బంధాలను పెనవేసే అనుబంధం ప్రేమ
సుమాలు వాడినా వీడని సుగంధం ప్రేమ
కన్నీటిని తుడిచే జడివాన ప్రేమ
మండపమై నీడనిచ్చే మండుటెండ ప్రేమ
చలిని చంపే చలిమంట ప్రేమ
దాహాన్ని దహించే జలపాతం ప్రేమ
గుండె గొంతుకలో సందడి చేసే మౌనరాగం ప్రేమ
అనురాగం చేరుకునే ఆఖరి మజిలీ ప్రేమ
కలలాంటి నిజం ప్రేమ
నిజం చేసుకోవాలనుకునే కల ప్రేమ
మమకారంతోవచ్చే అహంకారం ప్రేమ
చనువుతో చేసే చులకన ప్రేమ
జీవితం కోరుకొనే జీతం ప్రేమ
వేతనం ఆశించని పనితనం ప్రేమ
కలం నుండి జాలువారే అమృతం ప్రేమ
కలకాలం నిలిచుండే పరమాద్భుతం ఈ ప్రేమ