Zombie Emperor - 16 in Telugu Horror Stories by Ravi chendra Sunnkari books and stories PDF | థ జాంబి ఎంపరర్ - 16

Featured Books
  • Devil's King or Queen - 13

    माही: मैं कहा जा रही हु में तो यही हु रानी राज को बता देती ह...

  • THE ULTIMATE SYSTEM - 5

    सुबह होते ही शिवा की आंखें खुलीं उसके शरीर में अलग ही ऊर्जा...

  • जादुई मुंदरी - 5

    और राजा की लड़की किसी तरह मुश्किल से जमीन से उठी और तोते के...

  • Vampire Pyar Ki Dahshat - Part 3

    अग्निवेश, जो अब एक खूबसूरत लेकिन खतरनाक वैंपायर बन चुका है,...

  • गुनाह

    गहरे सन्नाटे सी अंधेरी रात बस चारों तरफ झिंगुरों की आवाजें ह...

Categories
Share

థ జాంబి ఎంపరర్ - 16

అంతే! స్కెలిటన్ జాంబీ తన చేతుల్లోంచి కత్తులు లాంటి ఎముకలను విసరడం మొదలుపెట్టింది. పైన ఎగురుతూ ఉన్న డైనోసార్ జాంబీ వాటిని తప్పించుకుంటూ ఉన్నా, చివరికి రెండు మూడు కత్తుల లాంటి ఎముకలు వచ్చి తన రెక్కలకు బొక్కలు పెట్టడం మొదలుపెట్టాయి.జాంబీ జనరల్స్ యుద్ధం – మౌంటెన్ జాంబీ ఆధిపత్యం

ఇప్పుడు డైనోసార్ జాంబీ మళ్ళీ తన రెక్కలున్న బొక్కలను అతికించుకుంటూ యుద్ధం తను మొదలు పెట్టాలని అనుకుంటూ ఒక్కసారిగా కిందికి దిగి, చిన్న చిన్న మామూలుగా ఉన్న జాంబీలను తన రెక్కలకు అతికించుకొని పైకి ఎగరడం మొదలుపెట్టింది. గట్టి శబ్దంతో ఆ పిల్ల జాంబీలు స్కెలిటన్ జాంబీని ఢీకొట్టాయి. అంతే! ఎముకలు పొడిపొడిగా మారిపోయాయి, ఎముకలు చల్లాచెదురు అయిపోయాయి.

అప్పుడే ఓడిపోయింది అని అనుకున్న స్కెలిటన్ జాంబీ, మళ్ళీ తన శక్తులను పొందినట్టుగా ఒక్క నిమిషంలో రెడీ సెట్ అప్ అయ్యి, మళ్ళీ పోరాటానికి సిద్ధమైంది. ఎముకల మధ్యలో ఉండే ఏవో కనుగుడ్లు లాంటివి కనిపిస్తున్నాయి. వెంటనే వాటిని డైనోసార్ జాంబీ యొక్క మొహం మీద విసిరి కొట్టింది. అది దాని మొహం మీద ఉన్న పళ్ళు చిటపట చిటపట శబ్దాలతో కరుస్తూ ఉన్నా కూడా, తన రెక్కలతో పట్టుకొని ఫైట్ చేయడం మొదలుపెడుతుంది.

అలా వాళ్ళిద్దరూ యుద్ధం చేసుకుంటున్న సమయంలో, మౌంటెన్ జాంబీ ఒక పక్కన నిలబడి, చిన్న పిల్లాడిలా ఆసక్తిగా చూస్తూ ఉంది. తన టైం ఎప్పుడు వస్తుందో తెలియదు. దాని కళ్ళు ఇప్పుడు రెడ్ కలర్‌లో ఉన్నాయి – అంటే అది ఎప్పుడో అప్‌డేట్ అయిపోయిందని అర్థమవుతుంది. చుట్టూ ఉన్న జాంబీలను చూస్తే, కొన్ని తెలుపు రంగులో, అప్‌డేట్ అయినవి ఎరుపు కలర్‌లో ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ మౌంటెన్ జాంబీ ఎప్పుడో అప్‌డేట్ అయ్యి, కొత్త రూపాన్ని సంతరించుకొని, మూడో దశకు వెళ్ళడానికి సిద్ధమవుతుందని అర్థమవుతూ ఉండగా...

