If You Write a Will... Is Death Inevitable? – 4 in Telugu Crime Stories by chintala srichandar books and stories PDF | మరణ శాసనం లిఖిస్తే... మరణం తప్పదా? - 4

Featured Books
Categories
Share

మరణ శాసనం లిఖిస్తే... మరణం తప్పదా? - 4

ఆనందరావు, " చూడు కార్తీక్! నీ గతం గురించి వినాలనుకుంటున్నాను. ఎందుకో నువ్వు హంతకుడువని, స్వయాన నా బావమరిది కొడుకును చంపావని తెలిసినా నాకు నీ పైన కోపంగాని ద్వేషం గానీ రావడం లేదు. నేను నీకు తండ్రి లాంటి వాడిని. నా కోసమైనా ఏం జరిగిందో చెప్పు" అని బతిమాలుతూ అడిగాడు. కార్తీక్ ఏం చెప్తాడా అని సుమా సత్య కూడా ఎదురు చూడ సాగారు.

 కార్తీక్ మెల్లగా లేచి నడుచుకుంటూ దగ్గరిలోని కిటికీ వద్దకు వెళ్లి బయటకు చూస్తూ నిలబడ్డాడు. కంటిలో నుండి సన్నగా ధారగా కన్నీళ్లు ఉబికి వచ్చాయి. వాటిని దిగమింగుకొని, గొంతు సవరించుకొని మొదలుపెట్టాడు...

"నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి మా ఇంట్లో నేను, అమ్మ, నాన్న మాత్రమే ఉండే వాళ్ళం. మాది చాలా చిన్న ఫ్యామిలీ మరియు సంతోషకరమైన ఫ్యామిలీ. ఎప్పుడూ మా ఇంట్లో అమ్మకు, నాన్నకు ఎలాంటి గొడవలు లేవు. చాలా అన్యోన్యంగా ఉండేవారు. మా నాన్న మిలటరీ నుండి వచ్చినందున పెన్షన్ వచ్చేది మరియు టౌన్ లో ఒక చిన్న ఉద్యోగం చేసేవాడు.మా అమ్మ ఇంట్లోనే ఉంటూ కుట్టు పని చేసేది. దాంతో మాకు డబ్బుకు లోటు ఉండేది కాదు. సరదాగా సంతోషంగా సాగిపోయేది. నాకు సుమారు 11 సంవత్సరాల వయసు వచ్చాక కొన్ని కొన్ని విషయాలు తెలియడం ఆరంభించాయి. మా ఊరు కి దగ్గర్లోని పల్లెటూల్లో మా తాతయ్య ఉండేవాడు. మా తాతయ్య ఊర్లో పెద్దమనిషి. చాలా ఇల్లు, పొలాలు ఉన్నాయి. తాతయ్యకు నాన్న ఒక్కడే కొడుకు. తాత వద్దన్నా వినకుండా, నాన్న దేశ సేవ చేయడం కోసం ఆర్మీలో చేరాడు మరియు 15 సంవత్సరాల సర్వీసు చేసి ఊరికి వచ్చాడు. 

మధ్యలో ఎన్నో సార్లు పెళ్లి చేసుకో అని చెప్పినా వినలేదు. ఆర్మీ నుంచి వచ్చాక మా నాన్న మా అమ్మను పెళ్లి చేసుకోవాలనుకున్నట్లు చెప్పాడు. తాతయ్య ఒప్పుకోలేదు. ఎందుకంటే మా అమ్మది వేరే కులం. ఆస్తి కూడా ఇవ్వను అని బెదిరించినా, నాన్న కాదనుకొని మా అమ్మను పెళ్లి చేసుకుని ఆ ఊరు వదిలివచ్చేసాడు. అప్పుడప్పుడు ఆ ఊరి వాళ్ళు మా నాన్న స్నేహితులు వచ్చి మాట్లాడుతుంటారు. అందువల్ల ఆ విషయం నాకు అర్థమైంది. 

