Truth - 17 in Telugu Thriller by Rajani books and stories PDF | నిజం - 17

The Author
Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

నిజం - 17

మరి మరిడయ్య నీకు ఫోన్ చేశాడా అని అడిగాడు విజయ్ , మ్ చేశాడు అర్ధరాత్రి దాటింది సుమారు 2 గంటల ప్రాంతంలో మరిడయ్య ఫోన్ చేసాడు , అతను ఫోన్ చేసే ముందే విచిత్రం గా ఆ బొమ్మ నుండి శబ్దాలు రావడం ఆగిపోయాయి , అందుకే సడన్ గా ఫోన్ రింగ్ అయ్యేసరికి కొంచెం భయ పడ్డాను , మళ్ళీ మరిడయ్య ఏమైనా ఫోన్ చేసాడు ఏమో అని ఫోన్ ఎత్తాను , అప్పుడు వరకు వచ్చిన శబ్దాల గురించి మరిడయ్య కు చెప్పాను , అప్పుడు మరిడయ్య మాట్లాడుతూ నాకు అంతా తెలుసు అక్కడ జరిగేది అంతా నాకు ఇక్కడ పూజ లో తెలుస్తూ నే వుంటుంది , నేను ఇప్పటి వరకు చేసిన పూజ వల్లే ఆ శబ్దాలు ఆగాయి , నేను ఎక్కువ సేపు దానిని కట్టడి చేయలేను , నేను చేయాల్సింది చేశాను ఇక్కడ స్మశానం లో ఉన్నాను , వూళ్ళో కి రావడానికి వీలయ్యే టట్టు లేదు , మిగిలింది నువ్వే చేయాలి అన్నాడు , నేనేం చేయాలి అన్నాను భయం తో వణకి పోతూ , ఆ పిల్లాడి రక్తాన్ని సమర్పించాల్సిన సమయం వచ్చింది అన్నాడు మరిడయ్య గంభీరం గా , నన్ను హత్య చేయమంటున్నావా అన్నాను కోపంగా , ఆ మరిడయ్య నవ్వి పిల్లాడికి ఏమి కాదు , రక్తం చిందే లా ఒకసారి తల మీద కొట్టు , ఆ శక్తి ని శాంతింప చేసామంటే అంతా సద్దుకుంటుంది , నేను అక్కడికి రాలేక పోవచ్చు కానీ నా దగ్గర బందీ గా ఉన్న ఆత్మ లను పంపగలను , అవి పిల్లాడికి ప్రాణ హాని కలగకుండా చూసుకుంటాయి, నువ్వు ఇప్పుడు ధైర్యం గా పని ముగిస్తే ఎవరికీ ఏమీ కాదు పైగా కోట్ల విలువ చేసే నిధి మన సొంతం అవుతుంది , మన పని పూర్తి కాగానే పిల్లాడు నాకు వూరి చివర దొరికాడు అని నేనే తీసుకెళ్ళి వాళ్ల ఇంట్లో అప్ప చెబుతాను , నువ్వు కాదని వెనకడుగు వేస్తే ఆ శక్తి ఆగ్రహం తో అక్కడే వున్న నిన్ను తరువాత నన్ను బలి తీసుకుంటుంది , ఇప్పటికే ఆలస్యం అవుతోంది నేను మళ్ళీ పూజలో 6కూర్చోవాలి నువ్వు నీ పని పూర్తి చేయగానే నాకు ఇక్కడ పూజలో కనిపిస్తుంది తెల్లవారక ముందే పని పూర్తి చేయాలి జాగ్రత్త అని బెదిరిస్తూ ఫోన్ పెట్టేసాడు మరిడయ్య అని చెప్పాడు శరభయ్య , నువ్వు వెంటనే వెళ్లి పిల్లాడిని రాడ్ తో కొట్టావు అంతేగా అన్నాడు విజయ్ కోపాన్ని ఆపుకుంటూ , లేదు సార్ ఒక గంట సేపు అలానే వుండి పోయా , కానీ మళ్ళీ ఆ బొమ్మ నుండి అరుపులు వినిపించాయి ,తెల్లవారక ముందే పని ముగించాలి అన్న మరిడయ్య మాటలు గుర్తు వచ్చాయి అంతే అంత భయం లోనూ దైర్యం కూడ దీసుకుని వంట గది లో నుండి