Friendship is a Sweet... Friendship is a Gift.... in Telugu Moral Stories by Yamini books and stories PDF | స్నేహం ఓ మధురం.... స్నేహం ఓ వరం....

The Author
Featured Books
  • इश्क दा मारा - 79

    यश यूवी को सब कुछ बता देता है और सब कुछ सुन कर यूवी को बहुत...

  • HOW TO DEAL WITH PEOPLE

                 WRITERS=SAIF ANSARI किसी से डील करने का मतल...

  • Kurbaan Hua - Chapter 13

    रहस्यमयी गुमशुदगीरात का समय था। चारों ओर चमकती रंगीन रोशनी औ...

  • AI का खेल... - 2

    लैब के अंदर हल्की-हल्की रोशनी झपक रही थी। कंप्यूटर स्क्रीन प...

  • यह मैं कर लूँगी - (अंतिम भाग)

    (भाग-15) लगभग एक हफ्ते में अपना काम निपटाकर मैं चला आया। हाल...

Categories
Share

స్నేహం ఓ మధురం.... స్నేహం ఓ వరం....

స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా.. కడదాక నీడలాగ నిను వీడి పోదురా..,దోస్త్ మేరా దోస్త్ తూహీ మేరా జాన్.. వాస్తవం రా దోస్త్.. నువ్వే నా ప్రాణం" అంటూ సినీ కవులు కవిత్వం రాసినా.. స్నేహానికి ఉన్న గొప్పదనం ఎన్ని రకాలుగా చెప్పినా వర్ణించేందుకు వీలుకానిదే...! అమ్మ అనే పదం తర్వాత ఆత్మీయతను ధ్వనింపజేసే ఏకైక పదం స్నేహం. స్నేహం అనేది ఆ దేవుడిచ్చిన గొప్ప వరం. అమ్మా, నాన్న, అక్క, తమ్ముడు, చెల్లెలు, అన్న మొదలైన బంధాలను ఆ దేవుడే సృష్టించి ఇచ్చినా స్నేహితులను మాత్రం మననే ఎంచుకోమన్నాడు. అందుకే మంచి స్నేహాన్ని సంపాదించుకుని భద్రంగా కాపాడుకుంటే అది మన జీవితాన్ని సంతోషంగా ఉంచుతుంది. అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం గొప్ప‌ద‌నం ఏంటో తెలుసుకునేప్ర‌య‌త్నం చేద్దాం..!!

స్నేహితుడి కోపాన్ని..లోపాన్ని భ‌రించ‌డ‌మే నిజ‌మైన స్నేహం..! ఎదుటి వాడిలోని కోపాన్ని, లోపాన్ని భరించే వాడే నిజమైన స్నేహితుడు అంటారు. స్నేహం అనేది ఇలా ఉండాలి, అలా ఉండాలి అంటూ దానికి ఒక నిర్ధిష్టమైన లెక్కలు, అంచనాలు ఉండవు. మనకు గురువులా బోధించి, దారి చూపి, తప్పు చేసినప్పుడు మందిలించే వ్యక్తి నిజమైన స్నేహితుడు. మంచి స్నేహితుల మధ్య ఎటువంటి మొహమాటాలు, రహస్యాలు ఉండవు. అవసరమైనప్పుడు నిస్సంకోచంగా తమ కష్టసుఖాలు ఒకరికొకరు పంచుకుంటారు. కష్ట సమయంలో కలత చెందిన మనసుకి వెన్నలా చల్లదనాన్ని, ప్రశాంతతను కలిగించే దివ్య ఔషధం స్నేహం. తమకు అవసరమైనప్పుడు కనీసం మాట సాయం చేయడానికైనా ఆప్తమిత్రులు ఉన్నారనే భావం మన కష్టాల తీవ్రతను తగ్గిస్తుంది. వారితో చర్చించి సమస్యకు పరిష్కారం కనుక్కొనాలనే ఆలోచనను కూడా కలిగిస్తుంది.

కంటికి దూర‌మైనా మ‌న‌సుకు ద‌గ్గ‌ర‌గా ఉండేదే స్నేహం..! ప్రతీ రోజు మాట్లాడుకోకున్నా అవసరమైనప్పుడు మనకు ధైర్యం, ఓదార్పు చెప్పే నేస్తం ఉన్నాడనే నమ్మకం మనకు కొండంత ధైర్యాన్ని, మనసుకు ఉపశమనాన్ని ఇస్తుంది. అందుకే నిజమైన స్నేహితుడు కంటికి దూరమైనా మనసుకు దగ్గరగా ఉంటాడు అంటారు. ఒక్కోసారి కుటుంబసభ్యులతో కూడా చెప్పుకోలేని సమస్యలను ఆత్మీయ స్నేహితుల నిర్మొహమాటంగా చర్చించుకోవడం స్నేహితుల మధ్య జరిగే అతి సాధారణ ప్రక్రియ. ఇక ఈ స్నేహితుల రోజు వెనుక ఉన్న కథ ఏంటో ఒకసారి తెలుసుకుందాం..! 1935వ సంవత్సరం ఆగస్ట్ మొదటి శనివారం రోజున అమెరికా ప్రభుత్వం చేతిలో హతమైన తన స్నేహితుడిని మర్చిపోలేని మరో స్నేహితుడు ఆ తరువాత రోజైన ఆదివారంనాడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. దీనికి చలించిపోయిన అమెరికా ప్రభుత్వం ఆగస్ట్ మొదటి ఆదివారాన్ని 'ఇంటర్నేషనల్ ఫ్రెండ్‌షిప్ డే'గా ప్రకటించింది.

