you are my destiny in Telugu Love Stories by priyanka books and stories PDF | యూ ఆర్ మై డెస్టినీ - 9

Featured Books
Categories
Share

యూ ఆర్ మై డెస్టినీ - 9

ప్రియా కి ప్రేమ్ తన బావ అని తెలియగానే షాక్ తో కళ్ళు తిరిగి పడిపోతుంది.

ప్రియ పడిపోతున్న సంగతి గమనించిన ప్రేమ్ ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యి ప్రియ కింద పడిపోకుండా తనని పట్టుకుంటాడు.

ప్రియా అలా సడన్గా పడిపోయే పాటకి అందరూ షాక్ అవుతారు జగదీష్ చంద్ర పరుగున ప్రేమ్ దగ్గరికి వస్తాడు.

నితిన్ ఫాస్ట్ గా తన పాకెట్ లో నుంచి ఒక టాబ్లెట్ బయటికి తీసి   " ప్రయా నీ ఇటు ఇవు వెంటనే ఈ టాబ్లెట్ తనకి వేయాలి " అని అంటాడు.

ప్రేమ్ ఆ టాబ్లెట్ చూస్తూ " అవసరం లేదు తను ఏమీ పానిక్ అటాక్ వల్ల పడిపోలేదు"  అని అంటాడు.

"ఏంటి? పానిక్ అటాక్ వల్ల కాకపోతే మరి ఎందుకు పడిపోయింది? ఫస్ట్ తనకి ఈ టాబ్లెట్ త్వరగా వెయ్యాలి పక్కకి తప్పుకో "అని కొంచెం కోపంగానే అంటాడు  నితిన్, ప్రియా నీ తన వైపుకి తీసుకోవడానికి ట్రై చేస్తూ. ప్రియా కి ఏమైందో అన్న కంగారు అతనిలో. 

నితిన్ వచ్చి ప్రియా ని తన దగ్గరికి తీసుకోపోతుంటే , ప్రేమ మాత్రం నితిన్ కి అందకుండా ప్రియా ని మరి కాస్త దగ్గరగా తీసుకుంటాడు తాను నాది అన్నట్లు.

నితిన్ అసహనంగా " ఒరేయ్ దాన్ని నాకు ఇస్తావా ఇవ్వవా"  అని అరుస్తాడు.

ప్రేమ మాత్రం కూల్ గా ఆన్సర్ చేస్తా "  నేను ఇవ్వను" 
అని అంటాడు.

ప్రేమ్ ఇంకా నితిన్ ప్రియ కోసం చిన్న పిల్లలు ఓకే  టాయ్స్ కోసం కొట్టుకున్నట్లుగా ఉంటుంది అక్కడ .

ఈ ఇద్దరు ఇలా కొట్టుకుంటుంటే ప్రియ కి ఏమి అవుతుందో అని నిఖిల్ కూడా కొంచెం కంగారు పడుతూ " అవును ప్రేమ్ ప్రియా కి వెంటనే ఈ టాబ్లెట్ వేయాలి, సిచువేషన్ అర్థం చేసుకో , త్వరగా ఆ టాబ్లెట్ తీసుకొని నువ్వు అన్న వెయ్యి తనకి"  అని అంటాడు .

జగదీష్ చంద్ర కూడా " అవును ప్రేమ్ తనకి వెంటనే ఈ టాబ్లెట్ ఇవ్వు"  అని అంటాడు.

" ఈ టాబ్లెట్ ఏంటి? ఎందుకు ?" అని అడుగుతుంది గాయత్రి గారు కొంచెం కంగారు పడదు ఆవిడకి కూడా ప్రియా అలా సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయే పాటికి కంగారు వేసింది. 

" అది నీకు తర్వాత చెప్తాను అక్క ముందు తనకి వెంటనే ఈ టాబ్లెట్ వేయాలి " అని కంగారు పడతారు జగదీష్ చంద్ర.