మౌంటెన్ జాంబీ యొక్క విధ్వంసం

యుద్ధం మధ్యలోనే వాళ్ళిద్దరూ, అంటే డైనోసార్ మరియు స్కెలిటన్ జాంబీలు ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ పక్కకి చూస్తారు. పక్కనే ఉన్న మౌంటెన్ జాంబీ వాళ్ళిద్దరినీ చూస్తూ ఒక్కసారిగా చిన్నపిల్లాడిలా ఉన్న మొహం దూరంగా మారిపోయి, ఇప్పుడు ఎర్రటి కళ్ళు కాస్త నల్లగా మారిపోయాయి! ఇక అది గట్టిగా గర్జిస్తూ ఉండగా డైనోసార్ జాంబీ పక్కకు వెళ్ళిపోయింది.

స్కెలిటన్ జాంబీ మాత్రం చాలా ధైర్యంగా, "యుద్ధానికి నువ్వు నాతో పోటీ పడతావా? నా వేగం ఉందా?" అని అంటూ అటూ ఇటూ పరిగెడుతూ, తన కాళ్ళను ఒక చక్రాల బండిగా (రోబోలలో చూపిస్తారు కదా, కాళ్ళకు రౌండ్‌గా తిరగడానికి టైర్స్ లాంటివి వస్తాయి కదా) మార్చుకుని, వాటితో స్పీడ్‌గా మౌంటెన్ జాంబీ చుట్టూ తిరగడం మొదలుపెడుతుంది. తన కాళ్ళకు ఉన్న ఎముకల లాంటి రౌండ్ టైర్స్ లాంటివి చిన్నగా కనిపిస్తూ వేగాన్ని అందుకుంటూ ఉంటే, మౌంటెన్ జాంబీ క్రూరంగా నవ్వుతూ తన అడుగు ముందుకు వేయగానే... అంతే! జాంబీ సైన్యం (ఈ సైన్యం, ఆ సైన్యం అంటూ తేడా లేకుండా) అన్నీ ఒక్క అడుగు వెనక్కి ఎగిరిపడ్డాయి! ఒక్క అడుగుకి ఇలా జరిగింది! అదే టైంలో, తన ఎదురుగా తిరుగుతూ ఉన్న స్కెలిటన్ జాంబీ యొక్క ఎముకలు ఊగడం మొదలుపెట్టాయి!

అంతటితో ఆగకుండా మరో అడుగు వేయగానే చెట్లు తునాతునకలైపోయాయి! మౌంటెన్ జాంబీ శరీరంలో నుంచి వస్తున్న ఊపిరి భయంకరంగా మారుతూ ఉండగా, వేడిగాలి పెడుతోంది. అంతే! ఆ ఎముకల జాంబీ (స్కెలిటన్ జాంబీ) రెండు మూడు అడుగులు వెనక్కి వెళ్ళిపోయింది. తను కూడా భయంకరంగా అరుస్తూ, చుట్టూ ఉన్న ఎముకలతో తన బాడీ స్ట్రక్చర్‌ను గట్టిగా మార్చుకుంది. చూస్తూ ఉంటే, మౌంటెన్ జాంబీ వెనక్కి తిరిగి పరిగెత్తడం మొదలుపెట్టింది. ఆ పరిగెత్తుకుంటూ వెళ్తుండగా, ఎముకల జాంబీలు మొత్తం తునాతునకలైపోయాయి! మామూలు జాంబీలు పారిపోవడం మొదలుపెట్టాయి. అసలు ఏం చేస్తుందో తనకే తెలియని పరిస్థితుల్లో ఉంది స్కెలిటన్ జాంబీ.

దూరంగా వెళుతున్న మౌంటెన్ జాంబీని క్రూరంగా చూస్తూ, ఎముకల జాంబీ తన శక్తులతో తన ఎముకలతో వాన లాంటివి విసరడం మొదలుపెట్టింది. అది చకచక వెళ్లి మౌంటెన్ జాంబీ యొక్క శరీరాన్ని తూర్పుపడటం మొదలుపెడుతుంది. కానీ ఆ పరుగు ఆగడం లేదు!