మా నాన్న స్నేహితుడైన తులసీరామ్ తరచుగా నాన్నను చూడడానికి వస్తుంటాడు. వచ్చిన ప్రతిసారి "చూడు రాజా! జరిగింది ఏదో జరిగిపోయింది. మీ నాన్నకు కూడా వయసు అయిపోయింది. నడవలేక పోతున్నాడు. తనని చూసుకోవడానికి మీ పెదనాన్న కూతురు, ఆమె భర్త వచ్చి అక్కడే ఉంటున్నారు. నువ్వు ఎప్పుడు వస్తావు? అని మీ నాన్న ఎదురు చూస్తున్నాడు. పంతాలు, పట్టింపులు వదిలి మీ నాన్నను పలకరించి ఆయన బాగోగులు చూసుకో!" అని అని చెప్పేవాడు. 

కానీ మా నాన్న నవ్వుతూ, " నా తండ్రిని చూసుకోవాలి అని నాకు ఉంది కానీ అయన పిలవకుండా నేను వెళ్లలేను. వెళితే ఆస్తి కోసం చివరి దశలో వచ్చాడు అని గుసగుసలాడుకుంటారు.అది నాకు ఇష్టం లేదు "అని చెప్పేవాడు. 

ఇలా రోజులు మంచిగా సాగుతున్న వేళ నా జీవితంలో ఒక భయంకరమైన ప్రళయం వచ్చింది. అసలు నా జీవితం ఇలా అయిపోతుందని ఊహించలేదు. ఒక రోజున నా బర్త్ డే కోసం షాపింగ్ చేయాలని నేను, నాన్నా, అమ్మ బైక్ పై వెళ్ళాము. నాకు మంచి బట్టలు ఒక జత కొన్నారు. మంచి హోటల్లో లంచ్ చేశాముm నాకు ఐస్ క్రీమ్ కూడా ఇప్పించారు. తిని హోటల్ నుంచి బయటకు వచ్చాము..

 రాగానే బయట ఏంటో హడావుడిగా ఉంది. ఏమైందని కొంచెం ముందుకు వచ్చి చూశాం. ఒక స్కూల్ బస్సు...అందులో విద్యార్థులు ఉన్నారు. డ్రైవర్ బస్సు ని రివర్స్ చేస్తున్నప్పుడు పక్కన ఉన్న ట్రాన్స్ఫార్మర్ కు బస్సు గుద్దింది. కొన్ని వైర్లు బస్సు పై పడ్డాయి. నిప్పు రవ్వలు పడుతున్నాయి.. పొగ వస్తుంది.. అందరూ అలా చూస్తున్నారే గాని ఎవరు ఏమి చేయడం లేదు. బస్సులో పిల్లలు భయంతో కేకలు వేయసాగారు. 

ఈ దృశ్యం చూసిన వెంటనే మా నాన్న ఒక్క క్షణం కూడా ఆగలేదు. పరుగు పరుగున బస్సు డోర్ తీసి బస్సులోకి వెళ్ళాడు. పిల్లలను బయటకు పంపిచేస్తున్నాడు... మా అమ్మ కూడాఏమి ఆలోచించకుండా బస్సు ఎక్కి మెట్ల దగ్గర నిలబడి పిల్లలను బయటికి తోస్తుంది.. సుమారు పది నిమిషాలు అయింది... దాదాపు పిల్లలందరూ దిగారు. చివర ఒక అబ్బాయిని పట్టుకొని మా నాన్న దగ్గరికి వచ్చేలోపు బస్సులోనికి మంటలు వ్యాపించి బస్సు దగ్దమైంది..అందులో మా అమ్మానాన్న చనిపోయారు.

ఏమి జరిగిందో అర్థం అయ్యేసరికి అంతా అయిపోయింది.. బాధతో, భయంతో వాంతి చేసుకుని పడిపోయాను. కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్లో ఉన్నాను. మా నాన్న స్నేహితుడైన తులసిరామ్ గారు నన్ను చూసి, " బాధ పడొద్దు" అని ఓదార్చి, హాస్పిటల్ నుంచి తీసుకొని మా తాతయ్య వాళ్ళ ఊరికి తీసుకొని వెళ్ళాడు.