ఊర్మిళాదేవి గారు కూడా " అవును మనవడా వెంటనే ఈ టాబ్లెట్ తనకి వెయ్యి " అని అంటుంది.

" మీరు కాసేపు ప్రశాంతంగా ఉండండి  " అని అంటాడు ప్రేమ్.

అందరికీ ప్రియా అల  సడన్ గా కళ్ళు తిరిగి పడిపోవడంతో  కంగారు పడుతుంటే
ప్రియా నీ పట్టుకున్న ప్రేమ్ "  కంగారు పడకండి తను నేనే తన బావ అన్న సంతోషం  జీర్ణించుకోలేక ఇలా కళ్ళు తిరిగి పడిపోయింది అంతే, మీరు అనుకున్నట్లు పానిక్ అటాక్ వల్ల కాదు "  అని అంటూ తనని ఎత్తుకొని వెళ్లి బెడ్ మీద పడుకో పెడతాడు.

పక్కనే ఉన్న వాటర్ బాటిల్ లో నుంచి కొన్ని వాటర్ తీసుకొని ప్రియా మొహం మీద జాల్లుతాడు. 

చల్లని నీళ్ళు అలా మొహం మీద పడగానే తుళ్ళిపడి " నో.."  అని అంటూ పైకి లేచి కూర్చుంటుంది ప్రియ.

ప్రియా ఫస్ట్ అలా కాళ్లు తిరిగి కింద పడిపోయేసరికి పానిక్ అటాక్ వల్ల పడిపోయింది ఏమో అని అందరూ భయపడ్డారు , కానీ ఇప్పుడు ప్రియా లేవడం  చూసి అందరూ ఊపిరి పీల్చుకుంటారు.

ప్రియా ఒకసారి చుట్టూ చూసి  ప్రేమ్ అక్కడే ఉండడం చూసి మళ్లీ గట్టిగా కళ్ళు మూసుకొని " నో ..నో ..ఇదంతా నా కల ఇదంతా నా కల నిజం కాదు"  అని పదే పదే  తనలో తాను అనుకుంటుంది. 

ప్రియా మళ్లీ కళ్ళు మూసుకుని తలకాయ్ అటు ఇటు ఎందుకు ఊపుతుందో అక్కడ ఉన్నవారికి అర్థం కాదు. 

' ఏమైంది దినికి తలకాయ అలా ఊపుతుంది కొంపతీసి పానిక్ ఎటాక్ వల్ల దీని బ్రెయిన్ లో చిప్ గాని దొబ్బిందా ఏంటి'  అని అనుకుంటుంది శైలు.

" తలకాయ ఓ అటు ఇటు ఊపకు  ఊడిపోయి కింద  పడిపోగలదు"  అని వెటకారంగా అంటాడు ప్రేమ్  , ప్రియ వైపు చూస్తూ నవ్వుతూ.

ప్రేమ్ మాట వినగానే కళ్ళు తెరిచి ప్రేమ్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది.
' వీడు ఇంతక ముందు ప్రేమ,  పెళ్లి అని అంటూ నా వెనక తిరిగి నన్ను టార్చర్ చేసేవాడు ఇప్పుడు ఏకంగా నేను వాడి మరదలు అయ్యి కూర్చున్నాను , అందులోనూ నా నోటి దూల వల్ల చేసుకుంటే బావని చేసుకుంటాను అని అన్నాను,  ఇప్పుడు వీడు నన్ను అస్సలు వదలడు,  నేనేం చేసేది రా కృష్ణయ్య ’ అని తనలో తాను అనుకుంటూ తల పట్టుకుని కూర్చుంటుంది.

ప్రియా అలా తల పట్టుకోగానే జగదీష్ చంద్ర కొంచెం కంగారుపడుతూ " తల్లి తలనొప్పిగా ఉందా"  అని అడుగుతారు. 

