సున్నితమైన చిన్న ప్రేమ కథ.
అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అని ఆశిస్తున్నాను. చదివి మీ అభిప్రాయం కామెంట్స్ లో ఇవ్వండి.
మీకు నచ్చితే మరిన్ని కథలను అందిస్తాను.. ఇట్లు మీ వర్ణ.
💞💞💞💞💞💞💞💞💞💞💞💞
అది ఒక చిన్న గ్రామం.
పరువు ప్రతిష్ట లకు ప్రాణం ఇచ్చే పౌరుషాలు, కులము, మతము, కట్టుబాట్లు, ఆచారాలు ఇంకా పొలిమేరలు దాటని గ్రామం.
కంటికి కనిపించని కంచెలతో గీతలు గీసుకుని, గడపలలో మడికట్టుకు తిరిగే పెద్ద వాళ్లకు పేరుగాంచిన గ్రామం.
వదిలేసి ఎగిరి పోలేని ఒక ఆడపిల్ల మనసును కట్టటి చేస్తున్న గ్రామం. తెగించి తీసుకుపోలేని ఒక మగవాడి పౌరుషాన్ని ప్రశ్నిస్తున్న గ్రామం.
అన్నిటి నడుమ కదిలిపోతున్న ఓనాటి సాయంత్రం..
నిమ్మ పండు రంగులో మెరుస్తున్న వేసవి సాయంత్రం. పచ్చటి పొలాల మీదా, గుడిసెల మీదా ఆ కాంతి వెదజల్లుతూ, ముద్దుగా తాకుతుంది.
చుట్టూ పూల వాసన, ఆకుల మర్మరాలు గాలిలో తేలుతూ ప్రేమను, తపనను నింపుకున్న గుండెకి వాటి సవ్వడితో సంగీతాన్ని జోడిస్తున్నాయి.
ఆ పచ్చటి పొలాల్లో గల మట్టి బాటలో ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఇంటికి వెళుతుంది లీల.
గుండ్రటి ముఖం , కాటుక పెట్టిన చిట్టి కళ్ళు, నీలం రంగు ముక్కు పుడకతో మెలుస్తున్న బుజ్జి ముక్కు దాని కింద గులాబీ రంగులో నవ్వుతూ వికసిస్తున్న చిన్ని చిన్ని పెదవులు.
నల్లని జుట్టు ఒత్తుగా అల్లడంతో నడుము వరకు ఉన్న జడ నడుస్తుంటే ఆమె అడుగులకు తగ్గట్టు లయబద్ధంగా ఊగుతూ వెనుక నుంచి చూడడానికి కనువిందుగా ఉంది.
నారింజ రంగు సల్వార్ కమీజ్, మరియు పసుపు రంగు దుపట్టాలో... సూర్యాస్తమయ రవికిరణాలను తన నడకలో ఉలకపోస్తున్నట్టు ఉంది ఆమె ఆహార్యం.
ఆమె చెతిలో ఒక ఓల్డ్ బుక్. అది ఆమె నిత్య ప్రయాణంలో భాగమైన అనుబంధం.
అతను దూరంగా ఉన్న అతనితో కలిసి పంచుకున్న జ్ఞాపకాలకు పదిలపరుచుకున్న ప్రణయ గ్రంధం అది.
కాళ్ల కింద మృదువైన నేల స్నేహితిలా తోడుగా, పక్షుల కిలకిల ధ్వని సంగీతంలా ఆమె అడుగులతో పాటు సాగుతున్న ఆలోచనలకు తాళం వేస్తున్న ఆహ్లాదమైన ప్రకృతి
ఎప్పటిలా ప్రకృతితో మమేకమై తన ప్రేయసికుని గురించిన ఆలోచనలతో వెళుతున్న లీల అడుగులు నిమ్మదించాయి ఎదురుగా కనిపిస్తున్న పెద్ద చెట్టు కింద ఉన్న అతన్ని చూస్తూ.
ఆమె కళ్ళు పెద్దవయ్యాయి గుండె సన్నగా అదురుతో వేగాన్ని పెంచుకుంటుంది. అసలు ఊహించలేదు అతను ఈ సమయంలో అక్కడికి వస్తాడని.
వెళ్ళిపోయాడు అనుకున్న దిగులు ఉదయం వరకు వదలలేదు. కాలేజీ కి వెళ్లిన తర్వాతే స్నేహితులు క్లాసులు వలన కాస్త నార్మల్ అయింది.
