The Zombie Emperor - 6 in Telugu Horror Stories by Ravi chendra Sunnkari books and stories PDF | థ జాంబి ఎంపరర్ - 6

Featured Books
Categories
Share

థ జాంబి ఎంపరర్ - 6

ఆదిత్య :"నా కుటుంబం బతికి ఉందని చెప్పావు, సంతోషం! కానీ నీ జీవిత చరిత్ర ఏంటో నీ కుటుంబానికి తెలియాలి కదా? నువ్వు ఏం చేశావో వాళ్ళకు తెలియాలి కదా?" అని ఆదిత్య అంటూ ఉండగా, వర్మ తన కర్రలో నుంచి ఒక కత్తి లాంటిది బయటకు తీస్తాడు. "చూడు! నువ్వు ఒక్క అడుగు ముందు వేసావంటే, ఈసారి ఈ శరీరం లేకుండా చేస్తా!" అని భయపెడుతున్నాడు ద జాంబి ఎంపరర్ (The Zombie Emperor)

వర్మ ప్యాలెస్ – ప్రస్తుత సమయం (కొనసాగింపు)

ఆదిత్య గిలగిల నవ్వుతూ, "ఏంటి? నువ్వు నా శరీరాన్ని నాశనం చేయగలవా? అవునా? అంత సత్తా ఉందా నీలో, ముసలి కుక్కా?" అని అంటూ రెండు అడుగులు వెనక్కి వేసి, తన వెనకాల ఉన్న పీఏ ప్రభాకర్‌ను చూస్తూ, "ఇప్పుడు వేటాడు చూద్దాం!" అని అన్నాడు.

ప్రభాకర్‌ను చూసి, వర్మ "వీడు కూడా నీలాగే మారిపోయాడా? అయినా ఎవరినీ వదిలిపెట్టను!" అని రెండు మూడు సార్లు ప్రభాకర్ శరీరంలో కత్తిని దూరుస్తాడు. పొడుస్తాడు. కానీ ప్రభాకర్‌కు ఎటువంటి నొప్పి, బాధ ఉన్నట్టు కనిపించడం లేదు. కత్తి తీసిన వెంటనే శరీరం మళ్ళీ మామూలుగా అవుతూ ప్రభాకర్ గట్టి దెబ్బతో వర్మను కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉండగా, ఆదిత్య ఒక అడుగు ముందుకు వేసి, చూపుతోనే ప్రభాకర్‌ను కంట్రోల్ చేస్తూ వెనక్కి పొమ్మని చెప్తాడు.

ఇక ఆదిత్య రంగంలోకి దిగి, "వాడినే చంపలేకపోయావ్ అలాంటిది నన్ను చంపుతావా?" అని వర్మ గొంతు పట్టుకొని పైకి లేపుతాడు. వర్మ గట్టిగా ఊపిరి తీసుకుంటున్నాడు. ఆదిత్యకు అది ఆనందంగా అనిపిస్తుంది. "ఓకే! ఇప్పుడు నా కథ చెబుతా విను!" అని స్టార్ట్ చేసేటప్పుడు ఒక పక్కకు తిరిగి, "నన్ను ఆపగలదు అనుకుంటున్నావా?" అని గట్టిగా నవ్వుతాడు.

సుమంత్ ఇల్లు – రాత్రి

ఆ నవ్వుకు అప్పటికి నిద్రపోతూ ఉన్న సుమంత్ ఉలిక్కిపడి లేస్తాడు. అతనికి మళ్ళీ చెమటలు. "ఏంటి ఈ కలలు?" అని బాధపడుతూ ఉండగానే తన అమ్మ మీనాక్షి దగ్గరికి వస్తుంది. "ఏం జరిగిందిరా అసలు? ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావ్?" అని అంటూ ఉంటే, తన కళ్ళలో జరిగింది చెప్పగా, మీనాక్షి "ఇలాంటి వింత కలలు మామూలే. ఆ దేవుడిని తలుచుకొని నీళ్లు తాగి పడుకో!" అని అంటూ ఉంటుంది.

"అవునమ్మా... నీకు వర్మ ఫ్యామిలీ గురించి తెలుసా?" అని అంటాడు సుమంత్.

ఆ మాట వినగానే నిశ్శబ్దంగా మారిపోయింది మీనాక్షి. "ఏంటమ్మా అలా అయిపోయావ్?" అని సుమంత్ అడుగుతూ ఉండగానే, అప్పుడే టీవీలో ఒక న్యూస్ వస్తుంది.

