కోర్టు అజయ్, ప్రవీణ్ మరియు అరవింద్ రెడ్డీలకి 15 రోజుల పోలీసు కస్టడీకి పంపించడానికి అనుమతించిన తరువాత వాళ్ళని పోలీసు వ్యాన్‌లొ ఎక్కించి విజయవాడ నగర శివార్లొ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిట్ (SIT) తాలుకు ప్రత్యేక విచారణా విభాగం(Special Interrogation Facility) కి అదె రోజు తరలిస్తారు.
సమయం : 05:15 గంటలు
సిట్ (SIT) తాలుకు ప్రత్యేక విచారణా కేంద్రం (Special Interrogation Facility)
వీళ్ళ ముగ్గురుని తీసుకొస్తున్న వ్యాన్ అక్కడికి చేరుకుంది.
వ్యాన్ నెమ్మదిగా ఆగగానే...అక్కడ ముందే సిద్ధంగా ఉన్న సాయుధ పోలీసులు చుట్టుముట్టారు.
వ్యాన్ వెనుక తలుపులు తెరుచుకున్నాయి.
"దిగండి..."
అని ఒక కానిస్టేబుల్ గట్టిగా అన్నాడు.
ముందుగా...
అజయ్ దిగాడు.
అతని వెనక...
ప్రవీణ్...
చివరగా...
అరవింద్ రెడ్డి.
ముగ్గురి చేతులకు సంకెళ్లు అలాగే ఉన్నాయి.
కోర్టు బయట ఉన్న మీడియా హడావిడి ఇక్కడ లేదు.
ఆ ఆవరణ అంతా నిశ్శబ్దంగా ఉంది. దూరంగా...
కొంతమంది పోలీసులు మాత్రమే ఉన్నారు. వాళ్ళు తమ తమ విధుల్లో నిమగ్నమై ఉన్నారు.
చుట్టూ పొడవైన ప్రహరీ గోడలు...
మూడు వరుసల భద్రత...
ప్రతి మూలలో సీసీ కెమెరాలు...
ప్రధాన ద్వారం వద్ద సాయుధ పోలీసులు.
రాష్ట్రంలోనే అత్యంత సంచలన కేసుకు సంబంధించిన ఈ ముగ్గురు నిందితులను ఇక్కడే పోలీసు కస్టడీలో ఉంచబోతున్నారు.
బండి దిగిన తరువాత పోలీసులు ముగ్గురినీ నేరుగా ప్రధాన భవనం లోపలికి తీసుకెళ్లారు.
అక్కడ కస్టడీలోకి తీసుకున్నప్పుడు జరిగె సాధారణ ప్రక్రియలొ భాగంగా వాళ్ళకి ముందు వైద్య పరిక్షలు నిర్వహించారు. తరువాత వాళ్ళ వ్యక్తిగత వస్తువులు (Personal belongings) ఏమున్నాయొ నమోదు చేసుకున్నారు. అక్కడ నుంచి వాళ్ళను మరింత లోపలికి తీసుకెళ్ళారు.
ఇంకా లోపలకి వెళ్ళగా ఒక పొడవైన కారిడార్ వస్తుంది.
ఆ కారిడార్లొ రెండు వైపులా వరుసగా గదులు ఉన్నాయి
చివరలో పైన " ప్రత్యేక విచారణా విభాగం (SPECIAL INTERROGATION BLOCK)" అని వ్రాసి ఉన్న గదిలోకి తీసుకెళతారు.
అక్కడ డ్యూటీలో ఉన్న అధికారి వరుసగా ఉన్న కస్టడీ జైళ్ళలొ మూడు గదుల తాళం తీసి తలుపు తెరిచాడు.
ఈ ముగ్గురినీ ఆ మూడు వేర్వేరు కస్టడీ సెల్సులో ఉంచారు.
రాత్రంతా వాళ్లు ఒంటరిగా ఉన్నారు. ఒకరినొకరు చూసుకోలేదు.
మరుసటి రోజు
ఉదయం : 9:25 గంటలు
ప్రత్యేక విచారణ విభాగంలొ అజయ్ సెల్
అజయ్ లోపల గోడకు ఆనుకొని ఉన్న ఇనుప మంచం మీద కూర్చొని ఉన్నాడు. తన ముందున్న గోడను చూస్తున్నాడు.
రాత్రంతా అసలు నిద్రపోలేదు. ముందు రోజు కోర్టులొ జరిగన సంఘటనలు...
పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పిన ప్రతి ఆరోపణ....
సాగర్ వర్మ ముఖం....
శ్వేత, హరీష్, సాంబయ్య కళ్ళల్లొ తనపై కనిపించిన కోపం....
అన్నీ అతని మెదడులొ తిరుగుతూనె ఉన్నాయి.
కొంచెంసేపటికి తనకి బూట్ల అడుగుల శబ్దం వినిపించింది. అజయ్ సెల్ వద్దకు ఒక పోలీసు కానిస్టేబుల్ వచ్చి తలుపు తెరిచాడు.
కానిస్టేబుల్ : మిమల్ని కలవడానికి మీ భార్య వచ్చారు.
అజయ్ : కాథరీన్ వచ్చిందా...?
అజయ్ నెమ్మదిగా లేచి బయటకు వచ్చాడు.
కొన్ని క్షణాల తర్వాత...
విజిటర్స్ రూమ్ వద్దకు చేరుకున్నాడు.
కానిస్టేబుల్ : 15 నిమిషాలె వెళ్ళి మాట్లాడి రండి...
అని చెప్పి అజయ్ ని లోపలికి పంపించి కానిస్టేబుల్ ఆ గది బయట నించున్నాడు. గది లోపల చుట్టు సీ.సీ.టీ.వి కేమెరాలు.
లోపల నీలం రంగు పంజాబీ డ్రెస్‌లో ఉన్న అజయ్ భార్య కాథరీన్ కూర్చొని ఉంది.
ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే ఆమె... ఈరోజు మాత్రం పూర్తిగా మారిపోయింది.
నిద్రలేని రాత్రుల ఆనవాళ్లు ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
కళ్లలో బాధ ఉంది... కానీ ఒక్క చుక్క కన్నీరు లేదు.
ఆమె నిశ్శబ్దంగా అలా కుర్చీలో కూర్చొని ఉంది
కొన్ని క్షణాలు... ఇద్దరూ ఒకరినొకరు చూస్తూనే ఉన్నారు..
అజయ్ చిన్నగా నవ్వడానికి ప్రయత్నించాడు.
అజయ్ : కాథరీన్ నువ్వు వస్తావని అనుకోలేదు. పిల్లలు ఎలా ఉన్నారు...?
కేథరిన్ సమాధానం చెప్పలేదు.
అజయ్ : నీకు ఇక్కడ రావడానికి పర్మీషన్ ఎవరిప్పించ్చారు.?
అదే మౌనం......
అజయ్ మళ్లీ...
అజయ్ : ఏం మాట్లాడవేంటి...?
కేథరిన్ గట్టిగా ఊపిరి తీసుకుంది.
కేథరిన్ : పిల్లలు బానె ఉన్నారు. మా అమ్మ దగ్గర.
అజయ్ : మీ అమ్మ వాళ్ళ మన ఇంటికి వచ్చారా...?
కేథరీన్ : లేదు ఇప్పుడు నేను పిల్లలతొ కలిసి మా అమ్మనాన్న దగ్గర ఉంటున్న...
అజయ్ : ఓహ్... పిల్లలతొ ఒంటరిగా ఉండడానికి భయమేసిందా. అయిన నువ్వు కంగారుపడకూ నేను ఇంకొ నెల రోజుల్లొ బేయిల్ మీద బయటకు వచ్చేస్తాలె. అప్పుడు వరకు మీరు అక్కడె ఉండండి.
కేథరీన్ : మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను చెప్తారా...?
అజయ్ : ఏంటది...?
కేథరీన్ : నిజంగానె మీరు తులసి అనె ఆమెతొ సంబంధం పెట్టుకొని బిడ్డను కన్నారా....?
అజయ్ : ఇప్పుడు అది అంతా ఎందుకు..? నేను బేయిల్ మీద మన ఇంటికొచ్చాక మాట్లాడుకుందాం.