వాళ్ల డాడీ వైపు చూస్తూ ' ఇప్పుడు డాడీ మాత్రమే నన్ను కాపాడ గలడు ఈ పెళ్లి నుంచి,  దాడి కి నేనంటే ప్రాణం ,డాడీ ని ఎలాగైనా సరే కన్విన్స్ చేసి ఈ పెళ్లి ఆపేయాలి'  అని అనుకుంటుంది. 

ప్రియా ఏమనుకుంటుందో ఏం చేయాలి అని అనుకుంటుందో ప్రేమ్ క్లియర్గా గెస్ చేయగలడు.

ప్రియా వాళ్ల డాడీ తో ఏదో చెప్పడానికి ట్రై చేస్తుండగా ప్రేమ్ మాట్లాడుతూ " మావయ్య తన గురించి నేను చూసుకుంటాలే కానీ మీరు కిందకి వెళ్లి మా ఎంగేజ్మెంట్ సంగతి చూసుకోండి "  అని అంటాడు.

' ఏంటి ఎంగేజ్మెంట్ ఆ ఇప్పుడు ఈ ఎంగేజ్మెంట్ జరిగితే ఈ ప్రేమ్ గాడిని అసలు ఆపలేను నేను , డాడీ తో వెంటనే మాట్లాడాలి ' అని  తన మనసులో అనుకొని వాళ్ళ నాన్న వైపు కంగారుగా చూస్తూ
" డాడీ ఆది నేను చెప్పేది" . అనే ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంటే. 

ఊర్మిళాదేవి ప్రియ ఏం చేయబోతుందో ముందుగానే ఊహించి  ' ఇప్పుడు ఇది వాళ్ళ నాన్నతో ఏడుపు మొహం పెట్టి నాలుగు సెంటిమెంట్ డైలాగులు చెప్పి ఈ పెళ్లి చేసుకోను అని అంటే నా పిచ్చి కొడుకు దాని మాటలు విని దానికి పెళ్లి చేయకుండా ఉండిపోతాడు ఇలా జరగడానికి వీల్లేదు ' అని అనుకోని. 

ప్రియ నీ మాట్లాడనివ్వకుండా
ఊర్మిళాదేవి అడ్డు చెబుతూ "  అవును వాడి కాబోయే పెళ్ళాన్ని వాడు చూసుకుంటాడు లే కానీ  మందు మనం వీళ్ళ నిశ్చితార్థం గురించి ఆలోచించాలి పద కిందకి వెళ్దాం ఎలాగో శైలు ఇక్కడే ఉంది కదా ఏమైనా ఇబ్బందిగా ఉంటే అది చూసుకుంటుందిలే " అని అంటూ శైలు వైపు చూసి.

" మనవరాలా దానికి ఏమైనా ఇబ్బందిగా ఉందేమో చూడు"  అని చెప్పి శైలు కి ఇంకెవరికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా జగదీష్ వైపు చూస్తూ
" నువ్వేంటి రా ఇంకా ఇక్కడే ఉన్నావు  అల్లుడు గారు కూడా కిందే ఉన్నారు ఆయనని ఒంటరిగా వదిలేసి వచ్చాము ముందు పదండి కిందకి" అని అంటూ జగదీష్ చంద్ర " అది కాదు అమ్మ ప్రియా ఏదో చెప్తుంది కదా.." అని అంటున్న జగదీష్ చంద్ర  కి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా జగదీష్ , సునంద  ఇంకా  గాయత్రి గారిని హడావిడిగా కిందకి పంపిస్తుంది. 

నితిన్ కూడా ఏదో మాట్లాడుతాకి ట్రై చేస్తుంటే " అది కాదు అమ్మమ్మ ఒకసారి ప్రియని మాట్లాడనివ్వు " అని అంటున్న  . " నువ్వు ఉండరా బాబు కూతురు రోజంతా మాట్లాడుకున్న వాళ్ళ మాటలు తీరవులే గాని " వాడిని కూడా మాట్లాడనివ్వకుండా చేస్తుంది ఊర్మిళాదేవి.

