you are my destiny in Telugu Love Stories by priyanka books and stories PDF | యూ ఆర్ మై డెస్టినీ - 10

Featured Books
Categories
Share

యూ ఆర్ మై డెస్టినీ - 10

ప్రేమ్ ఊర్మిళాదేవి చెయ్యి పట్టుకుని కిందకు నడుస్తూ  " అమ్మమ్మ ఈరోజు నాకు ఎంతో సంతోషంగా ఉంది నిజంగా చెప్పాలి అంటే చెప్పలేనంత సంతోషంగా ఉంది ఇదంతా కూడా నాకు ఏదో కల లాగా అనిపిస్తుంది"  అని అంటాడు. 

" నాకు కూడా మనవడా ఈ రోజు ఎప్పటికీ గుర్తుండి పోతుంది ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ నా కూతురు నా దగ్గరికి వచ్చింది, ఆయనే కనక బ్రతికి ఉండి ఉంటే ఎంతో సంతోషపడేవారు , ఈరోజు కోసం ఆయన చివరి శ్వాస వదిలే వరకు ఎదురు చూస్తూనే ఉన్నారు " అని అంది ఊర్మిళాదేవి. 
ఆవిడ గొంతులో బాధ కంటిలో నీటి చెమ్మ స్పష్టంగా కనిపిస్తుంది. 

వాళ్ళ అమ్మమ్మ బాధపడుతుంది అని గమనించిన ప్రేమ్ ఊర్మిళాదేవి గారిని  హత్తుకుంటూ " అమ్మమ్మ ఇలాంటి సమయంలో ఎవరైనా బాధపడతారా , తాతయ్య ఎక్కడున్నా సరే చాలా సంతోషపడతారు నువ్వు ఇప్పుడు ఇలా బాధపడుతూ ఉంటే ఆయన ఎలా సంతోషంగా ఉంటాడు చెప్పు అందులోనూ అమ్మ నిన్ను ఇలా చూస్తే ఇంకా బాధపడుతుంది ప్లీజ్ అమ్మమ్మ ఏడవద్దు , అమ్మ బాధపడితే నేను తట్టుకోలేను, అయినా ఇప్పుడు చూడు తాతయ్య కోరుకున్నట్లుగానే అమ్మ ఇప్పుడు వచ్చేసింది కదా నీ దగ్గరికి ఈ టైంలో హ్యాపీగా ఉండాలి" అని అంటాడు. 

ఊర్మిళాదేవి కింద ఆనందంగా మాట్లాడుతున్న తన కూతురు ని చూసి కళ్ళు తుడుచుకుంటూ " అవును ఇప్పుడు నేను ఆనందంగా ఉండాలి నా కూతురు నా దగ్గరికి వచ్చేసింది కదా"  అని అంటారు.

ఊర్మిళాదేవి కొంచెం నార్మల్ అవుతుంది , ప్రేమ్ ఆవిడని డైవర్ట్ చేయడానికి " అమ్మమ్మ ఇంతకీ నీ మనవరాలు ఈ పెళ్లి చెడగొట్టడానికి ఏం ప్లాన్స్ చేస్తుంది అంటావు" .

ఊర్మిళాదేవి ప్రియ గది వైపు చూస్తూ "నిజమేరా మనవడా ఆ సంగతి మర్చిపోయాను నేను,  అది దాని ఫ్రెండ్స్ కలిసి ఈ పెళ్లిని చెడగొట్టడానికి విశ్వప్రయత్నాలు చేస్తారు నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు  ఈ పెళ్లి ఎలాగైనా జరిగేలా నువ్వే చేయాలి " అని అంటుంది. 

" డోంట్ వర్రీ అమ్మమ్మ నీ మనవరాలు ఏసే ప్రతి ప్లాన్ కి తిప్పికొట్టే ప్లాన్స్ నా దగ్గర ఎప్పుడు ఉంటాయి, ఈ పెళ్లి కచ్చితంగా జరిగి తీరుతుంది " అని కాన్ఫిడెంట్ గా చెప్తాడు ప్రేమ్.

" ఈ పెళ్లికి నా తరపు నుంచి నీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది రా మనవడా"  అని అంటుంది ఊర్మిళాదేవి.

