భార్గవి ఆలోచిస్తూ ఉంటుంది. మాకు అలాంటి నమ్మకాలు లేవు అంటే.... మీ కూతురు మీద ఉన్న ప్రేమ ఇదేనా అంటారు.
మీరు చెప్పినట్టు చేద్దామంటే... ఆరు నెలలు ఆగాలి. ఎలా ఏది మాట్లాడినా శిల్ప కు ఇబ్బంది.
ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తుంది. ధనంజయ గారు మాట్లాడుతూ మీరు చెప్పినట్టు చేద్దాం అత్తయ్య గారు.
కానీ... అప్పటివరకు శిల్ప ని ఎక్కడ ఉంచాలి అని అడుగుతారు.
దానికి ఇందిరా గారు, మీరు కంగారు పడకండి శిల్ప ఇప్పటినుంచి మా అమ్మాయి. ఇక్కడే ఉంటుంది.
కాకపోతే... విక్రమ్ గదిలో ఉండదు. శిల్ప సపరేట్ రూమ్ లో ఉంటుందని చెబుతారు.
మేము పద్ధతులు, ఆచారాలలో దగ్గర చాలా స్ట్రిక్ట్ గా ఉంటాము. నేను నా కోడలికి ఎలా అలవాటు చేశానో, అలాగే శిల్పకి అలవాటు చేస్తాం..
ఈ ఆరు నెలలు పూర్తయ్యేటప్పటికీ శిల్పకి అన్ని అలవాటు చేస్తాను. ఎంతైనా శిల్ప ఈ తరానికి పెద్ద కోడలు కదా! అంటూ.. భార్గవి వైపు చూస్తారు.
భార్గవి సరే అండి. మీ ఇష్టం... అని అంటుంది.
శిల్పకీ ఈ విషయాలన్నీ చెప్పి వస్తాను అని లెగుస్తుంది. భార్గవి ఒక్క విషయం గట్టిగా చెప్పు.
మేము చెప్పే వరకు శిల్ప ముసుగు తీయకూడదు. తనే ఇంటి కోడలని బయట ఎవరికి తెలియకూడదు. సర్వెంట్స్ తో సహా అని గంభీరంగా చెబుతారు.
ఇదంతా విక్రమ్, శిల్ప జీవితం కోసమే తప్ప మాకు ఎటువంటి దురుద్దేశం లేదు అని అంటారు.
వెంటనే సత్యవతి గారు... అయ్యో, వదినగారు మీరు ఎందుకు అంత అలా చెబుతున్నారు.
శిల్ప ఇంటి కోడలు అయినందుకు ఖచ్చితంగా ఈ ఇంటి పద్ధతులు పాటించాలని చెప్పి.. శిల్ప రూంలోనికి వెళతారు.
ఏమైందమ్మా అని శిల్ప అడిగితే, జరిగిందంతా చెబుతారు. దానికి శిల్ప కంగారుగా ఏం మాట్లాడుతున్నారు మీరు.. ఆరు నెలలు ఎలా ఉండాలి?
అంటే అది ఎంత కష్టం మీకు అర్థం అవుతుందా అని అరుస్తుంది. దానికి సత్యవతి గారు చూడు శిల్ప , నువ్వు ఈ ఇంటి కోడలు వి.
ఈ ఇంటి పద్ధతులు పాటించాలి. పెళ్లిలో జరిగిన లోపం ఏంటో మనకి తెలియదు కదా అనగానే...
శిల్ప టెన్షన్ తో చేతులు పిసుకుంటుంది. కూతురు టెన్షన్ చూసిన భార్గవి, శిల్ప చేతుల మీద చేయి వేసి, రిలాక్స్ అని కళ్ళు ఆర్పుతుంది.
అయితే నేను ఇక్కడ ఉండాలా.. అది కూడా అజ్ఞాతంగా అని విసుగుగా ఉంటుంది.
