జాంబీ జనరల్స్ యుద్ధం - ఆదిత్య పునరాగమనం
సుమంత్ కింద పడే పెట్టడానికి ముందే, మౌంటెన్ జాంబీ ఒక్క తొక్కతో అతనిని భూమిలోకి పంపించేస్తుంది. అంత లావు శరీరాన్ని కూడా ఒక రక్తపిశాచి శరీరాన్ని భూమిలోకి తొక్కడమంటే మామూలు విషయం కాదు! అలా పడిపోగానే జాంబీలు గుడి వైపు వెళ్తున్నాయి. సుమంత్ చేతిలోంచి పడిపోయిన ఖడ్గం దూరంగా వెళ్లి పడింది. మళ్ళీ స్కెలిటన్ జాంబీ వచ్చి అతని మీద కాలు పెట్టి విచిత్రంగా నవ్వుతూ, "నేనే గెలిచాను! మేమే గెలిచాము!" అని ఒక విచిత్రమైన నవ్వును చూపిస్తూ తన విజయాన్ని చాటుకుంటూ ఉంది.
ఇంతలో "ఎవరికీ తెలియని ముప్పు వచ్చేసాం రా బుల్లోడా" అంటూ ఎవరో ఆకాశం నుంచి వస్తున్నారు! ఒక బ్లాక్ కలర్ టెలిపోర్టర్ లాంటిది వస్తుంది.
మానవత్వం యొక్క ఆశ - ఆదిత్య ఆత్మ పునరుజ్జీవనం
అక్కడ కట్ చేస్తే... ఎప్పుడైతే సుమంత్ కింద పడిపోతాడో, అక్షర మరియు మీనాక్షి ఇద్దరూ కళ్ళు తిరిగి పడిపోతారు. మరో పక్క చూపిస్తే, ఇదంతా చూస్తున్న నందవర్ధన్, "నన్ను క్షమించండి గురువుగారు! నా అజ్ఞానం వల్ల ఇప్పుడు భూమి అంతా ధ్వంసం అయిపోతుంది. నేను ఇప్పుడు ఏం చేయమంటారు? మీరు ఏం చెప్పినా చేస్తాను. ఇప్పుడు కంట్రోల్ తప్పిన ఆ జాంబీలను ఎవరు కంట్రోల్ చేయగలరు?" అని అడుగుతుంటే... సిద్ధార్థ మహర్షి చిన్నగా నవ్వుతూ, "నీ తప్పు తెలిసింది కానీ ఇప్పుడు లాభం లేనట్టుగా ఉంది" అని అంటూ ఆదిత్య ఉన్న బాటిల్ వైపు చూస్తాడు.
ఆదిత్య ఆత్మ నీరసంగా పడిపోయింది. అతని ఎర్రటి రంగు తగ్గుతూ ఉంది. "ఇప్పుడు ఏమీ కాలేదు. కేవలం నీ రక్తం, నా రక్తం కలిపి ఆదిత్యకు పట్టించాలి" అని అంటాడు. "ఏమన్నా చిన్న పిల్లాడు అని అనుకుంటున్నారా? పాలు తాపినట్టుగా దీనికి రక్తం పోయాలా?" అని నందవర్ధన్ అడుగుతాడు. సిద్ధార్థ మహర్షి చిన్నగా నవ్వుతూ, "మనం చేసిన తప్పుకు ఈ మాత్రం చేయాలి" అని అంటూ తన చేతిని కోసుకున్నాడు. ఆ రక్తంలోకి విడవడం మొదలుపెట్టాడు.
అదే టైంలో, మహాకాళికి పూజ చేస్తున్న వివేక్ మహర్షి పూజ పూర్తయినట్టుగా, ఒక్క దెబ్బలో ఒక మేక తల నరికి రక్తాన్ని కాళీమాతకు అర్పించాడు. ఆ రక్తం తాగిన (అంటే సిద్ధార్థ మహర్షి రక్తం అందుకున్న) ఆదిత్య ఆత్మ కొంచెం లేచి నిలబడింది. నందవర్ధన్ కూడా తన రక్తాన్ని పోయడంతో అతని (ఆదిత్య) ఆత్మకు అంతులేని శక్తి వస్తుంది. వెంటనే బాటిల్ పగలగొట్టుకొని బయలుదేరుతాడు. అదే టైంలో, మహాకాళి విగ్రహం దగ్గర నుంచి పులి గర్జన వినిపిస్తుంది. అంతేకాక త్రిశూలం పైకి లేస్తుంది. ఆ దెబ్బకు అక్కడున్న ముగ్గురు (సిద్ధార్థ మహర్షి, వివేక్ మహర్షి, నందవర్ధన్) స్పృహ తప్పి పడిపోతారు.
