If You Write a Will... Is Death Inevitable? – 9 in Telugu Adventure Stories by chintala srichandar books and stories PDF | మరణ శాసనం లిఖిస్తే... మరణం తప్పదా? - 9

Featured Books
Categories
Share

మరణ శాసనం లిఖిస్తే... మరణం తప్పదా? - 9

దుర్గాప్రసాద్ వెంటనే ఫోను తీసి ఒక నెంబర్ కు డయల్ చేశాడు.

అవతల ఫోన్ ఎత్తగానే, "ఏంటి భుజంగం గారు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశారంట. విషయం నా వరకు వచ్చింది "అంటూ వెహికల్ నెంబర్ చెప్పాడు.

అవతల వైపు నుంచి," మేము ఇలాంటి చిల్లర పనులు చేయము, కానీ ఆ నెంబర్ వెహికల్ మాత్రం నా అనుచరుడు సూరిగానిదే. ఏవైనా చిల్లర డబ్బులకు ఆశపడి చేసి ఉంటాడు. ఇందులో నాకు గాని, మా తండ్రికి గానీ సంబంధం లేదు. వాళ్లకు డబ్బులు ఇచ్చి అమ్మాయిని విడిపించుకోమని చెప్పండి. అమ్మాయికి మాత్రం ప్రా ణభయం ఉండదు "అంటూ ఫోన్ పెట్టేశాడు. 


దుర్గాప్రసాద్ కానిస్టేబుల్ తో" నగరంలో నిన్న కానీ ఈరోజు కానీ ఏవైనా కిడ్నాప్ కేసులు నమోదు అయ్యాయేమో కనుక్కోండి "అనడం కార్తీక్ వింటూ నడుస్తున్నాడు...

 ఇక లాభం లేదనుకొని ఎస్ఐ రాందేవ్ కు ఫోన్ చేసి విషయం అంతా చెప్పాడు. వెంటనే పోలీస్ స్టేషన్ కు రమ్మన్నాడు. కార్తీక్ ఆటో వెతికి, ఆటో ఎక్కి స్టేషన్కు వెళ్లేసరికి కాస్త ఆలస్యమైంది. 

కానిస్టేబుల్ సుబ్బారావు, "ఎందుకింత ఆలస్యం?" అనగా "ఆటో దొరకలేదు" అని చెప్పాడు.

ఎస్సై రాందేవ్, "సుబ్బారావు! మనం రికవరీ చేసిన బైకుల్లో ఒకటి కార్తీక్కు ఇవ్వు" అని చెప్పి ఎస్సై, సుబ్బారావు, కార్తీక్ ముగ్గురూ ఒక రూమ్ లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు.

 ఎస్సై రాందేవ్" చూడు కార్తీక్! ఇప్పుడు వివరాలు అన్నీ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా మొత్తం చెప్పు" అనేసరికి....అన్ని విషయాలు..కిడ్నాపర్ల గుర్తులు, దుర్గాప్రసాద్ ఫోన్ కాల్ విషయం అంతా చెప్పాడు.

 అప్పుడు రాందేవ్ ఇలా చెప్పడం మొదలుపెట్టాడు.

" కిడ్నాప్ అయిన అమ్మాయి ఎవరో కాదు, మన కానిస్టేబుల్ సుబ్బారావు కూతురు. సాయంత్రం పుస్తకాలు కొనుక్కోవడానికి బయటకి వస్తే కిడ్నాప్ చేశారు. పోలీసుల కూతురు అని తెలియక చేసి ఉంటారు.. డబ్బు డిమాండ్ చేయడం, ఇస్తే వదిలేయడం చేస్తారు. ఈ రెండు నెలల్లో ఇలా మూడుసార్లు జరిగింది. వాళ్ళు దాదాపు రెండు నుండి ఐదు లక్షల డిమాండ్ చేస్తున్నారు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే అమ్మాయిని చంపుతామని బెదిరిస్తున్నారు. డిపార్ట్మెంట్ పరువు కోసం ఇంకా కంప్లైంట్ చేయనీయలేదు. ఈ విషయాన్ని ఈ రాత్రికి ముగిద్దాం" అన్నాడు.