ప్రియా కి  మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వాళ్ళ నాన్నగారు అలా కిందకి వెళ్లేసరికి ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ లో గోళ్లు కోరుకుంటా కూర్చుంటుంది .

నితిన్ కి ఇక్కడ జరిగేదంతా చూస్తుంటే పిచ్చెక్కుతుంది. ఎలా ఆ నిశ్చితార్థం ఆపాలో అతనికి అర్థం కావట్లేదు ఎలాగైనా సరే ధైర్యం చేసి ప్రియా కి ఈరోజు తన మనసులోని మాట చెప్పేయాలి  అని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడు .

ఆదిత్య కూడా కింద అక్షయ కంగారు పడుతుందో అని తన దగ్గరికి వెళ్ళిపోతాడు.

ఊర్మిళ దేవి గారు మెల్లగా ప్రేమ్ దగ్గరికి వచ్చి ప్రేమ్ చెవిలో " ఒరేయ్ మనవడా నీ పెళ్ళాం మహా కంత్రిది వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి ఎలాగైనా సరే ఈ పెళ్లి చెడగొట్టాలి అని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది , నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు ఈ పెళ్లి ఎలాగైనా జరిగి తీరాలి"  అని అంటుంది.

" డోంట్ వర్రీ అమ్మమ్మ నా కాబోయే పెళ్ళాన్ని  దాని ఫ్రెండ్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు బాగా తెలుసు,  ఆ కృష్ణయ్య కూడా నాకే సపోర్ట్ గా ఉన్నాడు " అని తన అమ్మమ్మ వైపు చూసి కన్ను కొడతాడు.

ప్రేమ్ మాటల విన్న ఊర్మిళాదేవి గారు చాలా సంతోషపడతారు.

ఊర్మిళాదేవి టెన్షన్తో గర్ల్ కోరుకుంటున్న ప్రియా నీ చూసి  ' అమ్మ నా మనవరాలా నా వెనకాల ఎంత కథ నడిపించావే , నువ్వు ఆరోజు నా కూతురి కొడుకుని   చేసుకుంటాను అని చెప్పి కండిషన్ పెట్టినప్పుడు నేను అంతగా ఆలోచించలేదు దాని వెనకాల ఇంత  పెద్ద కుట్ర దాగి ఉందని. ఆ కృష్ణయ్య నా మొర ఆలకించాడు అందుకే ఆయన మాయలు చూపించి నా కూతురి చిన్న కొడుకుని నీ దృష్టిలో పడకుండా చేసి ,నీ నోటితో పెళ్లికి ఒప్పుకునే లాగా చేశాడు  'అని అనుకోని ఆ కృష్ణయ్య కి దండం పెట్టుకున్నారు. 

  ప్రయ నీ చూసి ఆవిడ మనసులో ' మనవరాలా నువ్వు నీ పెర్ఫార్మన్స్ చూపించావు ఇప్పుడు నా పెర్ఫార్మన్స్ చూద్దువు గాని' అని అనకంటూ 
" మనవరాలా నువ్వేమీ కంగారు పడకు నీ పెళ్లి ఎలాగైనా జరిగేలా నేను చూస్తాను కదా " అని అంటూ.

ప్రేమ్ వైపు చూస్తూ "  మనవడా నీకు నా మనవరాలిని  చేసుకోవడం ఇష్టమే కథ " అని అడుగుతారు. 

