Lunar Eclipse - 8 in Telugu Love Stories by umadevi books and stories PDF | పాణిగ్రహణం - 8

The Author
Featured Books
Categories
Share

పాణిగ్రహణం - 8

   విక్రమ్ ఆఫీస్ కి వెళ్ళిపోతాడు.  కారు దిగి ఆఫీస్ వంక చూస్తాడు

   V. J. S గ్రూప్...

    అది విక్రమ్ ముత్తాతగారు స్థాపించారు.  అంచెలంచలేక ఎదుగుతూ ఇప్పుడు ఒక గొప్ప స్థానానికి వచ్చింది.

   అది వి జె ఎస్ గ్రూప్ యొక్క మెయిన్ బ్రాంచ్.  30 అంతస్తుల బిల్డింగ్.  ఇక్కడి నుంచి అన్ని చోట్ల ఉన్న బ్రాంచెస్ ని హ్యాండిల్ చేస్తున్నారు.

   బిల్డింగ్ పైన వ్రాసి ఉన్న నేమ్ చూసి, ఎట్టి పరిస్థితుల్లోనూ మన కంపెనీకి,  మన వంశానికి మచ్చ తీసుకురాను. రానివ్వను ..

   అనుకుని... గంభీరంగా ఆఫీసులోనికి ఎంటర్ అవుతాడు.  విక్రమ్ చూడగానే ఆఫీస్ మొత్తం పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోతుంది.

   దించిన తల ఎత్తకుండా వర్క్ చేస్తున్నారు.  అమ్మాయిలు మాత్రం ఓరకంటూ విక్రమ్ చూస్తూనే ఉంటారు.  ఏమంటాడు రా..... బాబు.

   పెళ్లి అయిపోయినా సరే మనకు ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుంది కదా అని మనసులో అనుకుంటూ వర్క్ చేస్తూ ఉంటారు.

     వినయ్, భరత్ కూడా సైట్ వర్క్ ఫినిష్ చేసుకుని ఆఫీస్కు వస్తారు.   ఒక వ్యక్తి వచ్చి విక్రమ్ సార్ అపాయింట్మెంట్ ఇచ్చారు కలవాలి అని చెప్తాడు.

   రిసిప్షన్స్ట్ ఒకసారి కన్ఫర్మ్ చేసుకుని పంపిస్తుంది.  విక్రమ్ పీఏ 30 త్ ఫ్లోర్ లో ఉంటారు. ఆయన కలిస్తే విక్రమ్ సార్ దగ్గరికి తీసుకువెళ్తారు అని చెబుతోంది.

   ఓకే అని చెప్పి,,  లిఫ్ట్ లో 30 త్ ఫ్లోర్ కి వెళ్లి, విక్రమ్ పీఏ అయినా ఆనంద్ ని  కలిసి,

  హాయ్ సర్,  ఐయామ్ రిషి.  విక్రమ్ సార్ అపాయింట్మెంట్ ఇచ్చారు అని చెబుతాడు.  ఓకే అని చెప్పి విక్రమ్ క్యాబిన్ కి తీసుకువెళ్తాడు.

  ఎక్స్క్యూజ్మీ సార్ అనగానే,  కామెన్ అని చెబుతాడు. ఆనంద్,  రిషి లోపలికి వెళ్ళగానే విక్రమ్ ని విష్ చేస్తారు. విక్రమ్ హెడ్ మూవీ చూసి ,

  ఆనంద్ తొ భరత్, వినయ్ ని రమ్మన్నానని చెప్పు. అలాగే ఈ మీటింగ్ కంప్లీట్ అయ్యేవరకు ఎలాంటి డిస్టర్బ్ చెయ్యొద్దు అని చెప్పి పంపిస్తాడు.  భరత్ వినయ్ వచ్చాక డోర్ ని లాక్ చేసేస్తారు.

  ఇప్పుడు చెప్పండి రిషి మీరు తెలుసుకుని ఇన్ఫర్మేషన్ అని అడుగుతారు.  దానికి రిషి తన తెలుసుకుని ఇన్ఫర్మేషన్ అంతా చెబుతాడు.

    ధనుంజయ్ గారికి రెండు పెళ్లిళ్లు అనగానే... విక్రమ్ వాట్ అంటాడు.

   అవును సర్.  ధనంజయ గారి మొదటి భార్య పేరు రజిత..  వీరికి ఒక కూతురు అవని అని చెబుతాడు. విక్రమ్ పెదవులు అవని అని పలుకుతాయి.

    అవిని పుట్టిన తర్వాత ధనుంజయ్ గారికి వ్యాపారంలో బాగా కలిసొచ్చింది.  పట్టిందల్లా బంగారం అయింది.

    భార్గవి     రజిత గారి పిన్ని కూతురు.  అవని మొదటి పుట్టినరోజుకి అని భార్గవి   రజిత గారి ఇంటికి వచ్చింది.

