Truth - 18 in Telugu Thriller by Rajani books and stories PDF | నిజం - 18

The Author
Featured Books
  • DIARY - 6

    In the language of the heart, words sometimes spill over wit...

  • Fruit of Hard Work

    This story, Fruit of Hard Work, is written by Ali Waris Alam...

  • Split Personality - 62

    Split Personality A romantic, paranormal and psychological t...

  • Unfathomable Heart - 29

    - 29 - Next morning, Rani was free from her morning routine...

  • Gyashran

                    Gyashran                                Pank...

Categories
Share

నిజం - 18

కాసేపు నిశ్శబ్దం తప్ప మాటలేమీ వినపడలేదు విజయ్ కి , లైన్ లో వెయిట్ చేస్తున్న విజయ్ కి 5 నిమిషాలు తరువాత వినాయక్ గొంతు వినిపించింది.

వినాయక్ : హెల్లో విజయ్ గారు మీ డౌట్ నిజమే ఈ బొమ్మ లో ఒక చిన్న సీసీ కెమెరా ఉంది , దాని ద్వారా ఈ బొమ్మ ముందు జరిగేది అంతా వాళ్ల డివైస్ నుండి చూడొచ్చు , అంతే కాదు మరొక చిన్న డివైస్ కూడా ఉంది దాని ద్వారా వాళ్ళు రిమోట్ తో ఆపరేట్ చేసి ఈ బొమ్మ నుండి సౌండ్స్ వచ్చేవిధం గా కూడా చేయవచ్చు .

విజయ్ : వాళ్లు ఆ కెమెరా నీ ఇంకా ఆ డివైస్ ని వాళ్ళ దగ్గరున్న మొబైల్ కి గానీ పిసి కి గాని కనెక్ట్ చేసి ఉండొచ్చు , మీరు దాని గురించి ఏమయినా తెలుసుకోగలరా .

వినాయక్ : నాకు తెలిసి its not possible, అయినా నేను కనుక్కొని చూస్తాను , దీని గురించి ఏదయినా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీకు వెంటనే కాల్ చేస్తాను .

విజయ్ ఒకే అని ఫోన్ పెట్టేసాడు.

