తిరిగి కొట్టడం వాళ్ళ నోర్లు ముయించడం క్షణం పని ఆనంద్ కి.
ప్రేమించిన పిల్ల కోసం తన కుటుంబానికి ఇస్తున్న గౌరవంతో ఆ పని చేయలేక నిలబడి మాట్లాడుతున్నాడు.
ఇంకోసారి నా కూతుర్ని కలవడానికి ప్రయత్నించావు నిన్ను అక్కడే చంపి పాత్ర వేస్తా నా ఇంటి చుట్టుపక్కలే కాదు అసలు ఊర్లోనే ఉండడానికి వీలు లేదు అని శాసించినట్టే అన్నారు బసవయ్య గారు.
ఊర్లో ఉండదుద్దు అని చెప్పే హక్కు మీకు ఎవరు ఇచ్చారండి ముందు మీ అమ్మాయి మనసులో ఏముందో కనుక్కోండి..??
ప్రేమ కోసం ప్రాణం మిదకు తెచ్చుకున్న మీ కూతురి కష్టం కనిపించడం లేదా మీకు?? అని సుభాషిని గారు నిలదీస్తుంటే
ఆండాలమ్మ గారు అడ్డుపడ్డారు. గట్టిగా చివాట్లు పెట్టి ఆనంద్ ని తీసుకొని వెంటనే అక్కడి నుంచి వెళ్లిపొమ్మని పెద్ద గొడవే చేశారు.
కన్నీళ్లతో ఏడుస్తూ అన్నందుకు కోసం అల్లాడిపోతున్న లీలలను పూర్ణేశ్వరి గారు గట్టిగా పట్టుకొని ఆపుతున్నారు తోడుగా పెద్ద కోడలి సాయంతో.
కళ్ళ ముందు ఉండి కోట్టుకొని కష్ట పెట్టుకోవడం కన్నా దూరంగా ఉంటే కాస్తయినా ప్రశాంతంగా ఉంటుంది అనుకున్న ఆనంద్ మరుక్షణమే తల్లిని వెనక్కి తీసుకున్నాడు.
13 ఏళ్లకే పెళ్లి చేసుకున్న ఆ పెద్దవిడికి చాలా బాగా తెలిసే ఉంటుంది.
పెళ్లి అంటే పిల్లను తీసుకెళ్లి చేతిలో పెట్టడం కాదు.. ఆ ఆడపిల్ల జీవితాన్ని, శరీరాన్ని, మానాన్ని, మనసును, సంతోషాన్ని, సర్వస్వాన్ని మరొక మగాడి చేతిలో పెట్టడం అని.
కట్టుబాట్లతో బలవంతంగా జరిపే ఇటువంటి కళ్యాణం తో జరిగేది కాపురం కాదు వ్యభిచారం. నా లీల అలా బ్రతకలేకే చావుకు సిద్ధపడింది.
నా ఆవేశం వెనుక నా బాధ అందులోని నిజం వీళ్ళకి ఈ జన్మకు అర్థం కాదు. అది గడప దాటి వస్తే ఈ క్షణమే నాతో పట్టుకుపోతాను వీళ్ళకి అందనంత దూరంగా ప్రపంచానికి మరో పక్కకి తీసుకుపోగలను.
కానీ అది రాదు వీళ్లకు దాని ప్రేమ అర్థం కాదు.. కన్న కూతురితో, తోటబుట్టిన చెల్లెలితో, అల్లరు ముద్దుగా పెంచుకున్న ఆడపిల్ల తో కాపురం పేరుతో వ్యభిచారం చేయించడానికి సిద్ధపడ్డ ఇటువంటి వాళ్ళతో నువ్వు ఎందుకు అమ్మ మాటలు పడడం..??
వెళ్దాం పద..!! అని ఆవేశం, ఆవేదన గుండెలో రగిలిపోతున్న బాధతో చివరిగా లీలా ను చూస్తూ తల్లిని తీసుకొని వెళ్ళిపోయాడు ఆనంద్.
ఇక లీల నుంచి మాట లేదు.
అలాగే ప్రాణం ఉన్న కట్టేలా మంచం మీద పడిపోయింది.
ఇక తర్వాత అతను హాస్పిటల్ కి రాలేదు.
మరొక వారానికి లీల నీ ఇంటికి తీసుకొచ్చారు.
ఇంతకుముందు కాస్త ఇంటి నాలుగు గోడల మధ్యన తిరిగేది మాట్లాడేది.
ఇప్పుడు అది కూడా లేదు.. ఆనంద్ కావాలి అని చెప్పిన ప్రయోజనం లేని తన వాళ్ల మధ్య తానే ఒంటరిగా మిగిలింది.