" అది అడగాలా అమ్మమ్మ , దీన్ని ఇష్టం లేదు అనే వాళ్ళు ఎవరైనా ఈ లోకం మీద ఉంటారా , అందులోనూ ఇదంటే నాకు ప్రేమ , దీనికి  నా ప్రేమ విషయం ఎన్నోసార్లు చెప్పాను. కానీ నాకు తెలియదు కదా ఇది పెద్ద వాళ్ల తెచ్చిన పెళ్లి చేసుకుంటుంది అని , అది ముందే తెలిసి ఉంటే  జగదీష్ అంకుల్  అదే మామయ్య ని ఎప్పుడో వచ్చి అడిగేవాడిని దీన్ని నాకిచ్చి పెళ్లి చేస్తారా అని , ఈపాటికి మన కుటుంబాలు కూడా కలిసిపోయేవి. దీనికి  నాతో పెళ్లి అయిపోయి ఈపాటికి పిల్లలు కూడా కనే వాళ్ళమేమో " అని అంటాడు ప్రేమ్ , ప్రియ వైపు చూసి కన్ను కొడుకు.

ఆ మాటలు వింటున్న నితిన్ కి ఒళ్ళు మండిపోతుంది ' ఏంట్రా నా ప్రియా తో పిల్లల్ని కంటావా , పిల్లలు కనాలి అంటే పెళ్లి అవ్వాలి కదా , నువ్వు దాన్ని ఎలా పెళ్లి చేసుకుంటావో నేను చూస్తాను కదా'  అని తన మనసులో అనుకుంటాడు

' నేను పెళ్లే వద్దంటే వీడు పిల్లల వరకు కూడా వెళ్ళిపోయాడు , కృష్ణయ్య ఏదో ఒక మాయ చేయవయ్యా'  అని తన మనసులో అనుకుంటూ ఆ కృష్ణయ్య అని వేడుకుంటుంది ప్రియా.

" ఈసారి నీ కృష్ణుడు నీ వైపు కాకుండా నా వైపు ఉన్నాడు లే కానీ ముందు ఆ గోర్లు కొరకడం ఆపు , ఆ గోర్లు కొరకడం ఆపలేదనుకో చూట్టు ఎవరున్నారు అని కూడా చూడను ముద్దు పెట్టేస్తాను  " అని అంటాడు ప్రేమ్.

ప్రేమ్ మాటలకు గోర్లు కొరకడం ఆపేసి కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది.

' ఏంటి వీడు మా నానమ్మ ఇంకా నా ఫ్రెండ్స్ ఇక్కడే ఉన్నా ఇలా మాట్లాడుతున్నాడు అయినా వీడికి ఇంత సడన్గా ,ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది  ' అని అనుకుంటుంది.

తన మనసు చదివినట్లుగా " ఏమీ లేదు బంగారం  ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే ,ఇప్పుడే కదా నేను నీ బావ అన్న విషయం తెలిసింది,  అందులోనూ నువ్వు చేసుకుంటే నన్నే చేసుకుంటానని మొండి పట్టుదల పెట్టావు అని, ఎలాగో ఇంకాసేపట్లో మన నిశ్చితార్థం కూడా అయిపోతుంది అంటే సగం పెళ్లి అయిపోయినట్లే సో ఆటోమేటిక్గా ధైర్యం వచ్చేస్తుందన్నమాట " అని అంటాడు ప్రేమ్.

ఊర్మిళాదేవి నవ్వుతూ " నేను నీకు ఫుల్ సపోర్ట్ రా మనవడా.  ఎన్ని ముద్దులు కావాలంటే అన్ని ముద్దులు పెట్టుకో దాన్ని"  అని అంటుంది.

ప్రేమ్  ఊర్మిళాదేవి నీ హాగ్ చేసుకుంటూ " నువ్వు సూపర్ అమ్మమ్మ ఈ మాత్రం సపోర్ట్ ఇస్తే చాలు నాకు "  అని అంటాడు

ప్రియా కి మాత్రం ఊర్మిళాదేవి మాటలకు ఒళ్ళు మండుతుంది  " నానమ్మ నువ్వు అసలు నా నానమ్మ వేనా ఇలా ముద్దులు పెట్టుకోమని వాడికి పర్మిషన్లు ఇస్తావా నువ్వు " అని అంటుంది కోపంగా. 