ఈలోగా పక్కనుండి వెంకట్ sir ఫినిష్ అయింది , అని పిలిచాడు , విజయ్ వెళ్లి చూసాడు పెద్ద కళ్ళు గుబురు గడ్డం , మీసాలతో తలకి చుట్టి వున్న ఒక గుడ్డ మొత్తం మీద చూడడానికి మంత్రగాడిలా వున్నాడు, శరభయ్య సరిగా చూడు మరిడయ్య ఇలానే వుంటాడా అని అడిగాడు విజయ్ మళ్ళీ, అవును sir వీడే మరిడయ్య వీడిని ఎలాగయినా పట్టుకోండి , వీడి మాటలు నమ్మి నా జీవితం నాశనం చేసుకున్నా , బంగారం లాంటి నా పెళ్ళాం చనిపోయింది , ఇప్పుడే నాకు అంతా తెలిసొస్తుంది అని ఏడవటం మొదలుపెట్టాడు శరభయ్య , చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం రేపు నిన్ను కోర్టు లో హాజరు పరచాలి అటు నుండి జైల్ కి తీసుకెళతారు అన్నాడు విజయ్ , అయ్యో నన్ను నమ్ముకొని వచ్చిన నా భార్య కు పెద్ద కర్మ కూడా జరిపించడానికి కూడా లేకుండా పోయిందే అన్నాడు శరభయ్య , బయట ఫోన్ లో మాట్లాడటానికి వెళ్లిన సాగర్ లోపలికి వచ్చి , వెంకట్ గారు అయిపోయిందా స్కెచ్ వేయటం అడిగాడు సాగర్ , ya look at this అన్నాడు వెంకట్ , ఆ స్కెచ్ చూస్తూ కాసేపు ఆలోచించాడు , వెంకట్ గారు ఒక సారి ఈ beard అండ్ ముస్తాష్ తీసేసి మళ్ళీ ఒక సారి డ్రా చేయగలరా అడిగాడు సాగర్ , యా ఒక హాఫ్ అన్ అవర్ లో డ్రా చేస్తాను అన్నాడు వెంకట్ , సాగర్ మాటలు విన్న విజయ్ ఏంటి సాగర్ అతన్ని ఎక్కడయినా చూసావా అడిగాడు , i m not sure నాకెందుకో ఆ ఫేస్ ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది , అందుకే మీసం , గడ్డం లేకుండా డ్రా చెయ్యమన్నా ను అన్నాడు సాగర్ , విజయ్ కానిస్టేబుల్ ని పిలిచి శరభయ్య ని సెల్ లోపలికి తీసుకువెళ్ళా మని చెప్పాడు, తరువాత సాగర్ , వెంకట్ లను చూసి ఒకే యూ బోత్ క్యారీ ఆన్ , ఒన్స్ ఫినిష్ అయ్యాక నన్ను పిలవండి , నేను శరభయ్య ని అడగాల్సిన క్వశ్చిన్స్ ఉన్నాయి ఎక్కువ టైం లేదు , రేపు అతన్ని కోర్టు లో సబ్మిట్ చేయాలి అని , కానిస్టేబుల్ ని చూసి చంద్రం అందరికీ టీ పంపు అని చెప్పి శరభయ్య దగ్గరికి వెళ్లాడు విజయ్ , శరభయ్య ఇంతకీ నీ భార్య ఎలా చనిపోయిందో చెప్పలేదు నువ్వు అన్నాడు విజయ్ , శరభయ్య పైకి చూస్తు చెప్పటం మొదలు పెట్టాడు ఆ రోజు నేను పెరట్లో వున్న బాత్రూం లోకి స్నానానికి వెళ్ళాను , హడావుడిలో నేను పెరట్లో చెత్త లో వేసిన రాడ్ గురించి మరచిపోయాను, పెరట్లో ఆకులు వూడుస్తున్న సుజాత ఒకేసారి కేక వేసి పిలిచింది నన్ను కంగారుగా , ఏమయిందో అని స్నానం ముగించుకున్న నేను బయటకు వచ్చేసరికి ఆకుల చెత్త వైపు కన్నార్పకుండా బిగుసుకు పోయి చూస్తూ నిలబడి వుంది సుజాత , నేను దగ్గరకు వెళ్లి తడిమి ఏమయింది అన్నాను , నా వైపు కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ తన చేయి చత్త వైపు చూపిస్తూ ఆ రాడ్ కి ఆ రక్తం మరక ఏన్టి అని అడిగింది , నేను భయపడి ఆ రాడ్ మీద ఆకుల చెత్త కుప్పగా