Not the end - 64 in Telugu Mythological Stories by Ravi chendra Sunnkari books and stories PDF | అంతం కాదు - 64

Featured Books
Categories
Share

అంతం కాదు - 64

కొత్త పాత్రల ప్రవేశం: విశ్వసేన, భీముడు

ఇలా అనుకుంటూ ఉండగానే, "సరే, ఇప్పుడు రావాల్సిన వాళ్ళు వస్తున్నారు చూడు," అని అంటూ ఒక టెలిపోర్ట్‌ను ఓపెన్ చేస్తాడు. అక్కడి నుంచి కొంతమంది యోగులు, సిద్ధులు, అఘోరీలు, వారికి ముందుగా బలమైన వజ్రకాయతో ఉన్నట్టుగా లావుగా కనిపిస్తున్న వ్యక్తి వస్తున్నాడు. అతను వచ్చి రావడంతోనే అసురులను అతలాకుతలం చేస్తున్నాడు. సడన్‌గా అతని చేతిలోకి గద వచ్చింది. ఆ గదతో ఊంచి పడేస్తుంటే అసురులు అంతమైపోతున్నారు. అతను స్పీడుగా వెళ్తూ, "అర్జున్! అర్జున్ అన్నయ్య! ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడున్నావు? నిన్ను ఏం చేశారు?" అని అంటూ గదతో అసురులను నలిపేస్తున్నాడు. అడ్డొచ్చిన వాళ్ళను తొక్కి పడేస్తున్నాడు.

కొద్దిసేపటికి అర్జున్ దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ కొన్ని గద్దలు ఎగురుతూ ఉండగా, "ఏంటి, మా అన్నయ్యని చంపాలని చూస్తున్నారా? ఎంత ధైర్యం వీళ్ళకి! నా గురించి తెలియదు అనుకుంటా!" అని అంటూ ఒక్కసారిగా గదతో కొట్టేసరికి, అక్కడున్న బ్లాక్ ఎనర్జీ గద్దలన్నీ ఎగిరిపోతాయి. అతన్ని చూడగానే అర్జున్ ఇలా అంటాడు, "విశ్వా!" అని అంటూ హత్తుకుంటాడు. ఎప్పుడైతే భీముడు హత్తుకోగానే అతని భావాలు మళ్ళీ తిరిగి వస్తాయి. ఏడుపు వస్తుంది కన్నీళ్లలో నుంచి, ఆనందం నుంచి కోపం, కోపం నుంచి సంతోషం – ఇలా అన్ని భావాలు ఒక్కసారిగా విడుదలవడంతో గబ్బిలం, పిల్లి, ఫీనిక్స్ అన్ని బయటికి రావడం మొదలుపెడతాయి.

"సోదరా భీమసేనా! మన నన్ను కాదు కాపాడాల్సింది. నేను ఎలా పోయినా పర్వాలేదు, కానీ మన అమ్మ చెప్పిన రహస్యం నీకు గుర్తుంది కదా? కర్ణుడు మన పెద్ద అన్నయ్య అని! ఇప్పుడు అతను ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో కనుక్కోవాలి. మనం చేసిన తప్పుకు కచ్చితంగా మనం సరిదిద్దుకోవాలి. నేను ఇందాకే చూసా, ఎవరో శకునిని మామ అంటున్నారు. ఒకవేళ దుర్యోధనుడు వస్తే కచ్చితంగా కర్ణుడు మళ్ళీ లొంగిపోతాడు, లేదా అంతమైపోతాడు. ఈసారి మనం ఉన్నంతవరకు అతనికి ఏమీ జరగనివ్వకూడదు. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా," అంటూ తన పిల్లిని పెద్ద పులిగా మార్చేశారు. గబ్బిలం ఒక నెగటివ్ ఎనర్జీ పీల్చుకొని ఒక యంత్రంలా పిల్లి మీద కూర్చుంది. గబ్బిలం, పిల్లి – అవి రెండూ యుద్ధానికి సిద్ధమయ్యాయి. పెద్దపులిగా మారిన పిల్లి ఒక్కసారిగా తన పంజాలతో యుద్ధాన్ని అతలాకుతలం చేయడం మొదలుపెడుతుంది. అదే టైంలో ఫీనిక్స్ ఒక్కసారిగా అర్జున్ శరీరంలోకి చేరి, "ఇప్పుడు నా సత్తా ఏంటో చూపిస్తా వీళ్ళకి!" అని అంటూ అగ్నితో చుట్టూ నెగటివ్ ఎనర్జీని ఎక్కడా లేకుండా యుద్ధాన్ని ప్రారంభించాడు. తనకు ఎదురుగా వచ్చిన వాళ్ళు కాలి బూడిదవుతున్నారు.

ఇలా ఇక్కడ ఉండగా, మరోపక్క విక్రమార్క చూపిస్తాడు. విక్రమార్క లాస్ట్ అండ్ ఫైనల్‌గా, "ఏంటి, నిన్ను చంపడం పెద్ద కష్టం అనుకుంటున్నావా? నీ కొడుకుల్ని ఎలా చంపానో తెలుసా?" అని అంటూ ఒక బాణాన్ని సృష్టించాడు. "నీ కొడుకులను చంపాను, ఎలా చూస్తావా?" అని అంటూ మళ్ళీ ఎలా చంపాడో చెబుతూనే మహాసురుడికి భయం కల్పించడం మొదలు పెట్టాడు. "ఇలా తీసి ఇలా పొడిచాను," అని అంటూ ఎగిరి ఒక్కపొడితో గుండెల్లో పొడిచాడు. అతను అక్కడ చనిపోతాడు మహాసురుడు. అతని నుంచి నెగటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతూ ఉంది.దుర్యోధనుడి విజృంభణ: విక్రమార్క ఓటమి