మౌంటెన్ జాంబీ యొక్క అంతిమ రూపాంతరం

మౌంటెన్ జాంబీ దూరంగా వెళ్లి తన చుట్టూ ఉన్న జాంబీలను మింగడం మొదలుపెట్టింది! ఇంకా గట్టిగా మింగడం మొదలుపెట్టింది. ఉన్న జాంబీలు బెదిరిపోతూ అరుస్తూ ఉన్నాయి. అప్పుడే అది ఆరు తలలతో, నాలుగు చేతులతో మరింత భయంకరంగా మారి, మిగతా జాంబీలను పూర్తిగా మింగడం మొదలుపెట్టింది!

ఒక 15 నిమిషాల తర్వాత, అంతా నిశ్శబ్దమైంది. కానీ చూస్తే, ఏదో మిషన్ గన్ లాంటి భారీ ఆకారం తయారైపోయింది. ఆకాశంలోకి తన ఆరు తలలను పైకి ఎత్తి నిలబడింది. అందరూ ఏం జరుగుతుందని అనుకున్న టైంలోనే, మిషన్ గన్ లాంటి ఆ కడుపులోంచి (లేదా శరీరంలోంచి) వచ్చిన బుల్లెట్ల లాగా ఆకాశంలోకి వెళ్లి, అడ్డము వచ్చిన జీవులను, జాంబీలను, ముఖ్యంగా స్కెలిటన్ జాంబీ యొక్క సైన్యాన్ని ముక్కలు చేయడం మొదలుపెట్టింది. అది కూడా మౌంటెన్ జాంబీ కడుపులో నుంచి వచ్చిన మిషన్ లాంటి బుల్లెట్లతో ఉన్న మామూలు జాంబీలు (మామూలు జాంబీలు కూడా మిషన్ గన్ బుల్లెట్లుగా మారాయి!)మౌంటెన్ జాంబీ ఆధిపత్యం - జాంబీ జనరల్స్ అంతం

ఇంతటితో ఆగని మౌంటెన్ జాంబీ తన రూపాంతరం నుంచి పూర్తిగా మళ్ళీ మామూలుగా మారిపోయి చుట్టూ చూస్తుంది. ఆ విధ్వంసానికి ఎముకలు చల్లాచెదురు అయిపోయిన స్కెలిటన్ జాంబీ, ఆకాశంలో బొక్కలు పడి ఎగరలేక మెల్లగా కిందికి వాలుతున్న డైనోసార్ జాంబీ, దూరంగా భయంతో నిలబడి ఉన్న సోల్ క్యాప్చర్ జాంబీ, అంతకంటే దూరంగా భయంతో వణుకుతూ ఉన్న రెడ్ నైట్ గాడ్ జాంబీ - అన్నీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఆ దెబ్బలకు వాటి శరీరాలు కనిపించకపోయినా దెబ్బలు మాత్రం గట్టిగా తగిలాయి.

అంతటితో ఆగకుండా మరోసారి యుద్ధానికి సిద్ధమయ్యాయి అన్ని. పూర్తిగా మళ్ళీ సెట్ అయిన తర్వాత మరోసారి యుద్ధానికి సిద్ధమవుతూ ఉండగా, అసలు ఛాన్స్ ఇవ్వని మౌంటెన్ జాంబీ తన చేతులను నాలుగుగా మార్చి, చుట్టూ ఉన్న మామూలు జాంబీలను మళ్ళీ పట్టుకోవడం మొదలుపెట్టింది. ఈసారి జాంబీలు అరవడం మొదలుపెట్టాయి, "వద్దు వద్దు" అన్నట్టుగా గిలగిలా కొట్టుకుంటూ ఉన్నా, మౌంటెన్ జాంబీ అస్సలు పట్టించుకోకుండా, తన చేతిలోకి వందల కొద్దీ జాంబీలను రౌండ్‌గా బాల్ లాగా సృష్టించి, నాలుగు చేతులతో నాలుగు అటాక్‌లు చేయాలని సిద్ధమైంది.

