Not the End - 63 in Telugu Mythological Stories by Ravi chendra Sunnkari books and stories PDF | అంతం కాదు - 63

Featured Books
Categories
Share

అంతం కాదు - 63

మూషిక రాజు విజృంభణ: యుద్ధభూమిలో గణేశుడు

మూషిక రాజును యుద్ధభూమికి పిల్చుకోవాలి. అతను ఎక్కువసేపు పని కానివ్వడు, ఒక్క రెండు నిమిషాల్లో అంతం చేసి వచ్చేస్తాడు," అని అనుకుంటున్న సమయంలో, మూషిక రాజు భయంకరంగా ఢీకొడుతూ మూషికాసురుని ప్రాణాలు తీసే స్థాయికి తీసుకువెళ్తున్నాడు. చివరిగా మూషిక రాజు, మూషికాసురుని పైకి ఎగరేసి, ఒక్క తన్నుతో కింద పడేసి, గొంతు పట్టి, "ఇప్పుడు చెప్పు, మూషిక రాజు ఎవరు? నేనే కదా! నేనే కదా!" అని క్రూరంగా అడుగుతూ తన రెండు పళ్లతో ఒక్కసారిగా పీక కొరికి చంపేస్తాడు. అక్కడే భూమిలో కలిసిపోతుంది మూషికాసురుడి శరీరం. మూషిక రాజు ఒక్కసారిగా పైకి లేచి మూషికాసురుని సైన్యాన్ని మొత్తాన్ని తన వైపు తిప్పుకొని, తన దివ్య శక్తిని ఆ మూషికలకు ఇచ్చి, తన సైన్యంగా మార్చుకుంటాడు.4578

విక్రమ్ అజేయ శక్తి: కర్ణుడి అంశ

ఇక్కడ విక్రమ్ వైపు చూపిస్తారు. విక్రమ్‌కు ఉన్న విచిత్రమైన పవర్స్ ద్వారా ఎంతో మందిని చంపుతున్నాడు. అతనిని ఎలా ఆపాలో ఎవరికీ అర్థం కావడం లేదు. అతని చేతిలోంచి వస్తున్న విచిత్రమైన బుల్లెట్లు లాంటివి, ఇంకొన్ని విచిత్రమైన బాణాలు, కర్ణుడి కవచం, కర్ణుడి దివ్య ధనస్సు వంటివి అతనికి ఎంతో ప్లస్ పాయింట్‌గా మారాయి. తను దాడి చేసిన ప్రతి అసురుడు అంతమైపోతున్నాడు. అతని నుంచి నిప్పు, గాలి వంటి విచిత్రమైన ప్రకృతి శక్తులు విడుదలవుతున్నాయి. అతన్ని ఎలా ఆపాలో శకునికి కూడా అర్థం కావడం లేదు. అతన్ని ఎవరూ ఎందుకు ఆపలేకపోతున్నారంటే, అతను ఒక కర్ణుడి అంశతో పుట్టిన వ్యక్తి కాబట్టి, కర్ణుడికి ఉన్న శక్తులన్నీ ఉన్నాయి. సాధారణంగానే కర్ణుడిని ఆపడం చాలా కష్టం. అలాంటిది మానవ జన్మ ఎత్తి, మానవుల శక్తులు పొంది, భావాలను పట్టించుకున్న ఇప్పుడు, విక్రమ్ పేరుతో బ్రతుకుతున్న కర్ణుడిని ఎవరు ఆపగలరు?

దుర్యోధనుడి పునరుజ్జీవం: మామ-అల్లుడి కలయిక

ఇప్పుడు కట్ చేస్తే, ఒక లావా లాంటి ప్రదేశంలో చిన్న గుంటలో లావా ఉంది. ఆ లావా పైన ఒక స్తంభం లాంటి వస్తువు ఉంది. ఆ స్తంభం పైన ఒక చిన్న గుడ్డు, అది తెల్లటి కాంతితో మెరిసిపోతూ ఉండగా, దాని లోపల ఎవరో మనిషి కనిపిస్తున్నాడు. అతను నగ్నంగా ఉన్నాడు. అతను ఎవరో కాదు, దుర్యోధనుడు. ధర్మ చేసిన ప్రయోగం ఇది చాలా బాగా సక్సెస్ అయింది. ఒక మనిషి డీఎన్‌ఏ తీసుకొని, ఒక గుడ్డు లాంటి దానిలో అతనికి అప్పుడప్పుడు కొంచెం రక్తం మరియు కొన్ని మందులు ఇస్తూ, ఆ డీఎన్‌ఏను ఒక పెద్ద యువకుడిగా మార్చడానికి చేసిన ప్రయోగం సక్సెస్ అయ్యింది.

