Love - 4 in Telugu Love Stories by Harsha Vardhan books and stories PDF | ప్రేమ - 4

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

ప్రేమ - 4

తనను ఇంకా దగ్గరకు లాక్కొని గట్టిగా పట్టుకొని సరే నిన్ను నిన్నుగా ప్రేమించే నా జీవితంలో అన్నీ విధాలుగా ప్రేమను అర్పిస్తాను నువ్వు ఏమంటావు .

తను సిగ్గపడుతోంది అలాగే అర్జున్ ఇంకా లేట్ ఎందుకు తాళి కట్టేయోచుగా అయిపోతాను నీకు పెళ్ళాం , నా ప్రపంచ రాజ్యంలో రాజు గా ఉందిపోవచ్చుగా అంది .

" నువ్వు నా వైపు వేసే ఒక్క అడుగుకోసం , ప్రపంచం అంతా పువ్వులు పరుస్తాను .

నువ్వు నా వైపు విసిరే ఆ చిరునవ్వు కోసం ,
దిక్కులన్నీటిని ఒకటి చేస్తా . " అన్నాడు అర్జున్ .

". నువ్వు నా వైపు చూసే ఒక చూపు కోసం ,
1000 యుగాలైన నీరిక్షిస్తాను .

జన్మ జన్మల వరమైన నీ ప్రేమ కోసం ,
ఆ దైవాన్ని అయిన ఎదిరించి నిలబడతాను . "

అని అంది తాను .

ఇదే మంచి సమయం అనుకున్న మన అర్జున్ ఇక ఏ మాత్రం ఆలోచించకుండా తన కోసం తెచ్చిన గోల్డ్ చైన్ బయటకు తీసాడు .

ఓయ్ ఇప్పుడు దీన్ని తాళి అనుకో అని చెప్పి ఆ గోల్డ్ చైన్ తీసి తన మెడలో వేసాను .

తను నా వైపు ఒక చూపు చూసింది . దాని అర్థం నాకు అనిపించింది ఇదే నా ఊహలో ...

" నా ప్రేమకి అర్థం , నా నమ్మకానికి రూపం , నేను కోరుకునే జీవితం నువ్వే అని అన్నట్టు చూసింది . "

తను ఇలా అంది నాతో నిజంలో ...

" ఓయ్ నీతో ఎప్పుడు చెప్పలేదు కానీ ,
మన పెళ్ళి కోసం ,
నీతో కలిసి ఉండే రోజు కోసం ,
నీ కోసం ,
చాలా వెయిట్ చేస్తున్నానోయ్ ..!! "

తనతో ఒక మాట చెప్పాను ..!!

ఉండటానికి ఒక చిన్ని ఇళ్ళు ...
బ్రతకటానికి చిన్న జాబ్ ...
తోడుగా నా చిన్న దానివి అయిన నువ్వు ...
గడిచిపోయిన జ్ఞాపకాలు ...
ప్రేమగా సాగుతున్న జీవితాలు ...
అలా బ్రతికెద్దాం ...
ప్రేమకి ... ప్రాణంగా ...

తను నన్ను గట్టిగా వాటేసుకుంది . తన కళ్ళలో నీళ్ళు ఆనంద భాష్పాలు . నా కాళ్ళు ముక్కుకొని ఆశీర్వదించండి అంటు తను అంటే సిగ్గుతో నేను .

చాలా సంతోషంగా తనకు ఎప్పుడు గుర్తు ఉందిపోయెలా బర్త్ డే కానుక ఇచ్చాను .

ఇక అలా ఆ వెన్నెల రాత్రి కాస్త మధుర రాత్రి గా మారింది .

మెలకువలో కలలా తూచి..
మరుజన్మేదో మొదలైందే..

ప్రపంచం తెలీదే జతై నువ్వు ఉంటే..
ప్రమాదం అనేదే ఇటే రాదే..

సముద్రాల కన్న సొగసెంత లోతే..
ఎలా ఈదుతున్నా ముంచేస్తోందో..

కాల్చుతు ఉన్నాదే కౌగిలే కొలిమిలా...
ఇది వరకు మనసుకు లేని...

