tholipournami in Telugu Love Stories by sreelu books and stories PDF | తొలి పౌర్ణమి - 15

The Author
Featured Books
Categories
Share

తొలి పౌర్ణమి - 15

వాట్ ఈజ్ దిస్ చాందిని నువ్వు ఇంత లేట్ చేస్తే నేను దీన్ని మేనేజ్ చేయలేను.” It is showing your incapability in the work..”.
నేను ఎలాగైనా కంప్లీట్ చేస్తా సోహమ్, అంది తను.
ఈరోజు సాయంత్రం ఎంత లేట్ అయినా సరే దీన్ని పూర్తి చేసి వెళ్ళాలి, ఏం చేస్తావో నాకు తెలియదు అంటూ వెళ్లిపోయాడు. 
ఈ సోహమ్ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎందుకు అన్ని టాస్కులు అసైన్ చేస్తున్నాడో నాకైతే అర్థం కావట్లే, పోనీ సోహమ్ కి చెబుదాం అంటే మేం క్లైంట్ లొకేషన్ కి వచ్చాం వాళ్ళతో ఎలా పడితే అలా మాట్లాడకూడదు..
తను చాలా టెన్షన్ పడుతోంది..
నాకు తను భయపడటం నచ్చలేదు, తనకు హెల్ప్ చేద్దామని నిర్ణయించుకున్నా.
  తన పక్కన ఖాళీగా ఉన్న కుర్చీలోకి కూర్చున్నాను, తనని అడక్కుండానే లాప్టాప్ తీసుకున్నాను, ఇష్యూ ఏంటో చూడటం మొదలుపెట్టా, దాన్ని అర్థం చేసుకోవడానికి నాకు అరగంట పట్టింది.
తర్వాత తనకు వాటిని వివరించడం మొదలుపెట్టాను, తను నా కళ్ళలోకి చూస్తోంది, నేను కిందకి లేదా లాప్టాప్ వంక చూసి చెప్తున్నా.. వివరించడం పూర్తి కాగానే కొన్నింటిని ఫిక్స్ చేసి చూపించాను, మిగతా వాటిని అలాగే చేయమని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోయా.. ఎందుకంటే తను నన్ను మాట్లాడిస్తే నేను మాట్లాడకుండా ఉండలేను..
 సాయంత్రం ఆరు అవుతోంది తిరిగి ఇంటికి వెళ్లాలి, చాందిని నేను ఇద్దరమే ఉన్నాం, శృతి బయటికి వెళ్ళినట్టుంది, ఎలాగో వాళ్ళిద్దరూ వస్తారు కదా అని నేను కిందకి వెళ్ళిపోయాను.
 బండి స్టార్ట్ చేస్తుంటే ఫోన్ మోగింది. 
చూస్తే శృతి..
“విక్రమ్ నేను మా బావను కలవడానికి వచ్చా, నాకు ఇంకా టైమ్ పట్టేలా ఉంది , చాందిని ఇంకా అక్కడే ఉంది, తనకు కాసేపు తోడుగా ఉండి డ్రాప్ చేయవా” అంది.
 సరే శృతి…
చాందిని ఎప్పుడొస్తుందో కనుక్కుందామని పైకి వెళ్ళా.. క్యాబిన్ దగ్గరికి వెళ్లేసరికి అక్కడ సోహమ్ ఉన్నాడు..
తన వంక చూడకుండా ఇలా అన్నా, “చాందిని నువ్వు వచ్చే ముందు కాల్ చేయి నేను కింద వెయిట్ చేస్తుంటా” ..
హే విక్రమ్ నువ్వు వెళ్లొచ్చు, తనని నేను డ్రాప్ చేస్తా…అన్నాడు సోహమ్.
తనేమీ మాట్లాడలేదు నా వంక కామ్ గా అలానే చూస్తోంది..,ఒకపక్క అమ్మ ఫోన్ చేసింది, “ పనుంది బయటికి వెళ్లాలి తొందరగా రారా“..
తను ఏం మాట్లాడకపోయేసరికి “ఓకే సోహమ్ నాక్కూడా కొంచెం పనుంది” అంటూ, ఇంటికి బయలుదేరా..
వెళ్తుండగా దారిలో మళ్లీ ఫోన్ మోగింది, అమ్మ మళ్లీ చేసిందేమో అని ఎత్తలేదు..మళ్లీ మోగింది బండి పక్కకు ఆపా.
చూస్తే చాందిని, ఫోన్ లిఫ్ట్ చేశా..
“హలో చాందిని..”.
తను ఏం మాట్లాడట్లేదు..
