The Zombie Emperor - 3 in Telugu Horror Stories by Ravi chendra Sunnkari books and stories PDF | థ జాంబి ఎంపరర్ - 3

Featured Books
Categories
Share

థ జాంబి ఎంపరర్ - 3

ఇప్పుడు ఓపెన్ చేస్తే ఒక చిమ్మ చీకటి వెన్నెల వెలుగు సముద్రం మీద ఆరు మంది వెళ్తున్నారు ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు అబ్బాయిలు వాళ్ళు సరదాగా మాట్లాడుకుంటూ ఏంట్రా ఇది ట్రిప్ అన్నావు కానీ చూస్తే కనీసం దయ్యం కూడా ఉన్నట్టు లేదు శబ్దం లేదు నీటిలో చేపలు లేవు అసలు ఏం జరుగుతుంది రా అని అనుకుంటున్న టైం లోనే దూరంగా ఒక హైలాండ్ కనిపిస్తుంది మ్యాప్ లో ఒక అబ్బాయి చూసి ఇదే మనం చేరుకోవాల్సిన ఐలాండ్ అని అంటూ స్పీడుగా దగ్గరికి వెళ్తున్నాడు ఒక్కసారిగా బోర్డు తిరగబడింది లోపల నుంచి క్రూరమైన స్వర చేప లాంటి జీవి వచ్చి పడవను పూర్తిగా మింగేసింది కానీ వాళ్ళు ఎలాగో తప్పించుకొని ఎగిరి హై లాండ్ లో పడ్డారు ద జాంబి ఎంపరర్ (The Zombie Emperor)

రాంబాబు జ్ఞాపకాలు – ఫ్లాష్‌బ్యాక్

వారు (రాంబాబు పంపిన వ్యక్తులు) ఆ ప్రదేశంలో దిగిన వెంటనే తమ బ్యాగులు తీసుకున్నారు. "అబ్బా ఏంట్రా ఇది? ఏమీ లేవు అనుకున్నాను. అప్పుడే ఏదో వచ్చి మనల్ని చంపేసి ప్రయత్నం చేసింది" అని అనుకున్నారు. వెంటనే వారిలో ఒకరు ఒక బుక్ తీశారు. దానిలో 'సుర 13 ల్యాబ్ - ఇన్ ఆపరేషన్ Z DNA ఫైల్' అనే పత్రం ఉంది. ఆ ఫైల్ ప్రకారం, ఇంతకుముందు ఇక్కడ ఏదో ప్రయోగం జరిగినట్టు, ఆ తర్వాత ఇక్కడ మనుషులు మిస్ అవ్వడం, ఫోన్ కట్ అవ్వడం, సిగ్నల్ కట్ అవ్వడం - పూర్తిగా ప్రపంచానికి కట్ అయింది అని ఉంది.

దాంతో, వారు ఈ ఐలాండ్‌లో ఏదో ఉందని కనిపెట్టడానికి వచ్చారు. వాళ్లు అక్కడికి రాగానే, వారి ఫోన్‌లకు నెట్‌వర్క్ కట్ అవ్వడం మొదలైంది. చుట్టూ వెన్నెల వెలుగులో అంతా అద్భుతంగా కనిపిస్తూ ఉంది – వింత పువ్వులు, అంతకంటే వింత చెట్లు, అంతకంటే వింతగా ఉండే పండ్లు... కానీ ఒక్క పక్షి కూడా కనిపించడం లేదు.

వాళ్ళ చుట్టూ వాళ్ళకే తెలియని ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు, ఎవరో చూస్తున్నట్టు అమ్మాయిలు భయపడటం మొదలుపెట్టారు. అబ్బాయిలు మాత్రం "ఆగండి! ఎందుకు అంత భయపడుతున్నారు?" అని ముందుకు నడుస్తున్నారు. ముందుకు వెళ్లే కొద్దీ దూరంగా ఒక చిన్న ల్యాబ్ కనిపించడం మొదలైంది. వాళ్లు కూడా ల్యాబ్‌ను చూసి, "అమ్మాయా! ఈరోజు ఎలాగూ అక్కడ పడుకోవచ్చు. పొద్దున్నే ఏం చేయాలో చూద్దాం" అని ఉషారుగా వెళుతున్నారు.

పక్కనే ఒక వింత మామిడిపండు కనిపించడంతో, వాళ్లు ముగ్గురూ (ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి) దాని వైపు వెళ్లారు. అంతే! వెనకాల ఉన్న ఒక అమ్మాయిని ఎవరో పట్టుకొని పరిగెత్తడం మొదలుపెట్టారు. "గల్ గల్" మంటూ శబ్దం వినిపించింది, కానీ ఎవరికీ పెద్దగా అర్థం కాలేదు.

వెనకాల మిస్ అయిన అమ్మాయిని తనకంటే ముందు ఉన్న అమ్మాయి వెనక్కి తిరిగి చూసింది. కనిపించలేదు! ఆ అమ్మాయికి గుండె దడ పెరిగింది. తన ముందు చూస్తే, మిగతా ఇద్దరు దూరంగా వెళుతున్నారు. "ఆగండి! ఇక్కడ ఎవరో మిస్ అయ్యారు! అజిత్! రానా! ఆగు!" అని అరుస్తోంది ఆ అమ్మాయి.