కేథరీన్ : నిజమా కాదా...? ఆమె మిమ్మల్ని పెళ్ళి చేసుకొమన్నందుకు అతి ధారుణంగా తనని చంపేశారా..?
అజయ్ : చెప్పానా ఇంటికొచ్చాక మాట్లాడుకుందాం ఇక్కడొద్దని.
కేథరీన్ : మీరు ఇంటికొచ్చిన నేను పిల్లలు అక్కడ ఉండవు.. మిమ్మల్ని కలవము..
అజయ్ : ఏం మాట్లాడుతున్నావు...?
కేథరీన్ : నేను మీకు ఏం తక్కువ చేశాను? మిమ్మల్నీ నేనంత ప్రేమించాను. అయిన మీరు వెళ్ళి పరాయి ఆడదానితొ సంబంధం పెట్టుకున్నారు. ఛీ.. మీరు ఇంత నీచులని తెలియక మీతొ ఇంత కాలం కాపురం చేశాను. అందుకె ఇక మీదట మీతొ ఉండదలుచుకోలేను.
అజయ్ : అది కాదు కేథరీన్...
కేథరీన్ : మీరొక అవనీతి పరుడని తెలిసి కూడా మీతొ కాపురం చేశాను.
అజయ్ : కాని కాథరీన్ నేను ఏం చేసిన మన కోసమె కదా..
కేథరీన్ : తులసి తొ చేసింది కూడా మా కోసమెనా...
అజయ్ : మీ నాన్న కూడా అవనీతిపరుడెగా. పైగా నా గురించె తెలిసి బాగా సంపాదిస్తున్నానెగా నన్ను పెళ్ళి చేసుకున్నావు.
కేథరీన్ : అవును మా నాన్న అవనీతి పరుడె కావచ్చు కాని మీలాగా తన భార్యను మొసం చేసి వేరె ఆడదానితొ సంబంధం పెట్టుకోలేదు. తనని నమ్మించి చంపలేదు అదే తేడా...అయిన మీరేదొ సంపాదిస్తున్నారని మాత్రమె నేను మిమ్మల్ని పెళ్ళి చేసుకోలేదు. మీరు నన్ను ప్రేమించారని మా నాన్నకి వచ్చి చెప్తే మిమల్ని ఇష్టపడి పెళ్ళి చేసుకున్నా.
అజయ్ : కేథరీన్ ఇవాళ నువ్వు చాలా కోపంలొ ఉన్నావు. మనం తరువాత మాట్లాడుకుందాం.
కేథరిన్ : తరువాత మాట్లాడడాలు లేవు ఇదె చివరిసారి. ఇక నుంచి నాకు... మీకు... ఎలాంటి సంబంధం లేదు నా పిల్లలకు మీలాంటి తండ్రి ఉన్నాడని కూడా నేను చెప్పను. మీ నీడ కూడా వాళ్ల మీద పడనివ్వను.
అజయ్ తలెత్తి ఆమెను చూస్తాడు.
అతని పెదవులు వణుకుతాయి.
కానీ...
మాట బయటకు రాదు.
కేథరిన్ నెమ్మదిగా లేచి నిలబడుతుంది.
కేథరిన్ : హత్య చేసినా భర్తను కూడా క్షమించి... అతని వెంటే నిలబడ్డ భార్యలను చూశాను."
కానీ...
తనని ప్రేమించె భార్యను మోసం చేసి ఇంకో ఆడదానితో అక్రమ సంబంధం పెట్టుకున్న భర్తతో జీవితాంతం కాపురం చేసిన భార్యను మాత్రం నేను ఎప్పుడూ చూడలేదు.
ఇక చూడాలని కూడా లేదు.
ఆ మాటలు అజయ్ గుండెల్లో బాణాల్లా దిగాయి.
అజయ్ : కేథరిన్... ఒక్కసారి నేను..
ఆమె చేయి పైకెత్తి ఆపేసింది.
కేథరిన్ : వివరణలు వద్దు.
కోర్టులో విన్నది చాలు....
మీ గురించి తెలుసుకున్నది చాలు...
మిమ్మల్ని నేను ఎంతగానొ ప్రేమించాను కాబట్టె ఈ రోజు ఇక్కడికి వచ్చాను. మీ భార్యగా ఇదె చివరిసారి కూడా. ఇంకా నేను రాను....
అని చెప్పి నడుచుకుంటూ ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడకుండా అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతుంది.
తలుపు మూసుకున్న శబ్దం...
విజిటర్స్ రూమ్ మొత్తం మార్మోగుతుంది.
అజయ్ కుర్చీలోనే కూలబడిపోతాడు. తలపై చెయ్యి పెట్టుకొని అలా ఉండిపోతాడు.
తను జీవితంలో మొదటిసారి ఒక భర్తగా ఓడిపోయాడు.
కేథరిన్ వెళ్లిపోయిన కొద్దిసేపటి తర్వాత...
విజిటర్స్ రూమ్ తలుపు నెమ్మదిగా తెరుచుకుంది.
బయట ఉన్న కానిస్టేబుల్ తలుపు దగ్గర నిలబడి
కానిస్టేబుల్ : టైమ్ అయింది. ఇంక పదండి...
అజయ్ స్పందించలేదు. తల వంచుకుని అలాగే కూర్చున్నాడు.
కానిస్టేబుల్ : సార్...
రెండొ పిలుపుకి స్పందించి అజయ్ నెమ్మదిగా లేచాడు. అతని కళ్లలో తొలిసారిగా ఓటమి కనిపించింది. కానిస్టేబుల్ అతన్ని తిరిగి సెల్‌లోకి తీసుకెళ్లాడు.
ఉదయం 10:15 గంటలు
ప్రత్యేక విచారణ విభాగం (Special Interrogation Block)
కొంత మంది పోలీసులు వచ్చి ఒక్కొక్కరిని వేరువేరుగ సెల్లోంచి బయటకు తీసుకెళుతున్నారు. ముందు అరవింద్ రెడ్డిని తీసుకెళ్ళారు, అతని వెనక ప్రవీణ్ ను తీసుకెళ్ళారు. తరువాత అజయ్ వంతు వచ్చింది. పోలీసులు అజయ్ సెల్ వద్దకు వచ్చి ఆగారు. వాళ్ళలొ ఒక కానిస్టేబుల్ వచ్చి ఆ సెల్ తాళం తీసి తలుపు తెరిచాడు.
కొన్ని క్షణాలు అజయ్ వైపు చూసి...
పోలీస్ కానిస్టేబుల్ : పదండి మిమ్మల్ని విచారణకి తీసుకెళ్లాలని ఆదేశాలు వచ్చాయి.
అజయ్ నెమ్మదిగా లేచాడు. ఇప్పుడు అతని ముఖంలో నిన్నటి కోర్టులో కనిపించిన ఆత్మవిశ్వాసం లేదు. తన భార్య కేథరిన్ వెళ్లిపోయిన తర్వాత మిగిలింది ఒక్కటే...
నిశ్శబ్దం.
పోలీసులు వీళ్ళ ముగ్గరుని ప్రత్యేక నేర విచారణ గది (Special Interrogation Room) వైపు తీసుకెళ్తారు.
...
కొంచెం సేపటికి వాళ్ళు అక్కడికి చేరుకుంటారు.
ఒక్కొక్కరిని ఒక్కొ గదిలొ కూర్చొబెడతారు.
అరవింద్ రెడ్డి ఉన్న గదిలోకి ఎస్. ఐ సుందర్ మరియు ఎస్.ఐ జాన్ బాబు వెళతారు.
తరువాత ప్రవీణ్ ఉన్న గదికి ఏ.సీ.పి అధికారి ఒకరు వెళతాడు.
చివరకి అజయ్ వంతు వచ్చేసరికి తనని కూడా ఒక గదిలోకి పంపిస్తారు. అజయ్ లోపలకి అడుగు పెడతాడు.
లోపల గదిలో...
ఒక టేబుల్.
ఎదురెదురుగా రెండు కుర్చీలు.
గోడల మూలల్లో CCTV కెమెరాలు.
అజయ్‌ను కుర్చీలో కూర్చోబెట్టి పోలీసులు బయటకు వెళ్లిపోతారు. గది తలుపు మూసుకుపోతుంది.
కొన్ని క్షణాలు...పూర్తి నిశ్శబ్దం.