పరవసమేదో..
మొదలైందే..
మెలకువలో కలలా తూచి..
మరుజన్మేదో..
మొదలైందే..

అని పాట వస్తూ ఉండంగా . కోరికలు సముద్రం లాంటివి కదా ..!! ఒడ్డుకు చేరిన అలకు ఆనందం . మధ్యలో ఉన్న అలకు ఆరాటం . చేరని అలకు విషాదం . అలా ఆ రాత్రి ఒకఅనిర్వచనీయమైన రాత్రిగా ఎన్నో మధుర జ్ఞాపకాలు పంచు కున్నారు .

తను...పెళ్లి చేసుకున్నావ్ , మొదటిరాత్రి చేసుకున్నాం , నువ్వు నా మొగుడు నేను నీ పెళ్ళాం అని నేను ఫిక్స్ అయ్యాను . మరి అత్త మామా లను ఎప్పుడు పరిచయం చేస్తావ్ . మన ఇంటికి ఎప్పుడు తీసుకొని వెళ్తావ్ అర్జున్ అంది .

అన్నింటికీ ఒక సమయం వస్తుంది నువ్వు రెఢీగా ఉండాలి అంతే అన్నాడు . తను ఇప్పుడే వచ్చేనా అంది . ఒసేయ్ నువ్వు నీ తొందర ఆగవే బాబు మంచి రోజు చూసి ఎత్తుకెల్లిపోతాను అన్నాడు .

ఎవ్వరూ చూడని తెల్లవారు జామున లేచి అర్జున్ అక్కడి నుండి తిన్నగా ఇంటికి వెళ్లిపోయాడు .

తను ఒక్కసారి వస్తావా నీతో పని ఉంది నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను అంది . అర్జున్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి తొందరగా వెళ్ళాడు .

తను మొదటి సారి చీర కట్టుకుని వచ్చింది మన అర్జున్ కోసం . చూడటానికి చాలా అందంగా ఉంది .

వారి మధ్య ఇలా సంభాషణ జరిగినది ...

" నీలి రంగు చీరలో నడిచే సంద్రంలా తను ...
అలలాంటి నడకతో నావైపుకి వస్తూ ...
ఆశల కిరణాలతో ఉందయించే సుర్యుడిలా నేను ...
తన కౌగిలింతల కానుకలకై ఎదురుచూస్తూ ...

ముద్దులాటలాడుకుందామా ...
ఎవరు గెలుస్తారో చూద్దామా ...
ముత్యాల పలువరసల మాటున ...
మూసి మూసి నవ్వులతో తను ...

తన నల్లని కన్నులపై ...
శతచుంబనాల వెలుగులద్దాను నేను ...
మోహంగా ...
మోహనంగా ...
తనుకంగా ...
తన్మయంగా ...

తను సగమే తిరిగొచ్చి అలసిపోయింది మగత కళ్ళలో ...
మిగతావో ..?? అని అడిగా నేను ...

ఖతారాసుకో గుండె కాగితంలో ...
వడ్డీతో ఇస్తా ఎదో ఓ నాటికి ...

ఈ బాధ నిన్ను సులుపుతుండాలి .,
నేను ప్రతి క్షణం నీకు గుర్తొస్తుండాలి .

అరమొడ్పు కళ్ళతో ...
అమాయకపు నవ్వుతో ...
అలా అంది తను .

సిగ్గు పడుతూ అక్కడి నుండి వెళ్లి పోయింది తను .

అర్జున్ తనలో తాను ఇలా అనుకుంటూ ఉన్నాడు .

" చరిత్రలో ఎన్నో అందమైన మగ శిల్పాలన్ని విధ్వంసం చేసి అందమైన ఆడ శిల్పాలనే పూజించారు .

ఎందుకో తెలుసా మన మగవాల్లకి యుగ యుగాల నుంచి ఆడదంటే పిచ్చి . "

నవ్వుకుంటూ అర్జున్ మనసులో ఇలా అనుకున్నాడు .

నీ కోసం
నీ నవ్వు కోసం
ఏమైనా చేయొచ్చు పిల్లా .

ఇంకా ఉంది ... ☺️