సుబ్బారావు బాధతో, "సార్! మీ మీద గౌరవంతో కంప్లైంట్ ఇవ్వలేదు. నా పాపను ఎలాగైనా కాపాడండి. వాళ్లకు తగిన బుద్ధి చెబుదాం" అన్నాడు.

 తర్వాత కార్తీక్ తో వెహికల్ నెంబర్ తీసుకొని కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేశాడు. వెహికల్ ఎక్కడెక్కడ తిరిగింది చూశారు. కార్తీక్ చూసిన తర్వాత ఐదు నిమిషాల తర్వాత ఒక సీసీ కెమెరాలో దొరికింది. తర్వాత మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే సీసీ కెమెరా దాటలేదు. సో మూడు కిలోమీటర్ల పరిధిలో ఎక్కడో ఉంటుందని నిర్ధారణకు వచ్చారు. 

ఎస్సై రామదేవ్ తన బృందాన్ని సిద్ధం చేసుకున్నాడు. తను, కార్తీక్, సుబ్బారావు కాక మరో ముగ్గురు కానిస్టేబుళ్లు ఆయుధాలతో సహా రెడీ అయ్యారు. ఇద్దరు కానిస్టేబుల్లు కార్తీక్ బైకులపై బయలుదేరగా...మిగిలిన వారు పోలీసు జీపులో బయలుదేరారు.

 ముందు జాగ్రత్తగా సైరన్ ఆపు చేయించాడు ఎస్ఐ.

 సూరి వెహికల్ తీసుకొని ఒక పాత అ ల్యూమినియం ఫ్యాక్టరీ లోనికి వెళ్లారు. కిడ్నాప్ చేసిన ప్రతిసారి అక్కడికి వెళ్లడం వారికి అలవాటే. అక్కడికి వెళ్ళాక వాళ్లలో కొందరు మందు తాగడం మొదలుపెట్టారు. మరికొందరు తమ వెంట తెచ్చుకున్న బిర్యాని తినడం మొదలుపెట్టారు.సూర్య సిగరెట్టు కాల్చడం మొదలుపెట్టాడు.

 సిగరెట్ తాగుతూ ఆలోచిస్తున్నాడు. ఇంతలో వాళ్లలో ఒకడైన ఇస్మాయిల్, " ఏంటి సూరి అన్న ఇంత కష్టపడి కిడ్నాప్ చేస్తే అమ్మాయి మీద చెయ్యి వేయనీయవు. డబ్బులు తక్కువ తీసుకుంటావు. ఎలాగో రిస్కు చేస్తున్నాం కదా? డబ్బులు అయినా ఎక్కువ డిమాండ్ చేయవచ్చు కదా? " అని అడిగాడు.

దానికి సూరి, " ఒరేయ్ ఇస్మాయిల్, మనమంతా భుజంగం మనుషులం కాబట్టి పోలీసులు మనల్ని టచ్ చేయడం లేదు. పైగా ప్రజలు భయపడుతున్నారు కాబట్టి మన పని సాఫీగా జరిగిపోతోంది . అమ్మాయికి ఏమైనా జరిగినా, డబ్బులు వాళ్ళు ఇవ్వలేనంత అడిగినా వారు పోలీసులకు చెబుతారు. ప్రాబ్లం అవుతుంది. పైగా ఈ వ్యవహారం అంతా భుజంగం కు తెలియకుండా చేస్తున్నాం.ఆయనకు తెలిస్తే ప్రమాదం. మన ఖర్చులకు, అవసరాలకే కదా ఈ పనికి ఒప్పుకున్నది. నేనైతే డబ్బు తీసుకోవడం లేదు. మీకే కదా అంతా ఇస్తున్నాను. తల్లిదండ్రులు భయపడడం మొదలై ఉంటుంది. ఒక గంట తర్వాత ఐదు లక్షల డిమాండ్ చేసి ఉదయం తీసుకుని వదిలేయండి" అని చెప్పాడు.

ఇస్మాయిల్ కిడ్నాప్ చేసిన అమ్మాయి దగ్గరికి వెళ్లి నోటిలో కుక్కిన గుడ్డలు తీశాడు. ఆ అమ్మాయి భయంతో వనికి పోతుంది. తాగడానికి నీళ్లు ఇచ్చాడు, తర్వాత మీ నాన్న పేరు, మీ ఆస్తి ఎంత, ఏం చేస్తుంటాడు? అని అడిగాడు.ఆ అమ్మాయి సమాధానాలు చెప్పింది.