తన ముందు వెళ్తున్న అబ్బాయిలు వెనక్కి తిరిగి చూసేసరికి, అంతకు ముందు వెనకాల ఉన్న అమ్మాయి కూడా మిస్ అయింది. ఇక ముందున్న అమ్మాయి మాత్రం టెన్షన్‌తో పరిగెడుతూ ఉంటే, తన ముందు ఎవరో వచ్చారు! బలమైన కాళ్లతో ఒక్క దెబ్బతో అమ్మాయిని వెనక్కి ఎగిరిపడేలా చేశాడు. కింద పడి పడక ముందే అమ్మాయి గొంతు పట్టుకొని పైకి లేపి పరిగెత్తాడు!ద జాంబి ఎంపరర్ (The Zombie Emperor)

రాంబాబు జ్ఞాపకాలు – ఫ్లాష్‌బ్యాక్ కొనసాగింపు

వెనకాలే ఉన్న ఆ అబ్బాయిలు చూసేలోపే, వారికి ముందు దూరంలో ఒక అమ్మాయి నీలి కళ్ళతో మెరుస్తూ నిలబడి ఉంది. అప్పటివరకు వెనకాల ఉన్న వ్యక్తి భయంతో రెండు అడుగులు వెనక్కి వేసి, అక్కడికక్కడే పైకి ఎగిరి మాయమవుతాడు. అబ్బాయిలు వెనక్కి చూసి "ఎక్కడ పోయారు ఈ అమ్మాయిలు?" అని చూసే లోపే, ముందున్న ఆ అమ్మాయి వారి ఎదురుగా వచ్చి, "ఏం కావాలి?" అని చాలా నైస్‌గా అడుగుతుంది. ఆ అమ్మాయిని చూసి, వారికి తెలియకుండానే వారు ఆమె విషయంలో పడిపోతారు.

ఆ అమ్మాయి పేరు మాయ. ఆమె వారిని ఆ ల్యాబ్‌లోకి తీసుకువెళ్తుంది. అక్కడ వారి చేత చిన్న చిన్న పనులు చేయించుకోవడం మొదలుపెట్టింది – ఒళ్ళు పట్టించుకోవడం, నీళ్లు తాగమని చెప్పడం, ఆ తర్వాత వారి రక్తాన్ని చిన్నగా గ్లాసులో పోయమని చెప్పడం, ఆ రక్తాన్ని తను తాగడం... ఇలా చేస్తూ ఉంది.

అప్పుడే అక్కడికి ఎవరో వస్తారు. వెంటనే మాయ లేచి కూర్చొని, "సార్, క్షమించండి!" అని అంటుంది. వెంటనే తన ముందున్న వ్యక్తి బలంగా, "ఏం చేస్తున్నావ్? మళ్ళీ మొదలుపెట్టావా? నీకు మానవులంటే అంత ఇష్టమా?" అని అడుగుతాడు.

మాయ ఛి ఛి అని అసహ్యించుకుంటూ, "వీళ్ళు నాకిష్టం ఏంటి గురువుగారు? వీళ్ళ జాతి మన దాహం తీర్చడానికి ఉన్నది మాత్రమే! కానీ వీళ్ళు ఒక వింతైన ప్రాణి. ఒళ్ళు నొప్పులు ఉంటే నొప్పి తెలియకుండా ఒళ్ళు నొక్కుతారు" అని చిన్నగా వంకరగా నవ్వింది.

ద జాంబి ఎంపరర్ (The Zombie Emperor)

రాంబాబు జ్ఞాపకాలు – ఫ్లాష్‌బ్యాక్ కొనసాగింపు

మాయ అలా మాట్లాడగానే, గురువు గట్టి అరుపుతో ఇలా అన్నాడు: "నా పేరు ఆదిత్య! నేను కూడా మానవుడినే. కానీ ఒక మానవుడి వల్ల మరో మానవుడు ఇలా మారతాడని ఎవరికి తెలుసు? అలాంటిది నా ముందు మానవుడు నిలబడితే నేను ఎలా ఒప్పుకుంటా?!" అంటూ, ఆరుగురిని ఒక్క తోపుతో తోసేసి, వారి గొంతులు కోసేశాడు. వాళ్ళందరూ గిలగిలా కొట్టుకుంటున్నారు. కనీసం అరవడానికి ఛాన్స్ కూడా ఇవ్వలేదు ఆదిత్య.ఇంతలో, గోడల మీద బల్లుల్లా అతుక్కుని ఉన్న చిన్న చిన్న జాంబీ పిల్లలు ఒక్కసారిగా దూకాయి. రక్త మాంసాలను జుర్రుకుంటూ, కసికసిగా కొరుకుతూ, పీక్కు తింటునాయి. జాంబీలు ఆ రక్తపాతాన్ని చూస్తూ ఉన్న మాయ, "ఇక్కడే ఉంటే నేను కూడా వీళ్ళలాగే మారిపోతా" అని అనుకుంటూ మళ్ళీ బయటికి పారిపోతుంది.