" నీ యొక్క సపోర్ట్ చాలు అమ్మమ్మ, ఇక చూసుకో ఈ పెళ్లి ఎవరు ఆపాలనుకున్న ఆపలేరు"  అని అంటాడు ప్రేమ్.

వాళ్ల మాటల్లో కిందకి రానే వస్తారు వాళ్ళ అమ్మని చూసిన గాయత్రీ గారు వెంటనే వెళ్లి ఊర్మిళాదేవిని హత్తుకుంటారు. " అమ్మ..."

ఊర్మిళాదేవి గారు గాయత్రి గారి తల నిమురుతూ ప్రేమతో  "నా బంగారు తల్లి ఇన్ని సంవత్సరాలు పట్టిందా తల్లి ఈ తల్లి దగ్గరికి రావడానికి నీకు"  అని అంటారు.

గాయత్రి గారి కొంచెం బాధగా " నన్ను క్షమించమ్మా " అని అంటారు. 

" లేదులే తల్లి ఆరోజు మీ నాన్నగారు కోపంలో అలా అని ఉండకూడదు , ఏదో జరిగిపోయింది తర్వాత ఆయన నీకోసం  వెతకాని చోటు లేదు,  కానీ అప్పటికే మీరు ఈ ఊరు వదిలి వెళ్ళిపోయారు,  అప్పటినుంచి  మీ నాన్నగారు నీకోసం ఎంతో ఎదురు చూశారు ఎప్పటికైనా నీ జాడ తెలుసుకోగలను అన్న నమ్మకంతో , కానీ తీరా నవ్వ వచ్చే సమయానికి..." అని కొంచెం బాధగా చెప్పడం ఆపేశారు ఆవిడ. 

గాయత్రి గారు తన తండ్రిని తరచుకొని బాధపడతారు. తన భార్య బాధ పడటం చూడలేని గుర్దీప్ మాట్లాడుతూ " అత్తయ్య గారు ఎప్పుడో జరిగిపోయిన గతం గురించి ఎందుకు లేండి , అయినా మనం బాధపడినంత మాత్రాన ఆయన తిరిగి రాలేరు కదా, ఆయన ఇప్పుడు ఎక్కడున్నా మీ కూతురు మీ ఇంటికి చేరినందుకు ఎంతో సంతోషపడతారు ఈ సమయంలో అందరూ సంతోషంగా ఉండాలి. గతం గురించి తలుచుకొని బాధపడడం ఎందుకు" . అని అంటారు. 

వాళ్ళ అక్క బాధపడటం చూడలేని జగదీష్ చంద్ర కూడా గుర్దీప్ మాటలకు ఏకీభవిస్తూ " అవునమ్మా ఇది సంతోషపడాల్సిన సమయం " అని అంటారు. 

ఇంతలో గోపి ఇంటి నౌకర్ లోపలికి వస్తూ "  అమ్మగారు ఎవరో బ్యూటిషన్ అంటా వచ్చారు. మీరు రమ్మని చెప్పారు అంట కదా"  అని అంటాడు ఒక అమ్మాయిని లోపలి తీసుకువస్తూ. 

ఆ బ్యూటేషన్ని చూసి ఊర్మిళాదేవి  మాట్లాడుతూ " తనని గెస్ట్ రూమ్ లో కూర్చోపెట్టు"  అని గోపి కి చెబుతుంది. 

గోపి వెళ్ళిపోగానే. గుర్దీప్ పైపు చూస్తూ " అల్లుడుగారు ఇప్పుడు ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోవద్దు, మీ కొడుకుని నా మనవరాలకి ఇచ్చి పెళ్లి చేయడానికి మీకు ఏమైనా అభ్యంతరం ఉందా" అని స్టేట్ గా పాయింట్ కి వచ్చేస్తారు. 

ఆ మాటకి గుర్దీప్ గాయత్రి వైపు చూసి నవ్వుతాడు. " నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అత్తయ్య గారు పిల్లలు ఇద్దరు ఇష్టపడితే అంతకన్నా మంచిదేముంది, అందులోనూ నందు కూడా ఈ విషయం గురించి మీతో మాట్లాడాలని అనుకుంది , ఇక్కడికి వచ్చాక జగదీష్ ని అడిగి అతనికి , అతని కూతురికి ఇష్టముంటే,  పిల్లల వివాహం చేయాలని తను ఎప్పుడో అనుకుంది"  అని అంటాడు.

