Silence is the same - 6 in Telugu Drama by Sangeetha books and stories PDF | మౌనం మట్లాడేనే - 6

Featured Books
Categories
Share

మౌనం మట్లాడేనే - 6

ఎపిసోడ్ - 6


నిజానికి నిదర్శనం


[ఫ్లాష్‌బ్యాక్]

AK Vision Works గురించి చెబుతున్నప్పుడు ఆదిత్య వర్మ గారు ఇలా అన్నారు:

"3 years... ఎన్నో కష్టాలు పడి ఆ కంపెనీని ఆ స్థాయికి తీసుకెళ్లాం. అన్నీ బానే ఉన్నాయి. మీరు ఫ్యామిలీగా బాగా సెటిల్ అయ్యారు, నేను కూడా బాగా సెటిల్ అయ్యాను. ఏం కొనాలన్నా, ఏం చేయాలన్నా కొరత లేదు.
కాని... మీ నాన్న ఏం చేశాడు?
ఒక నిమిషంలో అన్నీ మార్చేశాడు. కష్టపడి నిలబెట్టిన కంపెనీని ఎవరి పేరుకో రాసి వెళ్లిపోయాడు.
ఇద్దరి ఫ్యామిలీ నాశనం అవడానికి మీ నాన్నే కారణం!" అని కోపంగా చెప్పుకుంటున్నాడు.


---

ప్రియా:
"అంకుల్..." అంటూ కొంచెం గొంతు పైకి తీసుకుని ఇలా చెప్పింది –
"ఒక స్నేహితుడు నమ్మకాన్ని తీసిపోసుకుంటాడా?
ఆ పరిస్థితి ఎంత తక్కువ దారుల్ని ఇచ్చిందో ఆలోచించారా?
(కళ్లను తుడుచుకుంటూ) – తెలుసుకోరు కూడా... ఎందుకంటే మీకు కోపం. ఎవరో ఏదో చెప్పారు. వాటిని నమ్మేసారు.
కానీ, మీ ఫ్రెండ్ మిమ్మల్ని ఎప్పుడూ మోసం చేయరని మీరు నమ్మలేకపోయారు.
అంత ఈగో మీలో..."


ఆదిత్య వర్మ:
"కోపంతో... మీ నాన్న వల్ల నేను నా భార్యను కోల్పోయాను.
నా కొడుకు కూడా నా నుంచి దూరమైపోయాడు.
ఇంకేమీ మిగల్లేదు వినడానికి..."
(తీవ్రంగా బాధతో)
"అతను ఆ డాక్యుమెంట్‌పై సైన్ చేయకుండా ఉండి ఉంటే... ఈ రోజు అంతా ముందులా ఉండేది.
నిజం చెప్పాలంటే... అంతకంటే బాగుండేది."


ప్రియా:
"ఆ డాక్యుమెంట్‌పై సైన్ చేయమని అడిగింది విక్రమ్ సర్ గారే." అని చెప్పారు.


ఆదిత్య విన్న వెంటనే షాక్ అయిపోయారు. అసలు మాట్లాడలేకపోయారు. మళ్లీ ఇలా అడిగారు:

"What are you saying? అతను నా తమ్ముడు! He is my brother Vikram Varma. He can't do this to me..."



ప్రియా:
"But he did, uncle.
అవును అంకుల్, ఆ డాక్యుమెంట్ మీద సైన్ చేయించుకున్నది మీ తమ్ముడు విక్రమ్ వర్మనే."

"అప్పటివరకు నాన్నకి తెలియదు ఆయన ఏం సైన్ చేస్తున్నారో. మోసం చేసి కంపెనీ పేపర్లపై సైన్ చేయించుకున్నారు."

"మీరు ఏదో మీటింగ్ కోసం సింగపూర్ వెళ్ళినప్పుడు విక్రమ్ గారు మా ఇంటికి వచ్చారు.
నాన్నతో ఏదో మాట్లాడారు. ఆ రోజంతా చాలా టెన్షన్‌గానే ఉన్నారు.
మిమ్మల్ని చాలా సార్లు కాంటాక్ట్ చేశారు కానీ రీచ్ కాలేదు.
ఇంకేం దారి లేక నాన్న ఆ డాక్యుమెంట్ మీద సైన్ చేశారు."

"నాన్న చనిపోయిన తర్వాత ఆయన ఫోన్‌లో ఈ వీడియో దొరికింది.
అప్పటివరకు ఎవరికీ నిజం చెప్పలేదు... మీకూ కూడా.
మీరే చూడండి." అని చెబుతూ వీడియో ప్లే చేసింది.


---

కృష్ణ ప్రసాద్ గారు వీడియోలో ఇలా అంటున్నారు:

"ఆదిత్య, నన్ను క్షమించరా?
నా వల్ల నువ్వు చాలా కోల్పోయావు.
ఆ బాధను నేను ఇన్ని నెలలుగా మోస్తున్నాను.
ఇప్పుడు మోసే శక్తి లేదు రా...
నా హార్ట్ కండిషన్ బాగాలేదు. ఎప్పుడు చనిపోతానో తెలీదు.
నిజం చెప్పాలని వస్తే నువ్వు వినలేదు.
మళ్లీ నువ్వు వినేటప్పటికి నేను ఉండను."

"ఆ రోజు నువ్వు సింగపూర్‌లో ఉన్నప్పుడు, నీ తమ్ముడు విక్రమ్ ఇంటికి వచ్చాడు.
నువ్వు కంపెనీ మొత్తం నా పేరు మీద రాసుండకపోతే అలా అయ్యేది కాదు.
తప్పు చేశానని ఏడుస్తూ చెపుతున్నా..."

