Silence is like a mirror - 5 in Telugu Drama by Sangeetha books and stories PDF | మౌనం మట్లాడేనే - 5

Featured Books
  • बेरी

    "तुपाची बेरी आणि आठवणींची गोडी…"वाटीमध्ये साठवलेलं बालपणआठवण...

  • भारती

    “एकसाथ राष्ट्रगीत शुरू कर ...”या सरांच्या वाक्यासरशी भारती श...

  • वायंगीभूत - भाग 1

           पहिला कोंबडा झाला नी घरण उठली. काल रात्रीच्या रांधपाल...

  • तो प्रियकर नव्हता,तो फौजी होता - 3

    भाग ३ : गुप्त योजनारात्र गडद होत चालली होती. बाहेर कुठेतरी द...

  • माणूसपणाची मशाल

    अतिशय प्रभावी.यामध्ये मी पात्रांची अंतर्गत जाणीव, सामाजिक सं...

Categories
Share

మౌనం మట్లాడేనే - 5


ఎపిసోడ్ – 5

గతపు నీడలు

[ఫ్లాష్‌బ్యాక్]

అదిత్య సర్ "గెట్ అవుట్" అనగానే, ప్రియాకి అసలు ఏమీ అర్థం కాలేదు. కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి.
అదిత్య గారు దాసయ్యతో కోపంగా ఇలా అన్నారు –
"దాసయ్య, ఈ అమ్మాయిని బయటకి వెళ్ళమని చెప్పు.
వెళ్లకపోతే నువ్వే చెయ్యి పట్టుకుని బయటకి వెళ్లగొట్టే!" అని చెప్పి రూమ్‌కి వెళ్లిపోయారు.

దాసయ్య ప్రియాతో
"అమ్మ, వెళ్ళండమ్మ..." అని చెప్పి బయటకి పంపించి తలుపు మూసేస్తాడు.

ప్రియా కన్నీళ్లు తుడుచుకుంటూ తనలో తానే అనుకుంటుంది –
"ఈరోజు మీరు ఎంత కోపంగా ఉన్నా, ఏం జరిగిందో తెలుసుకోవాల్సిందే అంకుల్... నేను చెప్పకుండా ఊరుకోను."
అని అనుకుంటూ ఉండగానే కృష్ ఫోన్ కాల్ వస్తుంది...

ప్రియా: "హై కృష్, చెప్పు."

కృష్ (నవ్వుతూ): "ప్రియా... నాకు ఒక విషయం చెప్పాలనుంది."

ప్రియా (గట్టిగా ఊపిరి పీల్చుకుని): "నాకు కూడా నీకు ఒక విషయం చెప్పాలనుంది కృష్..." అని చెప్పగానే,

కృష్: నవ్వుతూ – "అలాగైతే, సాయంత్రం మన రిగులర్ స్పాట్ లో కలుద్దాం." అని చెబుతాడు.

ప్రియా: "హ్మ్... ఓకే, బై." అని ఫోన్ పెట్టేసింది.

ఫోన్‌లో కృష్ ఫోటో చూస్తూ ఇలా అంటుంది...

"ఇన్ని రోజులు నిజం దాచినందుకు సారీ కృష్...
కానీ ఇప్పుడైనా చెప్పాల్సిన సమయం వచ్చింది.
ఇప్పుడూ చెప్పలేదు అంటే, ఉన్నదీ కూడా పోగొట్టుకునే పరిస్థితి వస్తుందేమో...
ఇది బహుశా తగిన సమయం.
నువ్వు విన్న తర్వాత ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయిన నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను."
(అని నవ్వుతూ, కన్నీళ్లు తుడుచుకుంది)

మళ్లీ వెనకనుంచి వచ్చి, కిటికీ నుంచి దూకి లోపలికి వచ్చింది...

"ఆదిత్య సర్ ఎక్కడున్నారు?" అని వెతుకుతోంది...

అప్పుడే కౌసల్య గారి ఫోటో (ఆదిత్య గారి భార్య) చూసింది.
"అమ్మ, మీరు స్టార్ట్ చేసిన పనిని నేను పూర్తి చేస్తాను.
నాన్నగారు మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి...
ఆయన ఈ లోకంలో లేకపోయినా, నేను ఉన్నాను.
ఆయన మాటను నేను నిలబెడతాను. I promise." అని చెప్పి లోపలికి వెళుతుంది.

ఆదిత్య సర్, కౌసల్యా గారి ఫోటో చూస్తూ, ఏడుస్తూ ఉన్నారు.
ప్రియా అది చూసింది. ఫోటో చేయి జారుతున్నంగానే వచ్చి పట్టుకుంది.
అప్పుడే తనను చూసి, ఆదిత్య గారు ఇలా అన్నారు:

ఆదిత్య వర్మ: "నువ్వు మళ్లీ ఎందుకు వచ్చావ్?" అని కోపంగా అడిగారు.

ప్రియా: "మీరు ఒక అబద్ధాన్ని నిజం అనుకుని బ్రతుకుతున్నారు అంకుల్...
అది అబద్ధమే అని చెప్పే సమయం వచ్చింది. అందుకే వచ్చాను." అని చెబుతుంది.

ఆదిత్య సర్ ఇంకా కోపంగానే చూస్తున్నారు.

ప్రియా, కౌసల్య గారి ఫోటో ఇచ్చి గట్టిగా ఇలా చెప్పింది –

ప్రియా:"మీకు మేడం ఫోటో మీద ఒట్టు అంకుల్.
నేను చెప్పేది వినండి." అని కొంచెం ధైర్యంగా చెప్పింది.

