యం సామాన్యులకు సాధ్యమా /” విక్రం మనసు లో ఎగసిన భావ కెరటం నిజం తెలుసుకోవాలన్న స్పృహ కలిగించింది. “ నువ్వేమైనా చెప్పుకోవాల్సి ఉందా ?” విక్రం సింహ్ ప్రశ్న ఊరి వారిని కలవర పరిచింది. అక్కడ రచ్చబండ చుట్టూ చేరిన జనం పరిస్టితి అర్ధం కాక ఒకరినొకరు చూసుకున్నారు.

అఘోరి విక్రం ను నిర్వికారం గా చూసాడు. “అందరూ నిన్ను దోషి అంటున్నారు. నువ్వు క్షుద్రోపాసకుడవని వారి అభిప్రాయం . ఆ అభియోగం తో నేనూ ఏకీభవిస్తాను. నేనూ మీ గురించి చాలా విన్నాను. నిన్ను శిక్షించడానికి ఈ కారణాలు చాలు. కాని, అలా శిక్షించటం ధర్మం కాదు. తప్పు చేసిన వారికీ కూడా మనసు లో మాట చెప్పుకునే అవకాశం ఇవ్వాలి. ఈ నీతి సూత్రానికి కట్టుబడే నీకు అవకాసం ఇస్తున్నాను. “

అఘోరి పెదవుల పై చిరునవ్వు మెరిసింది. విక్రం ను ప్రసన్నం గా చూసాడు.

“ మీ సమతా దృష్టికి శిరసా నమామి . ! మీ లో ఇంతటి గొప్ప గుణం ఉంది గనకే మీ ఇల్లాలు మీ అడుగుజాడలో నడిచి ఈ రోజు ఉదయం ఈ ఉన్మాదులతో సామరస్యం గా మాట్లాడి. నా ప్రాణం కాపాడింది.” అతడి చివరి మాటలతో విక్రం అఘోరిని కుతూహలం గా చూసాడు. రెండు క్షణాలు నిశ్శబ్దం !

“అవును—నేను అఘోరినే. నా వేషం, వాలకం చూసి మీరు భయ పడటం సహజం.. కానీ కేవలం బాహ్యరూపం చూసి మనిషి విలువను అంచనా వేయటం ధర్మమేనా ?”

అతడి ప్రశ్నలకు అందరూ మౌనమే. “ మీ దృష్టి లో నేను క్షుద్రోపాసకుడను . కిరాతకుడను. కాని, ఇంత వరకు నేనే కిరాతకం చేయ లేదు. మీ ఊరి శ్మశానం లో క్షుద్ర పూజ చేస్తూ వీరికి దొరికి పోలేదు. అందరి లాగే నేను ఈ ఊరి రహ దారిలో నడిచి వస్తున్నాను. నన్ను చూసారో లేదో వీరికి శివమెత్తుకొ చ్చింది . వెర్రి అఆవేశం తో “అఘోరి” అంటూ నన్ను చుట్టుముట్టారు . కొట్టి చంపాలని విశ్వ ప్రయత్నం చేసారు. “ నిజానిజాలు తెలుసుకోకుండా నీ మీద అత్యాచారం చేయాలనుకోవటం తప్పే . కానీ, నువ్వు అఘోరివి . నిన్ను చూసి భయ పడటం , దండించాలనుకోవటం చాల సహజం. అందుకు కారణం మీ ప్రవ్రుత్తి .! మీ పైశాచికత్వం .”

అఘోరి మందహాసం చేసాడు, “ అఘోరీ ల పై ఇలాంటి వదంతులు ఎలా వ్యాపించాయో గాని ---వారు మీరు అనుకుంటున్నట్లు క్షుద్రులు కారు. హిమాలయాల్లో కఠోర సాధన తో జీవన్ముక్తికి తపిస్తున్న అభినవ రుద్రులు. ఎవరో కొందరు క్షుద్రోపాసకులు అఘోరీ ల ముసుగు లో అత్యాచారాలు చేస్తూ ఇలాంటి వదంతులు వ్యాప్తి చేసి ఉంటారు. ఈ ఊర్లో ఉన్నప్పుడు నేనూ మీలాగే అఘోరీ ల గురించి చేదుగా అనుకునే వాడిని.”

అఘోరి చివరి వాక్యం అక్కడ సమావేశమైన ప్రతి ఒక్కరినీ వయోబేధం లేకుండా కలవర పరచింది.” అంటే నువ్వు ........ “ సందేహం గా చూసాడు విక్రం. అఘోరి మళ్ళీ మందహాసం చేసాడు. “ నా వేషం , వాలకం ఇలా విచిత్రం గా మారాయి. కనుక నే మీరు నన్ను గుర్తు పట్టా లేదు. నేను హీరాలాల్ ను. జమునా బాయి కొడుకు ను . “ అక్కడున్న జనం లో కలకలం మంద్రస్థాయి లో కెరటం లా వ్యాపించింది. అందరి చూపులు అతడి పై బాణాల్లా నాటుకు పోయాయి .