" ఏ తప్పేముందే ఈ  జనరేషన్ పిల్లలకి ఇదంతా కామన్ కదా , కావాలంటే శైలు ని అడుగు నిఖిల్ దాన్ని రోజుకి ఎన్నిసార్లు ముద్దు పెట్టుకుంటాడో ." అని అంటుంది ఊర్మిళాదేవి శైలు ఇంకా నిఖిల్ వైపు చూస్తూ

ఆ మాటలకి శైలు సిగ్గుపడితే నిఖిల్ " నానమ్మ మమ్మల్ని మాత్రం ఇందులోకి  లాగవద్దు ప్లీజ్ " అని అంటాడు.

ఊర్మిళాదేవి నవ్వుకుంటూ " అయినా ఈ కాలంలో ఏంటి మా కాలంలోనే మా పెళ్లి కాకముందే మీ తాతయ్య గారు నన్ను ఎన్నిసార్లు ముద్దు పెట్టుకున్నారో తెలుసా"  అని సిగ్గు పడిపోతుంది .

ఊర్మిళాదేవి సిగ్గుపడడం చూసి అందరూ కళ్ళు పెద్దవి చేసి ఆవిడ వైపు చూస్తారు. ప్రేమ్ మాత్రం ఊర్మిళాదేవి నీ పట్టుకుంటూ "  వావ్ అమ్మమ్మ చాలా ఇంట్రెస్ట్ చెప్పవా నాకు తాతయ్య గురించి"  అని అంటాడు.

ప్రియా మాత్రం కోపంతో " ఒసేయ్ ముసలి ఇప్పుడు ఆ భాగవతం మొదలు పెడితే ఇప్పుడు అప్పుడే అవ్వదు గాని , నన్ను కొంచెంసేపు ఒంటరిగా వదులుతావా ప్లీజ్ " . అని అంటూ 
ప్రేమ్ వైపు చూసి" ఇంకా నీకు ఆ భాగవతం వినాలి అనిపిస్తే ప్లీజ్ కిందకి వెళ్లి వినండి , నన్ను కొంచెం సేపు ఒంటరిగా వదిలేయండి " అని గట్టిగా అరుస్తుంది.

ప్రియా కి సహజంగా కోపం రాదు , ఎంతో కోపం వస్తే కానీ వాళ్ళ నాన్నమ్మని ముసలి అని పిలవదు. ఊర్మిళాదేవి ఒక్కొక్కసారి ప్రియా కోపానికి దాడుస్తుంది  కూడా.

ప్రేమ్ కూడా ప్రియా ని ఇంత కోపంగా చూడడం ఇదే ఫస్ట్ టైం. 

" ఒరేయ్ మనవడా మనం సైలెంట్ గా సైడ్ అయిపోతే బెస్ట్ ప్రస్తుతానికి"  అంటుంది ఊర్మిళాదేవి ప్రేమ్ చెవిలో.

ప్రేమ్ కూడా  " సరే అమ్మమ్మ " అని అంటాడు.

ప్రియా వైపు తన ఫ్రెండ్స్ వైపు ఒకసారి చూసి " ఎలాగో ఇప్పుడు మేము కిందకు వెళ్లాక ఈ పెళ్లి ఎలా చెడగొట్టాలి అనేది నీ తొట్టి గ్యాంగ్ తో డిస్కషన్ వేస్తావు అని నాకు తెలుసు , కానీ మందు గానే చెప్తున్నాను విను నువ్వు ఎన్ని ప్లాన్స్ వేసినా సరే ఈ పెళ్లి జరగడం మాత్రం ఆగదు , సో నన్ను పెళ్లి చేసుకోవడానికి మెంటల్ గా ప్రిపేర్ ఆవు బంగారం" అని చెప్పి ఊర్మిళాదేవిని తీసుకొని కిందకు వెళతాడు. 

కొనసాగుతుంది...

***