Are Amaindi - 15 in Telugu Thriller by sivaramakrishna kotra books and stories PDF | అరె ఏమైందీ? - 15

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

అరె ఏమైందీ? - 15

అరె ఏమైందీ?

హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్

కొట్ర శివ రామ కృష్ణ

"అవన్నీ తరువాత. ముందు ఏ టాబ్లెట్ వేసుకోవాలో చెప్పు."

"ఇప్పుడింత గాభరా పడే బదులు అప్పుడది వాడిని పెట్టుకోమనకపోయావా?"

"అంత ప్లానింగ్ తో వెళ్ళలేదు."

"సరేలే. ఇంతకీ ఎప్పుడు జరిగింది ఈ ఘనకార్యం?"

"ఈ రోజు మానింగే."

"రేపు మానింగే నువ్వు నా దగ్గరికి రా. నీకొక టాబ్ ఇస్తాను, వేసుకుందువుగాని. అలాగే ఒక స్ట్రిప్ నీ దగ్గర అట్టేపెట్టుకో. నీకు ఇకపై తరచూ అవసరం కావొచ్చు."

"థాంక్యూ వెరీ మచ్."

"నువ్వు నాకు థాంక్స్ చెప్పక్కర్లేదు. కానీ రేపు మానింగే రావడం మర్చిపోకు. ఆ టాబ్లెట్ సెవెంటీ టు అవర్స్ గడవకుండా వేసుకోవాలి. అలాగే ఇంకొక సజెషన్." కాస్త ఆగి చెప్పింది రజని. "నువ్వు వాడిని గ్లోవ్ పెట్టుకోమని ఇన్సిస్ట్ చెయ్యి. నువ్వు టాబ్ పెట్టుకోవడం కన్నా అది బెస్ట్."

"ఒకే అలాగే." నవ్వింది ప్రమీల.

కానీ ఆ రోజు రాత్రే తనకి పీరియడ్స్ వచ్చేసాయి. ఇంక కడుపు రాదని తేలిపోయి చాలా రిలాక్స్డ్ గా ఫీలయింది. ఆ విషయం చెప్తే రజని మాత్రం చాలా డిజప్పోయింట్ అయిపోయింది. తను తన దగ్గరికి వెళ్తే వాడు ఎలా చేసాడో అంతా తీరు, తీరున అడిగి తెలుసుకుందామనుకుంది.

ఇలా ఏం చేయాలో తోచక ఇబ్బంది పడుతున్న తరుణం లో ఫోన్ మోగింది. ఎవరా అని చూస్తే రజని. “చెప్పవే.” ఫోన్ ఎటండ్ చేసి అడిగింది ప్రమీల.

“ఏమిటది. విరహంతో వేగిపోతునట్టుగా వుంది గొంతు.”

“సరిగ్గానే గెస్ చేశావ్. ఆ రాస్కెల్ ఒక పదిరోజులు వూరు వెళ్ళి వస్తానని వెళ్ళాడు. ఇంకా రాలేదు.” గట్టిగా నిట్టూరుస్తూ అంది ప్రమీల.

“ఆ కాస్తా  అయిపోయేవరకూ ఒక లెక్క, అది అయిపోయాక ఒక లెక్క. తట్టుకోవడానికి కష్టంగానే వుంటుంది.”

“ఇదీ సరిగ్గానే గెస్ చేశావ్.” నవ్వింది ప్రమీల.  

“అలా ఒక్కదానివి ఏం ఇబ్బందీపడతావ్? నా దగ్గరికి రావచ్చు కదా, నాకూ కాస్త కాలక్షేపం గా వుంటుంది.”

మంచి ఆలోచనే అనిపించింది ప్రమీలకి. “సరే ఒక అరగంటలో నీ దగ్గర వుంటాను.”

“అమ్మగారు ఎక్కడికి బయలు దేరారు? పెళ్లీడుకొచ్చిన పిల్లవి, అలా వూరంతా షికార్లు తిరిగవస్తే బావుండదు.” బయటకి వస్తూండగా అంది తన తల్లి మల్లీశ్వరి.