ఇప్పుడు ధర్మ అక్కడికి చేరుకున్నాడు. ధర్మ గుడ్డును చూస్తూ ఒక చిన్న లాక్‌తో గుడ్డును ఓపెన్ చేస్తాడు. లోపల నగ్నంగా దుర్యోధనుడు కూర్చొని ఉన్నాడు. తనకు ఇప్పుడే విముక్తి లభించినట్టుగా అనిపిస్తుంది. ఒక్కసారిగా లేచి, "మామా!" అని గట్టిగా అరుస్తాడు. అతని అరుపుకు అక్కడున్న లావా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అతని శరీరం మీద చిన్నగా బ్లూ కలర్ లాంటి కవచం ఏర్పడటం మొదలుపెట్టింది. అది ఏంటి అని అంటే, ఒకప్పుడు ఇదే కవచం దుర్యోధనుడికి వస్తూ ఉండగా, కృష్ణుడు చేసిన చిన్న మాయ వల్ల అతనికి దక్కలేదు. కానీ ఇప్పుడు అది పూర్తిగా అతనికి దక్కింది. అది అతని డీఎన్‌ఏలో ఉన్న చిన్న భాగాన్ని ఉపయోగించి చేసిన చిన్న ప్రయోగం అయినందున, దుర్యోధనుడికి మళ్ళీ పాత శక్తి పూర్తిగా తిరిగి వచ్చింది.

సామ్రాట్ శక్తి: నాగశేషు వాసుకి రక్షణ

ఇప్పుడు రుద్ర దగ్గర చూపిస్తాడు. రుద్ర తన స్నేహితులు ఒక్కొక్కరిగా పడిపోవడం, కేవలం విక్రమ్, సామ్రాట్ నిలబడి పోరాడుతూ ఉండటం చూసి అతనికి కొంచెం బాధగా ఉన్నా, ఇంకొంచెం గర్వంగా ఉంది. అతను యుద్ధంలోకి దిగితే ఇంకెలా ఉంటుందని ఊహించుకుంటూ సిద్ధమవుతున్నాడు యుద్ధానికి.

అదే టైంలో సామ్రాట్ చూస్తే, సామ్రాట్ మెడలో ఉన్న నాగశేషు, వాసుకి పాములు రెండు అతని రక్షిస్తూ ఉన్నాయి. అతని దగ్గరికి నెగటివ్ ఎనర్జీ వచ్చినప్పుడల్లా ఆ పాములు నెగటివ్ ఎనర్జీని తనలోకి లాగేసుకుంటూ, సామ్రాట్‌కు యుద్ధం చేయడానికి సహాయపడుతూ ఉన్నాయి. అందులోనూ తన మెడలో ఉన్న గుండె లాంటిది అటువంటి శక్తులను చాలా ఈజీగా గ్రహించుకుంటూ అతనికి మరింత శక్తిని అందజేస్తుంది. తన చుట్టూ బ్లాక్ ఎనర్జీ ఎక్కడా కనిపించకుండా చేస్తూ ఉన్నాయి ఆ మూడు దైవ శక్తులు.