అజయ్ తలెత్తి ఎదురుగా ఉన్న ఖాళీ కుర్చీని చూస్తుంటాడు. అప్పుడే తలుపు బయట బూట్ల అడుగుల శబ్దం వినిపిస్తుంది...అజయ్ తలెత్తి తలుపు వైపు చూశాడు.
ఆ తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. లోపలికి... సాగర్ వర్మ అడుగుపెట్టాడు.
టక్ చేసి ఫుల్ హ్యాండ్స్ వైట్ షర్ట్ దాని క్రింద నల్ల ప్యాంట్...
అతని చేతిలో ఒక బ్రౌన్ ఫైల్ మరియు ఒక టాబ్ ఉంది.
సాగర్ లోపలికి వచ్చి తలుపు మూసి
సాగర్ వర్మ : హెలొ Mr. అజయ్ ఎలా ఉన్నారు.? మిమ్మల్ని ఈ స్థిలొ అది ఇలా కలుస్తాననుకోలేదు.
అని చెప్పి తనకి ఎదురుగా ఉన్న కుర్చిలొ కూర్చున్నాడు.
అజయ్ : నన్ను ఈ స్థితికి తీసుకొచ్చిందె మీరె కదా...
సాగర్ వర్మ తన చేతిలొ ఉన్న బ్రౌన్ ఫైల్ మరియు టాబ్ ను ఎదురుగా ఉన్న టేబుల్ మీద పెట్టి.
సాగర్ వర్మ : ఏం చెయ్యను చెప్పండి. ఒక హత్య కోసం ఈ దర్యాప్తు మొదలుపెడతె మీ అందరి చెరిత్రలు బయటకొచ్చాయి.
అజయ్ : నన్ను కలవడానికి నా భార్యకి పర్మీషన్ ఇచ్చింది కూడా మీరె కదా...?
సాగర్ వర్మ : అవును... మిమ్మల్ని ఒక్కసారి కలవాలని ఆమె నన్ను స్వయంగా రిక్వష్ట్ చేసింది. అందుకె ఇచ్చాను..
అజయ్ : అనుకున్నా...
సాగర్ చిన్న చిరునవ్వు నవ్వాడు.
కొన్ని క్షణాలు నిశ్శబ్దం
ఆ నిశ్శబ్దమే అజయ్‌కు అసహనంగా మారింది.
అజయ్ : ఏంటి...? ఏం మాట్లాడరా...?
సాగర్ ప్రశాంతంగా అతని కళ్లలోకి చూస్తూనే
సాగర్ వర్మ : ఇంతకి మీరు ఎలా ఉన్నారు అజయ్...?
ఆ ప్రశ్న విని...
అజయ్ చిన్నగా నవ్వాడు.
అజయ్ : ఇంటరాగేషన్ మొదలుపెట్టే ముందు ఆరోగ్యం గురించి అడుగుతారా...?
సాగర్ వర్మ : ఏదొ క్యాజువల్ గా అడిగాను అంతె
అజయ్ : సరే... ఇప్పుడు మీకు ఏం కావాలి...? నా దగ్గర నుంచి ఏం ఎక్సపెట్ చెస్తున్నారు.
సాగర్ వర్మ : ఒకటె ప్రశ్నకు జవాబు కావాలి దేవేంద్ర రెడ్డి, సూర్య నారాయణ.... వాళ్ళిద్దర్ని చంపింది ఎవరు..? మీరా..? లేక ఇంకెవరి చేతైన చంపించారా...?
ఆ ప్రశ్న విన్న అజయ్ ఒక్కసారిగా బిగ్గరగా నవ్వాడు..
ఆ నవ్వు గది మొత్తం మారుమ్రొగింది.
అజయ్ నెమ్మదిగా ముందుకు వంగి. సాగర్ కళ్ళల్లోకి చూస్తూ...
అజయ్ : ఎవరొ నీకు తెలియదా......?
"సాగర్ వర్మ అలియాస్ అర్జున్ వర్మ "
CUT TO FLASHBACK (ఫ్లాష్ బ్యాక్)
3 రోజుల క్రితం...
సరిగ్గ అజయ్ అరెస్ట్‌కు ఒక గంట ముందు.
అజయ్ తన ఇంట్లోని హాల్లో సోఫాలో కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాడు.
అప్పుడే అతని మొబైల్ మ్రోగింది.
స్క్రీన్ మీద..."Praveen Calling..." అని ఉంది.
అజయ్ వెంటనే కాల్ లిఫ్ట్ చేశాడు.
అజయ్ : చెప్పు ప్రవీణ్...
అవతల నుంచి ప్రవీణ్ కంగారుగా మాట్లాడుతున్నాడు.
ప్రవీణ్ : అజయ్... కొంప మునిగింది...మనం దొరికిపోయాం.
అజయ్ ఒక్కసారిగా సోఫాలో నుంచి లేచాడు.
అజయ్ : ఏమైంది...?
ప్రవీణ్ : మనం ఇన్ని రోజులు వెతుకుతున్న ఆ అర్జున్ ఎవరొ కాదు...
అజయ్ : ఎవరు...?
ప్రవీణ్ : ఆ సిట్ హెడ్ సాగర్ వర్మే.
అజయ్ : వాట్...? సాగర్ వర్మా...?
ప్రవీణ్ : అవును. మన దృష్టి మొత్తం వాళ్ల నాన్న మీద పడేలా చేసి... మనకె తెలియకుండా మనకు వ్యతిరేకంగా అన్ని సాక్ష్యాధారాలు సేకరించాడు.
అజయ్ : అవన్నీ ఎలా దొరికాయి...?
ప్రవీణ్ : ఆ జూనియర్ డాక్టర్ శ్వేత వల్ల తను చనిపోలేదు బ్రతికే ఉంది.
అజయ్ : ఎలా బ్రతికింది...?
ప్రవీణ్ : ఆ రోజు సి.ఐ మురళి ఆమెను హాస్పిటల్లో చంపలేదు. కొన ఊపిరితో ఉన్న ఆమెను బ్రతికించి సాగర్ వర్మ దగ్గరకు చేర్చాడు.
అజయ్ : వాడెందుకు అలా చేశాడు...?
ప్రవీణ్ : ఆ సి.ఐ మురళి ఈ సాగర్ వర్మ శిష్యుడు. ఆ అమ్మాయి సాగర్ మనిషని వాడికి ఎలాగో తెలిసిపోయింది. అందుకే కాపాడాడు.
అజయ్ చేతులు వణకడం మొదలైంది.
ప్రవీణ్ : అంతేకాదు...దేవేంద్ర రెడ్డి భార్య ప్రియ...
ఆ జూనియర్ డాక్టర్ హరీష్‌ను తప్పించింది. వాడు ఇప్పుడు సాగర్ వర్మ దగ్గరే ఉన్నాడు.
ఆ పొనికెగూడెం సాంబయ్యను దాచింది కూడా ఈ సాగర్ వర్మే.
అజయ్ ముఖం పూర్తిగా మారిపోయింది.
ప్రవీణ్ : ఆ రాఘవరావును చంపినందుకు పగబట్టి...బాబు కొడుకులు ఆడిన ఆట ఇది.
అజయ్ : అంటే...దేవేంద్ర రెడ్డి...
సూర్యనారాయణలను చంపింది...?
కొన్ని క్షణాలు...
అవతల నిశ్శబ్దం.
తర్వాత...
ప్రవీణ్ : ఇంకా అర్థం కాలేదా...? ఆ సాగర్ వర్మె...
వాడు ఐ.పి.ఎస్ అవ్వకు ముందు ఒక ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్. ఐ.పి.ఎస్ తర్వాత షార్ట్ టర్మ్ ఎథికల్ హ్యాకింగ్ కోర్స్ కూడా చేశాడు.
"తండ్రి మందు తయారు చేశాడు..."
"కొడుకు మొత్తం పథకం వేశాడు...."
అబ్బకొడుకులిద్దరు కలిసి మనల్ని వేటాడారు....
అజయ్ కాళ్ల కింద భూమి కదిలినట్టైంది.
కొన్ని క్షణాలు...
ఇద్దరి మధ్య నిశ్శబ్దం.
తర్వాత...
ప్రవీణ్ : అజయ్ నీతో కలిసి చదువుకున్న స్నేహితుడిగా...నాదొక చివరి సలహా.