ఒక రాడ్ తీసుకుని పిల్లాడు ఉన్న గది లోకి వెళ్లి మరిడయ్య చెప్పినట్టే తల మీద కొట్టేసాను, భయం తో ఏడుస్తూ అక్కడే ఉండిపోయా చాలా సేపు , ఆ బొమ్మ లో నుండి శబ్దాలు రావడం కూడా ఆగి పోయాయి , ఫోన్ రింగ్ అయిన శబ్దం వచ్చింది మరిడయ్యే చేసి ఉంటాడని వెళ్లి ఫోన్ ఎత్తాను , ఫోన్ లో అటు నుండి మరిడయ్య మాట్లాడాడు మన పూజ ఫలించింది మనం సాధించాం , నువ్వు వెంటనే పూజ చేసిన తలుపులు మూసివెయ్యి నా బందీ లయిన ఆత్మలు నా ఆజ్ఞ ప్రకారం బాబుని చేర్చాల్సిన చోటికి చేరుస్తాయి , నువ్వు మాత్రం తలుపులు తీయకు నేనే చెప్పేవరకు లేదంటే ఆత్మ లకు భంగం కలుగుతుంది వాటికి పని మధ్యలో భంగం కలిగిస్తే ఆగ్రహిస్తాయి , వాటి ఆగ్రహానికి బలి కాకు , సాయంత్రం లోగా అంతా చక్క బడిపోతుంది , రాత్రికి నేను వస్తాను నిధిని పంచుకుందాం అన్నాడు మరిడయ్య , ఫోన్ ఎత్తడానికి వచ్చే హడావుడిలో బాబుని కొట్టిన రాడ్ కూడా అక్కడ పెట్టేయకుండ నా వెంట తెచ్చాను అదే తప్పయింది, గది తాళం వేసే హడావుడిలో ఆ రాడ్ ని వెనుక పెరట్లో వున్న చెత్తలో విసిరి వెంటనే ఆ గది కి తాళం వేసేసా .మళ్ళీ ఆ గది తెరిచే సాహసం చేయలేదు నేను అన్నాడు శరభయ్య , మరి నీ భార్య ఎలా చనిపోయింది అడిగాడు విజయ్. ఆ రోజు తెల్లవారగానే బయటి నుండి తలుపులు కొడుతున్న శబ్దం వినపడింది , తలుపులు తీసి చూసాను ఎదురుగా నా భార్య ఉంది రెండు రోజులు తర్వాత వస్తా అన్న మనిషి అప్పుడే వచ్చేసింది అని తడ బడుతూ నిల్చున్న , అదేంటి అలా గుమ్మానికి అడ్డం గా అలా నిల్చున్నారు అని నన్ను పక్కకు జరుపుతూ లోపలికి వచ్చింది , నాకు కంగారు తో చెమటలు పట్టేసాయి , ఇంతకీ ఎందుకు అంత తొందరగా వచ్చేసావు అని అడిగాను, మీకు తెలీదా రామారావు గారి మనవడు కనిపించడం లేదంటూ మన వూరి వాళ్ళు తిరుగుతున్నారు కదా , మా అమ్మ వాళ్ల వూరు కూడా కొంత మంది వచ్చారు వెతకటానికి , ఈ విషయం తెలీగానే వెంటనే బయలు దేరి వచ్చేసాను , వాళ్ళింటికి వెళ్ళగానే అత్త, అత్త అంటూ పలకరించేవాడు, ఏమయ్యాడో ఏంటో అంది దిగులుగా , సాయంత్రాని కల్లా దొరికస్తాడు లే నువ్వేం కంగారు పడకు అన్నాను నేను , సుజాత నన్ను పై నుండి కిందకి ఎగాదిగా చూసి ఏవిటి అంత కంగారుగా వున్నారు మీరు ,ఇంత చలి లో మీకు చెమటలు ఎందుకు పడుతున్నాయి అంది అనుమానంగా అయినా సాయంత్రం కల్లా బాబు దొరుకుతాడు అని మీకెలా తెలుసు అని అడిగింది , ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అని దాని మీద అరుస్తూ స్నానం చేయటానికి వెళ్లి పోయాను , ఆ గది తాళం కొట్టు లో వున్న సరుగులో పెట్టాను అన్నాడు శరభయ్య .

