చంద్రకాంతి నిండిన అడవిలో చల్లని సెలయేటి ఒడ్డున
కడివెడు కుండను నెత్తిన పెట్టిన ఓ పడతి......
అది కేవలం నీ రూపం కాదు…
ఒక జీవంతమైన వయ్యారం.....
నెత్తిన కుండలో నీరు కాదు నెత్తిన మోస్తున్న బరువేమో
ఆమె నడకలో నిండింది ఓ సహనం
చేతుల వలయాల్లో మెరిసేది వెండి కాదు
కాలాల్ని మోయగల ఓ నిశ్శబ్ద బలం....
నీలాకాశం కళ్ళలోకి దిగివచ్చినట్టు చంద్రుడు ఆమె లలాటాన తిలకమై కూర్చున్నట్టు పల్లవి పాడే గాలికి కూడా ఆమె పాదాల దగ్గర నిశ్శబ్దం నేర్పే వయ్యారం...
చీర మడతల్లో దాగుంది నీలి వయ్యారం
నెత్తి మీద మోస్తున్న కుండ నీటి బరువుకన్నా
బాధ్యత బరువు ఎక్కువైనా పెదవుల మీద చిరునవ్వు మాత్రం తరుగని అందం.....
చంద్రుని వెలుగు నెమ్మదిగా జారుతున్న వేళ అడవి ఊపిరి ఆపుకుని చూసిన దృశ్యం ఆమె సౌందర్యం అన్నట్టుగా ఉంది...