అజయ్ ఏం మాట్లాడలేదు..
ప్రవీణ్ : నువ్వు వెంటనే అక్కడి నుంచి పారిపో. మరికాసేపట్లో నిన్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తున్నారు. తప్పించుకుంటే...మళ్లీ కలుద్దాం...."
"ఫ్లాష్ బ్యాక్ ends"
ప్రత్యేక విచారణా గది (Special interrogation room)
అజయ్ మరియు సాగర్ వర్మ మద్యన నిశ్శబ్దం....
సాగర్ వర్మ మొహంలొ గర్వంతొ కూడిన చిరునవ్వు....
చప్పట్లు కొడుతూ...
సాగర్ వర్మ : వావ్......సూపర్బ్......పరవాలేదు కనిపెట్టేశావె... ఎంతైన నీది కూడా ఐ.పి.ఎస్ బుర్రె కదా....
అజయ్ మొహంలొ చిన్న వెటకారపు నవ్వు...
సాగర్ వర్మ : అవును... నేనె చంపాను. ఆ మందు మా నాన్నె తయ్యారు చేశారు. అయితె ఏంటి..? నిరూపించగలవా...? ఆధారాలున్నాయా...? ఉన్న ఎవరు నమ్ముతారు నీ మాటను...
అజయ్ కుర్చిలొ వెనక్కి ఆనుకొని.
అజయ్ : అందుకె కదా నువ్వు అక్కడ... నేను ఇక్కడ కూర్చున్నది... లేదంటె నువ్వు కూడా నాతొ పాటు ఇంకొ కుర్చిలొ కూర్చునె వాడివి...
ఆ మాటకు సాగర్ మళ్ళి నవ్వాడు. తన నవ్వులొ అహంకారం స్పష్టంగా కనిపిస్తోంది.
నెమ్మదిగా ఎదురుగా ఉన్న టేబుల్ మీదున్న బ్రౌన్ ఫైల్ వైపు చేయి చాచాడు.
ఆ ఫైల్ తన వైపు లాక్కొని నెమ్మదిగా తెరిచాడు. లోపులున్న పత్రాలను అజయ్ వైపు తిప్పి
సాగర్ వర్మ : ఈ ఫైల్ చూశావా... ఇందులొ ఉన్న ఒక్కో పేజి మీ ముగ్గురి జీవితాలను ముగించడానికి సరిపోతుంది. నేను హంతకుడిని అని చెప్పడానికి మీ దగ్గర ఒక్క ఆధారం కూడా లేదు. కాని మీ ముగ్గురే ఆ రెండు హత్యలు కూడా చేశారు అని అనడానికి ఈ ఫైల్ చాలు.
అజయ్ ఆ ఫైల్ తన చేతులొ తీసుకొని చదువుతున్నాడు. ఒక్కో పేజీని తిరగేస్తూ.. అందులొ ఉన్న ఫొటోలు, ఫోన్ కాల్ డాటా రిపోర్ట్సు, సాక్షుల వాంగ్మూలాలు, బ్యాంక్ లావా దేవీలు అన్నీ చూస్తున్నాడు.
అజయ్ : ఇప్పుడు అర్ధమయ్యింది దేవేంద్ర రెడ్డి భార్యా ప్రియ ఆ హరీష్ ని ఎందుకు తప్పించిందొ. ఈ ఫైల్ చూపించి మేమె తన భర్తను చంపించామని నమ్మించావు. దాంతొ ఆమె తన కన్న కొడుక్కె వ్యతిరేకంగా నీకు సహాయం చేసింది.
సాగర్ ఏం మాట్లాడలేదు.
అజయ్ నెమ్మదిగా ఫైల్ మూసి టేబుల్ పెట్టాడు.....
చిన్నగా నవ్వుతూ చప్పట్లు కొట్టాడు....
అజయ్ : సూపర్బ్.... సక్సస్ ఫూల్ గా అందరిని బానె నమ్మించావు. ఒక్క ఆధారం కూడా లేకుండా నువ్వు చేసిన ఆ రెండు హత్యలు మా మెడకు చుట్టేశావు....
కొన్ని క్షణాలు గదిలొ మళ్ళి నిశ్శబ్దం అలుముకుంది
అజయ్ తన కళ్ళల్లోకి నేరుగా చూస్తూ...
అజయ్: కాని ఒక్క విషయం నాకు ఇంకా అర్ధం కావడం లేదు.
సాగర్ వర్మ కనుబొమ్మలను ఎత్తాడు.
అజయ్ : నీ పగ రాఘవరావు హత్యతొ మొదలైంది అంటె నాకు నమ్మకం కుదరడం లేదు. అంతకంటె ముందు నుంచె నువ్వు మా ప్రది కదలిక, ప్రతి నిర్ణయం, ప్రతి చర్యపై నిఘా పెట్టావు....
సాగర్ వర్మ నవ్వుతూ కుర్చీలో వెనక్కి ఆనుకుని... నెమ్మదిగా చప్పట్లు కొట్టాడు.
సాగర్ వర్మ : ఇంప్రెసివ్...
చివరికి అసలు ప్రశ్న దగ్గరకు వచ్చావు.
అజయ్ ఏమీ మాట్లాడలేదు.
సాగర్ టేబుల్ మీద ఉన్న పెన్ను చేతిలోకి తీసుకుని వేళ్ల మధ్య తిప్పుకుంటూ...
సాగర్ వర్మ : నువ్వు చెప్పింది నిజమే. నా పగ 3 ఏళ్ళ క్రితం డాక్టర్ రాఘవరావు హత్యతో మొదలుకాలేదు. అంతకంటెముందు 24 ఏళ్ళ క్రితం మొదలయ్యింది.
అజయ్ తన రెండు కనుబొమ్మలు ముడిచాడు.
అజయ్ : 24 ఏళ క్రితమా...? అప్పుడు నేనేం చేశాను...?
సాగర్ వర్మ : ఏం చేశావొ నీకు గుర్తులేదా...?
అంటు సాగర్ కుర్చీ నుంచి నెమ్మదిగా లేచి. అజయ్ ప్రక్కకు వచ్చి టేబుల్ మీద తన రెండు చేతులు ఆనించి నించున్నాడు.
తన కళ్ళలోకి సీరియస్ గా చూస్తూ..
సాగర్ వర్మ : బాగా గుర్తు తెచ్చుకో.....
"2002 డిసెంబర్ 15వ తారీకు....."
"ఇబ్రహీంపట్నం ప్రభుత్వ పాఠశాల...."
అజయ్ అయోమయంగా చూస్తున్నాడు...
సాగర్ సీరియస్ గా అజయ్ మొహం దగ్గరకొచ్చి
సాగర్ వర్మ : అ స్కూలు ప్రిన్సిపల్ కేశవ వర్మ......
అజయ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు....
అజయ్ : కేశవ వర్మ నీకు ఎలా తెలుసు...
సాగర్ వర్మ : నా కన్న తండ్రి....
Cut to Flash back
2002 జూన్ 1వ తారీకు.
సమయం : ఉదయం 8:30 గంటలు
ఇబ్రహీంపట్నం జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల...
ఆ ఊరికి కొత్తగా ట్రాన్సఫర్ అయిన కేశవ వర్మ తన భార్య కూతురుతొ కలిసి 3 రోజుల క్రితం ఇబ్రహీం పట్నానికి వచ్చాడు.
ఆ రోజె తన జయినింగ్ రోజు. ప్రిన్సిపాల్‌గా స్కూలులొ చేరి మొత్తం పాఠశాలకు సంబంధించి అంతా తెలుసుకున్నాడు.
2002 జులై 3వ తారీకు
సమయం : సాయంత్రం 5:15 గంటలు.
నెల రోజులు గడిచాయి. ఎప్పటి లాగె ఆరోజు కూడా తన పని ముగించుకొని సాయంత్రం స్కూలు వదిలి తన ఇంటికి బయలుదేరుతున్న సమయంలొ.
పాఠశాల వెనక కొంతమంది ఖాళి స్థలంలొ కొంతమంది మందు సీసాలతొ అక్కడికి వెళ్ళడం చూశాడు.
వెంటనె అక్కడికి వెళ్ళిన కేశవ వర్మ వాళ్ళను నిలదీశాడు.