డిమాన్ రవి ప్రవేశం - జాంబీ జనరల్స్ అంతం
అక్కడ అలా కట్ చేస్తే... సుమంత్ చేతిలో నుంచి పడిపోయిన ఖడ్గం బంగారు రంగులో వెలుగుతూ ఆకాశంలోకి వెళ్తుంది. అప్పుడే ఆకాశంలో నుంచి ఒక వ్యక్తి దిగి పక్కన ఉంటాడు. తన వెనకాలే ఎవరో మాయం అవుతూ తేలుతూ, గాల్లో ఎగురుతూ, వచ్చిన ఖడ్గాన్ని చేతిలోకి తీసుకుంటాడు. "నా పేరే డిమాన్ రవి" అని అంటూ ఒక్కసారిగా ఎముకల జాంబీని (స్కెలిటన్ జాంబీ) ఒకే ఒక్క కోతతో రెండు ముక్కలు చేసి పక్కన పడేస్తాడు!
అలా స్కెలిటన్ జాంబీని నరుకగానే, పైనుంచి వస్తున్న డైనోసార్ జాంబీని చూస్తూ, "నేను నీకంటే పెద్ద డిమాన్" అని అంటూ తన చేతిలో ఉన్న ఖడ్గాన్ని ఒక్క తోపులో ఆ డైనోసార్ జాంబీ తల నరికి పక్కన పడేస్తాడు. అప్పుడే పక్కన ఉన్న ఇంకో అబ్బాయి, అతని పేరు చంద్ర, అతను వచ్చి, "వీడేనా ఆ వ్యక్తి?" అని అంటూ భూమిలో కుంగిపోయిన సుమంత్‌ను చూస్తాడు. చంద్ర తన జేబులో నుంచి రెండు లిక్విడ్‌లు తీశాడు. అది ఏదో కాదు, రక్తం! ఆ రక్తాన్ని సుమంత్‌కు పోసి పక్కన కూర్చోబెట్టాడు.
యుద్ధం కొనసాగుతుంది అనుకునే లోపే, ఎవరో వచ్చి కొట్టడానికి ట్రై చేస్తున్నారు రవిని. వెంటనే రవి ఒక్క అడుగు వెనక్కి వేశాడు. ఒక పెద్ద చేతి ఆకారం మిస్ అయిపోయింది. ఆ చేతికి రవి చేతిలో ఉన్న ఖడ్గానికి అసలు సరిపోయేలా కనిపించడం లేదు. మరో వేటు వెయ్యాలి అని మౌంటెన్ జాంబీ వస్తూ ఉండగా ఏదో శబ్దం!
ఆదిత్య జాంబీ ఎంపరర్ గా పునరాగమనం - జాంబీలను తన నియంత్రణలోకి తీసుకోవడం
అక్కడ కట్ చేస్తే... ఆదిత్య ఆత్మ గాలిలో ఎగురుతూ తన ఎర్రటి ఆరాను ప్రపంచమంతా చిందిస్తూ ఉంటే, కొత్తగా మారిన జాంబీలు తలలు పట్టుకుని కింద పడిపోతాయి. పాత జాంబీలు ఏదో శబ్దం వచ్చినట్టు పైకి ఎగిరి చూసి ఆదిత్య వెనకాలే పరిగెత్తడం మొదలుపెట్టాయి. అడ్డువచ్చిన భవనాలు కూలిపోతున్నాయి, చెట్లు కుంగిపోతున్నాయి. గాలి వేగం పెరిగింది. ఆ గాలి కూడా ఎర్రటి ఆరాతో మెరిసిపోతూ ఒక చోటికి చేరుతుంది.
అంతకంటే ముందు బయలుదేరింది కాళీమాత విగ్రహం దగ్గర నుంచి! దానికంటే ముందు ఒక త్రిశూలం ఎక్కడికో వెళ్లి నిలబడింది. ఆ పులి ఒక చోటికి వెళ్ళింది. అది ఏదో కాదు, గుడి ఉన్న ప్రదేశం! అక్కడ ఒక బ్లాక్ హోల్ లాంటిది సృష్టించబడింది. త్రిశూలం దానిలోకి ప్రవేశించింది. కొద్దిసేపటికి అక్కడికి వచ్చిన ఆదిత్య, వాళ్ళందరినీ చూస్తూ ఏదో మాట్లాడుతున్నాడు.