టీవీ న్యూస్ రిపోర్టర్ (వాయిస్ ఓవర్): "బ్రేకింగ్ న్యూస్! వర్మ ఫ్యామిలీ పూర్తిగా చనిపోయింది! వాళ్ళ మృతదేహాల మీద ఎటువంటి గాయాల గుర్తులు లేవు. కానీ వాళ్ళ గొంతుల దగ్గర ఎవరో కొరికినట్టుగా చిన్న గాటు! వీళ్ళకు ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికి ఎంత ప్రయత్నిస్తున్నా పోలీసులకు అంతుచిక్కని అంశాలుగా, కేసుగా మిగిలిపోయాయి!"

అక్కడ సీన్ కట్ అవుతుంది.

ఆ మాటలు విన్న మీనాక్షి గొంతు పగిలేలా, గుండెలు ఎగసేలా ఏడుపు మొదలుపెట్టింది. "ఎందుకు నాకే ఇలా జరుగుతుంది? మొదటిగా నా ప్రేమ నాకు దక్కుతుందా లేదా అని ఆశ! మళ్ళీ నా ప్రేమ నాకు దొరికితే ఫ్యామిలీ దూరమైంది. ఫ్యామిలీ దూరమైన తర్వాత మళ్ళీ నా ప్రేమికుడు దూరమయ్యాడు. మళ్ళీ ఇప్పుడు నా ఫ్యామిలీ నాకు దూరమైంది. మళ్ళీ ఏం జరగబోతుంది?!" అని గట్టిగా ఏడవడం మొదలుపెడుతుంది మీనాక్షి.

ఆ మాటలు వింటూ సుమంత్, "అసలు ఏం జరుగుతుందమ్మా? నీకు ఆ ఫ్యామిలీకి ఏంటి సంబంధం? నాకు అసలు అర్థం కావడం లేదు!" అని అంటూ ఉంటే, మీనాక్షి ఏడుస్తూనే, "ఆ ఫ్యామిలీ ఎవరో కాదురా... నా పుట్టినిల్లు! నీకు తాత ఇల్లు! ఇప్పుడు మనకు ఉన్న ఒకే ఒక్క ఫ్యామిలీ మెంబర్ కూడా వెళ్లిపోయారు! ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇన్నాళ్ళు బ్రతికింది ఎవరి కోసమో తెలుసా? ఒక్కసారైనా మా నాన్న నన్ను కలుసుకుంటాడేమో అని! కానీ ఇక నా కోరిక తీరదని అర్థమైంది!" అని అంటూ ఏడుస్తూ ఉంటుంది.

"అసలు ఏమి జరిగిందో చెప్పవమ్మా!" అని గట్టిగా అడుగుతాడు సుమంత్. "అలాగే, అసలు మనం ఫ్యామిలీకి ఎందుకు దూరమయ్యాం? నేను ఎప్పుడూ నిన్ను అడగలేదు. నాన్న ఎవరు? ఎక్కడికి వెళ్ళాడు? ఎందుకు వదిలిపెట్టాడు? లేదా నువ్వే వదిలి వచ్చేసావా? అని నేను ఒక్కసారి కూడా అడగలేదు. కానీ ఇప్పుడు అడగక తప్పడం లేదమ్మా! ఏం జరిగిందో అసలు?" అని గట్టిగా అడుగుతూ ఉన్నాడు సుమంత్.

సుమంత్ మాటలకు మీనాక్షి చిన్నగా ఏడుస్తూ తన ట్రంక్ పెట్టి లో నుంచి కొన్ని ఫోటోలు తీస్తుంది. దాంట్లో వర్మ ఫ్యామిలీతో కలిసి ఉన్న మీనాక్షి ఫోటో ఉంది. మీనాక్షి పక్కన జగదీష్ కూడా కలిసి ఉన్నాడు. "ఇదే నీ ఫ్యామిలీ!" అని అంటూ మరో ఫోటో చూపిస్తూ ఉండగా, సుమంత్ "అమ్మ! ఇతడేనా అమ్మ వర్మ ఫ్యామిలీని చంపింది?" అని జగదీష్‌ను చూపిస్తూ అడుగుతాడు.

మీనాక్షి కొంచెం గట్టిగా, "ఫ్యామిలీని చంపింది పెద్దకొడుకేనా?! నన్ను దూరం చేసుకుని పెద్దకొడుకుకి ఆస్తిని ఇచ్చారు వాళ్ళు! ఆస్తి కోసం చంపేశాడు!" అని అంటూ ఉంటుంది

అంతలో మరో ఫోటో కింద పడుతుంది. అది ఆదిత్య ఫోటో. ఆదిత్యను చూస్తున్న సుమంత్, "అమ్మ! ఇతను ఎవరు? ఇతనిని నేను ఒకసారి నా కలలో చూశాను. '20 ఏళ్ల ఆకలి ఇప్పుడే మొదలైంది' అని నన్ను భయపెడుతూ ఉన్నాడు!" అని అంటూ ఉంటే, మీనాక్షి "అతడు ఎవరో కాదురా... మీ నాన్న!" అని చెబుతుంది.