ఆ నెగటివ్ ఎనర్జీ చివరికి శకుని శరీరంలోకి చేరుతుంది. అతను తల పట్టుకుంటూ, "ఈ విక్రమార్క గాడు మహాసురుడిని చంపేసినట్టున్నాడు. ఇప్పుడు పెద్ద కథ అయిపోయిందే!" అని అనుకుంటూ బాధపడుతున్నాడు. అప్పుడే దుర్యోధనుడు కోపంగా, "ఏంటి! మన సైన్యంలో ఒకడిని ఎవడో చంపాడా? ఎవరు వాడు? చెప్పు! ఒక్క గుద్దుతో చంపేస్తా!" అని అరుస్తున్నాడు. "చెప్తా మేనల్లుడా! నువ్వు నా కోసమే వచ్చినట్టుగా ఉంది. ఈ ప్రపంచాన్ని నీ కోసమే నేను స్వాధీనం చేసుకోవాలని ఎంత ప్రయత్నించినా, చివరికి నువ్వు ఎలాగో వచ్చావు. ఇప్పుడు నీ పట్టుదల ఏంటో, నీ శక్తి ఏంటో చూపించు. ఆ విక్రమార్క గాడిని ఒక్క తోపులో చంపేయ్!" అని అంటూ ఉండగా, దుర్యోధనుడు నీలిరంగు కవచంతో స్పీడుగా పరిగెడుతున్నాడు.

కొద్దిసేపటికి భూమి లోపల నుంచి బయటికి వచ్చిన విక్రమార్క అటు ఇటు చూస్తున్న టైంలోనే, "ఎవడ్రా నువ్వు?" అని అంటూ దుర్యోధనుడు పైనుంచి వచ్చి ఒక్క అటాక్‌తో విక్రమార్కను కింద పడేయాలని చూస్తాడు. విక్రమార్క ఒక్క అడుగు వేసి దుర్యోధనుడి చెయ్యి పట్టుకొని ఆపి, "ఎవరు నువ్వు? నామీద అటాక్ చేయాలని చూస్తున్నావా?" అని అడుగుతాడు. "ఎవరైతే నీకెందుకురా? ఇప్పుడు నీ చావు చూపిస్తా!" అని అంటూ మరో చేత్తో గుద్దుతుంటే, ఇద్దరూ గిరగిరా తిరుగుతూ ఒక్కసారిగా నేల మీద పడిపోతారు. ఒకరినొకరు క్రూరంగా చూసుకుంటూ, "నన్నెందుకు అటాక్ చేస్తున్నావ్? నిన్ను ఎవడు ఏమన్నాడురా?" అని అంటూ దుర్యోధనుడి మొహం మీద పంచ్ వేయాలని చూశాడు కానీ, దుర్యోధనుడు ఇంకొంచెం దూరం జరిగి తన కాలుతో విక్రమార్కను తన్నుతాడు. వెంటనే విక్రమార్క దూరంగా వెళ్లి పడతాడు. ఎంత స్పీడ్‌గా పడ్డాడో అంత స్పీడ్‌గా మళ్ళీ లేచి ఫైటింగ్‌కు సిద్ధమవుతూ ఉండగా, వెనకాల నుంచి ఎవరో వస్తున్నట్టు శబ్దం రావడంతో వెనక్కి తిరిగి చూస్తాడు. ఎవరూ ఉండరు. మరో పక్కకి చూడగా, తన ముందున్న దుర్యోధనుడు, "నీ పని అయిపోయింది!" అని అంటూ ఒక్క గుద్దుతో మైకం వచ్చేలా చేశాడు. విక్రమార్క అక్కడే పడిపోతాడు. వెంటనే అతని చుట్టూ నెగటివ్ ఎనర్జీ చుట్టుముడుతుంది.

విక్రమ్ (కర్ణుడు) ప్రతాపం: శత్రువుకు షాక్

ఇప్పుడు విక్రమ్ వైపు చూపిస్తారు. ఇతను కర్ణుడి అంశతో పుట్టిన వ్యక్తి. ఇప్పుడు విక్రమ్ అటూ ఇటూ గంతులు వేస్తూ బాణాలతో యుద్ధాన్ని ముందుకు సాగిస్తున్నాడు. తన సైన్యం ఎటువంటి ఇబ్బంది లేకుండా యుద్ధాన్ని ముందుకు సాగిస్తూ ఉంది. వీళ్ళంతా మనోహర లోకం నుంచి వచ్చినవాళ్లు కాబట్టి వాళ్లకు కూడా కొంచెం గొప్ప శక్తులు ఉన్నాయి. అదే టైంలో శకుని, "అల్లుడా, అడుగు! నీ చిరకాల స్నేహితుడు, శత్రువుగా మారిన కర్ణుడు అక్కడే ఉన్నాడు. అతనిని అడ్డుకుంటే మిగతా వాళ్ళను చాలా సులువుగా చంపేయొచ్చు!" అని చెబుతున్నాడు. దుర్యోధనుడు ఆశ్చర్యపోతున్నాడు. అతను విక్రమ్ వైపు చూస్తాడు. చూడ్డానికి అలాగే ఉన్నాడు – ఆ బంగారు కవచం, చేతిలో దివ్య ధనస్సు, అప్పుడప్పుడే వస్తున్న చిన్న చిన్న బుల్లెట్స్ లాంటివి – ఇవన్నీ అతనికున్న శక్తులే అని అనుకుంటూ ముందుకు వెళుతున్నాడు. అతని ఒక్కో అడుగు భారంగా ఉన్నా బలంగా కనిపిస్తుంది.