He is alive... - 6 in Telugu Women Focused by No One books and stories PDF | తనువున ప్రాణమై.... - 6

The Author
Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

తనువున ప్రాణమై.... - 6

ఆగమనం.....

ఆమె నోరు తెరిచింది మొదలు.. ఒక సెకండ్ కూడా బ్రేక్ ఇవ్వకుండా, మాట్లాడుతూనే ఉంది. అతను మధ్యలో బ్రేక్ వేద్దామని పొలైట్ గా... అతని ఒక చెయ్యి చూపించిన, చేతి ఫింగర్స్ ముడిచి, రిక్వెస్ట్ చేస్తున్నట్టు చూపిస్తూ, ఆపడానికి ప్రయత్నించినా కూడా... అసలు పట్టించుకుంటేనేగా, తన ఫ్లోలో తను చెబుతూనే ఉంది.

అసలు ఏంటండీ మీరు, మీ ఫ్లో లో మీరు మాట్లాడేస్తున్నారు. ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ తో, పనిలేదా మీకు అసలు!! ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా..??





ఉఫ్.... వాట్ ఇస్ దిస్ 6 ఫీట్, నేనేమో చక్కగా నువ్వు నేను ఒకటి అంటుంటే!! నువ్వేమో అండి, ఆగండి అంటున్నావు. ఆగితే ఎలా 6 ఫీట్.

అసలు నీ కటౌట్ కి, ఎంత ఫాస్ట్ గా దూసుకుపోవాలో, తెలుసా..??

యు నో 6 ఫీట్, ఐ యాం సో లక్కీ!
ఎందుకో తెలుసా..??
నేను నీ కటౌట్ కి తగ్గట్టుగా, స్పీడ్ ఉన్న అమ్మాయిని.
సో, ఐ యామ్ సో లక్కీ!! సో... సో... సో........,





హేయ్.... స్టాప్! స్టాప్... స్టాప్... స్టాప్!!!
బ్రేకులు లేని బండిల దూసుకుపోతున్న, ఆమెని పొలైట్ (మంచిగా) మోడ్ లో అయితే ఆపలేమని అర్థం చేసుకున్నాడు మన హీరో.


స్ట్రాంగ్ గా స్టాప్ బోర్డ్ పట్టుకొని, సీరియస్ మోడ్ లోకి, షిఫ్ట్ అయ్యాడు.



ఉఫ్...... గట్టిగా నోటితో, గాలి వదిలాడు.
హో గాడ్.... ఆ బ్రేకులు లేని బండిని చూస్తూ, ఇన్నర్ వేసుకున్నాడు.

మిస్, ఆర్ యు ఓకే..??
నువ్వు బాగానే ఉన్నావు, కదా..??
ఈ బ్రేకులు లేని బండికి, "స్క్రూ లూజ్" అనుకుంటున్నాడు, మన హీరో.
షాప్ లోని అన్ని కార్నర్స్ ని, అన్ని యాంగిల్స్ లో చెక్ చేస్తున్నాడు. మన హీరో....!!





హేయ్, 6 ఫీట్ దెనికోసం చూస్తున్నావు..??
నా ఫ్యామిలీ కోసమా..??
లేదా, నాతో పాటు ఇంకెవరైనా, ఉన్నారా అన..??
ఎందుకు, అటు ఇటు సెర్చ్ చేసి,
ఎనర్జీ వేస్ట్ చేస్తున్నావు..??
నన్ను అడిగితే, నేనే చెప్తాను కదా..!!
ఐ యాం సింగిల్, మై 6 ఫీట్..!!
ఐ వాంట్, మింగిల్ విత్ యు... సిక్స్ ఫీట్..!!
యు నో సిక్స్ ఫీట్!!
నువ్వు కూడా... నన్ను, నువ్వు అనేసావు!!
వితిన్ మినిట్స్ లోనే,
నువ్వు నన్ను, నువ్వు ఆన్నావంటే!!
వితిన్ అవర్ లో, ఏదైనా వండర్ జరిగిపోవచ్చు!!
ఏమంటావు!! చెప్పు... చెప్పు...ఏమంటావు!!