 ఇస్మాయిల్ సూరి దగ్గరికి వేగంగా వెళ్ళాడు.

" అన్న! పొరపాటు జరిగిపోయింది. ఆ అమ్మాయి హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు కూతురు." అన్నాడు ఇస్మాయిల్.

"సరే జరిగింది ఏదో జరిగి పోయింది. తెలిసో తెలియకో పనిలోకి దిగాము. ఇక వెనక్కి వెళ్లలేము.ముందుకే వెళ్లాలి.. కార్యక్రమాన్ని యధావిధిగా కొనసాగించండి "అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు" సూరి.

 వెంటనే ఇస్మాయిల్ సుబ్బారావు కు ఫోన్ చేసి అవతల ఫోన్ ఎత్తగానే, " నీ కూతురు నీకు ప్రాణా లతో కావాలంటే ఐదు లక్షలు రెడీ చేసుకో, రేపు ఉదయం ప్లేసు, టైము నీకు చెప్తాను. డబ్బులు ఇచ్చి మీ పాపను క్షేమంగా తీసుకొని వెళ్ళిపో! అలా కాదని పిచ్చిపిచ్చి వేషాలు వేసావో...నీ కూతురు శవం కూడా నీకు దొరకదు "అంటూ బెదిరించి ఫోన్ పెట్టేసి స్విచాఫ్ చేసేసాడు.

సుబ్బారావు ఎస్ఐతో విషయం మొత్తం చెప్పేశాడు. 

"ఇంక ఆలస్యం చేయకూడదు" అనుకుని వేగం పెంచారు. సీసీ కెమెరాల్లో వెహికల్ కనిపించిన చోటు తర్వాత నుంచి నిదానంగా రెండు వైపులా గమనిస్తూ మూడు కిలోమీటర్లు తిరిగారు.

వారు గమనించినది ఏమిటంటే కుడివైపున మాత్రమే జనసంచారం లేని పాడుబడిన రెండు ఫ్యాక్టరీలు ఉన్నాయి. సో అందులోనే వెతకాలని నిర్ణయించుకున్నారు ఆ ఫ్యాక్టరీలకు దూరంగా వెహికల్స్ ఆపారు  

పోలీసులు రెండు బృందాలుగా విడిపోయారు. మొదటి బృందం లో ఎస్సై, సుబ్బారావు, కార్తీక్ ఉన్నారు. రెండవ బృందంలో ముగ్గురు కానిస్టేబుల్ ఉన్నారు.

ఎస్సై వారికి ఇలా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు.

" మన ఫస్ట్ ప్రయారిటీ పాప సేఫ్టీ. ఒకవేళ వాళ్ళు పారిపోతే పారిపోనివ్వండి, కానీ వారు ఎదురు తిరిగితే.. మీపై ఫైరింగ్ జరిపితే ప్రాణాలకు ప్రమాదం అనుకుంటేనే ఫైర్ చేయండి. మిగతా విషయాలు నేను చూసుకుంటాను" అంటూ బయలుదేరారు. 

రెండు బృందాలుగా విడిపోయారు.

మొదటి బృందం ముగ్గురు కానిస్టేబుళ్లు ఆయుధాలతో ఫ్యాక్టరీ లోపలికి వెళ్లి నిందితుల కోసం గాలించసాగారు... శబ్దం చేయకుండా చాలా జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

రెండవ బృందమైన ఎస్ఐ, సుబ్బారావు, కార్తీక్ లు కూడా ముందుకు సాగారు. ఎస్సై మరియు సుబ్బారావు ఆయుధాలతో ఉన్నారు.కార్తీక్ దగ్గర ఆయుధం లేదు.

 ఫ్యాక్టరీలో అందరూ భోజనాలు చేశారు. కొందరు పేకాట ఆడుతున్నారు, కొందరు సెల్ఫోన్ చూస్తున్నారు.

 ఇస్మాయిల్ సూర్య దగ్గరకు వెళ్లి, " అన్నా మన పోరగాళ్లు ఆ అమ్మాయితో మజా చేయాలనుకుంటున్నారు" అనగానే..

సూరి సీరియస్ అయ్యాడు.