“ఎక్కడికోకాదమ్మా. నా ఫ్రెండ్ మల్లీశ్వరి దగ్గరికే. వేగంగానే వచ్చేస్తాలే.” అని చెప్పి బయటపడింది.

“ఇప్పుడు చెప్పు, ఎలా వుంది వాడితో నీ మొదటి అనుభవం. మామూలుగానే మొదటి అనుభవం అందరికీ చాలా ముఖ్యమైనది. అందులోనూ మా అందరిలా కాకుండా చాలా పదిలంగా కాపాడుకుంటూ వచ్చావు చాలా కాలం పాటు.” ఇద్దరూ రజనీ రూమ్ లో, రజనీ బెడ్ మీద ఒకళ్లకోకళ్ళు అపొజిట్ గా  సెటిల్ అయ్యాక, ప్రమీల మొహం లోకి సూటిగా చూస్తూ అడిగింది రజని.

“నేననుకున్నా వచ్చీరాగానే నన్ను నువ్వు ఇదే అడుగుతావని “ నవ్వింది ప్రమీల.

“ఆడగక. అలాంటి అనుభవం వినడానికి కూడా చాలా థ్రిల్లింగ్ గా వుంటుంది. నాకైతే నేను ఇంకా పెద్దమనిషిని  కాకుండానే నా బావ చేతుల్లో ఆ అనుభవం అయిపోయింది.”

“నాకూ ఒక బావ వుండివుండి వాడితో పెళ్లిచేయాలని మా వాళ్ళు ఆలోచిస్తూవుండివుంటే నీకులాగే అయివుండేది.” మళ్ళీ నవ్వింది ప్రమీల.

“నిజానికి నా బావా నేను ఆదిచేసుకున్నప్పుడు మా రెండు కుటుంబాల వాళ్ళు కూడా ఆ ఆలోచనతో లేరు ఏవో కొన్ని తగవులు మా కుటుంబాల మధ్య వుండడం వల్ల. కాకపోతే మా కుటుంబాల మధ్య సఖ్యత ఏర్పడి ఆ తర్వాత తర్వాత మా పెళ్లి చేయాలన్న నిర్ణయానికి వచ్చేశారు.”

“కాకపోతే ఈలోపునే మీ ఇద్దరూ ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లూ దొంగచాటుగా కలుసుకుని అది అయిందనిపించేశారు.”

“అంతా ఫ్రీగా అన్నిసార్లూ అవ్వలేదు. ఏదో కొన్నిసార్లు అవకాశం దొరికింది. కాకపోతే.............” కాస్త ఆగి అంది “............... నేను పెద్ద మనిషిని కావడానికి ముందు, పెద్ద మనిషిని అయిన తరువాత నన్ను మొదటిసారి అనుభవించింది నా బావే.”

“ఒకపక్క నీ బావని పెళ్లిచేసుకోవడానికి సిద్ధంగా వున్నావు. ఇంకోపక్క ఇలాంటి చిలకొట్టుళ్ళు నీకవసరమా? మీరిద్దరూ ఒకళ్ళకొకళ్ళు నిజాయితీ గా వుండలేరా?”

“అప్పుడప్పుడు అలాగా అనిపిస్తూ వుంటుంది. కానీ ఒకసారి అదలా టేస్ట్ చేశాక, మళ్ళీ వాడితో అవలేదు. అదిలేకుండా వుండలేక ఏదో కుదిరినవాళ్ళతో అలవాటైపోయింది. అయినా అన్నీ సందర్భాల్లోనూ జాగ్రత్తగానే వున్నాను ఏదో కడుపు, కాలు రాకుండా.” గట్టిగా నిట్టూరుస్తూ అంది రజనీ.

“అయినా నీకు నా సిన్సియర్ సజేషన్. ఇకనైనా అలాంటివిలేకుండా వుండు. ఇంకా ఆగలేకపోతే నీ బావనిచ్చి నీకు వేగంగా పెళ్లిచేసేయమని చెప్పు.”