వేసేసాను , సుజాత నా వైపు ఈ సారి ఆశ్చర్యం తో పాటు కోపంగా కూడా చూస్తూ నిలబడింది , నేను తడుముకుంటూ అది రాత్రి పాము వచ్చింది దానిని కొట్టాను దానితో అనేసాను కంగారులో , ఇంత చిన్న రాడ్ తో పాము ని కొట్టారా , అది కూడా పాము కనిపిస్తే కిలో మీటరు పారిపోయే మీరు అని నా వైపు అనుమానంగా చూస్తూ మీరు నా దగ్గర ఏం దాస్తున్నారు బాబు ఎక్కడ అని అడిగింది , ఏ బాబు నాకేం తెలీదు అన్నాను, చెప్పకపోతే అందరినీ పిలుస్తాను అంది , దాని చంప పగల గొట్టి నేనేం చేయలేదు , ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడితే నిజంగానే నిన్ను చంపుతాను అని బెదిరించాను , నేనే చస్తాను అప్పుడు వూరి జనం అంతా లోపలికి వస్తారు అని అక్కడే వున్న కిరోసిన్ డబ్బా చేత్తో తీసుకుని అప్పుడు ఎలాగయినా నీ గురించి తెలుస్తుంది అని అరిచింది నా మీద సుజాత , తన చేతిలో కిరోసిన్ డబ్బా లాక్కుని పక్కన పెట్టాను , ఈ లోపు కొట్టు బయటి నుండి ఎవరో తలుపు కొట్టి పిలుస్తున్న శబ్దం వినపడింది , నేను వచ్చి మాట్లాడతాను అని కొట్టు లోకి వెళ్ళాను , నేను బయటకు వచ్చిన 2 నిమిషాలకు లోపలి నుండి అరుపులు వినిపించాయి , నాతో పాటు నా వెనుక కొట్టు లో వున్న అతను కూడా వచ్చాడు , తన ప్రాణాలను కూడా లెక్కపెట్ట కుండా అంతకు తెగించింది నిజంగానే కిరోసిన్ పోసుకుని నిప్పంటించి కుంది , బాబు , బాబు అని సంపత్ గురించి చెప్పటానికి ప్రయత్నించింది అందుకే ఎవరికీ అనుమానం రాకుండా తన కడుపులో బిడ్డ గురించే కలవరిస్తోందని అబద్దం చెప్పాను అని నిట్టూరుస్తూ నా వల్లే నా భార్య చనిపోయింది అన్నాడు కళ్ళ నిండా నీళ్లతో శరభయ్య , సరే నువ్వు చెప్పింది ఈ పేపర్ మీద రాసి సంతకం పెట్టు అని పాడ్ కి పెట్టి వున్న ఒక పేపర్ పెన్ ఇచ్చాడు విజయ్ , శరభయ్య ని చంద్రం కి అప్పజెప్పి సెల్ నుండి బయటకు వచ్చాడు విజయ్ , స్టేషన్ లో ఒకవైపు సాగర్ చెబుతుంటే జాగ్రత్తగా వింటూ డ్రా చేస్తున్నాడు వెంకట్ , వాళ్ళ ముందుకు వచ్చి కూర్చున్నాడు విజయ్ , స్కెచ్ ఫినిష్ చేసి సాగర్ ముందు వుంచాడు వెంకట్ , కళ్ళు పెద్దవి చేసి చూస్తు yes ఇతన్నే నేను చూసింది అన్నాడు సాగర్ ఎక్సైటింగ్ గా , విజయ్ ఆ స్కెచ్ చేతిలోకి తీసుకుని సాగర్ నువ్వు ఇతన్ని చూసావా are you sure అని అడిగాడు , అతనితో నేను ట్రావెల్ చేశాను అంత ఈజీ గా మర్చిపోను అతన్ని అన్నాడు సాగర్ , ఎప్పుడు , ఎక్కడ చూసావ్ అంతా కొంచెం క్లియర్ గా చెప్పు అని అడిగాడు విజయ్ , సాగర్ గుర్తు తెచ్చుకున్టూ 6months బ్యాక్ నేను వూరికి వచ్చేటప్పుడు హైదరాబాద్ బస్టాండ్ లో నా పక్కన కూర్చున్నాడు తన చేతిలో ఒక క్రైం నోవెల్ ఉంది , జర్నీ చేసినంత సేపు అదే చదువుతూ ఉండటం గమనించాను , అందుకే మధ్య మధ్య లో అతన్ని అబ్జర్వ్ చేస్తూ కూర్చున్నా, మచలీపట్నం బస్టాండ్ లో దిగేసరికి బాగా వర్షం