The Mango Mystery in Telugu Moral Stories by Yamini books and stories PDF | ది మాంగో మిస్టరీ

The Author
Featured Books
Categories
Share

ది మాంగో మిస్టరీ

కథ నేపథ్యం (Story Context):   

అడివిలో జీవించే ఒక ఉల్లాసభరితమైన ఏనుగుకు, తియ్యని పండ్లు మరియు రుచికరమైన తిండ్లు అంటే చాలా ఇష్టం. కానీ ఆమెకు ఒక అలవాటు ఉండేది, అదేమీటంటే ఆమె తన ఆహరం ఎక్కడ ఉంచిందో ఎప్పుడూ మర్చిపోయేది! తన స్నేహితులు తనని ఇష్టపడేవారు, కానీ తరచుగా తన మతిమరుపు వల్ల ఆమెను ఆటపట్టించేవారు. ఒక రోజు ఉదయం, ఆమె మామిడి బుట్టను ఎక్కడ పెట్టిందో మరిచిపోయింది. తర్వాత ఆమె స్నేహితులు ఆమెకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ రోజు సరదా, నవ్వు మరియు తీపి జ్ఞాపకాలతో నిండిన రోజుగా మారింది. 

కథ ముఖ్య పాత్రలు (Key Characters) : 

• ఏనుగు – తరచుగా విషయాలు మరిచిపోతుంది.

కోతి  ఏనుగు స్నేహితులతో ఒకరు, సమస్యలను పరిష్కరించడంలో నైపుణ్యం కలది.

ఉడుత  ఏనుగు స్నేహితులతో ఒకరు, చురుకైన ఉల్లాసభరిత ఉడుత.

నెమలి  ఏనుగు స్నేహితులతో ఒకరు, జ్ఞానవంతమైనది మరియు మంచి సలహాలు ఇస్తుంది.

కథ (Story): 

ఒక రోజు, ఏనుగు చాలా ఆకలితో ఉంది. ఆమె మామిడి బుట్టను ఎక్కడో పెట్టినట్టు గుర్తుచేసుకొంది, కానీ అది ఎక్కడ పెట్టిందో గుర్తు చేసుకోలేకపోయింది. “అయ్యో! నేను ఎక్కడ పెట్టాను?” అని ఆమె అరిచింది. 

ఏనుగు స్నేహితుడైన కోతి, దాన్ని విని. చెట్టు నుండి క్రిందికి వచ్చింది. “చింతించకు, మిత్రమా. నీ మామిడి పండ్ల బుట్టను వ్యతడంలో నేను నీకు సహాయం చేస్తాను! ”, అని తను ఒక పెద్ద చిరునవ్వుతో చెప్పింది. త్వరగా ఉడుత మరియు నెమలి కూడా వారితో చేరారు. 

“ముందుగా నీ అడుగులను గుర్తుచేసుకో, మిత్రమా. నువ్వు ఈ రోజు ఎక్కడికి వెళ్ళావు?” అని నెమలి అడిగింది. 

ఏనుగు బాగా ఆలోచించింది. “హ్మ్… మొదట, నేను నీరు తాగడానికి నది దగ్గరికి వెళ్లాను.”

మిత్రులు నది దగ్గరకు వెళ్లారు. చిన్ను పొదల వెనుక వెతికారు, కానీ అక్కడ మామిడికాయలు లేవు. “తరువాత నువ్వు ఏం చేశావు?” అని కోతి అడిగింది. 

“ఆ తర్వాత, నేను పెద్ద మర్రిచెట్టు దగ్గర నిద్రపోయాను,” అని ఏనుగు చెప్పింది. 

మిత్రులంతా కలిసి మర్రిచెట్టు వద్దకు పరుగెత్తారు. కోతి చెట్ల కొమ్మలపైకి ఎక్కి చూసింది, కానీ అక్కడ కూడా మామిడికాయలు లేవు.

“ఇంకా ఎక్కడికి వెళ్ళావు, దోస్త్?” అని నెమలి మృదువుగా అడిగింది. 

ఏనుగు తన తల గోకింది. “ఓహ్! నేను పూల పొలానికి వెళ్లి పూల వాసన చూసాను!” 

 మిత్రులంతా కలిసి పూల పొలానికి పరుగెత్తారు. అక్కడ, నీడనిచ్చే చెట్టు క్రింద, ఏనుగుకు మామిడికాయల బుట్ట కనబడింది! 