“మా వాళ్ళు ఆ ఆలోచనతోటే వున్నారు. సాధ్యమైనంత త్వరలో నా పెళ్లి నా బావ తో అయిపోతుంది.” నవ్వింది ప్రమీల. “కానీ నీకు తెలీదు. ఒకసారి ఆ టేస్ట్ తెలిసాక లేకుండా వుండడం చాలా కష్టం అయిపోతుంది.”

“ఆ విషయం ఇప్పుడు నేనూ ఒప్పుకుంటాను. కానీ ఒక సిస్టమ్ ఇంకా మోరల్స్ లేకుండా ఎవరితోపడితే వాళ్ళతో సెక్స్ నేను అంగీకరించలేను. మనం పెళ్లిచేసుకోగలం అన్నవాళ్ళతోనే సెక్స్ కి అంగీకరించాలి. పెళ్లయ్యాక కేవలం భర్త తో మాత్రమే సెక్సుయల్ రిలేషన్షిప్ వుండాలి.”

“ఒక్క విషయం చెప్పు, నిన్ను చేసుకోబోయేవాడు కూడా అలాగే వుంటాడంటావా? నువ్వే చెప్పావుగా ఆ సాకేత్ నీతో ఏమన్నాడో. మగాళ్ళందరూ అలాగే వుంటారు. వాళ్ళకి అక్కరలేని మోరల్స్ మనకిమాత్రం దేనికి?” కోపంగా అడిగింది రజని.

“నువ్వు చెప్పింది కాదనలేను. అలాగని విచ్చలవిడితనాన్ని అంగీకరించలేను.”

“నువ్వు పాతకాలం మనిషివి. నీకు మోరల్స్ ముఖ్యం.”

“అలాగే అయితే పెళ్లికిముందే వాడితో ఎందుకు పడుకుంటాను? నువ్వు చెప్పింది నేను ఒప్పుకుంటాను. అది కొన్ని సందర్భాలలో తట్టుకోవడం కష్టమే. కాకపోతే నేను ఇందాక చెప్పినట్టుగా మనం పెళ్లిచేసుకుందాం అనుకుంటున్న వాళ్ళతోటే సెక్సుయల్ కాంటాక్ట్ పెట్టుకోవాలి. అలాగే ............”

“అర్ధం అయింది తల్లీ, అర్ధం అయింది, ఇంక అది ఆపు.” రెండుచేతులతో దణ్ణం పెట్టి అంది రజని. “ఇంతకీ నీ మొదటి అనుభవం గురించి చెప్పు, ఎలా వుంది వాడిచేతుల్లో?”

“నువ్వు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ రైట్. అనుభవం లేనివాడితో కన్నా అనుభవం వున్నవాడితో అది చాలా బావుంటుంది. వాడు నాతో ఎంత చక్కగా, డీల్ చేసి, ఎంత సుఖం ఇచ్చాడంటే, వాడికి ఇంతకుముందే అందులో అనుభవం వుందని చెప్పినందుకు నాకు కోపం రాలేదు.”

“అమ్మాయిలకి అందులో అనుభవం లేకపోయినా పర్లేదు, కాని అబ్బాయిలకి లేకపోతే మాత్రం విషయం చెడుతుంది. అనుభవం లేని ఒకళ్ళిద్దరితో నా అనుభవం నాకదే చెప్పింది.”

ఆ విషయం విని మరోసారి నవ్వింది ప్రమీల. “నా మొదటి సారి అనుభవం నాకు అద్భుతం గా వుంది. ఇంకా సంతోషించాల్సిన విషయం ఏమిటంటే ఆ సాకేత్  నన్ను ఎప్పుడుకావాలంటే అప్పుడు పెళ్లి చేసుకోవడానికి సిద్ధం గా వున్నాడు. కడుపు వచ్చినా పర్లేదు, కాంట్రాసెప్టివ్ ఏం వద్దని చెప్పాడు. నాకే భయం వేసి నిన్ను అడిగాను. అంతలోనే అయిపోయాను.”

“ఏమైనా పెళ్లయ్యేవరకూ మీరిద్దరూ జాగ్రతగా వుండండి. మరొక సలహా. టాబ్ కన్నా………..”

