He is alive... - 7 in Telugu Women Focused by No One books and stories PDF | తనువున ప్రాణమై.... - 7

The Author
Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

తనువున ప్రాణమై.... - 7

ఆగమనం.....



నో... సిక్స్ ఫీట్!!
నువ్వు నాకు ఇంత వావ్ ల కనిపిస్తే...
అని మల్లి తన రెండు చేతులు చాపేసి చూపిస్తుంది.
ఇట్స్ రియల్లీ, వెరీ సీరియస్..!!
అయినా నా ప్రేమ అంతా, ఒక్క మాటలో...
చెప్పేస్తే, ఎలా చెప్పు..??
నా ప్రేమ ఎంత సీరియస్ అనేది...
నేనే కదా, నీకు చూపించాలి..!!
నాకు వన్ మినిట్ టైం ఇవ్వు, సిక్స్ ఫీట్..!!
నాకు నీ మీద ఎంత ప్రేమ ఉందో...
నీకు అర్థమయ్యేలా, చెబుతాను..!!
జస్ట్ వన్ మినిట్, సిక్స్ ఫీట్..!!
ప్లీ......జ్......




అసలే మన వాగుడు కాయది వయసు తెలియనంత, చిన్న పిల్లల ముఖంలా ఉంటుంది. మరి ఇంత క్యూట్ గా రిక్వెస్ట్ చేస్తుంటే, అసలు ఆమె ముఖం చూసి.. ఒప్పుకోకుండా ఎవ్వరు ఉండరేమో!!




కానీ మన హీరో మాత్రం, ఒప్పుకోలేదండోయో..!!
పర్వాలేదు గట్టిపిండమే..!!


ప్రేమ మీద, ప్రేమికుల మీద,
అది అందిపుచ్చుకునే వారి మీద,
మన హీరోకి... చాలా మంచి రెస్పెక్ట్ ఉంది.



అసలు ఎవరో ఏంటో తెలియకుండా,
అద్దంలో చూడగానే నచ్చేసావు!!
ఇంత సీరియస్ గా ప్రేమించాను!!
ఆ ప్రేమ ఎంతో.. నీకు, అర్థమయ్యేలా చెబుతాను!!
అని విసిగిస్తున్న, ఆ వాగుడు కాయ మీద .. మన హీరోకి, పిచ్చ చిరాకు వస్తుంది.



చూడడానికి, భూమికి బెత్తెడు ఉంది గాని..
దీని వాగుడు మాత్రం దీనికన్నా, మూరెడు ఉంది!! పొద్దున్నే ఎవరి మొఖం చూసానో, ఏమిటో??
తుమ్మ బంకలా, వచ్చి తగులుతుంది.
ఛా.. ఇది చెప్పెది, నేను వింటే తప్ప..
ఇది నన్ను వదలదా..??


ఎదురుగా మిరిమిట్లు గోలుపుతూ, నిలబడిన..
ఆ పొట్టి వాగుడుకాయని సీరియస్ గా చూస్తూ..
మన హీరో, ఇన్నర్ వేసుకుంటున్నాడు.

మళ్లీ పైకి అంటే, వసపిట్టలాగా..
ఒకటికి 100 వాగుతుందని, భయం కాబోలు!!




హో..హో.. సిక్స్ ఫీట్!!
ఏంటి ఒప్పుకుంటున్నావా, చెప్పు..??
నువ్వు చెప్పకుండా, ఇలాగే నిలబడితే..
నేను కూడా, ఇలాగే నిన్ను చూస్తూ...
నీ ముందు ఉండిపోతాను...!!
అప్పుడు, టైమంతా ఇక్కడే కరిగిపోతుంది..!!
ఇంక నేను, నీ ప్రేమలో ఎప్పుడు కరగాలి..!!
నువ్వు ఎప్పుడు, నా ప్రేమలో మునిగి తేలాలి..!!
ఏంటి, సిక్స్ ఫీట్.... ఏదో ఒకటి చెప్పు..??

చిన్నపిల్లల గారాలు పోతూ...
అందంగా, రాగాలు తీస్తూ...
మన హీరోని, తెగ విసిగించేస్తుంది..!!