ఈ మాట వినగానే జగదీష్ చంద్ర ఎంతో సంతోష పడిపోతూ " నిజమా అక్క,  మేము కూడా ఇలాగే  ఆలోచించాము ముందుగానే ప్రియా ని అడిగాము కూడా , తాను ఈ పెళ్లికి ఎప్పుడో ఒప్పుకుంది" అని అంటాడు. 

ప్రియా ఈ పెళ్లి చేసుకుంటాకి ఒప్పుకుందని తెలిసిన గుర్దీప్ , గాయత్రీ గారు ఎంతో సంతోషపడతారు.

ఊర్మిళాదేవి సంతోష పడుతూ "  ఇంకెందుకు ఆలస్యం పంతులు గారికి కబురు చేస్తాను  పనిలో పనిగా ఈ రోజే నిశ్చితార్థం పెట్టేసుకుందాం " అని అంటారు.

" ఇప్పటికిప్పుడు అంటే..... ఏమి సిద్ధం చేసుకోలేదు కదా అమ్మ"  అని అంటున్న గాయత్రీ మాటలకి ఆదిత్య అడ్డు చెబుతూ "  అమ్మ డోంట్ వర్రీ  ఏమి కావాలో లిస్ట్ ఇవ్వు చాలు క్షణాల్లో నీ ముందు తెచ్చి పెడతాను " అని అంటాడు.
అతని తమ్ముడి లవ్ సక్సెస్ అయినంతకు ఆదిత్య కి చాలా సంతోషంగా ఉంది.

అక్షయ కూడా మాట్లాడుతూ " అవునా అత్తయ్య ఏం కావాలో చెప్పండి ఆయన క్షణాలు తెచ్చి పెడతారు " అని అంటుంది. తన కోరుకున్నట్లుగా ప్రియా తన తోడుకోడలు అవడం అక్షయకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.

" అది కాదు నాన్న కనీసం ఎంగేజ్మెంట్ రింగ్స్ కూడా ఏమీ కొనలేదు కదా ఇప్పటికిప్పుడు అంటే.."  అని అంటుంది గాయత్రి గారు.

ప్రేమ్ " మా నీకు కావాల్సింది ఎంగేజ్మెంట్ రింగ్ అంతే కదా ఒక్క నిమిషం"  అని చెప్పి తన పాకెట్ నుంచి ఒక బాక్స్ బయటికి తీస్తాడు అందులో రెండు బ్యూటిఫుల్ రింగ్స్ ఉంటాయి.

ప్రేమ్,  ప్రియ ఇంకా తనకోసం ముందుగానే రింగ్స్ చేయించి ఉంటాడు అవి నిన్న వచ్చి ఉంటాయి ఈరోజు పొద్దున్న  అక్షయ ,  ప్రియ ఎంగేజ్మెంట్ గురించి చెప్పడంతో కొంచెం బాధగా  తను ప్రియా తో ఊహించుకున్న లైఫ్ గుర్తుకు వచ్చి ఆ రింగ్స్ ఓపెన్ చేసి  చూస్తూ ఉండగా వాళ్ళ అమ్మ గాయత్రి గారు బయలుదేరడానికి లేట్ అవుతుందని పిలవడంతో కంగారులో ఆ రింగ్స్ పాకెట్ లో పెట్టుకొని బయటికి వచ్చి వాళ్ళ అమ్మతో బయలుదేరతాడు.
అవి ఇప్పుడు ఇలా ఉపయోగపడ్డాయి. 

గాయత్రీ గారు ఆ రింగ్స్ చూస్తూ"  వావ్ నాన్న చాలా అందంగా ఉన్నాయి , ఇవి ఎప్పుడు చేయించావు " అని అడుగుతారు.

" ప్రియా ఇంకా నా కోసం ఎప్పుడో ఆర్డర్ చేశాను మమ్మీ. అవి నిన్న నైట్ వచ్చాయి అనుకోకుండా ఈరోజు పొద్దున్న ఇవి పాకెట్లో పెట్టుకున్నాను , అవి ఇప్పుడు ఇక్కడ ఇలా ఉపయోగపడుతున్నాయి"  అని సంతోషంగా చెప్తాడు. 

