Are Amaindi - 18 in Telugu Thriller by sivaramakrishna kotra books and stories PDF | అరె ఏమైందీ? - 18

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

అరె ఏమైందీ? - 18

అరె ఏమైందీ?

హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్

కొట్ర శివ రామ కృష్ణ

"ఎక్కడికి వెళ్ళేది? నువ్వుకూడా నాతొ భోజనానికి అక్కడికి వస్తున్నావు. నువ్వూ వస్తేనే నేను వెళ్ళేది." మనోజ్ మొహంలోకి చూస్తూ అన్నాడు అనిరుధ్.

"ఈ అబ్బాయిని చూసినట్టుగానే వుంది, కానీ గుర్తురావడం లేదు." మనోజ్ మొహంలోకి చూస్తూ అంది తనూజ.

"ఈ వూళ్ళో చలపతి గారని గవర్నమెంట్ స్కూల్లో టీచర్ గా చేస్తూ ఉండేవారు. అయన అబ్బాయి. ఇప్పుడు ఆయనకి టౌన్ లోకి ట్రాన్స్ఫర్ కావడం వల్ల అక్కడికి మారిపోయారుఫ్యామిలీ అంతా. తన పేరు మనోజ్." అనిరుధ్ అన్నాడు.

"గుర్తుకు వచ్చింది. అయన భార్య మాల్లీశ్వరి గారు నాకు బాగా పరిచయం. తన ఇంటికి కూడా నేను ఎక్కువగా వెళుతూ ఉండేదాన్ని. అన్నట్టు నీకొక చెల్లెలు కూడా ఉండాలికదా."

"వుంది. తన పేరు ప్రమీల. ప్రస్తుతం డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసి ఇంట్లో ఖాళీగానే వుంది. మాకేమన్నా ఛాన్స్ ఇస్తే మంచి సంభంధం చూసి పెళ్ళిచేద్దామనుకుంటున్నాం." చిరునవ్వుతో అన్నాడు మనోజ్.

"అదేమిటి, అలా అంటున్నవ్?" కళ్ళు చిట్లించి ఆశ్చర్యంగా చూసింది తనూజ.

"మీకు తెలియంది ఏముంది? ఈ రోజుల్లో మేం ఎవర్నో ప్రేమించాం, వాళ్ళనిచ్చి పెళ్ళిచెయ్యండి అనడం మామూలు అయింది కదా." అదే చిరునవ్వు కంటిన్యూ చేస్తూ అన్నాడు మనోజ్.

"అదీ మంచిదే కదా. మీ మీద భారం తగ్గించినట్టుగా అవుతుంది." నవ్వింది తనూజ.

అనిరుధ్, మనోజ్ ఇద్దరూ నవ్వారు దానికి.

"నేనూ, మనోజ్ ఇంకా మంజీర ఒక కాలేజ్ లోనే చదివాము.” అనిరుధ్ అన్నాడు. “మనోజ్ చెల్లెలు ప్రమీల కూడా మాతోనే చదివింది. కాకపోతే మాకన్నా టు ఇయర్స్ జూనియర్. మేం ఫైనల్ ఇయర్ చదువుతూండగా తను ఫస్ట్ ఇయర్ చదివేది."

"ఐ సీ. " తలూపి అన్నాక మనోజ్ వైపు చూసి అంది తనూజ. "నువ్వూ కూచోబాబూ. నిలబడిపోయావ్."

"నువ్వప్పుడే వెళ్ళిపోతానంటే నేను ఒప్పుకోను." అనిరుద్ అన్నాడు

"సరే అయితే, నేను కిచెన్ లోకి వెళ్లి మనముగ్గురికీ కాఫీ తీసుకొస్తాను." అక్కడనుండి కదలబోతూ అన్నాడు మనోజ్.

అనిరుధ్ అప్పుడప్పుడూ వంటచేసుకుంటూ ఉంటాడు. మనోజ్ కి కూడా అక్కడ కిచెన్ లో అన్నివిషయాలూ బాగా పరిచయమే.