కేశవ వర్మ : ఇది పాఠశాల ఇక్కడ ఇలాంటివి చేయకూడదు మర్యాదగా ఇక్కడ నుంచి వాటిని తీసుకొని వెళ్ళిపోండి...
అని సిరియస్ గా వాళ్ళని హెచ్చరిస్తాడు. కాని వాళ్ళు ఎంతకి వెళ్ళకుండా తనతొ గొడవకి దిగారు. కేశవ వర్మను కొట్టడానికి ఒకడు ముందుకొచ్చాడు. వాడు కేశవ వర్మను కొట్టె ముందు తనె లాగి చంప మీద గట్టిగ కొట్టాడు.
దాంతొ మిగిలిన వాళ్ళు కూడా గొడవకు దిగి కేశవ వర్మను కొట్టబోతుంటె. ఈలోపు ఊరి జనం కొంతమంది అటువైపు రావడం వీళ్ళు చూశారు. దాంతొ గొడవ ఆపి అక్కడ నుంచి వెళ్ళిపోయారు. కేశవ వర్మ కూడా కాసేపటికి తన ఇంటికి వెళ్ళిపోయాడు.
వాళ్ళంతా నేరుగా ఊరిలొ ఉన్న నవతరం పార్టీ ఆఫీసుకి వెళతారు. అక్కడ వాళ్ళు మీటింగ్ లో ఉన్న దేవేంద్ర రెడ్డి మరియు సూర్యనారాయణులను కలిసి జరిగింది మొత్తం చెప్పారు.
"అప్పటికి వీళ్ళద్దరు నవతరం పార్టీలొ కీలక సబ్యులు. రాష్ట్ర స్థాయి రాజకీయాలలొ ఎదగాలని చూస్తున్న రోజులు.
అప్పుడు దేవేంద్ర రెడ్డి వయసు 29 సంవత్సరాలు. ఒక సంవత్సరం క్రితమె ప్రియతొ పెళ్ళైంది. సంవత్సరం తరువాత అరవింద రెడ్డి పుట్టాడు.
దేవేంద్ర రెడ్డి నవతరం పార్టీ యొక్క ఇబ్రహీంపట్నం నియోజకవర్గ యువజన అధ్యక్షుడు (Constituency Youth President).
అంతెకాకుండా స్థానికంగా కాంట్రాక్టులు, రియల్ ఎస్టేట్, ఇసుక వ్యాపారం వంటి వాటిపై పట్టు సాధిస్తున్న ఎదుగుతున్న నాయకుడు. పైగా ఆ నియోజకవర్గం MLAకి అత్యంత నమ్మకమైన వ్యక్తి.
ఇంక సూర్యనారాయణ. తన వయసు అప్పుడు 29½ సంవత్సరాలు. తనకి ఆ ఏడాదె కొత్తగా పెళ్ళైంది.
తను కూడా నవతరం పార్టీ సబ్యుడు. అదె ఇబ్రహీంపట్నంలొ మండల పార్టీ కన్వీనర్ గా ఉన్నాడు.
గ్రామ స్థాయి క్యాడర్, ఓటర్ల నిర్వహణ, పార్టీ కార్యక్రమాలు, ప్రత్యర్థులను బెదిరించడం వంటి గ్రౌండ్ ఆపరేషన్స్ చూస్తాడు.
దేవేంద్ర రెడ్డి కంటే బయట తక్కువ కనిపిస్తాడు, కానీ వ్యూహాలు అమలు చేసేది మాత్రం తనే.
దేవేంద్ర రెడ్డి ,సూర్య నారాయణలు ఇద్దరు చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. ఇద్దరు కలిసి 1993లొ నవతరం పార్టీ కార్యకర్తలగా చేరారు. తరువాత 9 ఏళ్ళల్లొ అంచలంచలుగా ఎదిగి జిల్లా స్థాయి రాజకియలు చేసె స్థాయికి ఎదిగారు."
కేశవ వర్మ గురించి చెప్పిన తరువాత దేవేంద్ర రెడ్డి ఆవేశపడబోతుంటె. సూర్యనారాయణ ఆపుతాడు.
సూర్య నారాయణ : రేయి దేవా ఆవేశ పడకు. అక్కడ జరిగినదాంట్లొ తప్పంతా మన వాళ్ళదె. ఇప్పడు నువ్వెళ్ళి ఆ స్కూలు ప్రిన్సిపాల్ ని ఏం చేసిన మనకె చెడ్డపేరు. పైగా రాబోయె ఎన్నికల్లొ ఈసారి పార్టి ఎం.ఎల్.ఎ టికెట్ నికివ్వాలని చూస్తుంది. ఈసారికి ఆ కేశవ వర్మని వదిలేయి.
సూర్యనారాయణ చెప్పిన దానికి దేవేంద్ర తగ్గాడు. నెల రోజులు గడిచాయి. రెండేళ్ళ తరువాత వచ్చె ఎన్నికల కోసం దేవేంద్ర రెడ్డి, సూర్యనారాయణలు ఇద్దరు ముందు నుంచె జనాలను ఆకర్షించడానికి రకరకాల పథకాలు వేస్తు ప్రచారాలు చేసుకుంటున్నారు.
ఆ పనిలొ భాగంగానె దళితవాడలొ ఉన్న దళితులను తమ వైపు తిప్పుకోవడం కోసం అప్పకికె వాళ్ళ కోసం అడపాదడపా చిన్న చిన్న సంస్కరణలు చేశారు. తరువాత ఊరిలొ అంబేద్కర్ గారి విగ్రహం లేకపోవడంతొ. వీళ్ళిద్దరు కలిసి ఆయనది చాలా పెద్ధ విగ్రహం పెట్టించాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకోసం అనువైన స్దలం కూడా వెతికారు.
ఆ స్థలం ఇబ్రహీంపట్నం జిల్ల పరిషత్ పాఠశాల ఆటల మైదానం. అది దళిత వాడకు దగ్గరగా ఊరి నడి మద్యన ఉంది. అందుకె దాన్నీ ఎంచుకున్నారు. అనుకున్నదె తడువుగా చకచకా పనులు ప్రారంభిచేశారు.
విగ్రహ ఆవిష్కరణకి ఆ ఊరి ఎం.ఎల్.ఎ మరియు పార్టి పెద్దలను కూడా పిలవాలని నిర్ణయించుకున్నారు.
కాని సరిగ్గ కేశవ వర్మ వచ్చి పనులను అడ్డుకున్నాడు. ఆ స్థలం ప్రభుత్వం పాఠశాల విద్యార్ధుల ఆటల కోసం కేటాయించిన మైదానం అని. అక్కడ విగ్రహావిష్కరణలు, రాజికీయసభలు పెట్టకూడదని. అది చట్టరిత్య తప్పు అని కలెక్టర్ కి ఫిర్యాదు చేసి ఆపించేశాడు.
దీంతొ అప్పటికె పార్టి పెద్ధలకు ఆహ్వానం పంపించిన దేవేంద్ర రెడ్డి, సూర్యనారాయణులకు పార్టి హెడ్ ఆఫిసు నుంచి తిట్లు పడ్డాయి. ఏ స్థలం ఏంటొ తెలుసుకోకుండా అనుమతులు లేకుండా ఎలా చేస్తారని చివాట్లు పెట్టారు. ఇద్దరికి ఊళ్ళోని, పార్టిలోని ఒక రకంగా అవమానమె జరిగింది.
దేవేంద్ర రెడ్డికి పిచ్చ కోపం వచ్చేసింది. ఆ రోజు రాత్రి పార్టి ఆఫిసులొ కూర్చొని ఫుల్లుగా మందు కొడుతున్నాడు. తన ఎదురుగా సూర్యనారాయణ కూర్చొని శాంతంగా ఆలొచిస్తున్నాడు.
దేవేంద్ర రెడ్డి : మన వాళ్ళని కొట్టినప్పుడె వాడికి బుద్ది చెప్పుంటె ఇవాళ ఇంత వరకు వచ్చేది కాదు. ఇప్పుడు చూడు మనకె ఎదురు తిరిగి కలక్టర్ కి కంప్లైంట్ ఇచ్చాడు.
గ్లాసులొ ఉన్న మందు తాగి ..