 పొరపాటున చేసిందేమో అని కాల్ కట్ చేయబోయా అంతలో ఈ మాటలు వినిపించాయి.
“ “ ఒప్పుకో చాందిని దీని వల్ల నీకు చాలా ప్లస్ పాయింట్స్ ఉంటాయి. 
చాందిని ఏడుస్తూ, “ఏంటి సోహమ్ ఇలా మాట్లాడుతున్నావ్”.
ఏంటి చాందిని, ఈ పీరియడ్ ఆఫ్ టైమ్ లో చాలా మంది ఇలాగే ఉన్నారు.
నేనలా ఉండలేను..
 చూడు చాందిని నేనేం తప్పుగా అడగట్లేదు, ఈ జనరేషన్లో ఇలాంటివన్నీ కామన్, నువ్వింకా చాలా అప్డేట్ అవ్వాలి, ఈరోజు చూసావా నేను నిన్ను ఎంత కష్ట పెట్టాల్సి వచ్చిందో, అందుకే నాతో పాటు లివింగ్ టుగెదర్ కి ఒప్పుకున్నావంటే, అసలు నీకు ఎలాంటి సమస్య ఉండదు, నువ్వు ఏ టెక్నాలజీస్ ను ఇంత కష్టపడి నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు, ప్రతి నెల ఒక రెండు రోజులు సెలవు తీసుకుని మనం ఎక్కడి కన్నా హాయిగా వెళ్లి రావచ్చు, ఒప్పుకో…
చూడు సోహమ్, నేను ఏదైనా నేర్చుకునే ముందుకు వెళ్తా, నువ్వు పక్కకి తప్పుకో నేను వెళ్ళాలి. “”
 వెంటనే బండిని వెనక్కి తిప్పా…
           ****
సరే కార్ ఎక్కు నేను డ్రాప్ చేస్తా, దారిలో మాట్లాడుకుందాం అన్నాడు సోహమ్..
“వద్దు నేను క్యాబ్లో వెళ్ళిపోతా” అంటూ పార్కింగ్ లాట్ నుంచి బయటకు నడిచింది..
 చెయ్యి పట్టుకున్నాడు సోహమ్..
అయినా నిన్ను ఎన్ని రోజులు నుంచి బ్రతిమిలాడుతున్నా, నీ మనసు కరగదా, ఇదిగో ఇలాంటివి చేస్తేనే మళ్ళీ భవిష్యత్తులో నీకు ప్రాబ్లమ్స్ వస్తాయి..
చెయ్యి వదులు..
దీనికి నువ్వు ఒప్పుకొని తీరాలి లేదంటే…, నీ జాబ్ కూడా పోవచ్చు.
వదులు సోహమ్..అంటూ తన చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తోంది..
ఈరోజు నువ్వు నాకు నచ్చే రెస్పాన్స్ ఇవ్వాల్సిందే… లేదంటే.
ఇంతలో అకస్మాత్తుగా ఇద్దరి ముఖాల హెడ్ లైట్ పడింది..
ఇద్దరు నా వైపు చూశారు, నన్ను చూడాగానే సోహమ్ చాందిని చెయ్యి వదిలేశాడు, చాందిని పరిగెత్తుకుంటూ వచ్చి నా ముందు నిలబడింది.
తనని వెనక్కి జరిపి నేను ముందు నిలబడ్డా, ఈ ఫీల్ చాలా బాగుంది,” కానీ తను భయపడుతోంది”.
“విక్రమ్… వాట్ ఆర్ యు డూయింగ్ హియర్, పెండింగ్ వర్క్ గురించి డిస్కస్ చేస్తున్నాం క్లైంట్ తిట్టాడని తను ఏడుస్తోంది” అంతే, “షి ఈజ్ వెరీ సెన్సిటివ్ గర్ల్ యు నో “. 
ఏదో చెప్పబోయింది తను…
ఒక చిటిక వేసి సోహమ్ నా వైపు చూసేలా చేశా..
 ఏంటి సోహమ్ ఇది, వాళ్లకు ఇంట్లో ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, అది పోయి ఇలా చేస్తే…
 ఏంట్రా….. నచ్చజెప్పి పంపిద్దాం అంటే చాలా ఎక్కువ మాట్లాడుతున్నావ్, నేను నీ గురించి ఒక కంప్లైంట్ చేస్తే నువ్వు కంపెనీ బయట ఉంటావు, అయినా ఆ అమ్మాయితో నేనెలా ఉంటే నీకెందుకురా, తనతో నువ్వు ఎలాగో మాట్లాడవు కదా , కాబట్టి “మైండ్ యువర్ బిజినెస్, అదర్వైజ్ యు విల్ పేస్ ది కాన్సిక్వెన్సెస్”.