"నేను మరిచేపోయాను. కిందటిసారి కూడా ఇక్కడ ఏమీ తీసుకోకుండానే వెళ్లారు ఆంటీ." మనోజ్ అభిప్రాయానికి అంగీకరిస్తూ అన్నాడు అనిరుధ్.

"నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను ఇక్కడ లంచ్ కూడా చేసివెళ్తాను. ప్రస్తుతానికి ఇలా వచ్చి కూచో. మనం మాట్లాడుకోవాలి." తనూజ అంది.

కానీ ఆ మాటలు పట్టించుకోకుండానే అక్కడనుండి కిచెన్ లోకి వెళ్ళాడు మనోజ్.

"మంజీర తను పెట్టిన కండిషన్ గురించి చెప్పింది." అనిరుధ్ మొహంలోకి చూస్తూ అంది తనూజ.

"ఏ కండిషన్?" కన్ఫ్యూజన్ గా అడిగాడు అనిరుధ్.

"అంతముఖ్యమైన విషయం నువ్వు మరిచిపోయావా?" నవ్వింది తనూజ. "మీ ఇద్దరి మధ్య అసలు సెక్సే ఉండకూడదని చెప్పిందట కదా. అందుకు నువ్వు ఒప్పుకున్నావుట."

"అది మీకు చెప్పిందా?" ఆ విషయం గుర్తుకువచ్చింది అనిరుధ్ కి. "ఆ విషయం ఎవరికీ చెప్పదనుకున్నాను."   

"ఎదో మర్చిపోయి 'నేను పెట్టిన ఆ కండిషన్ కి కూడా అనిరుధ్ ఒప్పుకున్నాడు' అంది. నేను రెట్టించి ఆ కండిషన్ ఏమిటని అడిగే సరికి తనకి అదేమిటో చెప్పక తప్పలేదు." చిరునవ్వుతో అంది తనూజ.

"కానీ నేను దానికి సీరియస్ గానే ఒప్పుకున్నాను." అనిరుధ్ అన్నాడు. "తనకి ఇష్టం లేకపోతె మా మధ్య అది ఉండదు."

"నువ్వు ఒప్పుకుంటావని నాకు తెలుసు." తనూజ ఇంకా ఎదో చెప్పబోతూ ఉంటే, మనోజ్ అక్కడికి ఒక ట్రే లో మూడు కాఫీ కప్పులతో వచ్చాడు. తనూజ, అనిరుధ్ ఇద్దరూ చెరో కాఫీ కప్పు తీసుకున్నాక, తనూజ కి అపోజిట్ గా ఒక కుర్చీ లాక్కుని అందులో కాఫీ కప్పుతో కూచుని, ట్రే ని పక్కన నేల మీద పెట్టాడు.

"కానీ జీవితం లో సెక్సే లేకుండా జీవించడం చాలా అబ్నొర్మల్. మగవాళ్ళకైనా, ఆడవాళ్ళకైనా సెక్స్ చాలా సహజమైన, ఇంకా ముఖ్యమైన విషయం. ఒకవేళ మీరిద్దరూ సెక్స్ లేకుండా జీవించడానికి మేనేజ్ చేసుకోగలిగినా, అలా జీవించడం అభినందించదగ్గ విషయం కాదు."   

ఆ విషయానికి ఏం మాట్లాడాలో తెలియక అనిరుధ్ మౌనంగా వుండిపోయాడు. టాపిక్ కొంచెం ఇబ్బందికరంగా ఉండడం తో మనోజ్ కూడా ఏం మాట్లాడకుండా మౌనంగానే వున్నాడు. కానీ ఇలాంటి విషయాలు ఎవరిదగ్గరైనా మాట్లాడాల్సి రావడం తనూజకి కొత్తకాదు.