జగదీష్ చంద్ర కొంచెం ఆశ్చర్యపోతూ"  ప్రియా కోసం చేయించావా ? " అని అడుగుతారు. 

" అవునురా నీ కూతురు అంటే నా కొడుక్కి పిచ్చి ప్రేమ, ప్రియా వాడి ప్రేమను ఒప్పుకుంటే నీతో వచ్చి ఎప్పుడో మాట్లాడదామని అనుకున్నాడు, కానీ  ఆ కృష్ణయ్య లీల వల్ల వీళ్ళిద్దరికీ ఇలా పెళ్లి జరగబోతుంది " అని సంతోషంగా చెప్తారు గాయత్రి గారు .

ప్రేమ్ కి ప్రియా అంటే ఇష్టం అని తెలుసుకున్న జగదీష్ చంద్ర సంతోష పడిపోతూ "  ఇది చాలా మంచి విషయం ఇంకా ఎందుకు ఆలస్యం ఈరోజే నిశ్చితార్థం పెట్టుకుందాం ఏమంటారు బావగారు"  అని గుర్దీప్ వైపు చూసి అడుగుతాడు.

" నాదేముంది అంతా మీ అక్క ఇష్టమే,  మా ఇంట్లో ఎప్పుడూ మీ అక్క మాటే నడుస్తుంది , మా ఇంటి యజమానురాలు  గారికి ఇష్టమంటే మేమేం చెప్పగలం చెప్పండి" అని నవ్వుతూ గాయత్రి వైపు చూసి అంటాడు గుర్దీప్.

ఆ మాటకి అందరూ నవ్వేస్తారు. 
ప్రేమ్ ఆనందానికి అవధులు లేవు.
...

ప్రియ రూమ్.

ప్రియా కోపంతో ఉండడం చూసి ఎవరో కూడా ప్రియా ని  మాట్లాడించకుండా అలాగే చూస్తూ ఉంటారు.

ప్రియా తన బెడ్  మీద కూర్చుని కళ్ళు మూసుకుని తన కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది.

తన ఫ్రెండ్స్ అందరూ కూడా ఒకరి మొహాలు  ఒకరు చూసుకుంటూ నువ్వు మాట్లాడు అంటే నువ్వు మాట్లాడు అని ఒకరికొకరు సిగ్నల్స్  చేసుకుంటూ   వారిలో వారు కొట్టుకుంటూ ఉంటారు. 

ముందుగా శైలు కొంచెం ధైర్యం తెచ్చుకొని , " ఇందులో అక్షయ ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం ఉన్నాయి నీకు వాళ్ళ పేర్లు చూసినప్పుడు డౌట్ రాలేదా ప్రియా"  అని తడబడుతూ అడుగుతుంది. 

ప్రియా కళ్ళు తెరిచి వాళ్ళని చూసి మళ్లీ తల పట్టుకుని" ఆ పేరుతో ఉన్న కామన్ ఫ్యామిలీస్ ఉంటాయి కదా అని అనుకున్నాను"  అని చెప్తుంది. 

నిఖిల్ మాట్లాడుతూ " అయినా ఫ్యామిలీ ఫొటోస్ లాంటివి ఏమీ నీకు ప్రొవైడ్ చేయలేదా ఆ డిటెక్టివ్ " అని అడుగుతాడు.

" ఆ ఫోటో సే ఉంటే ఇంతవరకు ఎందుకు తెచ్చుకుంటాను"  అని అంటుంది అసహనంగా, తనకి ఇప్పుడు ఏం చేయాలో ఈ పెళ్లిని ఎలా ఆపాలో తనకి అర్థం కావట్లేదు

ఆ ఫైల్ చూస్తున్న శైలు " ఇందులో అన్ని డీటెయిల్స్ కరెక్టుగానే అన్నాయి కానీ ప్రేమ్ డీటెయిల్స్ మాత్రం మిస్ అయ్యాయి.  ఇంతకీ ఆ డిటెక్టివ్ ఎవడే నీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సగం సగం ఇచ్చాడు ముందు వాడిని ,వాడిని సజెస్ట్ చేసిన వాడిని తన్నాలి" అని అంటుంది.

