20 డేస్ ఇక్కడే ఉంటాను. అనడంతో ఉత్సాహంగా చూసింది లీల. బట్ అప్పటి వరకు వెయిట్ చేసే ఓపిక లేదు మేడం ప్లీజ్ ఈ ఫ్రైడే గుడికి వేసుకొస్తావా అని రిక్వెస్ట్ గా అడుగుతున్న ఆనంద్ అల్లరి కి నవ్వుతూ సరే అంది.
ఒకే ఊరిలో ఉండే ఇద్దరు ఒకే దారిన.. నెలల తర్వాత కలిసిన ఏడబాటుని కబుర్లతో దూరం చేసుకుంటూ కలిసి వెళ్తున్నారు.
ఇంకా కొన్ని నిమిషాల్లో ఊరిలోకి వెళ్తాను అనగా వాళ్లని ఆటోలో వస్తున్న ఆండాలమ్మ గారు చూసి ఆటో ఆపి మరి ఎదురు వచ్చి నిలబడ్డారు.
ఆవిడతో పాటు బసవయ్య గారు కూడా ఉన్నారు, కొద్దిరోజుల నుంచి పొడి దగ్గుతో బాధపడుతున్న ఆవిడని హాస్పిటల్ కి తీసుకు వెళ్తున్నారు.
బామ్మగారిని చూడడమే భయపడ్డా లీలా డ్రెస్ కవర్ నలిపేస్తూ ఆనంద్ నుంచి ఒక అడుగు దూరం జరిగింది.
తండ్రి కన్న ఎక్కువగా బామ్మ గారికి భయపడుతుంది లీలా ఎందుకంటే ఆవిడ మాట కాదని ఎవ్వరూ ఇంట్లో ఏదీ చేయ్యరు.
ఎప్పుడు వచ్చావు అని పరామర్శగా ఆనంద్ ని ప్రశ్నిస్తూనే మనవరాలు చేయి పట్టుకొని తన వైపుకు తీసుకున్నారు ఆండాలమ్మ.
ఇప్పుడే ఊరికి వస్తున్నాను బొమ్మ అని లీల దూరాన్ని ఆండాలమ్మ గారి గొంతులో కరుకుతనాన్ని గమనిస్తూ చెప్పాడు ఆనంద్.
ఈ టైంలో ఏ బస్సులు ఇటు రావే, అని అనుమానం అడుగుతున్న ఆండాలమ్మ గారి కళ్ళల్లో లీలా చేతిలో ఉన్న కవర్ పడింది.
ఏంటే ఇది అని అడుగుతున్న ఆండలమ్మ గొంతు అనుమానంతో గట్టిగానే ప్రశ్నించింది.
నిజం చెప్పలేని భయం లీల ని తడబడేలా చేస్తే.. ఆనంద్ ఇబ్బందిగా చూస్తున్నాడు లీల ఆన్సర్ కోసం వెయిట్ చేస్తూ.
చెప్పలేకపోయింది తను. ఆండలమ్మ గారు ఆ కవర్ లాక్కొని చూసి దానిలో డ్రస్ ఉండడం అది లీలాకి ఇష్టమైన కలర్ కావడంతో ఇది నువ్వే రా తెచ్చావు?? అంటూ అనుభవంతో వచ్చిన అనుమానంతో ఆనంద్ మీద నోరు చేసుకున్నారు.
లీల భయంతో తలదించేసుకుంది. ఇప్పుడు ఆనంద్ కూడా చెప్పకపోతే ఆవిడ అనుమానానికి బలం పెరిగి కుటుంబాలు మధ్య సమస్యలు తలెత్తుతాయి.
అందుకే దాయకుండా లీలా కోసం తెచ్చాను బొమ్మ అని మరి ఆలోచన లేకుండా చెప్పేసాడు ఆనంద్.
అది వింటూనే కొయ్యబారిపోయింది లీల.
నా మనవరాలికి బట్టలు లేవనే తెచ్చావు రా అంటూ కోపం చూపిస్తున్న తల్లిని అమ్మ స్నేహం మీద తెచ్చాడులే మరీ అలా అనకు బాగోదు అని సమర్థించారు బసవయ్య.