"నేను మంజీర తో మాట్లాడాను." ఒక రెండు కాఫీ సిప్స్ తీసుకున్న తరువాత అంది తనూజ. "అటువంటి కండిషన్ పెట్టడం సరైన విషయం కాదని, తనని ఇష్టపడి పెళ్లిచేసుకోవడానికి ముందుకొస్తున్న నిన్ను ఇబ్బంది పెట్టడం మంచిది కాదని చెప్పను. తను నార్మల్ గా మారి సెక్స్ ని యాక్సెప్ట్ చెయ్యడం చాలా ముఖ్యం అని చెప్పాను. పెళ్లినాటికే తను అన్నివిధాలుగానూ నార్మల్ గా మారి, సెక్స్ ని ఎంజాయ్ చేసే స్థితికి రావాలని చెప్పాను."

"కానీ తను ఏ ప్రకారంగానూ ఇబ్బందిపడడం నాకు ఇష్టం లేదు. అలా తను తనని నార్మల్ గా మార్చుకునే స్థితిలో చాలా ఇబ్బందిపడాల్సి ఉంటుంది." అనిరుధ్ అన్నాడు.

"కానీ తప్పదు. తను సైకలాజికల్ గా కూడా పూర్తి హెల్తీ గా మారాలి. నా మేనకోడలు అన్ని రకాలుగా హ్యాపీ లైఫ్ జీవిస్తూంది అని కన్ఫర్మ్ చేసుకున్నాకే నేనిక్కడనుండి వెళతాను." దృఢస్వరం తో అంది తనూజ. 

మరొకసారి ఏం చెప్పాలో తెలియక మౌనంగా వుండిపోయాడు అనిరుధ్. అనిరుధ్ ఇంకా మనోజ్ కాఫీ తాగడం కూడా మర్చిపోయి తనూజ చెప్పింది వింటున్నారు.

"నాకు చాలా చేసాడు మా అన్నయ్య. అద్భుతమైన లైఫ్ వచ్చేలా చేసాడు. కానీ తనకి ఎంతో ముఖ్యమైన సమయంలో నేను సహాయంగా ఉండలేకపోయాను. ఎంతో చక్కగా ఉండాల్సిన నా మేనకోడలు జీవితం ఏ రకంగానూ తేడాగా ఉండడం నాకు ఇష్టం లేదు. నేను తననిఅన్నివిధాలుగానూ సరిచేసే ఇక్కడనుండి వెడతాను." చెప్పాక మళ్ళీ కాఫీని సిప్ చేసింది తనూజ.

తనూజ ఇచ్చిన ఆ చిన్న గ్యాప్ లో అనిరుధ్, మనోజ్ ఇద్దరూ అదే చేశారు.

"తనని ఇష్టపడి స్వచ్ఛదంగా పెళ్లిచేసుకోవడానికి ముందుకొస్తూన్న నువ్వుకూడా ఏ రకంగానూ ఇబ్బంది పడకూడదు. తనునా మాటని మన్నించి నీకు తప్పకుండా సెక్సువల్ గా కూడా కో-ఆపరేట్ చేస్తుంది. పెళ్లికిముందే అది మీ ఇద్దరిమధ్య పూర్తయింది అనిపించాలని, అంతగా తను డెవలప్ కావాలని తనకి చెప్పాను. నువ్వు కూడా కో-ఆపరేట్ చేస్తే అది తప్పకుండా సాధ్యం అవుతుంది."

"అంటే మీ ఉద్దేశంలో.............." అనిరుధ్ మొహం పూర్తిగా అనీజీనెస్ తో నిండిపోయింది అది వినగానే.

"ఎస్, మిస్టర్ అనిరుధ్. నా ఉద్దేశం అదే." నవ్వింది తనూజ. "పెళ్లయ్యే నాటికే తనకా విషయంలో వున్న సమస్య పూర్తి గా తీరాలి. మీరు చక్కగా ప్రతీది ఎంజాయ్ చేయగలగాలి. మీరిద్దరూ అది చక్కగా పూర్తి చేసి, పూర్తయిందని నాకు చెప్పాలి."

మరోసారి ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా వుండిపోయాడు అనిరుధ్.

