ఆ లెటర్ చదివిన సత్యవతి, శేషగిరి గారికి కన్నీరు ఆగడం లేదు. ఎంత పని చేసావు అవిని అని బాధపడతారు.
హైదరాబాద్ రైల్వే స్టేషన్ లో ఒక అమ్మాయి మాస్క్ పెట్టుకుని కూర్చుంది. తనను ఎవరు గుర్తుపట్టకుండా ఉండడానికి తలపై నుంచి కూడా స్కార్ఫ్ కట్టుకుంది.
ఫుల్లుగా కవర్ అయ్యే విధంగా డ్రెస్ వేసుకొని ఉంది. చాలా టెన్షన్ తో తన ఎక్కాల్సిన ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఉంది. కొంచెం సేపటికి తను ఎక్కాల్సిన ట్రైన్ రాగానే స్పీడ్గా వెళ్లి ట్రైన్ ఎక్కి కూర్చుంది. తనను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండాలని చాలా జాగ్రత్తలు తీసుకుని ట్రైన్ ఎక్కేసింది.
జైసింహ మాన్షన్.....
పొద్దుటే శిల్ప రూమ్ డోర్ నాకు చేసిన సౌండ్ వస్తుంది. మత్తుగా నిద్రపోతున్న శిల్ప కు ముందుగా సౌండ్ వినిపించదు.
ఇంకా కొంచెం గట్టిగా కొట్టిన తర్వాత ఉలుక్కుబడి లెగుస్తుంది. ఏంటి ఇంత అర్ధరాత్రి తలుపులు ఎవరు కొడుతున్నారని భయపడుతుంది.
శిల్ప అని బయట నుంచి అరుస్తారు. వెంటనే శిల్ప ముసుగు వేసుకొని వెళ్లి తలుపుతీస్తుంది.
ఎదురుగుండా లలిత గారు ఉంటారు. చెప్పండి అత్తయ్య గారు అంటే తెల్లారి పోయినా ఇంకా నువ్వు లెగలేదు అని లేపడానికి వచ్చాను అని చెబుతారు.
అప్పుడే తెల్లారిపోయిందా అని క్లాక్ వంక చూస్తుంది. అది చూస్తే అది ఉదయం 4:00 చూపిస్తుంది. అత్తయ్య గారు ఇంక నాలుగే అయ్యింది అంటుంది.
అవును. ఈ పాటకి నువ్వు లేచి పూజ గది ముందు శుభ్రం చేస్తూ ఉంటావ్ అనుకున్నాను. ఇంకా లెగలేదని లేపడానికి వచ్చాను అని చెబుతారు.
దానికి శిల్ప కొత్త ప్లేస్ కదా! రాత్రి నిద్ర పట్టలేదు. లేట్ అయిందని చెబుతుంది.
సర్లేమ్మ లేచి ఫ్రెష్ అయ్యి రా .... పూజ గది దగ్గర శుభ్రం చేయాలని చెప్పి వెళతారు.
ఇంత పొద్దుటే లెగాలా అనుకొని ఫ్రెష్ అయి వెళుతుంది. ఇంకా ఎవ్వరు కనిపించలేదు.
అదేంటి అత్తయ్య గారు ఎవరూ రాలేదు అంటే... అప్పుడే రారు. ముందు శుభ్రం చెయ్యి అని గట్టిగా చెబుతారు.
పూజగది బయట మాత్రమే శుభ్రం చేపిస్తారు. గది లోపలికి రానివ్వలేదు. గార్డెన్ లోనికి పంపి పువ్వులు తెప్పిస్తారు. ఇవన్నీ పూర్తయ్యేటప్పటికి ఉదయం 5:00 అవుతుంది.
ఇక్కడ పని అయిపోయింది రెస్ట్ తీసుకోవాలి అనగానే, ముగ్గు పెట్టమంటారు. నాకు ముగ్గు రాదు అని శిల్ప అనగానే, పరవాలేదు మేము నేర్పిస్తాము అని... రంగి అని సర్వెంట్ ని పిలిచి అప్పచెబుతారు.
అవి అన్ని పూర్తయ్యేటప్పటికీ శిల్పకి నడుం పట్టేస్తుంది. నడుము పట్టుకుని లోపలికి వచ్చిన శిల్పని చూసి ఇప్పటికి ఇది చాలు అనుకుని, రూమ్ కి వెళ్లి రెస్ట్ తీసుకోమంటారు.