చాందిని భయంతో నా భుజం మీద చెయ్యి వేసింది..
“సోహమ్ గొడవలొద్దు.. నేను చెప్పేది కాస్త విను” 
చూడు విక్రమ్ ఇది సినిమా కాదు నువ్వు హీరోయిజం చూపించడానికి, నేను తనతో కొంచెం మాట్లాడాలి నువ్వు ఇక్కడినుంచి దొబ్బెయ్.
వాడు నాకు వార్నింగ్ ఇచ్చిన మాటకి నేను చిన్నప్పడు కొట్లాట తర్వాత వదిలేసిన పాత విక్రమ్ నాలో బయటికి వచ్చాడు. వెళ్లి వాడి చొక్కా పట్టుకున్నాను. 
“నా చొక్కా పట్టుకుంటావా”, అని అరుస్తూ కాలర్ పట్టుకున్నాడు..
ఈసారి గొంతు పట్టుకున్నా.
నా జోలికి వస్తె ఏం అవుతుందో నీకు తెలియదు, అసలే క్లైంట్ కంపెనీ కి వచ్చావు….
 ఏంట్రా నీకు భయపడేది, అంటూ పిడికిలి బిగించి ముఖం మీద ఒక్క గుద్దు గుద్దాను, దెబ్బకి మూర్చ పడిపోయాడు.
2 నిమిషాలు అవుతోంది ఇంకా లేవట్లేదు..
“ చాందిని వాటర్ బాటిల్ ఇవ్వు”, వాడిపై కొన్ని నీళ్లు చిలకరించాను. 
మెల్లగా కళ్ళు తెరిచాడు, కళ్ళు బైర్లుగమ్మినట్టున్నాయి దృష్టిని ఒక చోట ఉంచలేక పోతున్నాడు..
అతని దృష్టి నా వైపు తేవడానికి చిటిక వేశా..
కోపంగా నా వైపు చూసాడు..
చూడు సోహమ్, చాందిని ఇక్కడ ఉన్నంతకాలం ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటుంది, నువ్వు నీ అతి తెలివి ప్రదర్శించి తనకు ఏ విధంగా అన్నా ప్రాబ్లం క్రియేట్ చేయాలని అనుకున్నావో, “ ఈసారి కింద పడవు, పడి పైకి పోతావ్..”
సోహమ్ మౌనంగా ఉండిపోయాడు..
 నేను అక్కడి నుంచి లేచి చాందిని చేయి పట్టుకొని బైక్ దగ్గరికి వెళ్ళా….
 ఏదో చెప్పబోయింది..
“ ఏం మాట్లాడకుండా బండెక్కు” అన్నా..
అలా వెళ్తూ బండిని ఒక పక్కకు ఆపాను అక్కడ నిర్మానుష్యంగా ఉంది. పక్కనే చెరువు, వికసించిన పూలతో చెట్లు, తుంపర్లుగా పడుతున్న వర్షం…, చల్లటి గాలి చర్మానికి తగులుతూ, చాలా ప్రశాంతంగా ఉంది.
దిగు చాందిని. 
“అసలు నీకు బుద్ధుందా ఇన్ని రోజులు ఈ విషయం జరుగుతుందని నాకో లేదా జయా కో చెప్పాలని తెలియదా, తెలివి ఉంటే సరిపోదు, అయినా నిన్ను అంతవరకు ఉండి పని చేయమని ఎవరు చెప్పారు పీ.జీ కి వెళ్లి చేయొచ్చు కదా, ఆరోజు అన్నావు గా అధికారాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని ఏదో చేస్తామని అది ఇదే , ఇష్టపడుతున్నాను, శుభ్రంగా పెళ్ళిచేసుకుంటాను అంటే మీకు నచ్చదు..”
తను సీరియస్ గా చూస్తోంది, నేను ఇంకాస్త రెచ్చిపోయి..
“చూడు దేవుడా అమ్మాయిలు ఎలా ఉన్నారో మరి మా లాంటి సిన్సియర్ అబ్బాయిల్ని ఏం చెయ్యమంటావ్” అంటూ పైకి చూసా..
నా చెంప ఛళ్ళుమనిపించింది చాందిని..
చెంప మీద చెయ్యి వేసుకుని నిలబడ్డాను. 
నువ్వే ఇంతదాకా తెచ్చుకొని, నన్ను కొడతావ్ ఏంటి అంటూ కొంచెం బాధ నవ్వు కలగలిపి అడిగాను. 