“హుర్రే! నాకు దొరికింది!” అని ఏనుగు సంతోషంగా అరిచింది. మిత్రులంతా కలిసి మామిడికాయలు తింటూ, వెతికిన ప్రదేశాల గురించి నవ్వుకున్నారు. “ఇంత దూరం నడిచినప్పటికీ, ఎంతో మజాగా అనిపించింది!” అని ఉడుత చెప్పింది.

“అవును, కొన్ని సార్లు, కొత్త మార్గాలు కూడా మంచి జ్ఞాపకాలను తీసుకువస్తాయి!” అని నెమలి చెప్పింది. 

Moral of the Story:

ఒకరికొకరు సహాయం చేసే స్నేహితులు శాశ్వతమైన జ్ఞాపకాలను సృష్టిస్తారు, ఎందుకంటే వారు సమస్యలను సరదా అవకాశాలుగా మార్చుకుంటారు. సమస్యలను కలిసి పరిష్కరించినప్పుడు స్నేహితుల మధ్య బంధం మరింత గాఢంగా మరియు విలువైనదిగా మారుతుంది. 

Friends who help each other create lasting memories because they turn challenges into opportunities for fun and laughter. When we work together to solve problems, the bond between friends grows stronger and more meaningful. 

ప్రాథమిక పాఠం (Basic Lesson Learnt):

స్నేహితులు ఎప్పుడూ సహాయం చేస్తారు, మరియు చిన్న తప్పులు పెద్ద సాహసాలకు దారితీస్తాయి. కొన్నిసార్లు మర్చిపోవడం సరదాగా ఉంటుంది, ఎందుకంటే ఇది కొన్ని సార్లు జీవితాన్ని ఆసక్తికరంగా మార్చుతుంది!

మంచి స్నేహితులు ఆకాశంలో నక్షత్రాల్లాంటి వారు కొన్నిసార్లు కళ్లకు కనబడకపోయినా అవసరమైనపుడు సాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు మీత్రమా

స్నేహం చేయడానికి ఆస్తి-అంతస్తు-హోదా వయసుతో సంబంధం లేదు... అర్థం చేసుకునే రెండు హృదయాలు ఉంటే చాలు. 

"అమ్మ ఇచ్చేది జన్మ గురువు ఇచ్చేది విద్య ఎవరూ ఇవ్వకుండా దొరికేది స్నేహం". 

స్నేహం అద్భుతమైంది. నిజమైన మిత్రులకు మించిన ఆస్తి లేదు. స్నేహానికి ఎల్లలు లేవు.

స్నేహం ఓ మధురమైన అనుభూతి. దీనికి వయసుతో నిమిత్తం లేదు. ఆటపాటలాడే బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు అందరిలో స్నేహభావం ఉంటుంది. అటువంటి స్నేహాని అనుభవిస్తేనే తెలుస్తుంది. సృష్టిలో నా అనేవారు, బంధువులు లేని వారైన ఉంటారేమే గాని స్నేహితులు లేని వారుండరు. ఇంట్లో చెప్పలేని సమస్యలు, బాధలు సైతం వీరితో ఎటువంటి దాపరికం లేకుండా చెప్పుకొని ఓదార్పు పొందుతాం. అదే స్నేహం. 'స్నేహం ప్రకృతి వంటిది. అది ఆహ్లాదంతో పాటు ఎంతో హాయినిస్తుంది'. 'జీవనయానంలో స్నేహం శ్వాస వంటిది'. స్నేహం ఎంతో తియ్యనైంది. అమ్మ ప్రేమ, స్నేహం ఈ రెండే జీవితంలో ముఖ్యం. స్నేహితులతో కలిసి ఉంటే కలిగే ఆనందం చెప్పలేనిది. ప్రవిత్రమైన స్నేహం ఉండాలి. అటువంటి స్నేహంలో ఎంతో ఆనందం ఉంటుంది. 

నీ నిజమైన స్నేహితుడు నీ ముందో 

నీ ప్రక్కనో ఉండక పోవచ్చు కాని 

నీ గురించే ఆలోచిస్తూ 

నీ శ్రేయస్సును కోరుతూ 

నీ మనసులోనే ఉంటాడు. 

• "స్నేహానికన్న మిన్న లోకన లేదురా, కడదాక నీడలాగ నిను వీడి పోదురా".

స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం..!