ఈలోగా బయటి నుండి కానిస్టేబుల్ వచ్చి sir స్కెచ్ వేసే ఆర్టిస్ట్ వచ్చారు అన్నాడు విజయ్ తో , విజయ్ సెల్ నుండి బయటకు వచ్చాడు ఆ ఆర్టిస్ట్ ని కలవడానికి , హెల్లో sir my name is venkat అని పరిచయం చేసుకున్నాడు అతను , హెల్లో mr venkat take ur సీట్ అని తను కూడా కూర్చున్నాడు విజయ్ , ఆ ఆర్టిస్ట్ వెనుక వున్న వ్యక్తి ని అప్పుడే సడన్ గా చూసిన విజయ్ ,సాగర్ నువ్వా ఇద్దరూ కలిసి వచ్చారా అన్నాడు , సాగర్ మాట్లాడుతూ వెంకట్ గారు నేను మచిలీపట్నం నుండి ఒకటే బస్ లో వచ్చాం , పక్క పక్కన కూర్చున్నప్పుడు పరిచయం అయ్యింది , వెంకట్ గారు ఇక్కడికే వస్తున్నారు అని నిన్ను కలవడానికి వచ్చేసాను అన్నాడు సాగర్ , విజయ్ కానిస్టేబుల్ ని పిలిచి శరభయ్య ను తీసుకురమ్మని చెప్పాడు , చూడు శరభయ్య ఆ మరిడయ్య ఎలా ఉంటాడో చెప్పు దానిని బట్టి ఈయన బొమ్మ వేస్తారు అన్నాడు విజయ్ , సరే sir అని చెప్పటం మొదలు పెట్టాడు శరభయ్య , ఈ లోపు విజయ్ ఫోన్ రింగ్ అయింది , చూస్తే అది డీసీపీ నుండి కాల్ ఫోన్ లిఫ్ట్ చేసిన విజయ్ హెల్లో గుడ్ మార్నింగ్ sir అన్నాడు , ఏం గుడ్ మార్నింగ్ విజయ్ అక్కడ అసలు ఏం జరుగుతుంది అన్ని చానల్స్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ ని ఏకి పడేస్తున్నారు , నువ్వు అరెస్ట్ చేసిన వ్యక్తిని అర్జంట్ గా కోర్టు లో హాజరు చేయాలి , తనకు అగైనేస్ట్ గా అన్ని అవిడేన్స్ దొరికాయి కదా రిపోర్ట్స్ అన్ని సబ్మిట్ చేసి అతన్ని కోర్టు లో హాజరు చేయి , అండ్ వన్ మోర్ థింగ్ ఆ వూరి జనం ఏదయినా గొడవ చేయొచ్చు అందుకే సిటీ నుండి ఎక్స్ట్రా పోలీస్ ఫోర్స్ అండ్ వాన్ వస్తారు , బీ రెడీ.అండ్ మీడియా ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి అన్నాడు డీసిపి , sir ఇక్కడ శరభయ్య తో ఇదంతా చేయించిన వ్యక్తి మరొకడు ఉన్నాడు అతని గురించి తెలుసుకోవటానికి ఇంట్రాగేషన్ చేస్తున్నా ఆల్మోస్ట్ ఫినిష్ అయింది , ఈరోజు అతని స్కెచ్ కూడా వేయిస్తున్నాం అన్నాడు విజయ్ , ఓకే విజయ్ అతని నుండి ఏ ఇన్ఫర్మేషన్ కావాలో ఈ రోజు కలెక్ట్ చేయి రేపు ఎట్టి పరిస్థితి లోనూ అతన్ని కోర్టు లో సబ్మిట్ చేయాలి , తరువాత డౌట్ ఉన్న మనిషి ని వీలయినంత త్వరగా పట్టుకో, ఆ వూరిలో ఎలాంటి ప్రాబ్లెమ్ క్రియేట్ అవ్వకుండా చూసుకోవటం నీ భాధ్యత అన్నాడు డీసిపి , ok sure sir అని ఫోన్ పెట్టేసాడు విజయ్ , అప్పుడే రాఘవులు అక్కడికి వచ్చాడు ఆయాస పడుతూ , విజయ్ అతన్ని చూసి ఏంటి రాఘవులు గారు అలా వున్నారు ఏం జరిగింది అని అడిగాడు విజయ్ , sir ఆ మీడియా కి ఎలా తెలిసిందో ఏమో, ఆ శరభయ్య ఇంటి ముందు చేరి ఇక్కడే క్షుద్ర పూజలు జరిగాయి అని లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు ,అన్నాడు రాఘవ . వాట్ అని లోపలికి వెళ్ళి టీవీ ఆన్ చేసాడు విజయ్. టీవీ లో న్యూస్ ఛానల్ వస్తోంది శరభయ్య ఇంటి ముందు నిలబడి చెప్పిందే చెప్పి ఆ ఇంటిని అన్ని యాంగిల్ స్ లోనూ తెగ చూపిస్తున్నారు .ఈ ఇంట్లో నే క్షుద్ర పూజలు జరిగాయి, ఒక చిన్న పిల్లాడిని బలి ఇవ్వడానికి చూసారు , ఇదంతా చేసిన వాడిని పట్టుకున్నారు కానీ ఇంతవరకు ఎలాంటి శిక్ష పడలేదు , ఆ పిల్లాడు హాస్పిటల్ బెడ్ మీద చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు , నిందుతుడికి శిక్ష పడుతుందా , బాబు బతుకుతాడా , పోలీస్ డిపార్ట్మెంట్ నుండి ఇప్పటికయినా ఏదైనా స్పందన ఉంటుందా అని అరచి, అరచి జనాన్ని రెచ్చ గొట్టేటట్టు గా చెప్తుంది ఒక లేడీ యాంకర్ , ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ చాలవన్నట్టు మళ్ళీ ఈ కొత్త ప్రోబ్లం ఒకటి అని కళ్ళు మూసుకొని తల పట్టుకున్నాడు విజయ్.