కుటుంబమంతా గమనిస్తున్న ఒక్కరు కూడా స్పందించలేదు. ఎవరిలో వాళ్లే ఇది తప్ప ఒప్ప అని తరిపించుకుంటున్నారే తప్ప అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవడానికి అహం ఒప్పుకోలేదు.
అందర్నీ గమనిస్తున్న దండాలు అమ్మ మౌనంగా పెరటి గుమ్మానికి పరిమితమయ్యారు. ఆవిడ ఆలోచనలు చాలా దీర్ఘంగా పోతున్నాయి.
లీలా ని నింపుకున్న గుండెతో ఆనంద్ ఊరు దాటి వెళ్లిపోయాడు.
ఇలాగే మరో రెండు నెలలు గడిచాయి. లీల పూర్తిగా చిక్కి శల్యమైపోయింది.
అలాగే వదిలేస్తే ఆనంద్ మీద ప్రేమతో ప్రాణం పోగొట్టుకుంటుందేమో నన్న భయం అందరిలో మొదలైంది.
ఆండలమ్మ గారిలో పూర్తిగా మౌనం చేరిపోయింది.
అక్కడ ఆనంద్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఊరికి దూరంగా ఉన్నాడని పేరే పని ప్రతిక్షణం లీల గురించి ఆలోచన అతన్ని నిలువనివ్వడం లేదు.
అలా అని ఊరికి వచ్చి అందరితో దెబ్బలాడి లీల ని ఇంకా కష్టపెట్టను లేడు.
కుటుంబాన్ని కాదు అనుకుంటే క్షణం పట్టదు లీలా కు గడప దాటడం. తను అలా గడప దాటిన మరుక్షణం ఆనంద్ తన గుండెల్లో దాచుకుంటాడు ఆమెని.
కానీ ఆ పని లీలా చేయలేదు. లీలాకిష్టం లేని పని చేయమని బలవంతం చేయలేక అలాగే తన కళ్ళ ముందు తన దూరంతో బాధపడుతూ ఉండలేక ఆనంద్ ఊరి వైపు చూడడం లేదు.
ఒకరోజు సంధ్యా సమయం కొడుకుని పిలిచారాండాలమ్మ. అస్తమిస్తున్న సూర్యుడిని నిశితంగా చూస్తున్న తల్లి పక్కన కూర్చుని ఏమన్నా కావాలమ్మా?? అని అడిగారు ఆయన.
లీలా ఏం చేస్తుంది రా అని పడమర దిక్కుకు వడిలిపోతున్న సూర్యుడి మీద నుంచి కళ్ళు తిప్పకుండా అడిగారు.
అది ఉన్న లేనట్టే అమ్మ. ముగ్గురు కొడుకుల తర్వాత మన ఇంట్లో పుట్టిన మొదటి ఆడపిల్ల, ప్రాణంగా చూసుకున్నాం.
కానీ ఈరోజు వాడి మీద పెంచుకున్న ప్రేమతో ప్రాణం పోగొట్టుకుంటుంటే ఏమీ చేయలేకపోతున్నాను అని బెక్కుతూ చెప్తున్నా కొడుకు తల మీద చేతిని ఉంచి నన్ను దాని దగ్గరికి తీసుకు పోరా అని అడిగారు ఆండాలమ్మ.
తల్లి అడిగినట్టు లోపలికి తీసుకొచ్చి లీల గదిలో వదిలి బయటకు వెళ్లారు బసవయ్య.
కానీ ఈరోజు వాడి మీద పెంచుకున్న ప్రేమతో ప్రాణం పోగొట్టుకుంటుంటే ఏమీ చేయలేకపోతున్నాను అని బెక్కుతూ చెప్తున్నా కొడుకు తల మీద చేతిని ఉంచి నన్ను దాని దగ్గరికి తీసుకు పోరా అని అడిగారు ఆండాలమ్మ.
తల్లి అడిగినట్టు లోపలికి తీసుకొచ్చి లీల గదిలో వదిలి బయటకు వెళ్లారు బసవయ్య.
సగానికి సగం అయిపోయి ఎముకల గూడులా మారిన మనవరాలిని కన్నీళ్ళతో చూస్తూ నెమ్మదిగా చీర చెంగున దాచిన లీల జ్ఞాపకాల పుస్తకాన్ని బయటకు తీసి తన గుండెల మీద పెట్టారు.
**************************
కామెంట్స్ మస్ట్ బేబీస్...💞
__Varna.