నువ్వు నోరు ముయ్యి రా నీకేమీ తెలియదు, వయసొచ్చిన ఆడపిల్లతో స్నేహం ఏంటి రా..?? చిన్నప్పటి స్నేహం స్కూలు వరకే పరిమితం. అప్పుడే ఇంట్లోకి రానివ్వని వీడిని ఈ వయసులో నా మనవరాలు పక్కన తిరిగితే ఎలా రా చెప్పకుండా వదిలేసేది..??
వయసు వచ్చిన ఆడపిల్లకి ఇలా బట్టలు తెచ్చావని ఊర్లో తెలిస్తే ఏమనుకుంటారో తెలుసా.. ?? అని ఆనంద్ ని గట్టిగానే మందలించారు ఆండలమ్మ.
బామ్మ కోపానికి లీల మౌనంగా ఉండిపోయింది. ఆనంద్ కారణంగా మాటలు పడుతుంటే చెప్పలేనంత బాధ. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్న చాలా కష్టంగా అదుపు చేసుకుంది.
మళ్లీ ఆనంద్ కోసం కన్నీరు పెట్టుకుంటే దానికి బామ్మగారు వేసే అక్షింతలు మామూలుగా ఉండవు. వాడి కోసం ఏడ్చే అంతా అనుబంధం ఉందా అంటే లీలా దగ్గర ఆన్సర్ లేదు.
చాలా కష్టంగా అనిపిస్తుంటే తండ్రి చేయి పట్టుకొని తలదించుకొని ఉండిపోయింది అలాగే.
నీకు అంతగా స్నేహంతో మా లీల తో మాట్లాడాలనుకుంటే ఇంటికి వచ్చి గుమ్మంలో ఉండి మాట్లాడు. ఇలా రోడ్లు మీద ఒంటరిగా మాట్లాడుకుంటే చూసే నలుగురు నాలుగు రకాలుగా అంటారు.
ఇంకోసారి ఇటువంటివి ఏమైనా నా కంటపడితే ఇంటికి వచ్చి మరి మీ నాన్నగారి ముందే మాట్లాడతాను అని పొడి దగ్గుతో కిస్ .. కిస్.. మంటూనే అరిచిన ఆండాలమ్మ కవర్ ఆనంద మీదకి విసిరేసి లీలా చేయి పట్టుకొని బరాబర్ లాకెళ్లి ఆటోలోకి తోసి ఎక్కి కూర్చుంది.
అమ్మ మనం హాస్పిటల్ కి కదా పోతుంది లీల ఇంటికి పోతుందిలే అని అంటున్న కొడుకును ఉరిమి చూసి హాస్పటల్ కి లేదు ఏమి లేదు. కాస్త కషాయం తాగితే ఆ దగ్గు అదే పోతుంది.
అడ్డమైన వాళ్లతో ఇలా నడిచి వెళ్లే కర్మ నా మనవరాలుకి పట్టలేదు ఎక్కువ పోదాం అని కొడుకుని చివాట్లు పెడుతున్న బామ్మ గారి కోపం మొత్తం ఆనంద్ మీదే.
అతని కళ్ళల్లో లీలా మీద కనిపిస్తున్న ఆపేక్ష ఆవిడకి నచ్చడం లేదు. స్నేహం పేరుతో అది ఎక్కడ పెరిగి ప్రేమగా ముదిరిపోతుందో నేను అన్న భయం.. అవునా అంగీకరించ లేక పోతుంది.
ఆ రోజు బామ్మ గారు అలా ఇంటికి తీసుకు వెళ్లిన తర్వాత వారం పాటు లీలా బయటికి రాలేదు, కాలేజీకి పోలేదు.
మరి మరి గుచ్చి గుచ్చి అడిగితే లేని ఆలోచన తానే కలిగించినట్టు అవుతుందని లీలా అని ఏది అడగకపోయినా.. ఏదో ఒక కారణం చెప్పే వారం పాటు లీలాను ఇంట్లోనే కట్టేసింది ఆండలమ్మ.
ఇల్లు దాటి బయటికి రాని లీల మీద ఆండాలమ్మ గారి అజమని చాలా కష్టంగా అనిపించింది ఆనంద్ కి.
ఒకరోజు చూడడానికి ఇంటికి వచ్చాడు. గుమ్మంలోనే నిలబెట్టి మనవరాలు లేదని ఇంకోసారి రావద్దని అరిచి పంపిస్తుంది ఆండాలమ్మ.
**************************
కామెంట్స్ మస్ట్ బేబీస్...💞
__Varna.