నాన్నా నీ జాడ ఎక్కడ?
నింగి లోని జాబిల్లి ని అడిగా,
మబ్బుల చాటున నువ్వు ఉన్నావేమో అని...
ఉబికి వస్తున్న కన్నీళ్ళ ను అడిగా,
కను రెప్పల మాటున నువ్వు దాగి ఉన్నావేమో అని...
నువ్వు రోజు నడిచే దారిలో వెతికా,
నీ పాద ముద్రలు అయినా కాన వస్తాయోమో అని...
నా తనువును తాకుతున్న చల్లని గాలిని అడిగా,
నువ్వు ఎక్కడైనా కనబడినావా అని...
నిత్యం పూజించే దీపంను అడిగా,
నిన్ను చేరే మార్గం చూపమని....
నిన్ను తలవని క్షణం,
నిన్ను పిలవని ప్రాణం,
నిన్ను కొలవని దేహం,
నిన్ను చూడలేని నయనం వ్యర్థం!
- Yamini