మిలియన్ డాలర్ ప్రశ్న...
ప్రేమించుకున్నాము అర్థం చేసుకున్నాము
మాది నిజమైన ప్రేమ
పవిత్ర ప్రేమ అని వంద మాటలు చెప్పే ఇప్పటి తరం
ఎప్పుడు విడిపోతారో ఎన్నాళ్లు కలిసి ఉంటారు
కూడా ఎందుకు చెప్పలేము
పెళ్లిదాకా కనీసం ఒకరినొకరు చూసుకోకుండా
కేవలం తల్లిదండ్రులు చెప్పారు అనే ఒక్క మాటతో
కష్టాల్లో నైనా నష్టాల్లోనైనా జీవితాంతం కలకాలం
తోడుండే అప్పటి తరానికి తేడా ఏంటి?????
తేడా ఒక్కటే...
బంధం పై ఉండే గౌరవం
ముఖ్యంగా ఈ గౌరవం భార్యాభర్తల్లో ఉంది.
విడిపోవడం అనే మాటని కనీసం ఆలోచనల్లో కూడా రానివ్వని
అప్పటి మనుషులు బంధానికి కట్టుకున్న వాళ్ళకి
ఎంతో గౌరవాన్ని ఇచ్చే మనసులు.
వాళ్ళు ఎన్నో ఏళ్ళు కలిసి ఉన్నారు అంటే దాని అర్థం
వాళ్ల మధ్య కష్టాలు నష్టాలు కోపాలు తాపాలు లేవని కాదు
ఏవి ఉన్నా కూడా వాటన్నింటినీ సమానంగా స్వీకరించారు
అందుకే కలకాలం కలిసి ఉన్నారు.
భార్యాభర్తల బంధమే కావచ్చు స్నేహితుల బంధమే కావచ్చు
ఇంకేదైనా కావచ్చు కలకాలం కలిసి ఉండాలి అంటే
ప్రేమ ఉండడం ఎంత ముఖ్యమో...
ఒకరి మీద ఒకరికి గౌరవం ఉండడం కూడా అంతే ముఖ్యం.
నా ఉద్దేశంలో అయితే
ప్రేమ కంటే గౌరవం ఉండడమే చాలా ముఖ్యం
ఎందుకంటే చాలామంది ఆడవాళ్ళకి తమ భర్త అంటే
ప్రేమ ఉన్నా లేకున్నా అపారమైన గౌరవం ఉంటుంది
అందుకే భర్త వల్ల ఎన్ని కష్టాలు పడుతున్న కూడా
విడిపోవాలి అని అనుకోరు.
ఆధునిక మార్గాలు ఆనందం వైపుకు వెళుతున్నాయా దుఃఖం వైపు వెళ్తున్నాయా?
సమాజం అభివృద్ధి వైపు వెళుతున్నాయా అర్థం కావడం లేదు
ఒకప్పుడు తప్పు ఒప్పు అని రెండు సమాజంలో ఉండేది కానీ
ఇప్పుడు ఏది కూడా తప్పుకాదు
అన్ని ఒప్పులే
ఎలా మాట్లాడిన తప్పుకాదు
ఎలా ప్రవర్తించిన తప్పుకాదు
ఎలాంటి వస్త్రాధారణ వేసుకున్న తప్పు కాదు
ఎలాగంటారా....
సీరియల్స్ లో స్త్రీ కి స్త్రీ నే శతృవు గా చూపిస్తారు. అక్కాచెళ్ళల్లు , ఆడపడుచులు వదినెలు ,
తోడుకోడళ్ళు , అత్తాకోడళ్ళు పరస్పరం కొట్లాడుకుంటారు. కుటుంబంలో ఏ ఇద్దరు స్త్రీలు సఖ్యతతో ఉండరు.
కానీ..
నిజ జీవితంలో మరి అంత దారుణంగా ఉంటారా అని అడిగితే అస్సలు ఉండరు
స్త్రీలను ఆభరణాల కోసం , సౌందర్యం కోసం ప్రాకులాడే వాళ్ళుగా చూపిస్తారు.
ఆడవాళ్ళంటే అందంగా ఉండితీరాలి.
కేవలం అందానికి ఆకర్షణకు సంబంధించిన వస్తువుగానే స్త్రీలను చూపిస్తున్నారు.
