Love - 3 in Telugu Love Stories by Harsha Vardhan books and stories PDF | ప్రేమ - 3

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

ప్రేమ - 3

ఆ తరువాత నేను ఇంటికి వెళ్ళాను . కొంచెం తనతో కలిసి ఫుల్ గా తినేసాను వచ్చే దారిలో .

ఆకలి గా కూడా లేదు . తనతో గడిపిన క్షణాలు గుర్తొచ్చి నాలో నేను నవ్వుకుంటూ ఉన్నాను .

అలా అలా నాలో మెదిలిన నా ఆలోచనల్లో పడి మూసి మూసి నవ్వులు నవ్వుతూ అలానే నిద్రలోకి జారుకున్నాను .

తరువాత పొద్దున్నే నిద్ర లేచి ఫ్రెష్ గా స్నానం చేసి టిఫిన్ చేస్తూ ఉంటే తను మెసేజ్ చేసింది .

ఎంటి అర్జున్ రెఢీ గా ఉన్నావా అని . నేను ఎప్పుడో రెఢీ అని చెప్పను .

తను నేను వచేస్తున్నాను అనగానే తన కోసం ఎదురు చూస్తూ ఉన్న బైక్ మీద .

ఇద్దరం కలిసి న్యూ కాలేజ్ చూడటానికి వెళ్ళాము .
ఇద్దరికీ సెట్ అవ్వెల ఉన్న కాలేజ్ చూస్ చేసుకున్నాం.

నెక్స్ట్ డే వెళ్లి జాయిన్ అయ్యాము . అలా అలా కాలేజ్ లో చదువుకుంటూ అన్నదంగా 1 సంవత్సరం చాలా హ్యాపీ గా ఎంజాయ్ చేశాం .

నేను ఎంతలానో వేచి ఉన్న రోజు వచ్చింది . అదే నా డార్లింగ్ బర్తడే .

కాకపోతే ప్రతి సారి తన పుట్టిన రోజు కి నాకు గొడవ జరగడం ఆ రోజు తనతో నేను మాట్లాడకుండా ఉంటాను .

ఇప్పుడు అంతే తను నా మీద కోపంతో అలిగి పడుకునేస్తుంది . ఇది కామన్ గా జరిగేది .

మనసుకు, మెదడుకి చాలా పెద్ద తేడా ఉంది.

మనసు నమ్మడానికి కారణాలు వెతకదు,కానీ మెదడు ఎప్పుడు ఏదో ఒక కారణం వెతుకుతూనే ఉంటుంది.

మెదడు మనసు చెప్తే వింటుంది,కానీ మనసు తన మాటే తను వింటుంది.

నేను తనని ఇష్టపడటానికి ఎప్పుడు కారణం వెతక లేదు.

ఇష్టపడటం అనేది మనసుకు సంబందించినది , నమ్మకం మెదడుకు సంబందిoచినది.

ఒక్కసారి నిజంగా ఇష్టపడితే చనిపోయే చివరి క్షణం వరకు,చివరి క్షణం వరకేంటి చనిపోయిన తరువాత,ఇంకా చెప్పాలి అంటే జన్మజన్మల వరకు మర్చిపోవడం కుదరదు.

మేము ఎన్ని సార్లు గొడవపడి అరుచుకున్నా ఒక్కరోజే అంతకు మించి ఉండలేము ఇద్దరం .

అలానే ఫైనల్ ఇయర్ అయ్యింది . పాస్ ఔట్ అయ్యి మంచి ర్యాంక్ సాధించాం .

ఇక మా లైఫ్ సెటిల్ అవ్వాలి తరువాత పెళ్లి అని చాలా ప్రి ప్లాన్డ్ గా ఉన్నాం .

అయితే ఒక చిన్న మాట ఈసారి ముందులా లేదు .
అంత చాలా మారిపోయింది .

తన పుట్టిన రోజు సందర్భంగా ఎప్పటిలాగా గొడవపడి తనతో మూడ్ ఆఫ్ గా ఉన్నాను .

ఎవ్వరికీ తెలియకుండా వాళ్ళ ఇంటి గోడ దూకి లోపలికి చిన్నగా శబ్దం లేకుండా వెళ్ళాను .