ఫుల్.... ఎక్సైట్మెంట్ మోడ్ లో, ఉన్న పాప... నవ్వుతూ కళ్ళ ఎగరేస్తూ, ఫుల్ హస్కీ వాయిస్ తో మాట్లాడుతుంది.





ఆ వాగుడు కాయ, వేషాలు చూస్తుంటే...
మనోడికి బి పి మీటర్, పెరిగిపోయింది..!!
సీరియస్ మోడ్ కాస్త యాంగ్రీ మోడ్ లోకి షిఫ్ట్ అయింది.!!

హేయ్... ఆపు!!
ఆర్ యు లాస్ట్, యువర్ మైండ్..!!
ఏంటి ఈ గోల..?? హా...
అసలే, హడావిడిలో ఉన్నాను...
నాకు చిరాకు తెప్పించకు..!!
అని పళ్ళు నూరేస్తున్నాడు!!

సి మిస్... నీ ప్రాబ్లం ఏమిటి..??
అసలు నాతో, పని ఏమిటి..??
చెప్పేసి ఇక్కడి నుంచి, వెళ్ళు..!!
విసిగించకు నన్ను..!!




ఓహో.... థాంక్యూ, సిక్స్ ఫీట్..!!
ఏమిటో చెప్పమని, నువ్వే అడిగేసావు!!
నువ్వు అడిగిన తర్వాత కూడా,
చెప్పకపోతే... అసలు బాగోదు!!
అందుకని, చెప్పేస్తున్నాను..!!
నీకోసం, చెప్పేస్తున్నాను..!!
నా మనసును నీ ముందు.. పరిచేస్తున్నాను..!!
నీకు తెలుసా, సిక్స్ ఫీట్..??




నాకు నువ్వు కనబడగానే, నాలో కలిగిన ఫీలింగ్..!!
వా....వ్.....!!
నాట్ దిస్ మచ్, వా....వ్....!!
అంటూ తన చేతులు రెండు, తన బాడీకి ఆనించి, కొంచెం ముందుకు చాపి పెట్టి! ఆ అరిచేతుల మధ్య డిస్టెన్స్(దూరం) ని, చూపిస్తుంది..!!

థిస్ మచ్ వా........వ్......... వ్..!!
అని తన రెండు చేతులు, బార్ల చాపి చూపిస్తుంది.




హే... ఇనఫ్!!
జస్ట్ స్టాప్ ఇట్..!!
నాతో మాట్లాడవలసింది మాత్రమే చెప్పు!!
ఒకే ఒక్క వార్డ్ లో!!
స్టాప్ ఆల్ దిస్ నాన్సెన్స్!!
OK!!

యాంగ్రీ మోడ్లో ఉన్న మన హీరో,
లిటిల్ బిట్, రెడ్ యాంగ్రీ బర్డ్ లాగా మారిపోతున్నాడు.
మాటల్లో కూడా, సీరియస్ నెస్ వచ్చేసింది.!!



సిక్స్ ఫీట్ సీరియస్నెస్ చూస్తున్న,
మన వాగుడుకాయ... సరేనని
క్యూట్ గా, తల ఉపుతుంది.





I LOVE YOU ❤️

క్యూట్ గా, సింపుల్ గా,
ఒకే ఒక్క మాటలో చెప్పేసి,
తన 6 ఫీట్ ని, హ్యాపీగా చూస్తుంది.




అతని షాక్ అవ్వలేదు!! సీరియస్ గా, చూస్తున్నాడు..!!
ఎందుకంటే అతను ముందుగానే, ఎక్స్పెక్ట్ చేశాడు!!
ఆ వాగుడు, ఆ నవ్వులు, ఆ మెలికలు తిప్పడాలు..
అంతా సింబాలిక్ గా చూపిస్తుంటే, ఇటువంటిదే ఏదో ఉంటుందని... అతను ముందుగానే, ఎక్స్పెక్ట్ చేశాడు!!