ఆ మూడు దైవశక్తిని చూస్తున్న శకునికి అనుమానం వస్తుంది. "అసలు ఏంటి, ఈడు ఇలా ఉన్నాడు? నా నెగటివ్ ఎనర్జీని వాడు లాగేసుకుంటున్నాడు అంటే, అతని మెడలో ఉన్న వాసుకి, నాగశేషులు చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నారు. వాళ్ళకు వ్యతిరేకంగా వాడాలి," అని పైకి చూస్తాడు. పైన గరుడ రూపంలో ఒక నల్లటి పక్షి ఎగురుతూ ఉంది. దాన్ని చూడగానే అతనికి అర్థం అవుతుంది.కార్తికేయ జ్ఞానం, రుద్ర ఆగ్రహం

అక్కడ విక్రమార్క, మహాసుర ఇద్దరు కొట్లాడుకుంటున్నారు. ఒకరి మీద ఒకరికి మరింత కోపం పెరుగుతూ, ఒకరిని ఒకరు చాలా బలంగా కొట్టుకుంటూ ఉండగా అక్కడ మళ్ళీ సీన్ కట్ అవుతుంది. ఇక్కడ విక్రమ్ తన శక్తులతో పోరాడుతున్నాడు. అదే టైంలో ఎక్కడినుంచో గట్టి అరుపు, "మామా!" అని శబ్దం. శకునికి ఆనందం పట్టలేదు. "అల్లుడు వస్తున్నాడు! ధర్మ, నువ్వు నిజంగా నా వైపు ఉన్న అదృష్టాన్నివయ్యా!" అని అంటూ చుట్టూ చూస్తున్నాడు. నీలి రంగులు చుట్టూ ఏదో వెలుగు వస్తూ ఉండగా, నెగటివ్ ఎనర్జీ కూడా దాంట్లో కలిసి విచిత్రంగా కనిపిస్తూ ఉంది. ఒక్కసారిగా ఎవరో ఆ భూమి మీద అడుగులు వేస్తారు. ఆ దెబ్బకు భూమి అల్లకల్లోలమై ఎగిరెగిరి పడుతుంది. అప్పుడే కనిపిస్తాడు దుర్యోధనుడు. కండలు తిరిగిన దేహంతో, నీలిరంగు కవచంతో అద్భుతంగా కనిపిస్తున్నాడు.

శకునిని చూడగానే దుర్యోధనుడు, "మామా, ఇన్ని రోజులకు నన్ను మళ్ళీ పుట్టించావా? నేను నిజంగా నువ్వు కూడా చనిపోయావేమో అని అనుకున్నాను. కానీ ఇలా మనం మళ్ళీ పుడతామని నేను అనుకోలేదు," అని అంటూ ఉండగా, అప్పుడే ధర్మ అక్కడికి వస్తాడు. ధర్మాను చూస్తున్న శకుని, "ఈ ధర్మ వల్లే మనం మళ్ళీ పుట్టగలిగాం. మన శక్తులు పూర్తిస్థాయిలో వచ్చాయి. ఇప్పుడు నేను ఒక యువకుడిని. ఈ శరీరం కూడా ఆ ధర్మా దే," అని చెప్పుకుంటూ ఇద్దరూ ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఉన్నారు.

సామ్రాట్ వైపు ఒక నల్లటి ఎనర్జీ లాంటిది వేగంగా వెళుతుంది. అది చూడటానికి దాదాపు గద్దలా కనిపిస్తూ బలమైన గోర్లతో దాడికి సిద్ధమైంది. దాని వెనుక వందల కొద్దీ గరుడ సైన్యం మొత్తం ఉంది. అవి అన్నీ ఒకేలా కనిపిస్తూ బ్లాక్ ఎనర్జీలో మాయం అవుతూ ప్రత్యక్షమవుతూ యుద్ధాన్ని కొనసాగిస్తున్నాయి. తమ ఎదుట వచ్చిన ప్రతి మానవుడిని ఒక్క తోపులో రెండు ముక్కలుగా చేసి పడేస్తున్నాయి. అలాగే అర్జున్ దగ్గరికి ఇంకొన్ని అసుర గణాలు బయటికి వెళ్తున్నాయి. అర్జున్ చుట్టూ చుట్టుముడతాయి.