లంక అంత కొంప కట్టారు ఈ గోడలు దూకలేక చస్తున్నా అని అనుకుంటూ ఎలాగో అలా పైకి ఎక్కాడు .

ఇక మెయిన్ డోర్ మూసి ఉంది కాబట్టి వెనుక పక్క దారి అదే అండి కిటికీ లో నుండి లోపలికి చిన్నగా శబ్దం లేకుండా వెళ్ళాను .

అదేంటో అండి అల నా డార్లింగ్ రూం లోకి వెళ్ళాను అంతే తనని చూసి నన్ను నేనే మైమరిచాను .

ఎందుకు అంటారా ..!!

" మచ్చ లేని చందమామ అనుకున్నా కానీ కనిపించి కనిపించని తన అధరంపై ఉన్న పుట్టు మచ్చను చూస్తుంటే తెలుస్తుంది దిష్టి తగలకుండా ఆ దేవదేవుడే పెట్టీ పంపాడేమో నా చెలియనీ .....

అలా తన వైపు చూస్తూ

నీకేం తెలుసు ఒక్క నవ్వుతో కట్టిపడేసావ్ పైగా అది చాలదు అనట్టు ఆ బుంగమూతి ఒకటి తిప్పి తిప్పి నన్ను గింగిరాలు తిప్పుతున్నావు కదే బంగారం ....

ఎంత అందగత్తె వైతే మాత్రం మరీ అంత ముద్దుగుందాలా నువ్వు ...

ఇంతలో ప్రకృతి కూడా స్తంబిస్తు ఉంది నా కోసమే నేమో ..!!

నేను చెప్పాను ప్రకృతి తో ....

మెల్లగా కరువు వార్షమా ... నా వెన్నెల తన మధుర కలల్లో విహరిస్తోంది .

చల్లగా వీచు పవనమా ... నా ప్రియ సఖియా హాయిగా శయనిస్తోంది .

శ్రుతి తగ్గించు ప్రకృతి గానమా ... నా ప్రాణం మగత లోకి జారుకుంటోంది .

దిగొచ్చి జోల పాడు దైవమా ... నా దేవత ముద్దుగా నిడురిస్తోంది . "

తనను నిద్ర లేపాను . ఒసేయ్ అరవకే నేనే వచ్చింది దోగలెం కాదు అని అన్నాను .

తను అర్జున్ నువ్వు మొదటిసారి నాకోసం మా ఇంటికి వచ్చావా నమ్మలేక పోతున్నాను .

ఇక మన అర్జున్ బర్త్ డే కానుక ఇద్దామని ఒక మంచి గిఫ్ట్ తెచ్చాడు .

ఒక గోల్డ్ చైన్ తనకోసం దాన్ని ఓయే ఇప్పుడు ఇలా అంటున్నా అని ఏమి అనుకోకు నీతో కలిసి గడిపిన క్షణాలు , జ్ఞాపకాలకు ఒక అర్థం ఉండాలి కదా ..!! అన్నాడు.

ఎంటి అర్జున్ ఏమైంది ఎవరన్నా ఏమన్నా అన్నారా ..!! అంటే లేదు .

నిన్ను వదిలి ఉండలేక పోతున్నాను . అది నీకు ఎలా చెప్పాలి అని అన్నాడు .

సరే అర్జున్ నాకు తెలుసు ఈ రోజు నువ్వు చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు ఎంటి కథ అంది .

అలా తనను దగ్గరకు లాక్కొని తన నడుము మీద చెయ్యి వేసి ఇంకా దగ్గరకు లాక్కొని ఇలా అన్నాడు .

" నీ కళ్ళలోకి మనసారా చూస్తుంటే ... నా చుట్టూ లోకం మాయమౌతోంది.

నీ అడుగులో అడుగేస్తు నడుస్తుంటే ... ఆ పయణమే నా గమ్యం అవుతోంది .

నువ్వు నా కౌగిలిలో కరిగిపోతూ ఉంటే ... ఆ కాలాన్ని అపేయల్నిపిస్తోంది .

నా జతగా నాకు తోడుగా నువ్వుంటే ... నా ఈ జన్మ సార్థకం అవుతోంది . "

కొనసాగుతుంది ... 🫡