"పెళ్ళికి ముందు సెక్స్ ఈ రోజుల్లో చాలా కామన్. అందులోనూ మీరిద్దరూ కాబోయే భార్యాభర్తలు. తనని నార్మల్ గా చెయ్యడానికి నీ కో-ఆపరేషన్ కూడా చాలా అవసరం." కొంచెం సీరియస్ ఎక్సప్రెషన్ తో అంది తనూజ.

"ఒకే ఆంటీ, మీరు చెప్పినట్టే చేస్తాను." ఇంకా ఇబ్బంది పడుతూనే అన్నాడు అనిరుధ్.

"తను నార్మల్ గా ఉంటుంది. ఎంతో యాక్టీవ్ గా మూవ్ అవుతూ ఉంటుంది. తనని బయటనుండి చూసిన వాళ్ళెవ్వరూ తనకి సెక్స్ పట్ల అలాంటి ఇరిటేషన్ ఉందనుకోరు." మనోజ్ అన్నాడు. "అసలు తనకి ఇలాంటి సమస్య ఎందుకు వచ్చివుంటుంది?"

"కాఫీ బాగుంది." కాఫీ ని ఫినిష్ చేసి, కాఫీ కప్పుని పక్కన నేలమీద పెడుతూ అంది తనూజ.

"అనిరుధ్ అయితే ఇంకా బాగా పెట్టివుండేవాడు, తనంత ఎక్స్పర్ట్ ని కాదు నేను." నవ్వుతూ అన్నాడు మనోజ్.

"ఇట్స్ ఆల్ రైట్." మళ్ళీ కుర్చీలో వెనక్కి జరగిలబడుతూ అంది తనూజ. "బాగా ట్రెడిషనల్ ఫ్యామిలీస్ లో పెరిగిన కొంతమంది ఆడపిల్లలు సెక్స్ ని అంత తేలిగ్గా యాక్సెప్ట్ చెయ్యలేరు."

"కానీ ఆంటీ..........." మనోజ్ అన్నాడు. "...........ఏ మాట కా మాట చెప్పాలంటే తన ఫ్యామిలీ ఏమీ అంత ట్రెడిషనల్ ఫ్యామిలీ కాదు. తను పబ్ లకి వాటికీ కూడా వెళ్ళేది."

"తన తల్లి తన చిన్నతనం లోనే పోయింది. తర్వాత తనని చూసుకున్నది సర్వెంట్ మైడ్స్ మాత్రమే. సో తనకి సరైన గైడెన్స్ కానీ, పెంపకం కానీ లేదు. ఇంట్లో ఒక్కతే ఆడపిల్ల.   తన ఫీలింగ్స్ ఫ్రీ గా షేర్ చేసుకోవడానికి ఎవరూ లేరు. బహుశా ఇలాంటి కారణాలవల్ల వేటి వల్లో తనకి సెక్స్ అంటే అలాంటి అయిష్టం వచ్చివుంటుంది." కాస్త ఆగింది తనూజ. "అయినా తనకి సెక్స్ పట్ల ఎందుకలాంటి ఇరిటేషన్ వచ్చింది అన్నదానికన్నా, తనని మామూలుగా చెయ్యడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను."

"మీరు చెప్పింది నిజం." అనిరుధ్ అన్నాడు. "తనెందుకలా అయింది అన్నదాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. సెక్స్ పట్ల అలాంటి ఇరిటేషన్ లేకుండా పోవాలి. అంతే."

తనూజ చెప్పింది విన్న తరవాత చాలా థ్రిల్లింగా వుంది అనిరుధ్ కి. తను సెక్సువల్ గా మంజీర తో అడ్వాన్స్ కావచ్చు. తనుకూడా అందుకు కో-ఓపెరేట్ చెయ్యడానికి సిద్ధంగా వుంది.

"ఒకే గైస్. మరింక నేను వెళతాను. మీ ఇద్దరిగురించి లంచ్ దగ్గర నేను ఎదురు చూస్తూ వుంటాను. బై."