స్రుష్టిలో అమ్మ త‌ర్వాత క‌మ్మ‌నైన ప‌దం స్నేహం..! ఇక అప్పటినుంచి ఈ ఫ్రెండ్‌షిప్ డే అలా అలా వ్యాపిస్తూ విశ్వవ్యాప్తమయ్యింది. స్నేహం అనేది ఇద్దరు పరిచయస్తుల మధ్య మాత్రమే ఉండే బంధం కాదు. కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు.... ప్రతీ వ్యక్తిలో ఉండాల్సిన ముఖ్యమైన భావన. స్నేహం అనేది ఉన్నప్పుడు కుటుంబ సభ్యుల మధ్య పొరపచ్చాలు తగ్గి ఒకరినొకరు అర్ధం చేసుకుని మసులుకునే అవకాశాలు మెండుగా ఉంటాయి. దీనివలన సమస్యలు తీవ్ర రూపం దాల్చకముందే పరిష్కారమవుతాయి. స్నేహంగా ఉన్నప్పుడు అనుమానం, కోపం, ద్వేషం కూడా దరిదాపులకు రావడానికి జంకుతాయి. కాని ఒక్కోసారి స్నేహం కూడా దుర్వినియోగం అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. అందరినీ స్నేహితులని నమ్మి మోసపోవడం కంటే ముందే జాగ్రత్త పడడం మంచిది.

అమ్మలా సంరక్షిస్తూ.. తప్పు చేసినప్పుడు నాన్నలా దండిస్తూ.. సోదరిలా ఆటపట్టిస్తూ.. సోదరుడిలా చిరాకు తెప్పిస్తూ.. మనసిచ్చిన వారి కంటే మనల్ని ఎక్కువగా ప్రేమించేవారే నిజమైన స్నేహితులు. నలుగురిలో నువ్వున్నా నీలో నువ్వు లేకుండా చేసేదే ప్రేమ ఐతే నీలో నువ్వు లేకున్నా నీకంటూ మేం నలుగురం ఉన్నామంటూ ధైర్యం చెప్పేదే స్నేహం. నిజమైన స్నేహితులంటే.. మన బలహీనతలు తెలిసినా.. బలాలనే మనకి తెలియజేస్తారు..! మనం బాధపడుతున్నామని తెలిస్తే.. మన సంతోషం కోసం తపిస్తారు..! మన ఆందోళనని తగ్గించి మనసు కుదుటపడేలా చేస్తారు.. మనలో ఉన్న లోపాలను గుర్తించి అనుకున్న పని పూర్తి చేసేందుకు ఉపయోగపడే మార్గాలను అన్వేషిస్తారు..!మనం చీకటిలో ఉన్నప్పుడు కొవ్వొత్తిలా వెలుగునిస్తూ.. నిరాశలో కూరుకుపోయినప్పుడు ఆశాకిరణంగా దారి చూపిస్తూ.. బాధ కలిగినప్పుడు మన నొప్పిని తనదిగా భావించి భరించేవారే నిజమైన స్నేహితులు.

ఈ విశ్వం నాకు సొంతం అన్న ధైర్యం కదరా, "స్నేహం చీకటిలో తోడు నిలిచే నీడే కదరా..."స్నేహం "
ఏ మార్గం దొరకని తరుణం, ఆ దేవుడి వరమే "స్నేహం",
తారల ప్రేముకు చిహ్నం, జాబిలి ముద్దే, "స్నేహం"...
ప్రతి గుండెకు స్వరమే "స్నేహం", ఆ స్వరముకు 'భావం' .. నేస్తం కంటికి పాపై.., పెదవిపై నవ్వే సంతోషం కురిపించును "స్నేహం"!.. ఆశకు ఆయువు "స్నేహం"... నిరాశకు మృత్యువు "స్నేహం"...నా లోకం నా నేస్తం.. నా ప్రేమ ప్రపంచం.....

అమ్మలా ప్రేమను పంచుతారు- నాన్నలా బాధ్యత నేర్పిస్తారు- అక్కలా జాగ్రత్తలు చెబుతారు తమ్ముడిలా పేచీ పెడతారు- గురువులా కర్తవ్యం బోదిస్తారు- జీవితభాగస్వామిలా కష్టసుఖాల్లో తోడుంటారు- సృష్టిలో అందరి స్థానాన్నీ భర్తీ చేయగలవారు...
ఒక్క స్నేహితులు మాత్రమే..జ్ఞాపకడలి ఉదయాన్నే ఉదయించి సాయంత్రం అస్తమించే సూర్యుని వలే కాదు సాగరాన్ని దాటే నావ వలే కాదు నింగిని ఎగిరే పక్షి వలే కాదు నిత్య జీవితంలో ప్రాణాన్ని ఇచ్చి నిజాయితీకు నీరాజనమిచ్చేది యుగాలు మారినా సంత్సరాలు గడచినా చెరగనిది స్నేహం....! తన కష్టంతో నిన్ను ఆపదలో పెట్టేవాడు కాడు స్నేహితుడంటే, తన కష్టాన్ని నీ దగ్గర దాచి, నీ కష్టాన్ని తెలుసుకొని, ఇష్టంగా పాలుపంచుకునేవాడే నిజమైన స్నేహితుడు. భాష లేనిది, బంధం వున్నది?" సృష్టిలో అతి మధురమైనది జీవితంలో మనిషి మరువలేనిది స్నేహం ఒక్కటే..