“గుర్తు వుందిలే. ఈ సారి వాడిని అది పెట్టుకోమని ఇంసిస్ట్ చేస్తాను. కానీ ........... “ ఏదో సందేహిస్తున్నట్టుగా ఆగింది ప్రమీల.

"నా దగ్గర నువ్వే విషయానికి సందేహిచక్కరలేదు. ఏం చెప్పదలుచుకున్నావో ఫ్రీగా చెప్పు." రజని అంది.

"నాకు ఒకొక్కసారి చాలా గిల్టీగా కూడా వుంది. పెళ్ళికి ముందు ఆలా సెక్స్,  ఎదో పెళ్లిచేసుకోబోయేవాడే అయినా, పెద్ద తప్పు చేస్తున్నట్టుగానే వుంది."

"అంతకన్నా చాలా పెద్ద, పెద్ద తప్పులు చేస్తున్న వాళ్ళే ఎంతో హ్యాపీ గా మనచుట్టూ తిరుగుతూ వున్నారు. నువ్వేదో పెద్ద తప్పు చేస్తున్నట్టుగా ఫీలవ్వకుండా హ్యాపీగా ఎంజాయ్ చెయ్యి. మీరిద్దరూ ఎలాగూ పెళ్లిచేసుకోబోతున్నారుగా."

కింద పెదవిని పళ్ళమధ్య బిగబట్టి ఆలోచనలో పడింది ప్రమీల.

"ఇంకా ఏమిటి ఆలోచిస్తున్నావు?"

"అతను మా కులమే. నన్ను పెళ్లిచేసుకోవడానికి అంగీకరించాడు. మా అన్నయ్యకి ఫ్రెండ్ కూడా కాబట్టి మా ఇంట్లో ఒప్పుకుంటారని అనిపిస్తూంది. అయినా మా ఇంట్లో ఏమంటారో, వాళ్ళింట్లో కూడా ఒప్పుకుంటారో, ఒప్పుకోరోనని అప్పుడప్పుడు టెన్షన్ గా అనిపిస్తూంది."

"అనవసరం గా గాభరా పడకు. అంతా మంచే జరుగుతుంది. కచ్చితంగా మీ ఇద్దరి ఇళ్ళల్లోనూ కూడా మీ పెళ్ళికి ఒప్పుకుంటారు." రజని అంది.

ఆ తరువాత రజని తో ఇంకాసేపు మాట్లాడాక, రజని పేరెంట్స్ కి ఇంకా తన తమ్ముడికి కూడా బై చెప్పి ఇంటికి వచ్చేసింది ప్రమీల.

&&&

"నేను నిన్నలా బ్లాక్ మెయిల్ చేసి వుండకూడదు. ఆలా చేస్తేనే కానీ నువ్వు మంజీర ని పెళ్లిచేసుకోవేమోనని నాకనిపించింది. నా భార్య అలా స్పష్టం చేసేక, ఇంక వేరేవాళ్లకి ఇచ్చి నా కూతుర్ని పెళ్ళిచెయ్యడం నాకు అవ్వదని తెలిసిపోయింది.అందుకనే అలా చేసాను"

"మీరలా బాధ పడొద్దు. మీరు మా కుటుంబానికి ఎన్నోరకాలుగా సహాయ పడ్డారు. అందువల్ల మీరంటే నాకు చాలా అభిమానం వుంది." ఇంక అంతకన్నా అప్పుడు ఏం అనాలో అనిరుధ్ కి తోచలేదు. 

ఆ రోజు అనిరుధ్ మళ్ళీ సర్వేశ్వరం ఇంటికి వెళ్ళాడు. ఈ సారి అందరూ హాల్లో కుర్చీల్లోనూ, ఇంక సోఫా లోనూ కూచుని మాట్లాడుకుంటున్నారు. తనూజ, మంజీర సోఫాలో పక్కపక్కనే కూచుంటే, సర్వేశ్వరం ఇంక అనిరుధ్ వాళ్ళకి అపోజిట్ లో కుర్చీల్లో కూచున్నారు.