దేవేంద్ర రెడ్డి : అనుమతి అంట అనుమతి.... ఇప్పటి వరకు ఏం చేసిన అన్నీ అనుమతులు తీసుకొనె చేశామా..?
సూర్యనారాయణ : దేవా... ప్రతి దానికి ఆవేశం పనికి రాదు. వాడొక ఆఫ్ట్రాల్ స్కూలు హెడ్ మాస్టార్.
దేవేంద్ర రెడ్డి : ఆఫ్ట్రాల్ ఆ స్కూలు హెడ్ మాస్టార్ వల్లె ఇవాళ మన పరువు పోయింది. అది మాత్రమె కాదు వాడి వల్ల మనకి ఇంకొ నష్టం కూడా జరిగింది.
సూర్యనారాయణ : ఏంటది...?
దేవేంద్ర రెడ్డి : ఆ సభ కోసం తెచ్చిన డబ్బు పార్టి ఆఫిసులొ ఉంచితె ఇన్కమ్ టాక్స్ వాళ్ళతొ సమస్య అని దాన్నీ ఆ స్కూల్లోని ఎడ్మిన్ ఆఫీసులో దాచాను. కాని...
సూర్యనారాయణ : ఆ...? కాని...?
దేవేంద్ర రెడ్డి : ఆ డబ్బు తేడానికి అని ఈ రోజు ఉదయం మన వాళ్ళు వెళ్ళారు. కాని ఆ డబ్బు అక్కడ లేదు.
సూర్యనారాయణ : ఏమైంది...?
దేవేంద్ర రెడ్డి : ఆ డబ్బు కేశవ వర్మ కంటపడింది. దాన్నీ తీసుకెళ్ళి నేరుగా పోలీసులకిచ్చాడు.
సూర్యనారాయణ : పరవలేదు ఆ ఇన్స్పెక్టర్ మన వాడెగా మనం డబ్బు తిరిగి తెచ్చుకుందాం.
దేవేంద్ర రెడ్డి : అక్కడె తేడా జరిగింది. లంచాలు తీసుకుంటున్నాడని ఈ.డి వాళ్ళు ఆ ఇన్స్పెక్టర్ ఇంటితొ పాటు పోలీస్ స్టేషన్ ని కూడా రైడ్ చేశారు. సరిగ్గ అప్పుడె ఈ కేశవ వర్మ డబ్బున్న బ్యాగుతొ అక్కడికి వెళ్ళాడు.
సూర్యనారాయణ : అంటె డబ్బు పోయినట్టెనా...?
వెంటనె సూర్యనారాయణ మందు కలిపిన గ్లాసు తీసుకొని ఒక్క గుక్కలొ మందు తాగాడు.
సూర్యనారాయణ : అసలు ఎవడు రా వీడు.? ఎక్కడ నుంచి వచ్చాడు మన ప్రాణానికి.? అసలు వాడి గురించి ఆరా తియ్యాలి.
అని చెప్పి లేచి తన జేబులోంచి సెల్ ఫోన్ తీసుకొని బయటకు వెళ్ళి తెలిసిన డీ.ఈ.ఒ శ్రవణ్ కి కాల్ చేసి. కేశవ వర్మ గురించి అడుగుతాడు. కాసేపటి తరువాత లోపలికి వచ్చి
సూర్యనారాయణ : తెలిసింది వాడి పూర్తి పేరు పెదబట్ల కేశవ వర్మ, తండ్రి పేరు అశోక వర్మ, సొంత ఊరు గుంటూరు జిల్లా చేబ్రోలు. వాడి సర్వీస్ ట్రాక్ రికార్డ్ కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంది. ఇక్కడికి రాకముందు చుండూరు మండలం మోధుకూరు గ్రామంలొ 8,9, 10వ తరగతులకు సైన్సు మరియు లెక్కల టీచర్ గా పనిచేశాడు. అంతకుముందు 5 ఏళ్ళ క్రితం తెనాలిలొ హెడ్ మాస్టర్ అంటె స్కూల్ ప్రిన్సిపాల్ గా పని చేశాడు.
దేవేంద్ర రెడ్డి : అదేంటి తెనాలి లాంటి టౌన్ ఏరియా లొ హెడ మాస్టర్ పని చేసి అక్కడ నుంచి ఏ నగరానికొ ట్రాన్సఫర్ అవ్వకుండా డిమోట్ అయ్యి మోధుకూరు లాంటి చిన్న గ్రామానికి ఎందుకు ట్రాన్సఫరయ్యాడు.
సూర్యనారాయణ : అక్కడ స్కూలులొ సరళా అనె ఒక 10వ తరగతి అమ్మాయిని సతీష్ అనె ఒక 17 ఏళ్ళ వార్డు కౌన్సులర్ కొడుకు ఏడిపించాడని. అందరు ముందు వాడిని చితకబాది పోలీసులకి పట్టించాడు.
అది మనసులొ పెట్టుకున్న ఆ వార్డు కౌన్సలర్ వాడి పలుకుబడిని ఉపయోగించి డీమోట్ అయ్యి మోధుకూరుకు ట్రాన్సఫర్ అయ్యెలా చెశాడు.
దేవేంద్ర రెడ్డి : మరి మళ్ళి ప్రమోషన్ ఎలా వచ్చింది...?
సూర్యనారాయణ : ఏముంది గత 5 - 6 ఏళ్ళులొ మన ఊరు స్కూలులొని విద్యార్ధుల ఉత్తీర్ణత శాతం పూర్తిగా పడిపోయింది ఎవరు పాసవ్వడం లేదు. ఊరి జనం అంతా కలిసి మండల్ ఎడ్యుకేషన్ ఆఫిసర్ (MEO) కి మరియు జిల్లా ఎడ్యుకేషన్ ఆఫిసర్ (DEO) మన శ్రవణ్ కి పాత ప్రిన్సిపాల్ పై ఎన్ని ఫిర్యాదులు చేసిన పట్టించుకోలేదు. దాంతొ వాళ్ళు నేరుగా రీజనల్ జాయింట్ డైరక్టర్ ఆఫ్ స్కూలు ఎడ్యుకేషన్ (Regional Joint Director of School Education (RJDSE)) కి మరియు డైరక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫిసర్ (Director of School Education (DSE)) కి ఇద్దరికి ఆ ప్రిన్సపాల్ మీద మరియు ఎం.ఈ.ఒ మరియు డీ.ఈ.ఒ ల పై ఫిర్యాదు చేస్తు ఉత్తరం వ్రాశారు. దాన్నీ వాళ్ళు బాగా సీరయస్ గా తీసుకొని పాత ప్రిన్సిపాల్ ని పంపించి మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న ఈ కేశవ వర్మను ప్రొమోట్ చేసి మరి ఇక్కడికి ట్రాన్సఫర్ చేయించారు.
దేవేంద్ర రెడ్డి : అంటె గురుడికి మంచి పేరె ఉంది.. నువ్వన్నట్టు తొందరపడి మనం వాడిని ఏం చేసిన హైదరాబాదు వరకు తెలిసిపోతుంది. అయితె మనం వాడిని ఏం చెయ్యలేమా..?
అని కోపంగా మళ్ళి గ్లాసులొ కలుపున్న మందుని తాగుతాడు.
సూర్యనారాయణ : ఎందుకు చెయ్యలేం... చెయ్యచ్చు.
దేవేంద్ర రెడ్డి : ఎలా....?
సూర్యనారాయణ : అందుకు మనం సమయమనం పాటించాలి. ఈరోజు జరిగిన సంఘటనని మనకి అనుకూలంగా ఆ కేశవ వర్మకి వ్యతిరేకంగా మలచాలి.
దేవేంద్ర రెడ్డి అయొమయంగా మొహం పెట్టాడు.
సూర్యనారాయణ : అర్ధం కాలేదు కదా...?
దేవేంద్ర రెడ్డి : లేదు...
సూర్యనారాయణ : నెమ్మది నెమ్మదిగా వాడి గురించి ఊర్లొ పుకార్లు పుట్టించాలి ముఖ్యంగా దళితవాడలొ వీడు అంబేద్కర్ గారికి దళితులకి వ్యతిరేకం అని అందుకె ఆయన విగ్రహం పెట్టనివ్వకుండా అడ్డుకున్నాడని పుకార్లు పుట్టీద్దాం.