ఇప్పుడు కూడా బరువుగా ఉన్న గుండెకు తోడుగా వాళ్ళిద్దరు జ్ఞాపకాలను భద్రపరిచిన పుస్తకాన్ని గట్టిగా గుండెలు కాదనుకుంటే అతనే చూస్తున్న లీలా కళ్ళల్లో సన్నటి నీటి తెర.
మళ్లీ రెండు సంవత్సరాలు వరకు కనిపించడు అనుకున్న తన ప్రేమ రూపం ఆనంద్ ఇప్పుడు కళ్ళ ముందు ఉంటుంటే ఆనందంతో కూడిన భావద్వేగం లీలా చెంపలను తడిపేస్తుంది.
కదలకుండా నిలబడిపోయినా లీల కాటుక కన్నుల్లో మెదులుతున్న కన్నీటిని చూసి నెమ్మదిగా లీల దగ్గరికి వచ్చాడు ఆనంద్.
బాధపడ్డావా..?? సుతిమెత్తని గొంతుతో అడుగుతున్న అతని కంఠంలో కూడా ఆమె గుండె అనుభవిస్తున్నంత ఎడబాటు ధ్వనిస్తుంది.
ఇప్పుడు ఇంకా బాధగా ఉంది అంటూ కన్నీళ్లతో నిండిపోతున్న కళ్ళను కిందకు దించేసింది లీలా.
బామ్మ గారి మాటలకి చాలా కష్టంగా అనిపించింది. అందుకే నీకు కనిపించి నిన్ను కష్టపడటం ఇష్టం లేక ఊరు వదిలి వెళ్ళిపోయాను.
కానీ ఇది నీకు ఇవ్వకుండా నాతో తీసుకువెళ్లడం చాలా బరువుగా అనిపించింది. అందుకే మళ్ళీ నీ కోసమే వచ్చాను అంటున్న అతన్ని కళ్ళు ఎత్తి చూసింది లీలా.
ఆరాధన తో నిండిన అంతులేని ప్రేమ ఆమె కళ్ళల్లో.
చెంపల మీదికి దూకుతున్న ఆనందం నిండిన కన్నీళ్లను తుడవడానికి అని ఆనంద్ ముందుకు పెట్టిన చెయ్యి టచ్ చేయక ముందే వెనక్కి జరిగింది లీలా.
ఆ దూరం భరించ లేనిది ఆనంద్ కి. గుండెలో దూదితో గుచ్చినట్టు ఒక్కసారిగా నొప్పి అనిపించింది.
నేను పిరికి వాడిని కాదు అంటున్న అతని కంఠం ఆవేశంతో కంపిస్తుంటే చేరలేని దూరం మనిద్దరిది అంది పక్కకు తిరిగి లీలా.
ఆ దూరాన్ని చేరప గలిగే ధైర్యం నాకు ఉంది.
అందుకు నీ సపోర్ట్ కావాలి అంటూ అప్పటివరకు భద్రంగా తన చేతిలో ఉండి రెపరెపలాడుతున్న వైట్ ఎన్వలప్ ఆమె ముందు ఉంచాడు.
ఆనంద్ తెగువ తెగింపు రెండు తెలిసిన లీలా అదిరిపాటుగా ఆనంద్ ని అతని చేతిలో ఉన్న ఎన్వలప్ ని చూస్తుంటే..
ఇది నా మనసు. నేను చెప్పకుండానే నా మనసుని చదివిన నీకు అందులో ఉన్న నా ప్రేమ అక్షరాలలో అందిస్తున్నాను.
రెండు సంవత్సరాలు సిటీలో ఉంటాను, ఆ తర్వాత ఎక్కడ ఉంటాను నాకే తెలియదు.
ఎంతమందిలో ఉన్నా నువ్వు లేని నేను ఎప్పుడూ ఒంటరి వాడిని అని స్థిరంగా చెప్తున్న ఆనంద్ గొంతులో గద్గత.
ఇది నా మనసు. నేను చెప్పకుండానే నా మనసుని చదివిన నీకు అందులో ఉన్న నా ప్రేమ అక్షరాలలో అందిస్తున్నాను.
రెండు సంవత్సరాలు సిటీలో ఉంటాను, ఆ తర్వాత ఎక్కడ ఉంటాను నాకే తెలియదు.
ఎంతమందిలో ఉన్నా నువ్వు లేని నేను ఎప్పుడూ ఒంటరి వాడిని అని స్థిరంగా చెప్తున్న ఆనంద్ గొంతులో గద్గత.
**************************
కామెంట్స్ మస్ట్ బేబీస్...💞
__Varna.