"విక్రమ్ నా దగ్గరకు వచ్చి,
'కౌసల్య హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యింది. ట్రీట్మెంట్‌కి తక్షణంగా పాతిక లక్షలు కావాలి,' అని చెప్పాడు.
ఆదిత్యకి ఫోన్ చేస్తున్నా – రీచ్ అవడం లేదు.
హాస్పిటల్ వాళ్లు 'డబ్బు లేకపోతే ట్రీట్మెంట్ చెయ్యం' అన్నారు అని చెప్పి,
ఏదో ఇన్షూరెన్స్ డాక్యుమెంట్ అని పేపర్స్ చూపించాడు."

"నేను చూసినప్పుడు ఇన్షూరెన్స్‌కి సంబంధించినవే ఉన్నాయి.
'నువ్వు వెళ్లే ముందు కొన్ని డాక్యుమెంట్లు నీ తమ్ముడి దగ్గరే ఇచ్చావు కదా. ఇది ఆ డాక్యుమెంట్లలో ఒకటే,' అని చెప్పాడు విక్రమ్.
'దీని మీద మీ సైన్ ఉంటే చాలు, హాస్పిటల్ వాళ్లకి అశురెన్స్ ఇస్తాను.
ఇది ఇన్షూరెన్స్ డాక్యుమెంట్. కౌసల్యకి అవసరం' అని చెప్పాడు."

"మీ తమ్ముడే కదా' అని నమ్మి, నేను ఆలోచించకుండా సైన్ చేశాను రా.
క్షమించు.
నిజంగా ముందు వెనకా ఆలోచించకుండా సైన్ చేశాను..."

"వీటి వల్ల కంపెనీకి ఎలాంటి నష్టం లేదు, ఇది తాత్కాలికమే అని చెప్పాడు.
అంత డబ్బు ప్రియా పేరుతో FDలో ఉంది. వెంటనే వాటిని బ్రేక్ చేయడం సాధ్యం కాక,
చేతిలో డబ్బు లేక ఏం చేయాలో అర్థం కాలేదు."

"కౌసల్య బానే ఉందని... అదంతా విక్రమ్ ఆడిన నాటకం అని."

"ఆ డాక్యుమెంట్ ఇప్పటికీ మీ తమ్ముడి దగ్గరే ఉంది..." అని చెబుతూ వీడియో ముగిసింది.


---

ఆదిత్య వీడియో చూసిన వెంటనే షాక్ అయిపోయారు.

"నా తమ్ముడు నా వెనుక ఇలా చేస్తాడని ఊహించలేదు..."

ఇన్నిరోజులు తన ఫ్రెండ్‌ని తప్పుగా అనుకున్నందుకు గిల్టీగా ఫీల్ అయ్యారు.
తప్పు చేసానని గ్రహించారు.


---

ప్రియా, ఆయన భుజం మీద చేయి వేసి ఇలా చెప్పింది:

"అంకుల్, ఇందులో మీ తప్పేమీ లేదు.
మీ తమ్ముడు మీ నమ్మకాన్ని... నాన్న నమ్మకాన్ని గెలుచుకుని మోసం చేశాడు Mr. Vikram Varma.
తప్పు చేసింది వాడు... మీరు కాదు."

"నిజం మీ ముందు పెట్టడానికి నేను మీ కంపెనీలో జాయిన్ అయ్యాను. కౌసల్య గారు చనిపోయిన తర్వాత మీరు మందులో మునిగిపోయారు.
విక్రమ్ గారు కావాలనే AK Vision Works కంపెనీని Vikram Group of Industries‌ గా మార్చేశారు." ఇప్పటి వరకు ఆ కంపెనీ ని తానే నడుపుతున్నారు.

"ఇప్పుడు ఉన్న కంపెనీకి మీరు CEO అనుకుంటున్నారా అంకుల్?
పేరు కోసం మాత్రమే."

"ఎప్పుడైనా ఆ పోస్టును లాగేసుకోవచ్చు. అలానే ప్లాన్ చేశారు.
మీరు ఆయన గ్రిప్‌లో ఉండాలనుకుని, ఎమోషనల్‌గా మిమ్మల్ని వీక్ చేస్తూ గెలుస్తున్నారు."

"ఇదన్నీ ప్రూవ్ చెయ్యడానికి ప్రస్తుతం నా దగ్గర సాక్ష్యం లేదు..." అని చెప్పింది. సాక్ష్యం తో పాటు నిజం బయట పెట్టాలంటే నాకు మీ సహాయం కావాలి. అందుకే ఇప్పుడే చెబుతున్నాను.


---

ఆ సమయంలో ఆదిత్య గారు తన చేయి ప్రియా తలపై పెట్టి:

"నువ్వు ఎప్పుడూ బాగుండాలమ్మా.
సంతోషంగా ఉండు." అని ఆశీర్వదించారు.


---

ఈవెనింగ్, ప్రియా కృష్ కలుసుకునే స్థలానికి వచ్చింది.
మొత్తం ప్లేస్ బెలూన్స్, డెకరేషన్లతో నిండిపోయింది.

"క్రిష్!" అని పిలిచింది.

ఆఫీస్ కొలీగ్స్, ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు.
క్రిష్ ప్రియా దగ్గరకు వచ్చి, ఆమె చేయి పట్టుకుని:

"Happy Birthday, Priya. I LOVE YOU." అని చెప్పాడు.


---

ప్రియా ఒక్కసారిగా చేతిని వెనక్కి తీయడం...

"Krish... I didn’t expect this from you.
Sorry... I don’t love you." అని చెప్పి అక్కడినుంచి వెళ్లిపోయింది.


---

[ముందు కొనసాగుతుంది...]


---