ఆదిత్యను చూసిన వెంటనే మౌంటెన్ జాంబీ తన తల మీద ఒక చిన్న సింహాసనం లాంటిది సృష్టించింది. ఆదిత్య ఆత్మ అక్కడికి వచ్చి ఆ సింహాసనంలో కూర్చొని తన సైన్యానికి ఏదో చెబుతున్నాడు. అది చెప్పిన అది విన్న తర్వాత జాంబీ సైన్యం ఒక్కొక్కటిగా ఆ బ్లాక్ హోల్‌లోకి వెళ్తున్నాది.
సుమంత్‌తో ఆదిత్య చివరి క్షణాలు - అదృశ్యం
అందరూ వెళ్ళిన తర్వాత, తన కొడుకు యొక్క మొహం చూశాడు ఆదిత్య. సుమంత్ వైపు చూశాడు. సుమంత్ నీరసంగా ఉన్నా చాలా శక్తివంతంగా ఉన్నాడు. ఒక్క అడుగు కిందికి వేసి దిగి తన కొడుకు దగ్గరికి వెళ్ళాడు. కొడుకును తాకాలనుకున్నాడు కానీ తాకలేకపోతున్నాడు. అతని కళ్ళలోంచి నీళ్లు కారుతూ, పక్కనే ఉన్న మీనాక్షిని చూస్తాడు. మీనాక్షి నుదుటిపైన ఉన్న అర్థ చంద్రకారపు బొట్టు మీద చూస్తూ, "నీ వల్లే నేను ఇలాగైనా ఉన్నాను. నీ ప్రేమ చాలా గొప్పది భార్యామణి" అని చిన్నగా నవ్వుతూ కళ్ళల్లో నీళ్లు తుడుచుకుంటూ తన కొడుకు వైపు చూస్తాడు.
తన కొడుకు సుమంత్ బాధగా, "నాన్నా! ఇన్నాళ్ళకు నన్ను కరుణించావా? ఇప్పటికైనా వచ్చావు!" అని అంటూ గట్టిగా అతుక్కుపోతే కింద పడినంత పని చేశాడు, ఎందుకంటే అక్కడ ఉన్నది ఆదిత్య ఆత్మ మాత్రమే. అప్పుడే బ్లాక్ హోల్‌లోకి వెళ్లి ఏదో చేసి వచ్చిన త్రిశూలం ఒక్కసారి ఆదిత్య శరీరంలోకి వెళ్ళిపోతుంది! అది అతనికి శరీరాన్ని ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. వెంటనే కొడుకును గట్టిగా హత్తుకుంటూ, "నన్ను క్షమించు రా! నిన్ను నేను చేరుకోలేకపోయాను. ఇదంతా మానవుల తప్పిదమే. వీళ్ళ కోసం నువ్వు ఎప్పుడూ పోటీ పడకు. ఇప్పుడు కూడా కాళీమాత నాకు ఆజ్ఞ ఇచ్చింది కాబట్టి వెళ్ళిపోతున్నాను. మీరు జాగ్రత్త!" అని అంటూ ఉన్నాడు. "ఇంకొక చిన్న విషయం, ఈసారి నీకు పెళ్లి అయిన తర్వాత నీకు నేను కొడుకులా పుట్టి నా ప్రేమను నేను మళ్ళీ దక్కించుకుంటాను" అని చిన్నగా ముద్దు పెట్టుకోగానే మళ్ళీ అతనిలో నుంచి త్రిశూలం బయటికి వెళ్ళిపోతుంది. అతను తన భార్య వైపు చూస్తూ, "నిన్ను చివరిసారిగా చూశాను, నన్ను నువ్వు చివరిసారిగా కూడా చూడలేకపోయావు" అని అంటూ లోపలికి వెళ్ళిపోతాడు – మౌంటెన్ జాంబీ తలపై ఎక్కి!