స్టార్ట్ అయింది , మీది ఈ వూరేనా అని అడిగాడు నన్ను లేదు దగ్గరి లో వున్న విలేజ్ కి వెళ్ళాలి అన్నాను , మరి మీరు అని అడిగాను ఈ వూరే మా రిలేటివ్స్ ఇంటికి వచ్చా అన్నాడు అతను , రెయిన్ కొంచెం తగ్గగానే అతను అక్కడి నుండి వెళ్ళిపోయాడు , మన వూరి బస్ కూడా ఎక్కలేదు అన్నాడు సాగర్ , నువ్వు వచ్చిన డేట్ కరక్ట్ గా చెప్పగలవా అన్నాడు విజయ్ , ఎస్ చెప్పగలను ఆ రోజు నా చెల్లి బర్త్ డే కోసమే వచ్చా , నెక్స్ట్ డే ఆగస్ట్ 3 నా చెల్లి బర్త్ డే , నేను ఆగస్ట్ 2 న వూరికి వచ్చా అన్నాడు సాగర్ ,కేలండర్ లో డేట్ చెక్ చేద్దామని ఫోన్ లో కేలండర్ ఓపెన్ చేసిన విజయ్ అంత కంగారులో కూడా ముందు విజ్జి బర్త్ డే అని ఆగస్ట్ 3 కి వెళ్లి save చేసుకున్నాడు , తరువాత ఆ year ఆగస్ట్ 2,3 డేట్స్ చెక్ చేసి షాక్ అయ్యాడు , ఆగస్ట్ 3ర్డ్ ఈ year అమావాస్య వచ్చింది , అంటే ఒక రోజు ముందే అతను హైదరాబాద్ నుండి వచ్చి పక్కనున్న పట్నం లో స్టే చేస్తున్నాడు నెక్స్ట్ డే వేషం మార్చుకుని శరభయ్య ని కలిసేవాడన్న మాట అని జరిగింది అంతా ఆలోచిస్తూ ఒక అంచనా వేస్తున్నాడు విజయ్ , వెంకట్ విజయ్ ని చూసి ok మై వర్క్ is డన్ all the best for your furthur ఇన్వెస్టిగేషన్ అన్నాడు విజయ్ కి షేక్ హ్యాండ్ ఇస్తూ, థాంక్స్ వెంకట్ మీ స్కెచెస్ వల్లే ఇప్పుడు కేస్ ముందుకు కదులుతుంది టైం కి వచ్చి కోపరేట్ చేసి నందుకు థాంక్స్ వన్స్ అగైన్ అన్నాడు విజయ్ , థట్స్ మై డ్యుటీ sir , మీకు ఏ అవసరం వున్నా నా పర్సనల్ నంబర్ కి డైరెక్ట్ గా కాల్ చేయండి , అంటూ ఒక కార్డ్ విజయ్ చేతికి ఇచ్చాడు , సాగర్ కి కూడా బై చెప్పి అక్కడి నుండి వెళ్లి పోయాడు వెంకట్ , విజయ్ రాఘవులు ని పిలిచి మరిడయ్య స్కెచ్ అతని చేతికి ఇస్తూ రాఘవులు గారు ఈ స్కెచ్ కొన్ని కాపీస్ తీసి ఉంచండి , మచలీపట్నం , హైదరాబాద్ స్టేషన్స్ కి ఫ్యాక్స్ పంపి అతని వివరాలు ఏమైనా తెలుస్తాఏమో నని కనుక్కోండి , అతను ప్రతి నెలా వన్ డే బిఫోర్ మచలీపట్నం కి వస్తున్నాడు కాబట్టి ఏదయినా హోటల్ లో లేదా లాడ్జ్ లో స్టే చేసే అవకాశం వుంది , నేను రేపు కోర్టు కి వెళ్ళాలి , సో మీరు చంద్రం కలిసి మచలీపట్నం వెళ్లి ఈ స్కెచెస్ చూపించి హోటల్స్ అండ్ లాడ్జ్ స్ లో ఎంక్వైరీ చేయండి అని చెప్పాడు రాఘవులు కి , సాగర్ ని చూసి రేపు నువ్వు కూడా uncle వాళ్ళతో పాటు మచిలీపట్నం వెళతావా అని అడిగాడు విజయ్ అడుగుదామా వద్దా అన్నట్టు , అది అడగడానికి ఎందుకురా అంత ఆలోచిస్తావ్ , వెళ్ళ మని డైరెక్ట్ గా చెబితే నేను వెళతా కదా అన్నాడు సాగర్ , ఎలా చెప్పను రా నువ్వసలే సాఫ్టువేర్ కదా ఇంట్లో వుండి కూడా వర్క్ చేస్తూనే వుంటారు అన్నాడు విజయ్ నవ్వుతూ , అవును నేను మొన్నటి వరకూ అలానే అనుకున్నా , నిన్ను చూసాక అర్థమయ్యింది పోలీస్ జాబ్ ఇంకా కష్టం అని అన్నాడు సాగర్ కూడా నవ్వుతూ.