తప్పదు శిల్ప నీ జీవితం సంతోషంగా ఉండాలి కదా అని.. నచ్చచెప్పి బయటికి వస్తారు.
సింహ ఫ్యామిలీ కి వెళ్లి వస్తామని చెప్పి ధనుంజయ వాళ్లు కూడా ఇంటికి బయలుదేరుతారు.
వీళ్ళు ఇంటికి వెళ్లేటప్పటికీ ఉదయ్ తలకి బిందు కట్టు కడుతూ ఉంటుంది. భార్గవి కంగారుగా ఏమైంది వదిన ఉదయ్ కి అని అడిగితే...
ఉదయం నిదానంగా కళ్ళు తెరిచి నన్ను క్షమించు అత్తయ్య అంటాడు. దేనికి అని అడిగితే..
చెప్పడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు.
పర్లేదు చెప్పు ఉదయ్ ఏం జరిగింది అని ధనుంజయ్ గంభీరంగా అడుగుతాడు. దానికి అవిని ఇంట్లో లేదు మావయ్య అని చెబుతాడు.
అవిని లేకపోవడం ఏంటి అని శేషగిరి గారు గట్టిగా అడుగుతారు.
అవని తన బాయ్ ఫ్రెండ్ తో వెళ్ళిపోయింది. ఆపడానికి ప్రయత్నించినందుకు నన్ను కొట్టి వెళ్ళిపోయింది. సర్వెంట్స్ కూడా చూశారు.
అని... అక్కడ ఉన్న ముగ్గులు సర్వెంట్స్ వంక చూస్తాడు. వాళ్ళు అవును అని చెబుతారు.
సత్యవతి గారికి నమ్మకం కుదరక, ఉదయ్ వంక చూస్తారు. ఉదయ్ చాలా నొప్పిగా ఉంది అమ్మ అని బాధపడుతూ ఉంటాడు.
సత్యవతి గారు బిందు ని చూసి ఆ టైంలో నువ్వెక్కడున్నావు అంటే... బిందు కంగారుపడుతూ నేను సునీల్ గారు గుడికి వెళ్లం పిన్ని గారు , వచ్చేటప్పటికి ఉదయ్ తనకు దెబ్బ తగిలి పడి ఉన్నాడు అని చెబుతుంది.
ధనుంజయ్ షాక్ తో కూర్చుంటాడు. శిల్ప పెళ్లి జీవితం అలా? అవిని ఇలా? అసలు ఏం జరుగుతుంది అని బాధగా కళ్ళు మూసుకుంటాడు.
భార్గవి బాధగా వచ్చి ధనుంజయ భుజం మీద చేయి వేస్తుంది. సత్యవతి, శేషగిరి కి ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్ గా రూమ్ కి వెళ్ళిపోతారు.
రూమ్ కి వెళుతూ సర్వెంట్స్ వైపు చూస్తారు. ముగ్గురు తలదించుకునే ఉంటారు. అందులో ఒక సర్వంట్ నమస్కారం చేస్తుంది.
ఏదో జరిగింది. తర్వాత అడిగి తెలుసుకోవాలి అని రూమ్ లోనికి వెళ్ళిపోతారు.
లోపలికి వెళ్లిన శేషగిరి గారు మంచం మీద కూర్చుని అసలు ఏం జరుగుతుంది సత్యవతి అంటూ పిల్లోని చేతిలోకి తీసుకుంటారు.
అక్కడ ఒక లెటర్ కనిపిస్తుంది. ఆ లెటర్ ని ఇద్దరు ఆశ్చర్యంగా చూసి తీసి చదువుతారు. ఆ లెటర్ లో ఉన్నది చూసి ఆశ్చర్యపోతారు
ఆ లెటర్ ఎవరు రాశారు ??
అది చదివిన వీళ్లిద్దరి పరిస్థితి ఏమిటి?
కథ కొనసాగుతుంది.....