ఆదిత్య వర్మ: "సరే... ఇప్పుడు నీవు చెప్పాలనుకుంటున్నది చెప్పు." అని అన్నారు.

ప్రియా: "మీకు మా నాన్నగారు ఎన్నో ఏళ్లుగా తెలుసు కదా అంకుల్...
అయినా మోసం చేశాడనే విషయాన్ని మీరు ఎలా నమ్మగలిగారు?" అని అడిగింది.

(ఆదిత్య సర్ చూస్తూ ఉన్నారు)

ప్రియా కొనసాగిస్తూ:  "మా ఫ్యామిలీ చాలా చిన్నది అంకుల్ – నేను, అమ్మ, నాన్న మాత్రమే.
మేము ముగ్గురమే… చాలా హ్యాపీగా ఉండేవాళ్లం.
కానీ… 'జీవితం మొత్తం మధ్యతరగతి స్థాయిలోనే ఉండిపోతుందేమో' అన్న భయం నాన్నకి ఎప్పుడూ ఉండేది.
నాకు మంచి లైఫ్ ఇవ్వాలని ఎప్పుడూ తపనపడేవారు."

"సొంత ఇల్లు కూడా లేదని, ఏలాగైనా పైకి రావాలి, డబ్బు సంపాదించాలి, స్టేటస్ పెరగాలి అనే తపనతో ఎన్నో బిజినెస్లు చేశారు నాన్న.
అన్నీ నష్టాల్లోకి వెళ్లిపోయాయి. దాంతో అప్పుల పాలయ్యారు.
అప్పుడు తెలిసింది – మనకు ఉన్న దాంట్లోనే నెమ్మదిగా, సంతోషంగా ఉండాలనే నిజం.

అలా మళ్లీ ఉద్యోగం చేస్తూ, కొన్ని సంవత్సరాల్లో అన్నీ అప్పులు తీర్చేశారు.
మళ్లీ మా జీవితం హ్యాపీగా సాగిపోవడం మొదలైంది.
అప్పుడే మీరు, నాన్నను కలిశారు..." అని చెప్పగానే

ఆదిత్య గారు (తనలో తానే మాట్లాడుతున్నట్టు):
"హ్మ్... మేము అప్పుడే ఆ ఏరియాకు షిఫ్ట్ అయ్యాం.
నాకు ఎప్పుడూ సొంతంగా బిజినెస్ చేయాలనే తపన ఉండేది.
కృష్ణ ప్రసాద్ రావు గారితో నేను కొంత కాలంలోనే మంచి స్నేహితులం అయ్యాం.
మీ నాన్న – ఆయనే – తాను పనిచేస్తున్న కంపెనీలోనే నాకు జాబ్ ఇప్పించారు.

మేమిద్దరం కలిసి చేసిన ప్రతి ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యింది.
క్లయింట్స్‌కి మా వర్క్ ఎంతో బాగా నచ్చేది.
ఇద్దరం ఎప్పుడూ సొంతంగా ఓ కంపెనీ పెట్టాలనే ఆలోచించేవాళ్లం.

అప్పుడే కొత్తగా ఓ కంపెనీ ప్రారంభిద్దాం అనే ఆలోచన వచ్చింది...
అలానే AK Vision Works పుట్టింది."

(ప్రియా కళ్లలో గర్వం మెరుస్తోంది. గొంతులో భావోద్వేగం ఉప్పొంగుతోంది.)

ఆదిత్య గారు నెమ్మదిగా చెప్పారు:
"AK Vision Works అనేది ఒక క్రియేటివ్ బ్రాండింగ్ అండ్ డిజైన్ ఏజెన్సీ.
బిజినెస్‌లకు బ్రాండ్ ఐడెంటిటీ డెవలప్ చేయడం, కార్పొరేట్ ప్రెజెంటేషన్లు, మార్కెటింగ్ మెటీరియల్స్, క్యాంపెయిన్ స్ట్రాటజీలు – ఇవన్నీ ప్రొఫెషనల్‌గా అందించేది.

మీ నాన్న, కృష్ణ ప్రసాద్ రావు గారు – నేనూ...
ఇద్దరం కలసి ప్రతీ ప్రాజెక్ట్‌ని ఎంతో డెడికేషన్‌తో, ఒక కళాకృతిలా చేసేవాళ్లం.

‘Vision Works’ అనే పేరు ఉద్దేశపూర్వకంగా పెట్టాము...
ఎందుకంటే మేము కలలు కన్నవాళ్లమే కాదు...
ఆ కలల్ని కార్యరూపంలోకి తేవడంలో నమ్మకమున్నవాళ్లం."
అని చెప్పి, తలెత్తి గర్వంగా అన్నారు –
"అదే మా Vision!"


---

[ప్రస్తుతం]

కృష్ ప్రియాతో ఇలా అన్నాడు –
"AK Vision Works అనేది మన ఇద్దరి నాన్నల కథ ప్రియా...
నీ వల్లే అది మళ్లీ వెలుగులోకి వచ్చింది.
Thankyou... అన్నిటికీ thanks for everything...

ప్రియా: నవ్వుతూ –
"హ్మ్… అంగీకరించాను Mr. కృష్ వర్మ.
నాకు తెలిసి నేను చేసింది అంతా మన నాన్న కోసం.
కానీ... నన్ను నమ్మి, ప్రేమించి, ఎదురుచూసిన నీకు బాధ కలిగించాను కదా… సారీ."

అని చెప్తుండగానే...

కృష్ చిన్నగా నవ్వుతూ:
"It's ok..." అని చెప్పాడు.

ఇద్దరూ అలా ఆ భావనలతో ముందుకు సాగారు...



[మరింత కొనసాగుతుంది]...