    అవని పుట్టినరోజు నాడు ఏమి జరిగిందో తెలియదు గానీ,  రజిత గారి మెట్ల పైనుంచి జారి కింద పడ్డారు. హాస్పిటల్ కి తీసుకువెళ్ల ప్రయోజనం లేదు.

   మొదటి పుట్టిన రోజునే అవకి ని తల్లి దూరమైంది. తండ్రి బాధలో ఉంటే,  నానమ్మకు అలవాటు పడింది.

  ఆ టైంలోనే రజిత పిన్ని గారు కూతురిని తీసుకుని వచ్చి పాపను చూసే వంకతో అక్కడే ఉన్నారు.  భార్గవి అవిని జాగ్రత్తగా చూసుకుంటూ, ధనుంజయ్ గారికి దగ్గరయింది.

     సత్యవతి గారు కూడా అవిని కి తల్లి అవసరం ఉంటుందని, భార్గవి తో  ధనుంజయ్ పెళ్లి జరిపించారు.

   కానీ ధనుంజయ గారికి అవని మీద ఎంత ప్రేమ ఉన్నా, అవిని ని చూసినప్పుడల్లా రజిత గారు గుర్తుకు వస్తున్నారని, అవిని తొ తక్కువ మాట్లాడేవారు..

   ఈ లోపు భార్గవి ప్రెగ్నెంట్ అవ్వడం, శిల్ప పుట్టడం జరిగింది.   రజిత జ్ఞాపకాల్లోంచి రావడానికి శిల్ప తొ అటాచ్మెంట్ పెంచుకున్నారు.

   అవిని కి అన్ని ఇస్తున్నాను అనుకున్నారే కానీ, విలువైన తండ్రి ప్రేమను ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారు.  అవిని తండ్రి ప్రేమ కోసం అల్లాడుతూనే ఉంది.

  ఇదే అదునుగా భార్గవి     తండ్రి కూతుళ్ళ మధ్య దూరం పెంచింది.  అది ఎంత దూరం అంటే అవిని సర్టిఫికెట్ లో గార్డియన్గా శేషగిరి గారి పేరు మాత్రమే ఉంది అని. సర్టిఫికెట్స్ చూపిస్తాడు.

  ఎక్కడికి వెళ్లినా శిల్ప ఒక్కతే కూతురు అన్నట్టుగా భార్గవి క్రియేట్ చేసింది.  మీ సంబంధం వెళ్ళినప్పుడు కూడా ధనుంజయ్ గారు అవిని నే మీకు ఇచ్చి చేయాలి అనుకున్నారు.

   కానీ ఏం జరిగిందో తెలియదు... అవిని ఈ పెళ్లి ఇష్టం లేదు.  ఇప్పుడు,  అప్పుడే చేసుకోనని చెప్పింది.  మీ సంబంధం వదులుకోలేక శిల్పకి ఖాయం చేశారు అని చెబుతారు.

    అంతేకాకుండా ఇంకొక ముఖ్య విషయం తెలిసింది సార్ అనగానే...  ఏంటిది అని అంటే..

   నిన్న అవనిగారు  ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. తన బాయ్ ఫ్రెండ్ తో ఎక్కడికో వెళ్ళిపోయిందని ఇంట్లో అనుకుంటున్నారు.

   బట్ నా ఎంక్వైరీలో తెలిసినంతవరకు అవని గారికి ఎలాంటి బాయ్ ఫ్రెండ్స్ లేరు. చాలా రిజర్వ్డ్ గా ఉంటారు.

    పార్ట్ టైం జాబ్ చేస్తూనే తను స్టడీస్ కంప్లీట్ చేశారు. చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న అమ్మాయి అని నా ఎంక్వైరీ లో తెలిసింది.

   అంతే కాదు సార్,  భార్గవి గారు ఎంత దారుణంగా క్రియేట్ చేశారంటే.... అవిని కి  ఎవరూ లేరు. ఒక గార్డెన్ దయతో చదువుకుంటుంది.  శిల్ప ఒక్కతే ధనుంజయ్ గారి కూతురు అన్నట్టుగా క్రియేట్ చేశారు.

    ఏ ఫంక్షన్ కి వెళదామన్నా అవని రాను అని చెప్పడం అవిని ని  వదిలేసి, ఫ్యామిలీ మొత్తం వెళ్లడంతో... అవిని ఉనికి వారి బంధువులు కి తెలియకుండా  అయిపోయిందని చెప్పి..

     అవిని డీటెయిల్స్ అన్ని ఇచ్చి, ఇంక నేను వెళతాను సార్ అంటే... అవిని ఎక్కడికి వెళ్లిందో తెలుసుకో...

  అలాగే శిల్ప డీటెయిల్స్ అన్ని తెలుసుకో రిషి అని చెబుతాడు.  ఓకే అని చెప్పి రిషి వెళ్ళిపోతాడు. ఎందుకన్నయ్య అని వినయ్ అడుగుతాడు  

దానికి విక్రమ్ సమాధానం ఏమిటి??కథ కొనసాగుతుంది....