అనిరుధ్, మనోజ్ ఇద్దరూ కూడా అప్పటికి కాఫీ తాగడం పూర్తి చేసి, కాఫీ కప్పులు కిందపెట్టి లేచి నిలబడ్డారు. తరువాత తనూజ వెళ్లిపోతూవుంటే, గుమ్మం వరకూ వచ్చి సాగనంపారు.

తరువాత అనిరుధ్, మనోజ్ ఇద్దరూ లంచ్ టైం వరకూ చదువుకున్నారు. అనిరుధ్ చాలా అడిగాడు కానీ, తనతో పాటుగా సర్వేశ్వరం ఇంటికి లంచ్ కి వెళ్ళడానికి మనోజ్ ఒప్పుకోలేదు. అందువల్ల మనోజ్ తన ఇంటికి వెళ్ళిపోతే, అనిరుధ్ ఒక్కడే సర్వేశ్వరం ఇంటికి లంచ్ కి వెళ్ళాడు.

&&&

"ఓహ్, గాడ్! నువ్వు ఇలా రావడం, నాతో మాట్లాడ్డం నాకు చాలా ఆనందం గా వుంది." అనిరుధ్ మొహం లోకి చూస్తూ ఆనందం గా అంది మంజీర.

అనిరుధ్, మంజీర ఇద్దరూ మునపట్లా మంజీర రూమ్ లో తను బెడ్ మీద, అనిరుధ్ కుర్చీలో కూచునివున్నారు.

"నిజంగా నేనిలా రావడం నీకు ఆనందంగానే ఉందా? అంటే నా మీద ఏదన్నా లవ్ ఫీలింగ్ స్టార్ట్ అయినట్టేనా?" చిరునవ్వుతో కుర్చీలో ఇంకా అడ్జస్ట్ అవుతూ అడిగాడు అనిరుధ్.

"చెప్పలేను, ఏదో ఫీలింగ్ మాత్రం స్టార్ట్ అయినట్టుగానే వుంది." గలగలా నవ్వింది మంజీర. "నిన్నిలా చూస్తూంటే థ్రిల్లింగా వుంది."

"కానీ ఒకప్పుడు నన్ను చూస్తేనే నీకు చాలా ఇరిటేషన్ గా ఉండేది కదా. ఇప్పుడెందుకు ఆలా అనిపించడం లేదు?" కళ్ళు చిట్లించాడు అనిరుధ్.

"ఏదో మ్యాడ్నెస్ లో ఆలా బిహేవ్ చేసాను. నిన్ను అది మర్చిపొమ్మని చెప్పను కదా. నీకు సారీ కూడా చెప్పాను." చిరుకోపంతో అంది మంజీర.

"ఏదో మామూలుగా అన్నాలె ఆ విషయం పట్టించుకోకు." నవ్వాడు అనిరుధ్. "ఇంక నెక్స్ట్ స్టెప్ మన పెళ్లే కదా. మన పెళ్ళికి మీ డాడ్ ఎప్పుడు ముహూర్తాలు పెట్టిస్తున్నారు?" ఇంకేం మాట్లాడాలో తెలియక అడిగాడు అనిరుధ్.

"చూస్తూవుంటే నాకన్నా నీకే పెళ్ళికి ఎక్కువ తొందరగా ఉన్నట్టుంది.  మరీ అంత తొందరగా ఉంటే నీ కాబోయే మామగారిని నువ్వే అడుగు."

"ఇలాంటి అందాల బొమ్మని సొంతం చేసుకోవాలని ఎవరికన్నా తొందరగానే ఉంటుంది కదా. మరీ ఆలస్యం చేస్తే నేను నిజంగానే అడుగుతాను."

"నేను మా ఆంటీ కి ఒక ప్రామిస్ చేసాను." అనిరుధ్ వైపు అలాగే చూస్తూ చిన్న గొంతు తో అంది మంజీర. "మన పెళ్లయ్యేలోపునే నేను ఆ విషయం లో పూర్తి నార్మల్ గా అవుతానని."