" అటువంటి ఆలోచనలు మానుకోండి. రేపు ఉదయం డబ్బు వస్తుంది. ఆ తర్వాత మీరు ఏ బ్రోతల్ హౌస్ కి వెళ్తారో, ఏ బార్ కి వెళ్తారో మీ ఇష్టం. అమ్మాయిపై చేయి వేయడానికి వీలు లేదు. పైగా కానిస్టేబుల్ కూతురు "అని వార్నింగ్ ఇస్తుండగా..

 ఫోన్ మోగింది. సూర్య నెంబర్ చూసి చాలా వినయంగా, " హలో చెప్పు అన్నా "అన్నాడు.

అవ తల నుంచి భుజంగం.

" సూరి, నీ చెంచా గాళ్ళు ఒక అమ్మాయిని తెచ్చారంట. ఇప్పుడే డిఎస్పి ఫోన్ చేసి అడిగాడు. ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు? మా నాన్నదాకా విషయం పోలేదు. ఏదైనా చేస్తే కోట్లలో చేయాలి. లక్షకు రెండు లక్షలకు చేసి తల మీదికి తెచ్చుకోవద్దు. జాగ్రత్త!" అంటూ ఫోన్ పెట్టేశాడు. 

ఇస్మాయిల్, " ఎవరు అన్నా "అంటే..

" భుజంగం అన్న ఫోన్ చేశాడు. విషయం ఆయన వరకు వెళ్ళింది. పోలీసులు అన్నకు ఫోన్ చేశారంట! విషయం ఎలాగో లీక్ అయింది. జాగ్రత్తగా ఉండాలి. ఇకపై ఇలాంటి ఆపేద్దాం "అని సూర్య అనగా..

" ఏం కాదులే అన్నా "అని ఇస్మాయిల్ చాలా తేలికగా తీసుకున్నాడు.

 కార్తీకు, ఎస్ఐ, సుబ్బారావు ఫ్యాక్టరీలోనికి ప్రవేశించారు. శబ్దం చేయకుండా అడుగు లో అడుగు వేసుకుంటూ వెళ్తుండగా... డోర్ ఓపెన్ అయిన శబ్దం విని ఆగిపోయారు.

 ఒకడు డోర్ ఓపెన్ చేసుకొని బయటకు వచ్చాడు. వాడు ఫుల్లుగా తాగి, తూలుతూ పాస్ పోయడానికి వచ్చినట్లు ఉన్నాడు. వాడు పాస్ పోసుకుంటున్నాడు. ముగ్గురు కళ్ళతోనే సైగ చేసుకుని వాని వెనకకు వెళ్లి నిలబడ్డారు.

వాడు పాస్ పోసి తిరిగేసరికి ఎదురుగా ముగ్గురు కనపడ్డారు. వెంటనే జేబులోని తుపాకి తీద్దామని చేయి కదిపే లోపల సుబ్బారావు వాడి చేయి గట్టిగా పట్టుకున్నాడు. వాడు అరిచి అందరిని అలర్ట్ చేద్దామని అనుకుంటే కార్తీక్ గట్టిగా నోరు మూసాడు. ఎస్సై రాందేవ్ తుపాకీ మనతో వాని తలపై గట్టిగా కొట్టాడు. కింద పడిపోయాడు. వారి చేతులు కట్టేశారు.

 వాడి ముఖం చూసి కార్తీక్ వెహికల్ లో చూశానని చెప్పాడు. లోపలికి బయలుదేరారు. చిన్నగా డోర్ తీసుకొని లోపలికి వెళ్లారు. ఎదురుగా సూరి, ఇస్మాయిల్ మరో ముగ్గురు కనబడ్డారు.వాళ్లను చూడగానే సూరి, ఇస్మాయిల్ అదిరిపడ్డారు. 

ఇస్మాయిల్ కాల్పులు జరపగా ముగ్గురు దాక్కున్నారు. వాళ్లు కాల్పులు జరుపుతూనే ఉన్నారు.si, సుబ్బారావు కూడా కాల్చారు.

 కాల్పుల శబ్దం విన్న అవతల ఫ్యాక్టరీలో ఉన్న ముగ్గురు కానిస్టేబుల్స్ పరిగెత్తుకుంటూ ఫ్యాక్టరీలోకి వచ్చేశారు. బుల్లెట్లు అవతల నుంచి రావడం ఆగిపోయాయి. 