హే ఆపు.. ఆపు.. ముందు..!!
ఇది మొత్తం, మొత్తం బంద్ చెయ్యి..!!
అసలు ప్రేమంటే, ఏంటో తెలుసా నీకు..!!
అసలు ఆడపిల్లవేనా నువ్వు..??
ఈ వేషాలు ఏంటి, ఈ గోలా ఏంటి..??
అలా చూడగానే, ఇలా ప్రేమ వచ్చేసిందా..??
ప్రేమ, ప్రేమ అంటూ విసిగించుకు, నన్ను!!
నువ్వు చెప్పేది వినాల్సిన, అవసరం నాకు లేదు!!
ఫస్ట్ యు లీవ్ థిస్ ప్లేస్, రైట్ నౌ !!
పో... ముందు ఇక్కడి నుంచి...

మన హీరో, ఈసారి యాంగ్రీ మోడ్లో...
కొంచెం సీరియస్ గా, అరిచేస్తున్నాడు!!
నెమ్మదిగా చెబితే, పొట్టిది వింటుందా..??



తన సిక్స్ ఫీట్ కి, కోపం వచ్చిందని..
మన పొట్టి దానికి, అర్థం అయిపోయింది..!!
ఈసారి ముఖమంతా ముడిచేసుకుని..
క్యూట్ గా పప్పీ పేస్ పెట్టి..
మళ్ళీ మొదలు పెట్టింది..!!

లవ్ ఎట్ ఫస్ట్ సైట్.... సిక్స్ ఫీట్..!!
ప్లీజ్...6 ఫీట్ ట్రస్ట్ మీ..!!
రియల్లీ, లవ్ ఎట్ ఫస్ట్ సైట్!!
అమ్మాయిలకి, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఒప్పుకోరా.!!
అబ్బాయిలకి మాత్రమే, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఉంటుందా..!!
ప్లీజ్... 6 ఫీట్, ట్రస్ట్ మీ... లవ్ ఎట్ ఫస్ట్ సైట్!!

నాకు నీ మీద ఎంత ప్రేమ ఉందో...
ఒక్కసారి, అర్థమయ్యేలా చెబుతాను!!
నేను ఒక్కసారి చెప్పాక, నీకు బాగా అర్థమైపోతుంది.
ఆ తర్వాత నువ్వే, నాకోసం వెతుక్కుంటూ వచ్చేస్తావు!! నువ్వు, నాకోసం వెతుక్కుంటూ, వచ్చే అంత ప్రేమ...
నాకు నీ మీద, ఉంది... సిక్స్ ఫీట్..!!





షట్ అప్....!! జస్ట్... షట్ అప్..!!
ఇంకొక్కసారి... నన్ను సిక్స్ ఫీట్ అన్న, ప్రేమ, ఫస్ట్ సైట్,
అబ్బాయిలు, అమ్మాయిలు,
అని చెత్త చెత్త వాగుడంతా వాగిన!!
ఐ..విల్.. కిల్.. యువ్... వింటున్నావా..??
ఐ..విల్.. కిల్.. యు ..!!
జస్ట్... షట్.. అప్.. అండ్ గో..!!

మన హీరో, పొట్టి దాని టార్చర్ తట్టుకోలేక...
తన ఫ్రస్టేషన్ అంతా బయట పెట్టేస్తాడు..!!
ఎర్రబడిపోయిన కళ్ళతో, పొట్టి దాన్ని సీరియస్ గా చూస్తున్నాడు..!!




పిచ్చ కోపంతో, ఫుల్ గా రైస్ అయిపోయి..
అరుస్తున్న ఆ సౌండ్ కి చుట్టూ ఉన్నవాళ్లు అంతా... వీళ్లిద్దరిని, స్టాట్యూ లా నిలబడిపోయి చూస్తున్నారు..!!



సిక్స్ ఫీట్ అలా అరవకు!
చూడు అందరూ మనల్ని చూస్తున్నారు!
ప్లీజ్ సిక్స్ ఫీట్, కామ్ డౌన్..!!



స్వీట్ గా, ఇన్నోసెంట్ ఫేస్ తో, పొట్టిది రిక్వెస్ట్ చేస్తుంది..!!


చుట్టూ ఉన్న వాళ్ళని, అలాగే సీరియస్ గా చూస్తాడు..!!
అందరూ సెట్ అయిపోయి, తలలు తిప్పేసుకుంటారు..!!
పబ్లిక్ ప్లేస్ కావడంతో, కోపాన్ని కంట్రోల్ చేస్తున్నాడు..!!
వేధిస్తున్న పొట్టి దాన్ని మాత్రం, చంపేసేలా చూస్తున్నాడు!!