ఆ మాట వినగానే నితిన్ అరుణ్ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. ఏదో అర్థమైన వాళ్ల లాగా వాళ్ల కళ్ళు పెద్దవి అవుతాయి , వాళ్ళ ఇద్దరి మొహాల్లో కంగారు స్పష్టంగా కనిపిస్తుంది.

ప్రియా సడన్గా ఏదో గుర్తుకు వచ్చిన దానిలాగా "అవును నిజంగా,  ఆ డిటెక్టివ్ ఇన్ఫర్మేషన్ నాకిచ్చిన వాడిని  తన్నాలి , వాడి మీద ఉన్న నమ్మకంతో ఆ డిటెక్టివ్ గాన్ని కూడా పూర్తిగా నమ్మాను,  అదే ఇప్పుడు నా కొంప ముంచింది" అని అంటుంది.

" ఇంతకీ నీకు ఆ డిటెక్టివ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరే" అని అడుగుతుంది శైలు.

ప్రియా కోపంతో ఉగ్రకాలీలాగా పైకి లేచి నితిన్ వైపు చూస్తుంది." ఆ రుద్ర గాడు నీ ఫ్రెండే కదా"  అని అడుగుతుంది. 

నితిన్ కొంచెం భయపడుతూ వెనక్కి జరుగుతూ  "స్వీటీ ఐ యాం సారీ ,  నిజంగా వాడు నీకు ఇలా సగం సగం ఇన్ఫర్మేషన్ ఇస్తాడని నాకు తెలియదు,  తెలిసి ఉంటే వాటి గురించి నీకు అసలు చెప్పే వాడీని కాదు ఐ యాం సారీ"  అని భయపడుతూ అంటాడు.

శైలు ఆశ్చర్యపోతూ " ఏంటి ఆ డిటెక్టివ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నువ్వా,  ఒరేయ్ ఎదవ నీవల్ల ఇప్పుడు ఏం జరిగిందో చూడు"  అని అంటుంది.

" ఒసేయ్ నువ్వు ఆగవే " అని నితిన్ అంటూ ప్రియా వైపు కొంచెం భయంగా చూస్తాడు.

ప్రియ తన అందమైన కళ్ళు రెండు పెద్దవి చేసి  నితిన్ వైపు కోపంగా చూస్తుంది. కోపంలో తన కళ్ళు ఎర్రబడతాయి , తన తెల్లని మొహం ఎర్రబడుతుంది. తన అందమైన పొడవాటి జుట్టు గాలి లోకి లెగుస్తుంది. ( యాక్చువల్లీ ఫ్యాన్ గాలి వల  లెగుస్తుంది అనుకోండి) .
ఎప్పుడు శాంతస్వరూపంగా కనిపించే మన ప్రియ ఇప్పుడు రుద్రకాళి లాగా కనిపిస్తుంది.

నితిన్ నిఖిల్ వైఫ్ చూసి " ఒరేయ్ ప్లీజ్ సేవ్ మీ " అని అంటాడు .

కానీ నిఖిల్ మాత్రం ఈవిల్ స్మైల్ ఇస్తాడు.
ఆ ఈవిల్ స్మైల్ చూసిన నితిన్ 'చి చి అయినా నేనేంటి తెలిసి తెలిసి ఈ రావణాసుడి హెల్ప్ అడుగుతున్నాను , కృష్ణయ్య నన్ను కాపాడే వాడు ఎవడయ్యా' అని అనుకుంటాడు.

ప్రియా మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన చూపు నితిన్ వైఫై ఉంచి నిఖిల్ వైపు చేయి చూపించి " నిఖిల్ ఆయుధం"  అని అడుగుతుంది. 

ఆ మాట వినగానే నితిన్ గుండెజారిపోతుంది ' అయిపోయింది ఈరోజు తో నా చాప్టర్ క్లోజ్' అని అనుకుంటూ నిఖిల్ వైపు చూసి ' వీడు ఏ రివాల్వరో ఇవ్వడు కదా'  అని అనుకుంటాడు.

నితిన్ మైండ్ చదివినట్టుగా నిఖిల్ తలకాయ అడ్డంగా ఊపుతాడు.