ఎస్సై కూడా కాల్పులు ఆపించి వారిని పట్టుకోవడం కోసం ముందుకు ఉరికాడు. వాళ్లు, వీళ్లు పోరాడుతున్నారు. 

సుబ్బారావు మాత్రం తన కూతురు కోసం వెతుకుతూ ఒక గది తలుపు తీసి లోపల బంధించిన తన కూతుర్ని చూసి కంటతడి పెట్టుకొని, విడిపించి బయటకు తీసుకొని వచ్చాడు. ఆ అమ్మాయిని చూడగానే ఎస్సై, కార్తిక్ కు సంతోషం వేసింది. 

ఇంతలో ఇస్మాయిల్ సుబ్బారావును తోసేసి ఆ అమ్మాయి చేయి పట్టుకొని లాక్కొని వెళ్తున్నాడు.. ఎస్సై, సూర్య హోరాహోరీగా పోరాడుతున్నారు. 

"నాన్న" అన్న పిలుపుతో ఎస్సై, "కార్తిక్ అమ్మాయిని విడిపించు "అన్నాడు. కార్తీక్ ఇస్మాయిల్ వెనక పరిగెత్తాడు.

కార్తిక్ ఇస్మాయిల్ ఎదురుగా వెళ్లి నిలబడ్డాడు. ఆ అమ్మాయిని వదిలేయ్ అనగా వాడు అవేమి వినకుండా కార్తీక్ పై పిడి గుద్దులు కురిపించబోయాడు. ఒక చేత్తో అమ్మాయిని పట్టుకొని, రెండవ చేత్తో కార్తీకుని కొడుతున్నాడు. 

రెండు దెబ్బలు తిన్న కార్తిక్, ఒక చేత్తో వాడి చేతిని అడ్డుకొని మరొక చెత్తో వాడి గుండెల పై బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు అమ్మాయి చేయి వదిలి పడిపోయాడు. వాడి నోట్లో నుంచి రక్తం కారుతోంది. కళ్ళు తిరుగుతున్నాయి. తిరిగి లేవలేక పోతున్నాడు. వాడు కార్తీక్ ను చూసి వీడిని ఎలాగైనా చంపాలి అనుకుంటున్నాడు కానీ లేవలేకపోతున్నాడు.

 ఎస్సై, సూర్య పోరాడుతున్నారు. ఎస్సైని దెబ్బలు కొడుతున్నాడు. ఎస్ఐ కూడా తప్పించుకొని సూర్యుని కొడుతున్నాడు. ఇలా సాగుతుండగా.. కార్తీక్ వేగంగా వచ్చి సూరి భుజంపై చేయి వేసి తన వైపు తిప్పుకొని బలంగా పిడికిలి బిగించి మూతి మీద, గుండెలపై గట్టిగా కొట్టాడు.ఆ దెబ్బలకు సూరి కూడా పడిపోయాడు. 

అమ్మాయిని కిడ్నాప్ చేశారన్న కోపంతో కార్తీక్ కనపడిన వాడిని కనపడినట్లుగా ఎడాపెడా చితకొట్టేశాడు.

అతని దెబ్బలు తాళలేక అందరూ రక్తం కక్కుకుంటూ పడిపోయారు. కార్తీక్ ఆవేశం చల్లారలేదు ఇంకా ఎవరిని కొట్టాలని వెతుకుతున్నాడు కానీ ఎవరూ లేరు. అందరు పడిపోయారు.ఎస్సై రాందేవ్ కార్తీక్ భుజంపై చేయి వేసి శాంతించమన్నట్లుగా సైగ చేశాడు.

 కానిస్టేబుల్స్ అందర్నీ బంధించారు. అందరు చచ్చిన పాము లా నీరసంగ పడిపోయారు.

 ఇస్మాయిల్ కు, సూర్యకి చాలా అవమానకరంగా ఉంది. వాళ్ళు కార్తీక్ ని చూసి తట్టుకోలేక వీడి వల్ల మన ప్లాన్ మొత్తం నాశనమయింది, వీడ్ని ఎలాగైనా చంపేయాలి.. వదలకూడదు అని వారిద్దరూ కళ్ళతో సైగ చేసుకుని గట్టిగా నిర్ణయం తీసుకున్నారు.