ఆ విషయం వినగానే అనిరుధ్ గుండె ఝల్లుమంది. "ఏ విషయం లో?" అర్ధం కానట్టుగా అడిగాడు.

"అదే సెక్స్ విషయం లో నాకున్న ఇరిటేషన్ ఇంకా అలర్జీ ని పూర్తిగా తగ్గించుకుని నార్మల్ అవుతానని."

"నీకు ఇష్టం లేకుండా ఏ విషయం వద్దు. నువ్వు అనవసరం గా ఇబ్బంది పడొద్దు. మనం అది లేకుండా కూడా హ్యాపీ గా ఉండగలం."

"లేదు అనిరుధ్. ఆంటీ చెప్పింది నిజం. అందరూ సెక్స్ అలా ఎంజాయ్ చేస్తూ వున్నప్పుడు నేను మాత్రం దానిపట్ల ఎందుకు ఇరిటేషన్ ఫీలవ్వాలి? దట్ ఈజ్ సంథింగ్ ఆన్-నాచురల్ అనీ నాకూ అనిపిస్తూంది. అంతేకాకుండా నావల్ల నువ్వు కూడా ఇబ్బంది పడకూడదు."

"నేను ఏ ఇబ్బందీ పడను. నువ్వు అనవసరంగా.............."

"ఇది కేవలం నీ గురించి అలోచించి మాత్రం కాదు." అనిరుధ్ ని కట్ చేస్తూ అంది మంజీర. "నా గురించి కూడా. నేను నా ఆంటీ కి ఇచ్చిన మాట గురించి కూడా."

"ఒకే దెన్. నాకు ఇంతకన్నా ఆనందకరమైన విషయం ఇంకేం ఉంటుంది? ఇప్పటివరకూ నీలాంటి అప్సరస అందాల్ని ఎంజాయ్ చేయలేనని బెంగపడుతూ వున్నాను. ఇప్పుడు నువ్వే నీ అంతట నువ్వుగా ముందుకు వచ్చావు." గట్టిగా నవ్వి అన్నాడు అనిరుధ్.

మంజీర కూడా నవ్వింది అది వినగానే. ఎందుకో సడన్గా తన బుగ్గలు రెండూ ఎర్రబడిపోయాయి సిగ్గుతో.

"వాట్ ఈజ్ ది ఫస్ట్ స్టెప్ ఇన్ ఇట్ దెన్? మనం ఇప్పుడు ఏం చెయ్యాలి?"అనిరుధ్ అడిగాడు

"ఆంటీ కి మాట అయితే ఇచ్చాను కానీ ఏం చెయ్యాలో నాకైతే ఐడియా లేదు. నువ్వే ఆలోచించు."చిరునవ్వుతో నొసలు మూడేసి అంది.

"నిన్ను తెగించి ఏం చేద్దామన్నా నువ్వా నిరంజన్ కి ఇచ్చిన ట్రీట్మెంట్ గుర్తుకు వచ్చి భయం వేస్తోంది. దెబ్బకి వాడెంత భయపడిపోయాడో తెలుసా?" భయం నటిస్తూ అన్నాడు అనిరుధ్.

"వాడికి ఆ ట్రీట్మెంట్ ఇచ్చింది మామ్, నేను కాదు." నవ్వింది మంజీర. "మామ్ నువ్వే నా మొగుడివని ఫిక్స్ అయిపోయి వుంది. వేరే ఎవడన్నా నా వంటిమీద చెయ్యి వేస్తె ఎలా వూరుకుంటుంది?కానీ నువ్వయితే మాత్రం ఏమీ చెయ్యదు. అంతేకాకుండా తన దృష్టిలో మన పెళ్లి అయిపోయింది కూడా."

"మంజీ........డార్లింగ్ ...........అది నీ మామ్ కాదు. పార్ట్ అఫ్ యువర్ మైండ్. నీ సబ్-కాంషస్."