గతం నీలి నీడ లా మనసు లో మెదలగా అఘోరి ఉదాసీనం గా ఉంది పోయాడు. “ నా జీవితం లో జరిగిన విషాదం మీకు తెలుసు. పడవ ప్రమాదం లో నా భార్యా బిడ్డలు , తల్లి గంగ పాలయ్యారు. అవశేషం లా నేను మిగిలాను నేను ఎవరి కోసం బతకాలన్న ఆలోచన నన్ను పిచ్చివాడిని చేసింది. దిక్కు తోచక , దారి తెన్నూ లేకుండా కొంతకాలం మొండి గా బతికాను . చివరకు విసిగి పోయి ఆత్మహత్య చేసుకుందామని ప్రయత్నించి నీటి పాలు కాగా ఓ పుణ్యాత్ముడు రక్షించాడు. అతడొక అఘోరి. అతడిని చూసి మీలాగే నేనూ భయ పడ్డాను. కానీ, అతడి తో కొన్ని రోజులు గడిపాక అతడొక మహత్తర సాధకుడు అని తెలిసింది. నన్ను అద్వితీయ వాక్పటిమ తో మంత్ర ముగ్ధుణ్ణి చేసాడు. జీవిత సత్యాలు బోధించాడు. నాలో గూడు కట్టుకున్న బాధ, భ్రమ యిట్టె తీసి వేసాడు. కర్తవ్యమ్ బోధించి శిష్యుడు గా స్వీకరించాడు ". అందరూ సర్వం మరిచి వింటున్నారు.

“ ఆ నాటి నుండి నా జీవన గమనమే మారింది. దృష్టి మారింది.—దృక్పధం మారింది. నేను హీరాలాల్ అన్న విషయం మరిచిపోయాను . సాధన—నిరంతరం కఠోర సాధన ! మనసును, శరీరాన్ని జ్ఞానాగ్ని లో తపింప జేసే సాధన . రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు—కాలం ధ్యాసే లేదు. నా లక్ష్యం లో, నా లగ్నం లో మార్పు లేదు. అంతర్ముఖుడై లోన వెలిగే దివ్య జ్యోతి ని దర్శించటం ఓ అపూర్వానుభూతి .

దివ్యానుభవం ! ....ఇలా చాల కాలం గడిచాక మా గురుదేవులు నన్ను దేశాటన చేసి రమ్మన్నారు . కానీ, అలౌకికత్వం అలవడినాక దృష్టి లౌకిక ప్రపంచం వైపు మళ్ళదు. ఆ మాటే వారితో అన్నాను. వారు చిద్విలాసం గా నవ్వారు. ధర్మ ప్రచారం, రక్షణ సాధకుడి గురుతర బాధ్యతను , పైగా ప్రపంచ దర్శనం తో సాధన కు పూర్ణత్వం సిద్ధిస్తుందని చెప్పారు. వారి మాట కాదనలేక దేశాటనకు బయలుదేరాను. తీర్థయాత్రలు చేస్తూ, దివ్యక్షేత్రాలు దర్శిస్తూ మూడు రోజుల క్రితం ఈ ప్రాంతానికి వచ్చాను. .. పుట్టిన ఊరు మనసును పట్టి లాగింది. అంటే... ఇలా ఊరి దారి పట్టి మన వారికీ దొరికి పోయాను. ..అఘోరీలు సాధారణంగా జనజీవనం లో కలవరు. జనస్రవంతి కి దూరం గా ఉంటూ , ఎవరిని కలవాలో వారినే కలుస్తూ , కొత్త విషయాలు తెలుసుకుంటూ , లోకం పోకడ గమనిస్తూ , ప్రయాణం సాగిస్తూ వచ్చాను. ఇక్కడికి వచ్చాక సొంత ఊరన్న ధీమా తో ,ఎవరో ఒకరు గుర్తించక పోతారా అన్న నమ్మకం తో, ఊరి బాట పట్టి చిక్కులు కొని తెచ్చుకున్నాను. మీ ముందు దోషిలా నిలబడ వలసి వచ్చింది. “ అఘోరి తన సుదీర్ఘ కధనం ముగించి గాడంగా నిట్టూర్చాడు. అతడు పూర్వాశ్రమం లో హీరాలాల్ అని తెలిశాక అందరూ చుట్టూ చేరి పరామర్శలు , పలకరింపులు ప్రారంభించారు .

రెండు రోజులు సొంత ఊర్లో గడిపి అఘోరి తిరుగు ప్రయాణం అయ్యాడు . విక్రం అభ్యర్ధన మీద చివర గా అతడింట్లో భిక్ష స్వీకరించాడు . కోమలా విక్రం ల ఆప్యాయత, ఆతిధ్యం అతడిని ఆకట్టుకొన్నాయి. ముఖ్యంగా కోమల సంస్కారం అతడిని మంత్రముగ్ధుడిని చేసింది.


******************************************

కొనసాగించండి 11 లో