 మా తాతయ్య మంచంలో ఉన్నాడు. మా అత్త మామ తో మాట్లాడి నన్ను ఇంటి దగ్గర దింపి వెళ్లిపోయాడు. నేను ఆ ఇంటికి రావడం ఎందుకో అత్తమామలకు నచ్చినట్లుగా లేదు. నాతో సరిగా మాట్లాడేవారు కాదు. అయితే వారి కూతురు నా మరదలు అయిన రాణి మాత్రం మాట్లాడేది. ఇల్లు చాలా పెద్దగా విశాలంగా ఉంది. ఆవులు, గేదెలు, కోళ్లు ఉన్నాయి. దాదాపు పది మంది పనివాళ్ళు ఉన్నారు. 

నన్ను ఎప్పుడూ నా రూమ్ లోనే ఉంచేవారు. బయటకు రానిచ్చేవారు కాదు. నాతో పని వాళ్లు కూడా మాట్లాడే వాళ్ళు కాదు. భోజనం కూడా చాలా తక్కువగా పెట్టేవారు. తర్వాత నన్ను గవర్నమెంట్ హై స్కూల్లో చేర్పించారు. మా నాన్నకు నెలనెలా వచ్చే పెన్షన్ డబ్బులు, ఇన్సూరెన్స్ డబ్బులు కూడా వాళ్లే తీసుకున్నారు.

 నేను స్కూలుకు వెళ్లే దారిలో ఒక మెకానిక్ షాపు ఉంది. ముగ్గురు పనివాళ్ళు పనిచేసేవారు. ఓనర్ పేరు ఇబ్రహీం. అతని కొడుకు అబ్దుల్లా. అబ్దుల్లా మాస్కుల్లోనే మా తరగతి చదివేవాడు. అతను స్కూలుకు సరిగా వచ్చేవాడు కాదు. వారంలో ఏదో ఒక రోజు వస్తాడు. మిగతా రోజుల్లో షాపులో పనిచేసేవాడు.

 సాయంత్రం స్కూల్ అయిపోయాక ఇంటికి వెళ్లే సమయంలో ఒక అరగంట అబ్దుల్లాతో మాట్లాడి వెళ్లేవాడిని. ఇంట్లో నా పరిస్థితి దారుణంగా ఉండేది. నా సొంత ఇంట్లో నేను పరాయి వాడిగా ఉండవలసి వచ్చింది. పరాయి వాళ్ళు నా ఇంట్లో సొంత మనుషుల్లా పెత్తనం చెలాయించేవారు. నాకు ఆహారం కూడా సరిగా పెట్టేవారు కాదు. చాలా ఆకలిగా ఉండేది. ఎలా అడగాలో అర్థం అయ్యేది కాదు. అప్పుడప్పుడు రాణి ఇచ్చే చిరుతిల్లు ఎంత తినకూడదని అనుకున్న, ఆకలి బాధ భరించలేక తినేవాడిని. ఎక్కడికైనా వెళ్లిపోవాలి....అని ఆలోచించేవాడిని.

 ఇంతలో మా తాతయ్య ఆరోగ్యం విషమించి మరణించడం జరిగింది. కార్యక్రమాలు పూర్తయ్యాయి.. కొన్ని రోజుల తర్వాత రాణి బర్త్డే వచ్చింది. కొద్దిమంది బంధువులు వచ్చారు. కేక్ కటింగ్ పూర్తయి భోజనాలు చేయడం ప్రారంభించారు. బంధువుల్లో ఒకతను మాటలో మాటగా మాట్లాడుతూ, " ఇంకేముంది! కార్తిక్ కు, రాణి కి కొద్దిగా సంవత్సరాల తర్వాత పెళ్లి చేస్తే బాగుంటుంది. ఎంచక్కా అందరు కలిసి ఉండవచ్చు" అన్నాడు. 

దానికి మా అత్తయ్య, " ఏదో తల్లిదండ్రులు చనిపోతే మీలాంటి పెద్దలు అనాధగా బ్రతకలేడు అని అడుక్కుంటే మేమైతే, ఏమోలే అని ఒక ముద్ద వేస్తున్నాం. పెళ్లా..గిల్లా? " అన్నది.

 దానికతను, "అదేంటి? ఆస్తికి వారసుడు కార్తీక్ మాత్రమే కదా?"అనగా...