దొరికిందే ఛాన్స్ అనుకుని గబగబా లోపలికి వెళ్లి తలుపులు వేసుకొని పడుకుంటుది.
విక్రమ్,వినయ్, భరత్ వర్కౌట్ స్ ఫినిష్ చేసుకుని రెడీ అయి వస్తారు. అందరూ బ్రేక్ఫాస్ట్ కోసం డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు.
శిల్ప తప్ప అందరూ ఉంటారు. ఇందిరాగారి విక్రమ్ తో నీకు ఆరు నెలలు టైం ఇచ్చాను. ఈ లోపు ఫినిష్ అవ్వాలి అంటే సరే అని చెప్పి బ్రేక్ ఫాస్ట్ ఫినిష్ చేసి ఆఫీస్కు బయలుదేరుతారు.
నివేదిత చేతికి టిఫిన్ ప్లేట్ ఇచ్చి శిల్పతో ఫ్రెండ్షిప్ చేసి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయమని చెబుతారు. సరే అని ప్లేట్ తీసుకుని శిల్ప రూమ్ లోనికి వెళుతుంది.
శిల్ప మత్తుగా నిద్రపోతూ ఉంటుంది. ఏంటో దీని రాజభోగం అనుకుని.... నిద్ర లేపుతుంది.
ప్లీజ్ మమ్మీ కొంచెం సేపు పడుకుంటాను అని అటు తిరిగి పడుకుంటుంది. వదిన అని గట్టిగా పిలుస్తుంది.
దెబ్బకు ఉలుకుబడి లేచి కూర్చుంటుంది. ఏంటి వదిన నువ్వు ఇంకా లెగలేదా?? మన ఇంట్లో ఇంత సేపు పడుకుంటే గ్రానీకి కోపం వస్తుంది.
టిఫిన్ తిను అని చెబుతుంది. ఒక్క నిమిషం అని ఫ్రెష్ అయ్యి వస్తుంది. ముసుగు ఉంచుకుని టిఫిన్ చేస్తూ ఉంటుంది.
పర్లేదు వదిన ముసుగు తీసేయ్, మనిద్దరమే కదా అని చెప్పి ముసుగుతీస్తుంది. శిల్ప ని చూసి అబ్బా వదిన ఎంత అందంగా ఉన్నావు.
పెళ్లి చూపుల్లో కన్నా ఇప్పుడు ఇంకా అందంగా ఉన్నావు. అచ్చు మోడల్ లాగా ఉన్నావ్ అని పొగుడుతుంది. దానికి శిల్ప చాలా సంతోష పడిపోతుంది.
టిఫిన్ కంప్లీట్ అయ్యాక వదిన మనిద్దరం ఇప్పుడు నుంచి ఫ్రెండ్స్ అని చెయ్యి ఇచ్చి, నువ్వు నాకు బ్యూటీ టిప్స్ చెప్పాలి వదిన .
ఇంత అందంగా ఉండడానికి అని ఇంకా మునగ చెట్టు ఎక్కిస్తుంది. శిల్ప ఫోన్ నెంబర్ కూడా తీసుకుంటుంది.
విక్రమ్ ఆఫీస్ కి వెళ్ళిపోతాడు. కారు దిగి ఆఫీస్ వంక చూస్తాడు
V. J. S గ్రూప్...
అది విక్రమ్ ముత్తాతగారు స్థాపించారు. అంచెలంచలేక ఎదుగుతూ ఇప్పుడు ఒక గొప్ప స్థానానికి వచ్చింది.
అది వి జె ఎస్ గ్రూప్ యొక్క మెయిన్ బ్రాంచ్. 30 అంతస్తుల బిల్డింగ్. ఇక్కడి నుంచి అన్ని చోట్ల ఉన్న బ్రాంచెస్ ని హ్యాండిల్ చేస్తున్నారు.
బిల్డింగ్ పైన వ్రాసి ఉన్న నేమ్ చూసి, ఎట్టి పరిస్థితుల్లోనూ మన కంపెనీకి, మన వంశానికి మచ్చ తీసుకురాను. రానివ్వను ..
ఇప్పుడు శిల్ప పరిస్థితి ఏమిటి?
కథ కొనసాగుతుంది....