మౌంటెన్ జాంబీ ఇప్పుడు స్కెలిటన్ జాంబీ అలాగే డైనోసార్ జాంబీని గురి చూసి కొట్టడానికి రెడీ అవుతుంది. దాని కళ్ళు ఇప్పుడు రౌండ్‌గా ఫుట్‌బాల్ అంత పెద్ద బాల్స్ లా మారి చుట్టూ గమనించడం మొదలుపెట్టాయి.

పైకి ఎగరడం మొదలుపెట్టింది డైనోసార్ జాంబీ ఎలాగైనా తప్పించుకోవాలని. స్కెలిటన్ జాంబీ అయితే పెద్దగా భయపడలేదు, ఎందుకంటే తనకు తెలుసు తను ఎప్పటికీ చచ్చిపోదని. కానీ బాధాకరమైన భాగం ఏంటంటే, తను చనిపోయిన ప్రతిసారి తన పవర్ తగ్గుతూ వస్తుంది. ఆసక్తి ఉన్న తన శక్తుల పట్ల తనకు నమ్మకాల్లేవు, ఎందుకంటే ఇప్పుడు తన శక్తులు పూర్తిగా అంతరించిపోయినట్టుగా కేవలం ఇప్పుడు కత్తులు, బాణాలు మాత్రమే వస్తున్నాయి. ఇంకా ఎటువంటి టెక్నిక్‌లు ఉపయోగించాలో తనకు సరిపోవడం లేదు, వేగం తగ్గిపోయింది.

ఇక లాస్ట్ వన్ ఫైనల్ వార్నింగ్ అంటూ మౌంటెన్ జాంబీ తన చూపులతోనే అందరికీ భయం పెట్టింది. మిగతా జాంబీలు అన్నీ కళ్ళెర్ర చేశాయి (భయంతో). కానీ ఈ రెండు జాంబీలు (స్కెలిటన్, డైనోసార్) మాత్రం అస్సలు తగ్గడం లేదు. మౌంటెన్ జాంబీ ఇంకా క్రూరంగా నవ్వుతూ తన చేతిలో ఉన్న జాంబీ బాల్స్‌ని గిరగిరా తిప్పడం మొదలుపెట్టింది.

డైనోసార్ జాంబీ మరియు స్కెలిటన్ జాంబీల ఓటమి

డైనోసార్ జాంబీ గాల్లోని అటూ ఇటూ తిరుగుతూ తన వేగాన్ని పెంచుకుంటూ, తగ్గించుకుంటూ ఉండగా, మౌంటెన్ జాంబీ ఒకే ఒక్కసారి ఒక జాంబీ బాల్‌తో డైనోసార్ జాంబీని దూరంగా ఎగరకొట్టింది. అది కింద పడిన వెంటనే తన తల నుంచి రక్తం రావడం మొదలుపెడుతుంది. అది అలా కింద పడిపోయింది, పూర్తిగా ఓడిపోయింది.

ఇక చెప్పాలంటే, మిగతా మూడు బాల్స్ కూడా డైరెక్ట్‌గా వెళ్లి స్కెలిటన్ జాంబీని లక్ష్యంగా చేసుకున్నాయి. మొదటిగా ఒక బాల్ తగులుతుంది, కానీ అది ఎముకల జాంబీ యొక్క కత్తితో ఆ బాల్స్‌ని రెండు ముక్కలుగా చేస్తుంది. ఆ వెంటనే ఇంకొకటి రావడంతో అది తగిలి కింద పడుతుంది. తను లేచి లోపే మరో బాల్ తగిలింది. అంతే! ఇక ధ్వంసం అయిపోయింది స్కెలిటన్ జాంబీ!సుమంత్ పరివర్తన - జాంబీల విజయం - షాడోకాన్ జాంబీ ప్రవేశం

అంతే, ఒక గంట సేపటికి అందరూ కళ్ళు తెర్చుకున్నారు. అప్పటిదాకా ప్రజలు దాక్కున్న గుడి నాశనం అయిపోయింది! అక్కడ అప్పటికి లేచి నిలిచి ఉన్న జాంబీలు "రక్తం, ఆకలి, మాంసం" అనే మూడు కోరికలతో మృగాల్లా అరుస్తూ ఉండగా, మానవ వాసన గాలిలో ఒక గంధం వాసన లాగా తగిలింది. మనుషులకు ఆహారం ఎలాగో, ఆ వాసన తగలగానే జాంబీలు డైరెక్ట్‌గా గుడి వైపు చూశాయి. ప్రజలు ఉలిక్కిపడ్డారు.