 దానికి, " వీళ్ళ నాన్న ఆస్తి వద్దనుకొని కదా వేరే కులం అమ్మాయితో వెళ్లిపోయాడు. వీళ్లు వెళ్లిపోతే మేము దాదాపు 14 సంవత్సరాలు పాటు ఈయన బాగోగులు చూసాం. ఆస్తిని పెంచాం. దీనిపైన మాకే హక్కు. ఎవరికీ లేదు" అని అత్త అనగానే...

 ఇక ఇంట్లో ఉండడం మంచిది కాదని అనిపించింది. మరుసటి రోజు మా అత్త, మామ ఉండగా "అత్తయ్య నేను హాస్టల్లో ఉండి చదువుకోవాలని అనుకుంటున్నాను" అని చెప్పాను.

 దానికి మా అత్తయ్య, "నీపై ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టం. నిన్ను రమ్మని మేము పిలవలేదు. నువ్వు వెళ్ళిపోతాను అంటే మేము ఆపము" అన్నది. మా మామయ్య కూడా మౌనంగా ఉన్నాడు. ఇంట్లో నుండి బయటకు వచ్చాను. ఎక్కడికి వెళ్లాలో అర్థం కావడం లేదు. ఊరంతా తిరిగాను. తిరిగి తిరిగి అబ్దుల్లా మెకానిక్ షాపుముందు వచ్చి కూర్చున్నాను. 

షాప్ లోని కూలీలు, ఓనరు అబ్దుల్లా భోజనానికి కూర్చున్నారు. నాకు చాలా ఆకలిగా ఉంది. సిగ్గు విడిచి పోయి అన్నం అడుక్కోవాలి అనిపించింది. కళ్ళలో నుండి నీరు వచ్చింది. నీళ్లు తుడుచుకొని వేరే వైపు చూశాను. సీతారాముల గుడి కనిపించింది. రాముని తదేకంగా చూశాను. ఎన్ని కష్టాలైనా పడ్డాడు కాని ధర్మం తప్పలేదు రాముడు. ఆకలి వల్ల చనిపోయినా పరవాలేదు కానీ ఎవరిని అడుక్కోకూడదు అని. ఆ క్షణమే నిశ్చయించుకున్నాను.

 ఒకసారి కళ్ళు మూసుకొని శ్రీరామచంద్రుని తలుచుకొని కనులు తెరవగానే ఎదురుగా అబ్దుల్లా ఉన్నాడు. 

"అరేయ్ కార్తీక్! మా నాన్న పిలుస్తున్నాడు రా" అని పిలిచాడు. నేను అబ్దుల్లా వెంబడి షాప్ లోనికి వెళ్లి నిలబడ్డాను. ఇబ్రహీం భోజనం చేస్తున్నాడు తలపైకి ఎత్తకుండానే, "కార్తీక్ కూర్చో! మాతో కలిసి భోజనం చెయ్. ఇంట్లో ఉండవలసిన నీవు ఇలా వీధిలో ఉన్నావంటే నేను అర్థం చేసుకోగలను. మళ్లీ మాట్లాడదాం "అన్నాడు. 

"సార్ నాకు షాప్ లో పని ఇవ్వండి "అనగా.... అప్పుడు ఇబ్రహీం, " నా కొడుకు ఎంతో.... నువ్వు కూడా అంతే. ఇద్దరూ కలిసి పనిచేసుకొండి. షాప్ లోనే పడుకోవడానికి తగిన ఏర్పాట్లు చేస్తాను" అనగానే సంతోషంతో భోజనం చేసి పనిలో చేరాను. 

పగలంతా షాప్ లో పనిచేసే సాయంత్రం నేను అబ్దుల్లా కలిసి ఊరంతా తిరిగే వాళ్ళం. అలా నెల రోజులు గడిచిపోయాయి. ఈ నెల రోజుల్లో నా గురించి మా అత్తగాని, మామ గాని రాలేదు. రాణి మాత్రం ఒక రెండు సార్లు వచ్చి నా బాగోగులు అడిగి వెళ్లింది. నాకోసం ఎవరూ రారు అనుకుంటున్నా రోజుల్లో మా గురువుగారైన గురునాథం మాస్టారు మెకానిక్ షాప్ కు వచ్చారు.