బ్రతుకు తేనెటీగలా
చావకు తేనెలో పడ్డ ఈగలా
చిరిగిన బ్రతుకును కుట్టు సూదిలా
కుట్టి చావకు దోమలా చీమలా
పచ్చడైనా సరే ఆకలి తీర్చు బీరచెక్కులా
కాళ్ళ క్రింద పడి పడేయకు అరటి తొక్కలా
పూచి విచ్చి వాడిపోకు ముళ్ళ మధ్య గులాబి పువ్వులా
వేగి ఉడికి కడుపు నింపు గోబి పువ్వులా
కాలి కడుపుమంట చల్లార్చు రొట్టెలా
కాల్చుకు తినకు చితిలో పేర్చిన కట్టెలా
మురికినీ మరకనూ వదిలించు సబ్బు నురుగులా
పెరిగి తరగకూ సముద్రపు తరగలా
అందంగా ఇమిడిపో మంచిమాట లో ఓ అక్షరంలా
కూల్చి రాలకు కాల్చిన తూటాలా
ఓంశాంతి