అదే పనిగా ధర్మ మళ్ళీ అక్కడ మాయమై మరోచోట ప్రత్యక్షమవుతాడు. చిన్న చిన్న పిల్లలున్న ప్రదేశం, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు తమ ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతుండగా, ధర్మ తన రోబోట్‌లతో మరింత విధ్వంసం చేస్తున్నాడు. కానీ ఎనర్జీ ఎక్కడికీ వెళ్ళకుండా ధర్మ ఒక ప్రొటెక్షన్ షీల్డ్‌ను అంతా ఒక చోట చేరుస్తున్నాడు. ఇది శకుని చెప్పాడు, అది పాటించాడు. కానీ ఈ విషయం చెప్పింది కూడా ధర్మానే.

మరోపక్క చూపిస్తే, శివ దాదాపు పడిపోయాడు. తన ముందున్న ఒక గబ్బిలం లాంటిది శివ మెడ మీదకి ఎక్కి, అక్కడున్న డైమండ్‌ను పీకడానికి ట్రై చేస్తూ ఉంది. అదంతా చూస్తున్న రుద్ర తట్టుకోలేకపోయాడు. "ఆపండి! నన్ను ఒక్క నిమిషం వదలండి, అంతు చూసి వస్తా!" అని అంటూ రెచ్చిపోతున్నాడు. అందరూ అతనిని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. గణేశుడు ఒక మాట చెప్పాడు: "చూడు, ఇక్కడ జరిగేది ఏదీ ఊరికే జరగడం లేదు. అంతా ఆ కృష్ణుడి లీల. నువ్విలా రెచ్చిపోయి నీ శక్తిని వృధా చేసుకోకు," అని అంటూ ఉన్నాడు. కానీ రుద్ర మాట వినకుండా అరుస్తున్నాడు. వెంటనే కార్తికేయ, "చెప్పేది అర్థం కావడం లేదా?!" అని గర్జించడంతో రుద్ర ఒక్క నిమిషం విత్తరపోయి చూస్తున్నాడు.

కార్తికేయుడు ఇలా అంటున్నాడు: "మేమందరం సైలెంట్‌గా ఉన్నా మాకేం చేతకాదు అనుకుంటున్నావా? ప్రతిదానికి ఒక సమయం వస్తుంది. మీ సమయం వచ్చినప్పుడు విడుదల చేస్తాం. అప్పటిదాకా సైలెంట్‌గా ఉండు. అప్పుడు చూపించు నీ ధైర్యం, నీ ప్రతాపం! ఇక్కడ ఎంతో మంది రావాలి. ఈ యుద్ధభూమిని ఎందుకు సరిపెట్టాం? ఇక్కడ మామూలు శక్తులు కాదు, మంత్ర శక్తులు కాదు, దైవ శక్తులు కూడా నిలవగలిగే శక్తి ఉంది. ఇక్కడ ఇంకా కొన్ని పాత్రలు రావాలి. అవి వచ్చేదాకా సైలెంట్‌గా ఉండు. నిన్ను విడుదల చేసినప్పుడు ఇక్కడ నువ్వు ధ్వంసం చేస్తావని మాకు తెలుసు. కానీ అప్పుడే అయితే కథ ఎలా ఉంటుంది చెప్పు? ఇక్కడ ఎంతోమంది ఉన్నారు, గొప్ప గొప్పలు ఉన్నారు. అయినా అందరూ సైలెంట్‌గా చూస్తున్నారని అర్థం కావడం లేదా? కొంచెం అర్థం చేసుకో," అని గట్టిగా మాట్లాడుతుంటే, గణేశుడు, "అన్నయ్య, ఎందుకు అలా భయపెడుతున్నావ్? చూడు రుద్ర, ఇది లీల కాబట్టి నువ్వు ఏమీ చేయలేవు. అక్కడికి వెళ్తే నీకున్న బలహీనతలను వాళ్ళు కనుక్కుంటే నిన్ను కూడా ఆపేస్తారు. అదే చివరి క్షణంలో అందరూ ఓడిపోయారు అనుకున్న టైంలో నువ్వు బయలుదేరితే అందరూ ఒక్క దెబ్బకు అయిపోతారు," అని శాంతంగా చెప్పడంతో రుద్ర ఒక క్షణం సైలెంట్‌గా విన్న తర్వాత ప్రశాంతంగా కూర్చుంటాడు. కానీ మనసులో అగ్నిపర్వతం రగులుతూ ఉంది.