మళ్ళీ పోయిన శక్తిని తెచ్చుకొని ముందుకు వెళ్తున్నాడు సుమంత్. అతని వేగం హఠాత్తుగా పెరిగిపోయింది. ఆ గుడి దగ్గరికి వస్తున్న జాంబీలను ఒక్క తోపుతో నరుకుతూ ఉన్నాడు. తన గోర్లు పెద్దగా మారాయి! అది చూస్తూ ఉన్న మీనాక్షి, అక్షర అయితే బిత్తరపోయారు, "అసలు ఏం జరుగుతుంది వీడికి?" అని అనుకుంటూ ఉన్నారు.

మౌంటెన్ జాంబీ ఆధిపత్యం - విధేయత

కానీ అక్కడ మౌంటెన్ జాంబీ యొక్క విధ్వంసం ఆగడం లేదు. అందరూ తలలు వంచారు. ఇక చివరికి డైనోసార్ జాంబీ తను తలవంచుతూ, "నేను ఎయిర్ ఫైట్ జనరల్‌గా ఉండిపోతాను" అని వాగ్దానం ఇచ్చింది. తను పూర్తిగా మౌంటెన్ జాంబీ ఆధిపత్యంలోనే ఉంటానని, స్కెలిటన్ జాంబీ తాను భూమి మీద జాంబీ జనరల్‌గా ఉండిపోతానని చెబుతుంది.

మౌంటెన్ జాంబీ ఆదిత్యకు ఎంతో నమ్మకమైన స్నేహితుడు, మిత్రుడు. ఇప్పుడు అతడు రాజు కంటే పెద్ద స్థాయిలో లేకపోయినా, అక్కడున్న ప్రతి జాంబీకి నాయకుడిగా మారిపోయాడు. అలాంటిది ఈ మౌంటెన్ జాంబీ యొక్క కథ, అతని నాయకత్వం ఎలా ఉంటుందో ముందు ముందు తెలుస్తుంది. వాడికి (మౌంటెన్ జాంబీకి) తన మనసులో ఇలాంటి భావన ఉంటుంది: "రాజుకి ఎంతో విధేయుడు. ఏది చెప్పినా చేస్తాడు." మనుషులకు కుక్కపిల్ల ఎలాగో, ఆదిత్యకు ఈ మౌంటెన్ జాంబీ అలాంటిదిగా మారిపోయి ఉంది.

షాడోకాన్ జాంబీ మరియు సుమంత్ అంతిమ పరివర్తన

అప్పుడే సుమంత్ చేసిన విధ్వంసాన్ని చూస్తూ ఉన్న స్కెలిటన్ జాంబీ ముందుకు వెళుతూ ఉంటే, దూరం నుంచి ఏదో కదులుతున్నట్టు కనిపిస్తుంది. అది నేలలో పాకుతూ గుడి వైపు నుంచి మెల్లగా సుమంత్ కాళ్ళ వైపు వస్తుంది. అది సుమంత్ యొక్క కాలును పట్టుకుని విసిరి కొట్టింది. అతడు ఎగిరిపడగానే నీడలో కనిపిస్తుంది. అప్పుడే కనిపిస్తుంది షాడోకాన్ జాంబీ! ఇది నీడలో ఉండే అటాక్ చేసే జాంబీ. నీడలో మాత్రమే ఉంటుంది. బయటికి వస్తుంది కానీ అటాక్ చేయదు. నీడను పట్టుకొని మరో జాంబీగా మార్చగలదు! అదే నీడతో ఇతరులను చంపగలదు!

అలా పైకి ఎగిరే సుమంత్‌ను గమనించిన మౌంటెన్ జాంబీ, ఒక్క తోపుతో తన పంచుతూ సుమంత్‌ను ఎగిరిపడేలా చేస్తుంది. గాల్లో ఉన్న డైనోసార్ జాంబీ సుమంత్‌ను పట్టుకొని గిరగిరా తిప్పుతూ నేలకేసి కొడుతుంది. అప్పుడు వస్తుంది స్కెలిటన్ జాంబీ. స్కెలిటన్ జాంబీని వీరందరికీ ఆదేశం ఇచ్చింది (సుమంత్‌ను కింద పడేలా చేయమని).