"కానీ అన్నయ్యా నీకు ఎన్నిసార్లు చెప్పాలి, అది నీ భార్య కాదు కేవలం మంజీర తాలూకు స్ప్లిట్ పెర్సనాలిటీ మాత్రమే అని." చిరాకుపడుతూ అంది తనూజ.

"నీ విషయం లో అలా కావచ్చు, కానీ నా విషయం లో మాత్రం అది నా భార్య నిర్మలే." దృఢస్వరం తో అన్నాడు సర్వేశ్వరం. "అంతకుముందు కూడా కొన్నిసార్లు నాతొ తాను మాట్లాడింది. కానీ ఆరోజు ఉన్నంత కోపంగా ఎప్పుడూ లేదు. తనని చూస్తే నాకు చాలా భయం వేసింది. తనతో స్పష్టం గా చెప్పేను. వేరే ఎవరికీ మంజీర ని ఇచ్చి పెళ్ళిచెయ్యను, అనిరుధ్ మాత్రమే తనకి భర్తగా ఉంటాడు అని. అప్పుడు మాత్రమే తను శాంతించింది."

కాస్త నిశబ్దం తరువాత మళ్ళీ సర్వేశ్వరమే అన్నాడు. "తన ఉద్దేశంలో తను అనిరుధ్ చేత తన తాళి మంజీర మెళ్ళో వేయించిననాడే పెళ్లయిపోయింది. అంత చిన్న సంఘటనతో వాళ్లిద్దరూ భార్యాభర్తలు అయిపోయారన్న తీర్మానానికి  తనెలా వచ్చేసిందో నాకు బోధపడడం లేదు."

"వదినకి మైండ్ సరిగ్గా పనిచేయదు. తనలా చెయ్యడం లోనూ, అలా అనుకోవడం లోనూ పెద్దగా ఆశ్చర్యం లేదు." తనూజ అంది.

"నన్ను ఆ రోజుల్లో ఆవిడ చాలా అభిమానం గా చూసేది, తరచూ నా కూతుర్ని పెళ్లిచేసుకుంటావా, తనని జాగ్రత్తగా చూసుకుంటావా అని అడిగేది. మేమిద్దరం అప్పుడు బాగా చిన్నపిల్లలం. అందరి పిల్లలలాగే ఆవిడ దగ్గర కూడా ఆడుకునేవాళ్ళం. అంతమాత్రానికే ఆవిడకి నా మీద అంత అభిమానం వచ్చి, తన కూతురికి భర్తగా చెయ్యాలనిపించి ఉంటుందా?" అనిరుధ్ అన్నాడు.

"వూళ్ళో అందరూ నా భార్య అంటే భయపడేవారు, తనని దూరంగా ఉంచేవారు. కానీ మీ అమ్మగారు మాత్రం తనతో చాలా స్నేహంగా ఉండేవారు. మీ అమ్మగారి లాంటి మనిషి అత్తగారు అయితే, తన కూతురు సుఖపడుతుందన్న అభిప్రాయం తో కూడా తను అలాంటి నిర్ణయానికి వచ్చిఉండొచ్చు." సర్వేశ్వరం అన్నాడు.  

"నువ్వు చెప్పింది నిజమే. తను అనిరుధ్ ని మంజీరకి భర్తగా అనుకోవడానికి అది మెయిన్ రీజన్ అయి ఉండొచ్చు." తనూజ అంది.

"బహుశా అలాంటి మైండ్ సరిగ్గా పనిచేయని వ్యక్తి కూతురన్న సింపతీ వల్ల కావచ్చు, అమ్మ నాతొ తరచూ చెప్పేది. మంజీర తో గొడవ పడొద్దు. తనతో చాలా మృదువుగా వుండమని. అందుకని అంతచిన్నతనమైన ఆ రోజుల్లో కూడా, నేను మంజీర ని ఏమనేవాడిని కాదు. చాలా జాగ్రత్తగా చూసుకునేవాడిని." అనిరుధ్ అన్నాడు. 