****'ఏంటి రివాల్వర్ ఇవ్వవా? మరి ఏమిస్తావ్ రా దానికి'
'వెయిట్ అండ్ వాచ్' ***
(నిఖిల్ అండ్ నితిన్ మైండ్ వాయిస్)

" ఒక్క నిమిషం స్వీటీ"  అని చెప్పి నిఖిల్ దగ్గరలో ఉన్న ఒక పెద్ద కర్ర తీసుకొని వచ్చే ప్రియా చేతికి ఇస్తాడు .

ఆ కర్ర చూడ్డానికి చాలా పెద్దగా ఉంటుంది ఒక రకంగా చెప్పాలి అంటే పోలీసోడి చేతిలో ఉండే లాటి కర్ర లాగా ఉంటుంది. ఆ కర్ర చూసి నితిన్ కళ్ళు పెద్దవి అవుతాయి ' ఏంటి వీళ్లు ఇప్పుడు థర్డ్ డిగ్రీ లాంటివి గాని నామీద ప్లాన్ చేశాడా ఏంటి? ' అని మనసులో అనుకుంటాడు.

" అయిపోయావురా నువ్వు ఈరోజు నా చేతుల్లో"  అని నితిన్ వెంటపడుతుంది.

నితిన్ మాత్రం ప్రియా నుంచి తప్పించుకుంటూ రూమ్ మొత్తం పరిగెడుతూ ఉంటాడు.

శైలు ,నితిన్ ని చూసి జాలిపడి ,నిఖిల్ దగ్గరికి వచ్చి "  నిఖిల్ దాన్ని ఆపొచ్చు కదా పాపం వాడిని చంపేసేటట్టు ఉంది ఈరోజు"  అని అంటుంది.

" ఏం పర్లేదు ఎప్పటినుంచో వాడిని తంధాం అనుకుంటున్నాను కానీ నాకు చాన్స్ రాలేదు ఈరోజు  ప్రియా కి వచ్చింది  , లెట్ మీ ఎంజాయ్ ద మూమెంట్ " అని అంటాడు. కూల్ గా సోఫాలో కూర్చుని అక్కడ జరుగుతుంది మొత్తం ఏదో సినిమా చూస్తున్నట్టు చూస్తూ.

నిఖిల్ తో పని అవ్వదు అని శైలు అరుణ్ దగ్గరికి వెళ్లి " ఒరేయ్ నువ్వైనా ఆపరా దాన్ని"  అని అడుగుతుంది.

అరుణ్ టెన్షన్ పడుతూ " నువ్వు ఆగవే తల్లి నాకు ఎక్కడ పడతాయా అని , నేను టెన్షన్ తో చస్తున్నాను  ఇక్కడ "  అని అంటాడు.

శైలు కి ఏమీ అర్థం కాదు, కన్ఫ్యూజ్ అవుతూ " నీకు పడటం ఏంటి?" అని అడుగుతుంది. 

ఇంతలో ప్రియ చేతుల్లో తన్నులు తింటున్న నితిన్ " నన్ను ఒక్కడినే కొడతావ్ వెంటే ? అసలు నాకు ఆ డిటెక్టివ్ గాడి గురించి చెప్పింది అరుణ్ గాడు , ముందు వాడిని కొట్టు"  అని అంటాడు.

" చచ్చేండ్రోయ్ , వీడు నన్ను కూడా ఇరికించేసాడు" అని అంటూ ఎక్కడికి పారిపోవాలి అర్థం కాక అటు ఇటు పరిగెడుతూ ఉంటాడు అరుణ్.

ప్రియా నితిన్ నీ వదిలి అరుణ్ వెంట పడుతుంది. 
" అయిపోయారు రా ఇద్దరు ఈ రోజు నా చేతిలో మీ ఇద్దరి వల్ల నా కొంప మునిగింది ఈరోజు,  నా చేతిలో చచ్చారు ఈరోజు "  అని అంటూ ఇద్దరినీ కలిపి కుమ్మేస్తుంది.

నిఖిల్ వాళ్ళిద్దర్నీ చూస్తూ నవ్వుతూ " ఇదే కదా టూ ఫ్రెండ్షిప్ అంటే " అని అంటాడు .

ఇంతలో తలుపు దగ్గరికి వచ్చిన ప్రేమ్ , ఆదిత్య ఇంకా అక్షయ, అక్కడ జరుగుతున్నది చూసి షాక్ అవుతారు. 

కొనసాగుతుంది.....

తప్పులు ఏమైనా ఉంటే క్షమించగలరు.