అని చెప్పి ఇద్దరు నవ్వుతూ మళ్ళి చెరొ గ్లాసు మందు తాగుతారు....
వాళ్ళ పథాకం ప్రకారం కేశవ వర్మపై వ్యతిరేకంగా ఊళ్ళొ పుకార్లు పుట్టిస్తారు. ముఖ్యంగా దళితుల పిల్లలపై కేశవ వర్మ వివక్షత చూపిస్తున్నాడని ప్రచారం చేయిస్తారు.
ఊరి ప్రజలు ఆ పుకార్లు విన్న కాని వాటిని పుకార్ల గానె చూస్తున్నారు. 4 నెలలు గడిచాయి. జనాల మెదడులొ ఆ పుకార్లు నాటుకుపోయాయి కాని ఎవరు దాన గురించి బహిరంగంగా మాట్లాడటంలేదు. ఊరి ప్రజలు కేశవ వర్మపై తిరగబడడానికి ఒక బలమైన సంఘటన జరగాలి దాని కోసం దేవేంద్ర రెడ్డి మరియు సూర్యనారాయణలు ఇద్దరు ఎదురు చూస్తున్నారు.
2002 డిసెంబర్ 15వ తారీకు
సమయం : సాయంత్రం 5:30 గంటలు.
ఆ రోజు సాయంత్రం కేశవ వర్మ తన పని ముగిశాక బాత్రూంకని పాఠశాల వెనుకకు వెళ్ళినప్పుడు అక్కడ 9వ తరగతి చదువుతున్న 14 ఏళ్ళ తులసి మరియు 10వ తరగతి చదువుతున్న 15 ఏళ్ళ అజయ్ ఇద్దరు హద్దలు మీరి ప్రవర్తిస్తు కేశవ వర్మకి కనిపించారు.
అది చూసి వాళ్ళని తన ఆఫీసుకి తీసుకెళ్ళి ఇద్దరిని గట్టిగా మందలించి. మరుసటి రోజు తమ తల్లిదండ్రులను తీసుకురమ్మని హెచ్చరించరించి పంపించేస్తాడు.
అజయ్ తన సైకిల్ మీద ఇంటికి వేగంగా వెళ్ళిపోతాడు. తులసి మాత్రం ఏడుస్తూ నడుచుకుంటూ ఇంటికి బయలుదేరింది. దారి మద్యలొ బైక్ పై వెళుతున్న సూర్యనారాయణ ఏడుస్తూ ఇంటికి వెళుతున్న తులసిని గమనించి తన వద్దకు వెళ్ళి ఏం జరిగిందని అడుగుతాడు. తులసి స్కూల్లొ జరిగింది మొత్తం చెప్తుంది.
తులసి : మా నాన్నకి చెప్తె నన్ను చంపేస్తాడు లేదా నాకు చదువు మాన్పించి పెళ్ళి చేసేస్తాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలొ నాకు అర్ధం కావడం లేదు.
సూర్యనారాయణ : నువ్వేం భయపడకు. నేను చెప్పినట్టు మీ నాన్నకి చెప్పు. దాంతొ మీ నాన్న నిన్ను ఏమి అనడు. సరేనా...?
అని తన కళ్ళు తుడిచి కేశవ వర్మపై అబద్దం చెప్పమంటాడు. తులసి ముందు భయపడుతుంది కాని తరువాత ఒప్పుకొని ఇంటికి బయలుదేరుతుంది.
దారిలొ తన తండ్రి సతీష్ టీ.వీ.ఎస్ ఎక్సల్ మీద వెళుతూ ఏడుస్తున్న కూతురిని చూస్తాడు. ఆపి తన వద్దకు వెళ్ళి ఏం జరిగింది అని కూతురుని అడుగుతాడు.
తులసి భయపడి సూర్యనారాయణ చెప్పమన్నట్టు.. కేశవ వర్మ తనని లైంఘికంగా వేధించాడని అబద్దం చెప్తుంది. అంతె అప్పటికె కేశవ వర్మపై వ్యతిరేకంగా ఉన్న పూకార్లకు తన కూతురి మాటలు మరింత బలాన్నీ చేకూర్చాయి.
దాంతొ కోపంతొ ఊగిపోయిన సతీష్ దళితవాడలొ తమ మనుషులను పిలుచుకొని కేశవ వర్మ ఇంటికి పరిగెడతారు.
అది గమనించిన సూర్యనారాయణ మరియు దేవేంద్ర రెడ్డి తమ వద్ద పనిచేస్తున్న జోసఫ్ రాజుకి అదనంగా బయట మనుషులను తీసుకొచ్చి గుంపులొ కలిపెయ్యమంటారు.
తులసి తండ్రి సతీష్ తన మనుషులతొ కేశవ వర్మను తన ఇంటి ముందె చుట్టు ముట్టి కొట్టడం ప్రారంభిస్తారు. ఈలోపు జోసఫ్ రాజు బయట నుంచి మనుషులను తీసుకొచ్చి కేశవ వర్మను కర్రలతొ కొడుతున్న వాళ్ళతొ కలిసిపోతారు.
అడ్డుకున్న కేశవ వర్మ భార్య సుమతిని కూడా ఈ బయట నుంచి మనుషులు కొడతారు. కాసేపటికి సుమతి తన భర్త కేశవ వర్మను తీసుకొని ఇంట్లోకి పరిగెడుతుంది.
ఇదంతా దేవేంద్ర రెడ్డి, సూర్యనారాయణలు కొంచెం దూరంలోనె ఉండి నించోని గమనిస్తున్నారు. తరువాత వాళ్ళ మనిషి జోసఫ్ రాజు ఆ ఇంటిపై పెట్రోల్ పోసి కాగడాతొ నిప్పు అంటించడానికి వస్తాడు. అది తప్పు అని అడ్డుకున్న తులసి తండ్రి సతీష్ ని జోసఫ్ రాజు మనుషులు వెనక్కి లాగేస్తారు.
తరువాత జోసఫ్ రాజు కాగడాతొ ఆ ఇంటికి నిప్పంటిస్తాడు. కాసేపటికె ఆ ఇల్లు తగలిబడిపోవడం ప్రారంభమవుతుంది. చూస్తుండగానె తమ కళ్ళముందె కేశవ వర్మ, తన భార్య బిడ్డలతొ కలిసి సజీవదహనం అయిపోతారు.
ఫ్లాష్ బ్యాక్ ends
ప్రత్యేక విచారణా గది (Special interrogation room)
అజయ్ మరియు సాగర్ వర్మ మద్యన నిశ్శబ్దం....
కేశవ వర్మ తన కన్న తండ్రి అన్న సాగర్ మాట విని అజయ్ షాక్ గురయ్యాడు.
అజయ్ : కేశవ వర్మ నీ కన్నతండ్రి ఏంటి..? నీ కన్న తండ్రి మాధవ వర్మ కదా..?
సాగర్ వర్మ : మాధవ వర్మ నా బాబాయి. మా పిన్నికి, బాబయికి నేనంటె ఇష్టం. మా పిన్నకి పురిట్లోనె బిడ్డ చనిపోతె నన్ను దత్తత తీసుకున్నారు. కాని మా పిన్ని రెండేళ్ళ తరువాత చనిపోయింది. అప్పటి నుంచి నేను మా బాబాయితోనె ఉంటూ పెరిగా. సెలవులకని మా అమ్మ నాన్నలను చూడ్డానికి అని నేను మా బాబాయి వచ్చిపోతుండె వాళ్ళం
అజయ్ : అంటె ఆ రోజు వాళ్ళు చనిపోయినప్పుడు కూడా నువ్వు అక్కడె ఉన్నావా...?
సాగర్ కళ్ళల్లొ కోపం కనీళ్ళుతొ......
సాగర్ వర్మ : అవును అక్కడె ఉన్నా. అప్పుడె ఊరి నుంచి నేను మా బాబాయి వచ్చాం.. నా కళ్ళ ముందె నా తల్లిదండ్రులు, నా చెల్లి సజీవ దహనం అవుతుంటె చూస్తూ ఉన్నాం కాని ఏం చెయ్యలేకపోయాం... నా చెల్లి బాధతొ అరుస్తున్న అరుపులు ఇంకా నా చెవికి వినబడుతూనె ఉన్నాది.
