ఈ కాలం లో కూడా ప్రేమలేఖ రాస్తున్నాడు ఏంటి మూర్ఖుడు అని అనుకుంటవేమో ...అనుకున్న పర్లేదు
మనుసులో మాటలు నీకు చేరడానికి నేను మూర్ఖున్ని ఐన పర్లేదు
నా లోని భావాలని ఒక్క పదం లో తెలపాలి అంటే
"నేను నిన్ను ప్రేమిస్తున్నాను" నిజానికి ఈ పదం కూడా సరిపోదు అనిపిస్తుంది
ఎందుకంటే "ప్రేమిస్తున్నాను" అనే పధం లో ప్రేమని మాత్రమే ఇవ్వటం ఉంది
నేను అల అస్సలు ఉండను ..
నువ్వు నాతో ఉన్నప్పుడు ఆనందాన్ని చూపిస్తాను..
నువ్వు అలసి పోయి వచ్చినప్పుడు ని కోసం పనులు చేసి నా సేవ ని చూపిస్తాను
నువ్వు బాధలో ఉన్నప్పుడు నా ధైర్యాన్ని చూపిస్తాను..
అదే నికేమన్న అయితే కన్నీరు తో నా బాధని చూపిస్తాను..
చిరాకులో ఉన్నప్పుడు కోపాన్ని చూపిస్తాను ..
నీకు కోపం వచ్చేట్టు చేస్తూ సరసాన్ని చూపిస్తాను
ఒక్క మాటలో చెప్పాలి అంటే
గొప్ప ప్రేమికుడిలా నిన్ను ....మీ అమ్మ నాన్న ల చూసుకుంటాను అని అస్సలు చెప్పను
కానీ ఒక సాధారణ ప్రేమికుడిలా
నాతో ఉన్నని రోజులు నీకు మీ అమ్మ నాన్న లు గుర్తుకు రాకుండా మాత్రం చూసుకోగలను
ప్రేమున్న చోటే బయం ఉంటుంది అని ఎవరో చెప్పారు
బహుశ అందుకేనెమో ..
కాగితం పై రాయడానికి వచ్చిన అక్షరాలు .. నీతో చెప్పడానికి మాత్రం బయపడుతున్నాయి
అర్ధం చేసుకుంటావని ఆశిస్తూ
ప్రేమతో నీ...