Think about it!! in Telugu Short Stories by Sita books and stories PDF | కాస్తా ఆలోచించండి!!

The Author
Featured Books
Categories
Share

కాస్తా ఆలోచించండి!!

ఒకరు వద్దు అని చెప్పారు అంటే అది వద్దు అని అర్ధం.  అది కూడా పర్టిక్యులర్ గా ఒక అమ్మాయి  వద్దు అంది అంటే అసలు వద్దు అని అర్ధం. ఈ డైలాగ్ ఏ సినిమా  అని చెప్పనవసరం లేదు అనుకుంటా కదా! 

ఎస్ అలా వైకుంఠపురంలోనిది.

ఇప్పుడు ఎందుకు గుర్తుకు వచ్చింది అనే కదా మీ డౌట్. నిన్న ఒక సినిమా చూసా. కేవలం లాస్ట్ లో  ఒక డైలాగ్ విని అక్కడే ఆగిపోయింది నా ఆలోచన, మనసు కూడా.

అది చెప్పే ముందు ఒక చిన్న విషయం చెప్పాలి. ఇది చాలా సున్నితమైన విషయం.
ఇక్కడ చెప్పడం కరెక్ట్ నో కాదో నాకు తెలియదు కానీ చాలాసేపు ఆలోచించి రాస్తున్న.
భార్య భర్తల మధ్య సున్నితమైన బంధం గురించి. అది చెప్పే ముందు మరొక మాట.

మనం ఉదయం లేచిన దగ్గర నుండి  టీవీ న్యూస్ లో కావచ్చు , సోషల్ మీడియాలో కావచ్చు  వినే విషయం ఆడపిల్ల ల మీద జరిగే అత్యాచారం. వాటిలో కొన్ని బయటకి రాకపోయినా చాలా వరకు మన చెవి లో పడుతూనే ఉంటాయి. విన్న వెంటనే ఆల్మోస్ట్ అందరూ అనుకునే మాట ఒక్కటే అలాటి వాడిని కాల్చి చంపాలి అని.

ఏమిటి భార్య భర్తల బంధం కోసం చెప్తా అని రేపిస్ట్ ల గురించి చెప్తున్న  అనుకుంటున్నారా... కొంత మంది కి నేను ఏమి చెప్పాలి అనుకుంటున్నానో అర్థం అయ్యే ఉంటుంది. అర్థం కానీ వాళ్ళకి నేను చెప్తా ... అది నేను చూసిన సినిమా చెప్పితే నేను ఏమి చెప్పాలి అనుకుంటున్నానో మీకు అర్థం అవుతుంది కంగారు పడకండి. అంతా చెప్పాను మెయిన్ స్టోరీ మాత్రమే. అది కూడా నన్ను ఆలోచనలో పడేసిన సీన్ మాత్రమే చెప్తా.

ఒక భార్య తన భర్త మీద కేసు వేస్తుంది. తనని సెక్సువల్ గా టార్చర్ పెడుతున్నాడు అని. తనకి ఇష్టం లేకపోయినా సెక్స్ కోసం వేధిస్తున్నాడు అని, భర్త మీద వైవాహిక అత్యాచారం  కేసు వేస్తుంది. వైవాహిక అత్యాచారం చేసే వాళ్ళు,  అసలు అది తప్పే కాదు అని చెప్పేవాళ్ళు, అది మా హక్కు అని అడ్డం గా వాదించేవాళ్ళు  కనీసం పది పదిహేను ఫ్యామిలీ లలో ఒకరు అయినా ఉంటారు ఏమో.  ఎవరు బయటకి చెప్పుకోలేని సున్నితమైన విషయం.

బయటకి చెప్పలేని బాధ.  ఎవరికి చెప్తుంది ఏ భార్య  అయినా
భర్త కా ?? ...తన వలనే కదా ఈ బాధ
పేరెంట్స్  ....  రిలేటివ్స్ .. ఫ్రెండ్స్ .. ఎవరికి చెప్పలేదు. తనలో తానే ఏడుస్తూ బాధపడేవాళ్ళు చాలా మందే ఉంటారు మన చుట్టూ.  

అందరూ అలా ఉన్నారు అన్ని చెప్పను కానీ ఉన్నారు అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను.  భర్త తరుపు లాయర్ భర్త హక్కు అని వాదిస్తాడు. అలా ఇద్దరి లాయర్లు వాదన ప్రతివాదన ల తరువాత లాస్ట్ లో భార్య తరుపు లాయర్ ఒక మాట అంటాడు. 

"రేప్ జరిగిన అమ్మాయి నే నయం, కనీసం నాకు అన్యాయం జరిగింది అని పోలీస్ స్టేషన్ కి  వెళ్ళి దోషి మీద కంప్లైట్  ఇస్తుంది. కానీ ఇక్కడ  అలా కాదు ఆ దోషి కి 
మర్నాడు కిచెన్ లో దోసలు వేస్తుంది అని అంటాడు. 
అప్పటి వరకు భర్త తరుపున వాదించిన లాయర్ భార్య పైకి లేచి క్లాప్ కొట్టి అక్కడ  నుండి ఏడుస్తూ వెళ్ళిపోతుంది."  
ఈ సీన్ నే నేను ఈ రచన రాయడానికి కారణం.  

అలా అని భర్త తరుపు లాయర్ చెడ్డ వాడు కాదు . మగాడుని అనే అహంకారం. నాకు అవసరం అయినప్పుడు నా చెంత కి రావాలి అని,  తన భార్య  మీద తనకి అధికారం ఉంది అని అనుకునే మనసత్వం గలవాడు.  అలాంటి వాళ్ళు తమ తప్పు ఒప్పుకోరు. ఇక్కడ  లాయర్ తన భార్య కాలు పట్టుకుంటాడు అనుకోండి  అది వేరే విషయం.  తప్పు అని తెలిసి  ఒప్పుకునే వాళ్ళు కూడా ఎక్కడో  ఉంటారు నూటికి ఒకరు. 
ఒక తప్పు పది తప్పులకి కారణం అవుతుంది అంట. తప్పే చేయని మనిషి ఉండడు కానీ తప్పు ఒప్పుకునే వాడు వేలలో ఒకరు ఉంటారు ఏమో కదా 

ఏది ఏమైనా, ఎంత దగ్గరి వాళ్ళు అయిన ఎదుటి వారిని గాయపరిచేలా మాట్లాడం కానీ, చేతల్లో కానీ బాధ పెట్టడం తప్పే అది సొంత భార్య అయినా, అలాగే భర్త అయినా సరే.
బాధ కి లింగబేధం లేదు. ఆడ అయినా మగ అయినా ఒకటే. మన వాళ్లే కదా అని ఏమైనా పడతారు అనుకోవడం
తప్పు. ఒకసారి ఎదుటి వారి మాటలకి మనసు లో చిన్న గాయం అయిన అది పెరిగి పెరిగి కొండత అవుతుంది కానీ  పూర్తిగా పోదు కదా!  

చివర గా ఒక మాట 

మనం ఏమి లేదు అని అనుకున్నది,  ఒక్కోసారి ఎదుటి వారి మనసులో మరచిపోని బాధ ని మిగిల్చిఉండచ్చు కదా! నిజమే ఆ బాధ బంధం విడిపోయేలా చేస్తుంది.
కలిసిఉన్న  కలవలేక, కలిసి ఉండలేక నరకం అనుభవిస్తుంది.
అది ఎవరైనా సరే. 

                               Sita ❤️