కొన్ని క్షణాలు నిశ్శద్దం...
అజయ్ : నీ కుటుంబం మొత్తం చనిపోడానికి కారణం దేవేంద్ర రెడ్డి, సూర్యనారాయణ, తులసి మరియు తన తండ్రి సతీష్. కాని మా నాన్నని ఎందుకు చంపావు...?
సాగర్ వర్మ : ఓహొ ఇది కూడా తెలుసుకున్నావా..?
అజయ్ : అవును ఆ రోజు మీ నాన్న మాధవ వర్మను కలవాడినికి తెనాలిలొ మీ ఇంటికి వెళ్ళినప్పుడు. అక్కడ ప్రతి ఫొటోల్లొ నీ చేతికున్న కడియాన్నీ చూశాను. అదె కడియాన్నీ మా నాన్న శవం దగ్గర చూశాను.
సాగర్ వర్మ : చంపాను అని తెలుసుకున్న వాడివి ఎందుకు చంపానొ తెలియలేదా...? దేవేంద్ర రెడ్డి, సూర్యనారాయణులకి మీ నాన్న జోసఫ్ రాజు ఒక పెంపుడు కుక్క. ఆ రోజు ఇంటికి కాగడాతొ నిప్పంటిచింది మీ నాన్నె. ఆ విషయం నాకు తులసి నాన్నె చెప్పాడు.
అజయ్ మళ్ళి షాక్....
సాగర్ వర్మ : అదె వారసత్వం నువ్వు కూడా కొనిసాగించావు. నువ్వు చెయ్యని దారుణాలు లేవు.ఛా...
మాధక ద్రవ్యాల సప్లై, బుటకపు ఎన్కౌంటర్స్,
నువ్వు ఏదొ పోలీసు ఉద్యోగంలొ రికమండేషన్ ఇప్పిస్తావని ఆశపడి మాధక ద్రవ్యాల విషయంలొ నీకు ఇన్ఫార్మర్ గా పనిచేసిన పాపానికి ఒక గుడి పూజారి కొడుకైన కిషోర్ శర్మను బూటకపు ఎన్కౌంటర్లొ దారుణంగా చంపేశావు.
సాగర్ తన నేరాలు చిట్టా విప్పుతుంటె. అజయ్ మౌనంగా ఉన్నాడు.
సాగర్ వర్మ : నీ సుఖం కోసం తులసిని వాడుకున్నావు. ఎదురు తిరిగినందుకు దారుణంగా చంపేశావు, అన్నిటికన్న నన్ను మరింత కలిచిన విషయం నా చెల్లి శ్వేత తనని కూడా చంపాలని చూశావు. ఇన్ని ధారుణాలు చేసిన మిమ్మల్ని అంత తేలికగా వదిలేస్తానా...?
అజయ్ కి మొట్టమొదటిసారి చిన్నగా భయం మొదలైంది.
సాగర్ వర్మ : అందుకె ముందు ప్రధాన సూత్రదారులైన దేవేంద్ర రెడ్డి, సూర్యనారాయణలను చంపేశా.. దాంతొ మిమ్మల్ని అందరిని కాపాడె వాళ్ళు లేకుండా పోయారు. అందుకె మీ అందిరికి వ్యతిరేకంగా సులువుగా సాక్యాధారలు సంపాధించగలిగాను.
మళ్ళి కొన్ని క్షణాలు నిశ్శబ్దం....
సాగర్ వర్మ : నువ్వేదొ బేయిల్ మీద బయటకు రాగలవేమొ కాని ఈ కేసుల నుంచి మాత్రం అస్సలు బయటపడలేవు. ఎన్ని సంవత్సరాలైన మీకు కచ్చితంగా శిక్ష పడుతుంది. కాని నీకు అంటు ఇప్పుడు ఎవరున్నారు. తల్లిదండ్రులు లేరు, భార్య నిన్ను ఛీ అని పోయింది. ఇంక నువ్వు బేయిల్ నుంచి బయటకొచ్చి ఎక్కడికి వెళతావు...? నౌ.. యు..అర్..టోటల్లి జీరొ...
అనె గట్టిగా టేబుల్ పై కొడతాడు.
నిశ్శబ్దం మళ్ళి ఆ గది మొత్తం అలుముకుంది...
సాగర్ వర్మ టేబుల్ మీద ఉన్న టాబ్ మరియు బ్రౌన్ ఫైల్ తీసుకొని బయటకి నడిచాడు. తలుపు తియ్యగానె ఒక 6.5 ఏళ్ళ వయసున్న చిన్నపాప తలుపు దగ్గర నించుంది.
"నాన్న"
అంటు సాగర్ వర్మ దగ్గరకొచ్చింది. సాగర్ ఆ పాపని ఎత్తుకున్నాడు.
అజయ్ ఆ పాపను గమనిస్తున్నాడు.
సాగర్ ఇటు తిరిగి అజయ్ వైపు చూస్తూ.....
సాగర్ వర్మ : ఏంటి పెళ్ళికాని నాకు ఈ పాప ఎక్కడనుంచి వచ్చింది అనుకుంటున్నావా..?
అజయ్ అయొమయంగా చూస్తున్నాడు.
సాగర్ వర్మ : ఈ పాప ఎవరొ కాదు. నువ్వు చేసిన పాపానికి రూపం...... తులసి కూతురు.
ఆ పాప తన కూతురు అని వినగానె అజయ్ మళ్ళి షాక్ అయ్యాడు.....
సాగర్ వర్మ : తులసి చనిపోయాక కొన్ని రోజులకె తన తల్లి కూడా కూతురి మీద బెంగతొ చనిపోయింది. ఆ తరువాత సంవత్సరానికి తులసి తండ్రి యాక్సిడెంట్ అయ్యి హాస్పెటల్లొ చేరితె నన్ను పిలిచి జరిగింది చెప్పి ఈ పాపను నా చేతిలొ పెట్టి చనిపోయాడు.
పాప : నాన్న తాతయ్య త్వరగా రమ్మంటున్నారు...
సాగర్ వర్మ : ఇదికొ వచ్చేస్తున్నా అమ్మా...
అంటూ బయటకు వెళుతూ వెనక్కి తిరిగి...
సాగర్ వర్మ : నీ వల్ల అనాథ అయిన ఈ బిడ్డ... ఈ రోజు నన్ను 'నాన్న' అని పిలుస్తోంది. అంతకంటే నాకు ఇంకే న్యాయం అవసరం లేదు........
అని చెప్పి వెళ్ళిపోయాడు.
వెళిపోతున్న సాగర్ మరియు తులసి కూతురిని చూస్తూ అజయ్ అలా ఉండిపోయాడు. తన కళ్ళల్లొ నీళ్ళు కారుతున్నాయి.
రెండు రోజులు తరువాత
సమయం : ఉదయం 11:05 గంటలు.
సాగర్ వర్మ ఒక కిరాణా కొట్లొ పాప కోసమని డైరిమిల్క్ చాక్లెట్ మరియు మంచి నీళ్ళ బాటిల్ కొంటున్నాడు.
అదె సమయంలొ ఆ కిరాణా కొట్టులోని టీ.వి లొ అజయ్ ఆత్మహత్య చేసుకున్నాడనె వార్త వస్తుంది.
కాని సాగర్ వర్మ ఆ వార్తని పట్టించుకోకుండా. చాక్లెట్, వాటర్ బాటిల్ తీసుకొని తన కార్ వద్ధకు వెళ్ళాడు.
కారు ముందు సీటులొ మాధవ వర్మ కూర్చున్నాడు. వెనక సీట్లొ శ్వేత మరియు తులసి కూతురు కూర్చున్నారు.
సాగర్ వర్మ ఆ పాపకి చాక్లెట్ ఇచ్చి వాటర్ బాటిల్ మాధవ వర్మకిచ్చి కార్ ఎక్కి బండి స్టార్ట్ చేశాడు.
పాప : నాన్న నన్ను బోటు షికారుకు ఎప్పుడు తీసుకెళతావు...?
సాగర్ వర్మ : ఇదిగొ అక్కడికె వెళుతాన్నాం బంగారం...
అని అనగానె అందరు నవ్వారు....
కార్ బయలుదేరి వెళ్ళిపోయింది....
---------------------------సమాప్తం----------------------------