ఐ నో!! నేను ముందుగానే, అనుకున్నాను!!
నీ వేషాలు చూస్తుంటేనే, నాకు అనిపించింది!!
నీకు అసలు, కామన్ సెన్స్ ఉందా!!
చూసి చూడగానే, ఐ లవ్ యు అని చెబుతున్నావు!!
నాకే చెబుతున్నావా?? లేక....
కనిపించిన ప్రతి ఒక్కరికి, ఇలాగే చెబుతున్నావా??
ఈమధ్య నీలాంటి అమ్మాయిలకి,
ఇలా, ఐ లవ్ యు అని చెప్పడం...
ఒక ఫ్యాషన్ గా మారిపోయింది.. కదా!!
ఆ వర్డ్ నీకు, అంత చీప్ గా కనిపిస్తుందా..??
యు నో, దట్స్ మీన్..??

మన హీరో కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ... స్టేబుల్ గా సీరియస్ గా, చెబుతుంటే!! ఆ వాగుడుకాయి మాత్రం హ్యాపీగా, నవ్వుతూ, ఆ వాయిస్ వింటూ... ఎంజాయ్ చేస్తుంది.




మన హీరో అంత సీరియస్ గా చెబుతుంటే, తను అలా నవ్వుతుండేసరికి, మన హీరోకి అప్పటి వరకు ఆపుకున్న కోపం, వస్తున్నా... వస్తున్నా... అంటూ, వచ్చేస్తూ ఉంది.



హే జస్ట్ స్టాప్ ఇట్...!!
ముందు ఆ నవ్వడం ఆపు..!!
ఈ తిప్పడం కూడా ఆపు..!!
నేను ఇంత, సీరియస్ గా చెప్తుంటే..!!
నీకు అంత జోక్ గా ఉందా..??
ఆర్ యు మాడ్..??
జస్ట్ గెట్ అవుట్, ఫ్రమ్ హియర్..!!
జస్ట్ గెట్ అవుట్..!! అని చాలా కోపంగా అరుస్తాడు.



నో సిక్స్ ఫీట్!! దిస్ ఇస్ నాట్ జోక్..!!
ఐ యాం వెరీ సీరియస్, అబౌట్ మై లవ్..!!
నేను చాలా సీరియస్ గా, చెబుతున్నాను..!!
ఐ లవ్ యువ్!!
రియల్లీ, స్ట్రాంగ్ లీ, సీరియస్లి...
I LOVE YOU ❤️
అని క్లియర్ గా చెప్తుంది.



ఏంటి కనిపించగానే, ఐ లవ్ యు చెప్పడం సీరియస్, హా!!
అసలు ఏమనుకుంటున్నావు, నీ గురించి!!
నేను ఎలా కనిపడుతున్న, నీ కంటికి!!
పిచ్చి వేషాలు వేయకు!!
నాకు తిక్క రేగిందంటే, ఏం చేస్తానో నాకే తెలియదు!!
పో ఇక్కడినుంచి!!



నో సిక్స్ ఫీట్!!
నువ్వు నాకు ఇంత వావ్ ల కనిపిస్తే...
అని మల్లి తన రెండు చేతులు చాపేసి చూపిస్తుంది.
ఇట్స్ రియల్లీ, వెరీ సీరియస్..!!
అయినా నా ప్రేమ అంతా, ఒక్క మాటలో...
చెప్పేస్తే, ఎలా చెప్పు..??
నా ప్రేమ ఎంత సీరియస్ అనేది...
నేనే కదా, నీకు చూపించాలి..!!
నాకు వన్ మినిట్ టైం ఇవ్వు, సిక్స్ ఫీట్..!!
నాకు నీ మీద ఎంత ప్రేమ ఉందో...
నీకు అర్థమయ్యేలా, చెబుతాను..!!
జస్ట్ వన్ మినిట్, సిక్స్ ఫీట్..!!
ప్లీ......జ్......




@@@@@@@@@

నాతోపాటు పయనిస్తూ, మీ ఆదరణ అందిస్తారని ఆశిస్తున్నాను.

తదుపరి భాగంలో... కథానాయకుడుకి, మన కథానాయకి తన ప్రేమ ఎంతా సీరియస్.. అనేది, తెలియజేస్తుంది.

నచ్చిన వారితోపాటు, చదువుతున్న ప్రతి ఒక్కరు మీ రేటింగ్స్, సమీక్షలను అందజేస్తే... మాకు మరింత ప్రోత్సాహకంగా ఉంటుంది.

మళ్లీ కలుద్దాం.
థాంక్యూ సో మచ్.
వర్ణ.