"అలా యాక్సెప్ట్ చెయ్యడం ఇప్పటికీ నాకు కష్టంగానే వుంది." నిట్టూర్చింది మంజీర. "బట్ నీ విషయం లో అలా జరగదు. భయపడకు."

"భయపడినా తెగిస్తాను. ఎందుకంటే నేనూ నీ ఆంటీకి మాట ఇచ్చాను."

"నువ్వు నా ఆంటీ కి మాట ఇవ్వడం ఏమిటి?" నొసలు ముడేసి అడిగింది  మంజీర.

తనకి తనూజ కి జరిగిన సంభాషణ గురించి చెప్పాడు అనిరుధ్.

"నన్నెలాగైనా నార్మల్ చెయ్యాలని చాలా కమిట్మెంట్ తో వుంది నా ఆంటీ." నిట్టూర్చింది మంజీర. "చాలా ముఖ్యమైన సమయం లో నాకు తోడుగా వుండలేకపోయానని, అందుకనే ఇలా ఆన్-నాచురల్ గా తయారయ్యానని తన బాధ."

"అదీ నిజమే కదా. అందరి ఆడపిల్లల్లాగే నీకూ నా అన్న ఒక అమ్మలాంటి ఆడతోడు ఉండివుంటే, నీకిప్పుడీ సమస్య ఉండేది కాదేమో."

"నాకిప్పుడీ సమస్య ఎందుకువచ్చింది అన్న డిష్కసన్ కి కాదు కదా మనం ఇక్కడ వున్నది." చిరాగ్గా అంది మంజీర. "అది ఎలా సాల్వ్ చెయ్యాలో చూడ్డానికి మనం ఇక్కడ వున్నాం. ఒక మగాడివి, దానికి ఏం చెయ్యాలో ఆలోచించకుండా నన్ను సలహాలు అడుగుతున్నావు? షేమ్ ఆన్ యువర్ పార్ట్."

"నేను మరీ అంత ఇది కాదు. జస్ట్ నువ్వెలా రియాక్ట్ అవతావా అని ఆలోచిస్తున్నాను." కుర్చిలోనుండి లేస్తూ అన్నాడు అనిరుధ్. "అందులో మొదటి పార్ట్ గా నేను నీ పక్కకి వచ్చి కూచుంటాను."

"గో ఆన్" ఎంకరేజింగ్ గా చూస్తూ అంది మంజీర.

"నీ చుటూ చెయ్యి కూడా వెయ్యొచ్చా?" మంజీర పక్కన కూచున్నాక అన్నాడు అనిరుధ్.

"చిన్న ముద్దు కూడా పెట్టుకో, నో ప్రాబ్లెమ్." నవ్వింది మంజీర.

దానితో మంజీర చుట్టూ చేతులు వేసి, తన పెదవుల మీద స్ట్రెయిట్ గా ముద్దు పెట్టుకున్నాడు అనిరుధ్. తన చేతులు కూడా అనిరుధ్ చుట్టూ వేసి ఆ ముద్దు తో కో-ఆపరేట్ చేసింది మంజీర.

అనిరుధ్ జీవితంలో ఒక అమ్మాయిని, అందులోనూ మంజీర లాంటి అప్సరస ని ముద్దుపెట్టుకోవడం అదే మొదటిసారి. మెత్తటి ఆమె పెదాలు తన పెదాల కింద నలుగుతూ ఉంటే ఏదో స్వర్గం లో వున్నట్టుగా అనిపించింది. కాస్సేపట్లోనే తనని గట్టిగా కౌగలించుకుని రెండు బుగ్గలమీద ముద్దులు పెట్టుకున్నాడు. బలమైన, గుండ్రని ఆమె వక్షోజాలు రెండూ తన ఛాతికి హత్తుకున్నప్పుడు ఎక్కడలేని సుఖం అనిపించింది అనిరుధ్ కి.

(ఇంతవరకూ మీకు నచ్చిందని భావిస్తా. తదుపరి భాగం సాధ్యమైనంత త్వరలోనే అప్లోడ్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మర్చిపోవద్దు.)