అశ్లీలత అర్థనగ్న దుస్తులు వేసుకోవడం
ఇప్పుడు సాంప్రదాయంగా మారింది
విదేశాలను ఆదర్శంగా తీసుకుంటూ
బంధాలను నాశనం చేసుకోవడం ఇప్పుడు చాలా కామన్ భారతీయ వివాహ వ్యవస్థకు ఉండే గౌరవం చాలా గొప్పది
ఆధునిక పోకడల కారణంగా అది పూర్తిగా నాశనం అయ్యింది
ఒకప్పుడు తప్పు అనే భయమే మనిషిని
మంచి జీవితంలో నడిపించేది
కానీ అసలు ఇప్పుడు తప్పే లేదు
మంచి చెడు రెండు సమాజంలో ఉండేవి
కానీ ఇప్పుడు మంచి చెడు అనేది లేకుండా అంతా ఏకం అయిపోయింది
ఏం చేసినా చెడుగా తప్పుగా అనిపించడం లేదు కనిపించడం లేదు
ఒకప్పుడు తప్పు ఒప్పు చెప్పే వ్యక్తులు ఉండేవారు సమాజంలో తప్పేంటి ఒప్పు ఏంటి తెలిసిన మనుషులు ఉండేవాళ్ళు
ఇప్పుడు మాకు అన్ని తెలుసు అనే పొగరు తప్ప
ఎవరికి ఏది తెలియదు
కాబట్టి ఇక్కడ ఏం చేసినా కరెక్టే
ఎలా ఉన్నా కరెక్టే
ఎలా మాట్లాడినా కరెక్ట్
ఎలాంటి బట్ట కట్టిన కరెక్టే
ఎవరితో ఎలా ప్రవర్తించినా కరెక్టే
ఎందుకంటే...అసలు తప్పు అనేది లేదు
ఇప్పుడు తప్పు ఒప్పు అనేవి ఏమీ లేవు
ఉన్నదల్లా ఒకటే మనకు నచ్చడం నచ్చకపోవడం
మనకు నచ్చితే ఒప్పు
నచ్చకపోతే తప్పు.... అంతే
తప్పుచేయడానికి తప్పించుకోడానికి చెప్పే మాట
మాత్రం ఒకటే...అంత సవ్యంగానే ఉంది
మీ బుద్ధి మార్చుకోవాలి అని
రిలేషన్షిప్ ఒక కారు అనుకుంటే
నమ్మకం ప్రేమ గౌరవం ఇష్టం నాలుగు చక్రాలు లాంటివి.
ఇంకా వాళ్లకి మనం ఇచ్చే టైము ఇంజన్ లాంటిది.
ఇక వీటిని అన్నింటికంటే అసలైంది డబ్బు
అది పెట్రోల్ లాంటిది.
అది లేకుండా బండి ముందుకు వెళ్ళదు
డబ్బులు లేకుండా ఏ బంధము ముందుకు వెళ్లలేదు.
డబ్బుకు బంధంతో పనిలేదు కానీ
బంధాన్ని కాపాడుకోవాలి కలకాలం నిలుపుకోవాలి అంటే
డబ్బు కచ్చితంగా కావాలి.
అయినా కలిసి ఉండడం కంటే విడిపోవడానికి
ఇష్టాన్ని చూపుతున్న రోజులు ఇవి
ఎందుకు విడిపోతున్నారో కూడా గ్రహించలేని ఆలోచించలేని మనసులు
విడిపోవడమే అన్ని సమస్యలకు పరిష్కారం అనుకునే
మనుషులు
కొన్ని బంధాలను ఏం చేసినా కూడా కాపాడుకోలేము.
కాపాడుకోలేని బంధాల చుట్టూ తిరిగి వెంపర్లాడడం నిజంగానే మూర్ఖత్వం ఎందుకంటే మనం ఎంత చేసిన కొన్ని బంధాలు కాపాడుకోలేము కలిసి ఉండాలి అనుకునే ఆలోచన చాలు ఎన్ని తప్పులునైనా కలిపి ఉంచతుంది విడిపోవాలి అనే ఒక చిన్న ఆలోచన వచ్చినా చాలు
అది మనుషుల్ని మనుషుల్ని విడదీస్తుంది సూదిమున దూరం ఎంత అప నమ్మకం అనుమానం చాలు మనుషుల్ని పూర్తిగా
విడతీయడానికి
ఈ కాలంలో అయితే బంధాన్ని కాపాడుకోవడానికి సంఘ కష్టమే ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఎలా పడిపోతారు ఎవరు చెప్పలేము కాలం విడదీయొచ్చు మనసులే విడదీయొచ్చు మనసులే విడదీయు లేదంటే ఆలోచన విడదీయొచ్చు నిజంగా కలకాలం కలిసి ఉండడం అనేది ఒక అద్భుతంగా మారింది.
బంధాన్ని కాపాడుకోవడానికి ప్రేమ వ్యామోహం శారీరక సుఖం కాలం ఇవేవీ కూడా పనికి రావడం లేదు ఎందుకు విడిపోతున్నారు కూడా తెలియని బంధాలు ఎన్నో.
సహృదయంతో ఆలోచిస్తే శారీరక సంబంధం కూడా ఒక బంధాన్ని కాపాడలేక పోతుంది అంటే పరిస్థితి ఎంతగా చేయి దాటుతుందో అర్థం చేసుకోవచ్చు ఈ ప్రేమ కూడా ఒక బంధాన్ని బట్టి ఉంచలేక పోతుంది ఏ సుఖం కూడా ఒక బంధాన్ని కలకాలం నిలిపి ఉంచలేక పోతుంది అంతటికి కారణం ఒకటే మనిషి మనసు ఆలోచన ఇది సక్రమంగా ఉన్నప్పుడు బంధం కలకాలం నిలిచి ఉంటుంది ఇది సరిగ్గా లేనప్పుడు ఆ బంధం బీటలు వాడుతుంది