విజయ్ కి వెంటనే ఏదో గుర్తు వచ్చినట్టు కళ్ళు తెరచి , అసలు శరభయ్య ఇక్కడ ఇంట్లో చేసేవి తనకు పూజలో కనిపించాయి అని మరిడయ్య ఎలా చెప్పాడు అనుకుని ఫోరెన్సిక్ ల్యాబ్ లోని వినాయక్ కి కాల్ చేసాడు విజయ్ .

ఎస్ విజయ్ చెప్పండి అన్నాడు ఫోన్ లిఫ్ట్ చేసిన వినాయక్ ,

విజయ్ : మీరు ఆ రూం లో దొరికిన బొమ్మని లాబ్ కి తీసుకెళ్లారు కదా .

వినాయక్ : ఎస్ అది కూడా చెక్ చేశాం దాని మీద కూడా ఓన్లీ శరభయ్య ఫింగర్ ప్రింట్స్ మాత్రమే ఉన్నాయి.

విజయ్ : నో , ఫింగర్ ప్రింట్స్ గురించి కాదు ఆ బొమ్మ ని ఒక సారి ఓపెన్ చేసి చూడండి , దానిలో ఏదయినా క్లూ దొరుకుతుంది అని డౌట్ గా ఉంది .

వినాయక్ : వాట్ ఆ బొమ్మలో క్లూ నా , ఒక్క నిమిషం లైన్ లో ఉండండి , చెక్ చేసి చెప్తా.

విజయ్ ని లైన్ లో ఉంచి తన అసిస్టెంట్ ని పిలిచి , ఆ బొమ్మ ను తెచ్చి ఓపెన్ చేసి చూడమని చెప్పాడు వినాయక్ , లైన్ లో ఉండి వాళ్లిద్దరి మాటలు వింటున్నాడు విజయ్ , వినాయక్ అసిస్టెంట్ బొమ్మను ఓపెన్ చేసి చెక్ చేశాడు , దానిలో వాళ్లకు కనిపించింది చూసి ఇద్దరూ షాక్ అయ్యారు.