సుమంత్ కింద పడగానే అతని రక్తం కక్కుకుంటాడు. అతని శరీరం రక్తం కోల్పోగానే అతని జుట్టు చెదిరిపోతుంది, బోడి గుండుగా తయారవుతాడు! చర్మం లావుగా అవుతుంది, బట్టలు చినిగిపోతాయి. అతని గోర్లు మరింత రక్షకంగా మారిపోతాయి. అతని కళ్ళు ఇప్పుడు ఎర్రగా మారిపోయాయి. అతని కళ్ళు మామూలు మనుషులను ఒక రకంగా చూస్తున్నాయి – అంటే ప్రాణం ఉన్న వాళ్ళకు వేడి ఎలా ఉంటుందో, చనిపోయిన వాళ్ళకు చలితనం (కూలింగ్) ఎలా ఉంటుందో, అలాంటి ప్రక్రియలు ఇప్పుడు సుమంత్ చూస్తూ ఉన్నాడు.

ఇతను పూర్తిగా రక్త పిశాచిలా మారిపోయాడు! అతనికి ఇప్పుడు తన శరీరం తన అదుపులో లేదు. అతనికి మైండ్‌లో "రక్తం కావాలి" అని ఒక్క మొండి ఆలోచన.

సుమంత్ - జాంబీ హైబ్రిడ్ ఆవిర్భావం మరియు మిషన్

సుమంత్, తనలోని శక్తితో, స్కెలిటన్ జాంబీ కాలును పట్టుకుని విసిరి కొడుతున్నాడు! అలాగే స్కెలిటన్ జాంబీ కూడా సుమంత్ యొక్క చేతులను పట్టుకొని గిరగిరా తిరుగుతున్నాడు. గాల్లో ఉన్న డైనోసార్ జాంబీ ఈ హఠాత్ పరిణామానికి ఒక్క నిమిషం గల్లంతయ్యి, మళ్ళీ సుమంత్ యొక్క కాళ్ళు పట్టుకొని తను కూడా గాల్లోకి విసిరి కొట్టింది. ఆ దెబ్బకు సుమంత్ జాంబీ జనరల్ (స్కెలిటన్ జాంబీ) చేతులు వదిలేశాడు. వెంటనే స్కెలిటన్ జాంబీ నేల మీద నిలబడింది.

గాల్లో విసిరి కొట్టగానే సుమంత్ మళ్ళీ వెళ్లి గుడి ముందు నిలబడ్డాడు. తన ముందు వస్తున్న జాంబీ సైన్యాన్ని చూస్తూ దూరంగా నవ్వుతూ ముందుకు వెళుతున్నాడు. ఎక్కడినుంచి దొరికిందో తెలియదు కానీ ఒక ఖడ్గం ప్రత్యక్షమైంది. కానీ వాటిలో (ఖడ్గంలో) రక్తం లేదు, మాంసం మాత్రమే ఉంది.

ఇది అతని లాస్ట్ చాన్స్! అతనికి రక్తం దొరకకపోతే అతని శరీరం పేలి చనిపోతాడు. దొరికితే మామూలు అవుతాడు, కానీ జీవితాంతం అలాగే ఉండాలి.

ఫ్లాష్‌బ్యాక్ / వివరణ:

"ఇది ఎలా జరిగింది?" అని ఒక్క స్లిప్ వేస్తే, ఒక స్క్రీన్ కనిపించినట్టుగా... ఆదిత్య ఒక జాంబీగా మారిన ఆత్మ, అతని శరీరం నుంచి వచ్చిన ఈ చిన్న కుర్రవాడు (సుమంత్) జాంబీలలోని శక్తిని పొందినాడు. అతడు చనిపోలేదు, అలాగని బ్రతికి ఉన్నాడు! కానీ జాంబీ ఎటాక్‌తో పవర్స్ వచ్చాయి, కానీ అతను జాంబీ కాలేదు. అందుకే అతను రక్త పిశాచిలా మారిపోయాడు