"అలా నువ్వు తనని ట్రీట్ చెయ్యడం కూడా నా వదినని ఇంప్రెస్ చేసి ఉండాలి, ఆవిడ నువ్వే తన కూతురి భర్తవి కావాలన్న నిర్ణయం తీసుకోవడానికి." తనూజ అంది.

"కానీ నేనెప్పుడూ అలా ఆలోచించలేదు. తను ఆ రోజు తన మంగళసూత్రం అనిరుధ్ చేత అలా మంజీర మెళ్ళో వేయించడం ఒక పిచ్చి చేష్టగానే అనుకున్నాను. ఆ తరువాత మంజీర కూడా అనిరుధ్ మీద ఎలాంటి ఆసక్తి చూపించలేదు. ఇంతలో నా ఫ్రెండ్ చిదంబరం మంజీర ని  తన కొడుకు నిరంజన్ కి ఇచ్చి పెళ్ళిచెయ్యమని అడిగాడు. చిదంబరం, అతని భార్య ఇద్దరూ మంచి వ్యక్తులు. అంతే కాకుండా మంజీర, నిరంజన్ ఇద్దరూ కాలేజ్ లోమంచి స్నేహితులుగా వుంటున్నారని, కలిసి తిరుగుతున్నారని కూడా చెప్పాడు. నాకు అభ్యంతరపెట్టడానికి ఏం కనిపించలేదు. నేను మంజీరని అడిగి చూసాను. తనూ నిరంజన్ స్నేహితులు అయిన మాట వాస్తవమేనని, తనతో పెళ్ళికి తనకి అభ్యంతరం లేదని చెప్పింది."."

"నాకేం అప్పటికి లైఫ్ మీద ఒక సీరియస్ అభిప్రాయం లేదు. నేను ఆలోచించింది అంతా డాడ్ అలా కావాలనుకుంటున్నారు, నేను వాడిని పెళ్ళిచేసుకుంటే హ్యాపీ గా ఫీలవుతారుఅని, అంతే." మంజీర అంది.

"ఆ నిరంజన్ ఒక పెద్ద రాస్కెల్. వాడికి చాలా మంది అమ్మాయిలతో సంభందం వుంది. ఇంకా పెద్ద తాగుబోతు. ఎంత మీ డాడ్ హ్యాపీ గా ఫీలవుతారని తెలిసినా వాడితో పెళ్ళికి నువ్వంత సైలెంట్ గా ఎలా ఒప్పేసుకున్నావో నాకు బోధపడడం లేదు." అనిరుధ్ అన్నాడు.

"ఆ నిరంజన్ అలాంటి వాడా? ఆ చిదంబరం తన కొడుకు చాలా మంచివాడని చెప్పాడే." సర్వేశ్వరం కోపంగా అన్నాడు.

"ఎవరన్నా తన కొడుకు గురించి మరొకలా చెప్తారా?" తనూజ అడిగింది.

"అయినా వాడలాంటి వాడు అయినప్పుడు నువ్వు ఆ విషయం నాకు చెప్పాలి కదమ్మా. ఎందుకు వాడితో పెళ్ళికి అలా ఒప్పేసుకున్నావు? ఒక తాగుబోతు, తిరుగుబోతు కి నిన్నిచ్చి పెళ్లిచేసి నేనెలా హ్యాపీ గా ఉండగలను?" సర్వేశ్వరం అన్నాడు వేదనగా.

"ఏమో డాడ్, అప్పుడంతగా ఆలోచించలేకపోయాను. పెళ్లి మరీ అంత ముఖ్యమైన విషయం లా అనిపించలేదు." మంజీర అంది.

"అలా చూస్తే నీ మామ్ నీకు చాలా ఉపకారం చేసింది. తనలా చెప్పివుండకపోతే తనతో నీ పెళ్లి చేసేసి ఉండేవాడిని భవిష్యత్తులో."

"అంతకుముందెప్పుడూ వదిన మంజీర లో ఎక్స్పోజ్ అయినప్పుడు, అనిరుధ్ కి తనని ఇచ్చి చేసేసిన పెళ్లి విషయం గురించి మాట్లాడలేదా? మన దృష్టిలో అది పెళ్లికాదు, కానీ తన దృష్టిలో అంతే కదా." తనూజ అడిగింది.