మాయా, రవి, చంద్ర - గవర్నమెంట్ ప్లాన్ - సీజన్ 2 ఆరంభం
అప్పుడే అదంతా దూరంగా నిలబడి చూస్తున్న మాయాను, నీలిరంగు ఆరాలో చూస్తూ ఉన్నాడు రవి. "ఏంట్రా ఇది! ఇంత అందంగా ఉంది. దీని కళ్ళు చూస్తుంటే నాకు కళ్ళు తాగిన కోతి పిల్లలా గంతులు వేయాలి అనిపిస్తుంది" అని అనుకుంటూ చిన్నగా మాయా దగ్గరికి వెళ్లి, "హలో మేడం! మీ పేరు?" అని అడుగుతాడు. "నా పేరు మాయా" అని తను సిగ్గుపడుతూ, మొదటిసారిగా ఒక అబ్బాయిని తన మొహంలోకి లాగిలేకపోయానని బాధ, మరియు తనను కూడా ఒక వ్యక్తి ఇంత బాగా చూసుకుంటాడా అని ప్రేమ – రెండు కలబోసిన మాటలతో మెల్లగా మాట్లాడుతుంటే... ఆదిత్య గొంతు గట్టిగా వినిపిస్తుంది! "మాయా! ఇది ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు. భవిష్యత్తులో కలుసుకుంటే చూద్దాం!" అని అనడంతో మాయా బాధగా, "సరే రవి, నేను మళ్ళీ వస్తాను" అని అంటూ లోపలికి వెళ్ళిపోతుంది.
సీజన్ ముగింపు - నల్లటి ఆత్మ తిరిగి రాక
అలా కట్ చేస్తే, కొన్ని రోజుల తర్వాత గవర్నమెంట్ ఇదంతా సద్దుమణిగింది అని అనుకున్న తర్వాత, కాపాడిన ప్రజలను విడుదల చేసింది. వాళ్ళందరూ పెద్దగా యువకులే. గవర్నమెంట్ ఒక చిన్న పథకం వేసింది: "ఈ ప్రపంచంలో ఇప్పుడు పెద్దగా మానవ జనాభా లేదు. దాన్ని పెంచాలంటే యువకులే ఒక పెద్ద మానవ అస్త్రాలు. ఆ అస్త్రాలను మనం యూజ్ చేసుకోవాలి" అని గవర్నమెంట్ చెప్పింది. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజలు ఓట్లు వేస్తే కనీసం ఎవరు గెలుస్తారో చెప్పడం కూడా కష్టం. ఇదంతా రాజకీయ కుట్రలా మారిపోయింది. ప్రజలందరికీ ఇలా అంటూ, "చూడండి! మీకు ఎవరికీ పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళకు మేము పెళ్లి చేస్తాం. మీ కుటుంబం ఒప్పుకోకపోయినా మేము మీకు సపరేట్ ఇల్లు వెళ్లాయి ఇచ్చి చేస్తాం."
ఇదంతా వింటూ ఉన్న చంద్ర, అలాగే రవి, అక్షర, ఇంకా సుమంత్ – వీళ్ళందరూ గట్టిగా నవ్వుకుంటున్నారు. "ఇదేంట్రా ఇది! గవర్నమెంట్ ఇలా కూడా చేస్తుందా? ఇది తెలిస్తే చచ్చినోళ్ళు కూడా లేసి వచ్చి పెళ్లి చేసుకుంటామని అంటారేమో!" అని పగలబడి నవ్వడం మొదలుపెట్టారు.
అలా కట్ చేస్తూ ఇప్పుడు రవి, "నేను వెళ్తున్నాను. భవిష్యత్తులో నన్ను ముంబైలో వెతుకు, కనిపిస్తాను. కచ్చితంగా కనిపిస్తాను. నేను కనిపించేసరికి నువ్వు మరింత బలంగా తయారవు. నీలాంటి వాళ్ళను సేకరించు" అని అంటూ తను ఒక బ్లాక్ హోల్ లాంటిది సృష్టించి (అది టెలిపోర్టల్), అందులోకి చంద్ర మరియు రవి ఇద్దరు వెళ్లిపోతారు.
అప్పుడు అక్కడ సీన్ కట్ చేసి మరో దృశ్యం చూపిస్తారు: అక్కడ కొంతమంది అబ్బాయిలు, అమ్మాయిలు అక్కడికే వెళ్తున్నారు. ఎందుకో తెలియదు. అక్కడికి వెళ్ళిన వెంటనే కొన్ని స్వర చేప లాంటివి వాళ్ళ మీద దాడి చేసి చంపడం మొదలుపెట్టాయి. మళ్ళీ ఆరంభం అయ్యింది! నల్లటి ఆత్మ పైకి లేచింది! "జాంబీ ఎంపరర్ సీజన్ 2" అని పడడంతో కొన్ని డైమండ్లు ఇంకా కొన్ని డిమన్స్ ఫొటోస్ చూపిస్తున్న సీన్ కట్ అవుతూ స్టోరీ పూర్తి అవుతుంది.