తను ఏడ్చే గొంతుతో, ఎందుకు విక్రమ్ నన్ను ఇలా చంపుతావు, మీ మనసులో ఉన్న విషయాన్ని వచ్చి డైరెక్ట్ గా చెప్పరు, ఎవరెవరికో చెప్పి అది మాకు తెలిసేలా చేస్తారు, అది నచ్చక ఏదో ఒక మాట అనేస్తే మాతో మాట్లాడరు, ఇలా ఉంటే నేను ఎలా చెప్పగలను. 
అది కాదు చాందిని ఆ విషయం వేరు , నేను నీకు నచ్చలేదు కాబట్టి నిన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేను మాట్లాడలేదు, కానీ ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు వచ్చి చెప్పాలి కదా….
 నువ్వు నాకు నచ్చలేదు అని నేను చెప్పానా, నాకు ప్రేమంటే నచ్చదని చెప్పాను, చిన్నప్పటి నుంచి ఒంటరిగా బతికిన నాకు, ఎవడో ఒకడు వచ్చి జీవితాంతం నీతో కలిసి ఉంటా అంటే, ఒక్కసారిగా ఎలా ఒప్పుకోమంటావు, సమయం పడుతుంది కదా… 
ఒకటి గుర్తుపెట్టుకో విక్రమ్, “అబ్బాయిలు నచ్చితే ప్రేమిస్తారు, కానీ అమ్మాయిలు నచ్చితే ఆలోచిస్తారు”.
నిజమే చాందిని నేను చిన్నపిల్లాడిలా చాలా మూర్ఖంగా ప్రవర్తించాను…
ఇంకా నువ్వేమన్నావ్ “నీకు డిసీజ్ ఉందని నేను ఒప్పుకోలేదా” దగ్గరికి రా అంటూ పిలిచింది..
అమ్మో నేను రాను నువ్వు ఇంకో చెంప పగలగొడతావ్..
ఇదిగో ఇలా మాట వినలేదంటే కొట్టేస్తా…
రెండు చెంపల మీద చేతులు పెట్టుకుని తన దగ్గరికి వెళ్ళా.., వేగంగా నా వైపు నడిచింది, మళ్ళీ కొడుతుందేమో అని కళ్ళు మూసుకున్నా..
నేను పూర్తిగా ఊపిరి తీసుకోలేక పోతున్నా….
చూస్తే తను నన్ను కౌగిలించుకుంది, చాందిని నన్ను కౌగిలించుకొంది, తను వదులుతున్న శ్వాస నా గుండెకు తగులుతుంది, తనలో నాపై ఉన్న ఇష్టాన్ని నేను ఫీల్ అవుతున్నాను. 
అలా కొన్ని సెకండ్లు కౌగిలిలో ఉండిపోయాక ఇలా అడిగింది..
“జీవితాంతం ఇలాగే నా దగ్గరగా ఉంటావా” అని అడిగింది.
‘ మరీ ఇంత దగ్గరగా ఉంటే నడవడానికి కష్టంగా ఉంటుందేమో ‘ అన్నాను..
ఒక గిల్లు గిల్లింది…, “ అమ్మ” అంటూ అరిచా..
నా చేతులతో తనని గట్టిగా హత్తుకున్నాను నాకు తెలిసి తనకు నా సమాధానం ఏంటో అర్థమయ్యే ఉంటుంది.
రేయ్ కన్నా బయటికి రారా, అంటూ పిలుస్తోంది అమ్మ, వెంటనే కథ వినడం ఆపేసి వెళ్లి డోర్ తీశాడు ఆకాష్.
నీ ఆరోగ్యం బాగోలేదని స్కూల్ నుంచి కాల్ చేశారు , ఏమైంది నాన్న..
ఏం లేదమ్మా అప్పుడు ఏదో కొంచెం తలనొప్పిగా ఉంటే వచ్చేసా అంతే. 
టాబ్లెట్ వేసుకున్నావా..
ఇంకా లేదమ్మా..
సరే రా, తినేసి టాబ్లెట్ వేసుకో.
వెళ్లి భోజనానికి కూర్చున్నాడు ఆకాష్, అమ్మ వడ్డిస్తోంది. 
అమ్మ మా క్లాస్ లో రీనా నన్ను ఈ సండే డిన్నర్ కి రమ్మని పిలిచింది వెళ్ళనా… అంటూ అడిగాడు.
నిజం చెప్పు డేట్ కి వెళ్తున్నావ్ గా..
సిగ్గుతో తల వంచుకున్నాడు, ఆకాష్ ముఖం ఎర్రబడింది.