"ఆంటీ మీ దృష్టిలో తను మంజీర మామ్ కాదు, కేవలం తన స్ప్లిట్ పెర్సనాలిటీ మాత్రమే." అనిరుధ్ అన్నాడు. "అలాంటప్పుడు అంతకుముందు ఆ స్ప్లిట్ పెర్సనాలిటీ  ఆ విషయం గురించి మాట్లాడిందా లేదా అన్నదాని గురించి మనం ఎందుకు ఆలోచించాలి?"

"ఈ స్ప్లిట్ పెర్సనాలిటీలు, ఇంకా మల్టిపుల్ పెర్సనాలిటీలు చాలా చిత్రమైనవి. వాటిని క్యూర్ చెయ్యడానికి కూడా వాటిని అసలు వ్యక్తినుండి వేరుగా చూడాలి. వాటికీ సెపరేట్ ఐడెంటిటీ ఇచ్చి, వాటి భావాలకి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి."

"నేనెంత చెప్పినా నువ్వు నీ పాట మానవు కదా, నిన్ను సైకియాట్రిస్ట్ ని చేసి నేను పెద్ద తప్పు చేశాను." కోపంగా అన్నాడు సర్వేశ్వరం.

ఆదివినగానే అక్కడ వున్న తక్కిన ముగ్గురూ నవ్వారు.

"నో డాడ్. ఆంటీ చెప్పింది కూడా సబబు గానే కనిపిస్తూ వుంది. ఈ రోజుల్లో కూడా స్పిరిట్స్ అవీ ఏమిటి? నేను స్ప్లిట్ పెర్సనాలిటీ ప్రాబ్లెమ్ తో సఫర్ అవుతున్నాను, దానినుండి నేను క్యూర్ కావాలి." మంజీర అంది.

"నువ్వు అలా ఆలోచించడం నిజంగా చాలా ఆనందంగా వుంది." తనూజ అంది. "నువ్వే ప్రాబ్లెమ్ తో సఫర్ అవుతున్నానని యాక్సెప్ట్ చేసిన తరువాత, నీకు అందువల్ల ప్రాబ్లెమ్ లేకుండానే చెయ్యొచ్చు."

"ఇప్పుడు ఆంటీ అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి డాడ్. మామ్, అదే నాలో ఆవిడ స్ప్లిట్ పెర్సనాలిటీ ఎక్స్పోజ్ అయినప్పుడల్లా, అనిరుధ్ నా భర్త అని మాట్లాడేదా? నన్ను వేరే ఎవరూ పెళ్లిచేసుకోకూడదు అని చెప్పేదా?"

"అవును. అలాగే చెప్పేది. కాకపోతే మనిషిగా బతికున్నప్పుడు సరిగ్గా పనిచేయని మైండ్, దయ్యంగా మారాక పనిచేస్తుందా? ఆ పిచ్చితోటె అలా మాట్లాడుతోందనుకుని నేనా విషయం ఎప్పుడూ సీరియస్ గా తీసుకోలేదు. సరేలే అనిరుద్ధే మంజీర భర్త అనేసే వాడిని. కానీ నేనది కేవలం మామూలుగానే అంటున్నానని, సీరియస్ గా కాదని ఆ రోజు తనకి అర్ధం అయిపోయి వుండాలి. అందుకనే తను అంత సీరియస్ అయిపోయింది."     

అది విన్నాక మళ్ళీ తక్కిన ముగ్గురూ అక్కడ నవ్వారు.

"సరేలే ఈ స్ప్లిట్ పెర్సనాలిటీ ప్రాబ్లెమ్ ఎలా సాల్వ్ చెయ్యాలో ఆలోచిస్తాను." తనూజ అంది 

(ఇంతవరకూ మీకు నచ్చిందని భావిస్తా. తదుపరి భాగం సాధ్యమైనంత త్వరలోనే అప్లోడ్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మర్చిపోవద్దు.)