ఏం చేశాను నేను? నన్ను ఇంత గుండెల్లో వేదన పుట్టించి, నన్ను ఇలా ఒంటరిగా వదిలేసి నువ్వు ఎటో వెళ్లిపోతే నా పరిస్థితి ఏంటి?
నిన్ను గురించి ఎన్ని విషయాలు నా మనసులో, నా బుర్రలో పెట్టుకుని తిరిగానో నీకు తెలుసా? నాకు ఎంత నొప్పిగా ఉందో నీకు తెలుసా? నువ్వు చేసిన ప్రతి పని, చెప్పిన ప్రతి మాట గుర్తొచ్చినప్పుడల్లా నా గుండెల్లో నొప్పి వస్తోంది.
ఆరు సంవత్సరాల బంధం కదా మనది… ఇప్పుడు నా గుండెను ఎవరో పిండి పిసికేస్తున్నట్టుగా ఉంది. ఏడుపు రావడం లేదు. ఏడిస్తే గుండెల్లో ఉన్న భారం కొంచెమైనా తగ్గుతుందంటారు. కానీ నాకు మాత్రం కన్నీళ్లు కూడా రావడం లేదు. గుండెల్లో నొప్పి మాత్రమే మిగిలిపోయింది.
నా విషయంలో ఎందుకు ఇలా చేశావు? ఎందుకు నన్ను ఇంతగా బాధపెడుతున్నావు? నేను నీకు ఏం చేశాను?
రాత్రిళ్లు ప్రశాంతంగా నిద్రపోయి ఎన్ని రోజులు అయిందో తెలుసా? దాదాపు ముప్పై రోజులు అయింది. ఒక్క రాత్రి కూడా ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నాను.
నన్ను ఇంతగా బాధపెడుతున్నావని నీకు తెలియదా? నా పరిస్థితి నీకు అర్థం కావడం లేదా?
నువ్వు దూరంగా వెళ్లిపోయావు… కానీ నీ జ్ఞాపకాలు మాత్రం నన్ను వదిలిపెట్టడం లేదు. ప్రతి క్షణం నిన్నే గుర్తు చేసుకుంటూ, ఈ బాధను నా గుండెల్లో మోస్తూ ఉన్నాను.
- Anjali