వాడు అంతలా కోపంగా చూస్తుంటే, పొట్టిది మాత్రం క్యూట్గా ఐస్ చేస్తూ... అందంగా నవ్వేస్తుంది.


సిక్స్ ఫీట్ నీకో విషయం చెప్పనా?
నువ్వు కోపంలో చాలా హాట్ గా ఉన్నావు!!
ఇలా అందరూ నిన్ను చూస్తుంటే, దిష్టి తగులుతుంది!! మనిద్దరం ఉన్నప్పుడు మాత్రమే, ఇలా కోపంగా ఉండు!! ఇలా నువ్వు, చాలా హాట్... హాట్ గా ఉన్నావు!!
ఇప్పుడు ఓకేనా, సిక్స్ ఫీట్..!!




ఉఫ్..ఏంటే ఓకే!!
నువ్వు ఇప్పుడు.. పోతావా, పోవా..??






ఉహూ.. పోను సిక్స్ ఫీట్!!
నీకు అర్థమయ్యేలా చెప్పే వరకు..
నిన్ను వదిలి, ఎక్కడికి పోను..!!
చాలా క్యూట్ గా మూతి ముడిచి పప్పీ ఫేస్ తో చెప్తుంది.




ఛా.. ఓకే ఫైన్!!
నువ్వు ఇక్కడే చావు!!
నేనే పోతాను..!!

అని చాలా ఇరిటేటెడ్ గా అక్కడి నుంచి వెళ్లబోతాడు.



సిక్స్ ఫీట్ అప్పుడు..
నేను కూడా నీతోనే వస్తాను..!!
అని అతని వెనకే కదులుతుంది.



వాట్ కమ్ అగైన్..
నాతో వస్తావా..??
అని పళ్ళు బిగించి సీరియస్ లుక్ తో వెనక్కి తిరిగేడు.




హా.. నీతోనే రావాలి కదా!!
నా ప్రేమ నీకు అర్థం అయ్యేలా చెప్పాలంటే..!!
లేదంటే, ఒక్క నిమిషం నాకు ఇవ్వు..!!
చెప్పేసి వెళ్ళిపోతాను..!!
ఆ తర్వాత నువ్వే, నాకోసం వస్తావు..!!
అని నవ్వుతూ చాలా కూల్ గా చెప్తుంది.






నో వే..!! చస్తే అది జరగదు!!
నాకు ఆ అవసరం కూడా లేదు..!!
అన్నాడు చాలా కాన్ఫిడెంట్ గా.




ఏంటి, సిక్స్ ఫీట్ భయమా..!!
నా ప్రేమ నీకు తెలిసిపోతే...
తర్వాత నాకోసం, వెతుక్కుంటూ వచ్చేస్తానని..!! భయపడుతున్నావా..!!
కళ్ళు ఎగరేస్తూ, మూతి గుండ్రంగా తిప్పుతూ...
క్యూట్ గా, టెంప్ట్ చేస్తుంది..!!






ఏంటి భయమా..?? నాక, నెవ్వర్..!!
అయినా, నీలాంటి పొట్టి దానికి భయపడేదెంటే..!!
అని పాప టెంట్ చేస్తుంటే సిక్స్ ఫీట్ ప్రెస్టేట్ అవుతున్నాడు.



లేదు సిక్స్ ఫీట్, నా ప్రేమ నిజం..!!
అందుకే నువ్వు భయపడుతున్నావు..!!
నీకు భయం లేదంటే, ఒప్పేసుకో..!!

ప్రస్టేషన్ పెంచి, ఫ్రేమ్ లో ఇరికించేసింది..!!
ఇంకేం చేస్తాడు; భయమా అని వెక్కిరించింది కదా!!
మన హీరో, ఒప్పేసుకున్నాడు..!!





హో థాంక్యూ సిక్స్ ఫీట్..??
కం విత్ మీ..!!
అని, చేయ్యి పట్టేసుకుంటుంది.



హే డోంట్ టచ్ మీ..!!
టచ్ చేసావో, చంపేస్తా..!!
అని, చేయి వెనక్కి లాగేసుకుంటాడు..!!



ఓకే ఓకే సిక్స్ ఫీట్...!!
డోంట్ షౌట్, అస్సలు టచ్ చేయను..!!
ఇక్కడ అందరూ ఉన్నారు సిక్స్ ఫీట్..!!
అటు వెళదాం రా, అంటూ చేయి పట్టుకుని...
ట్రైల్ రూమ్ వైపుకి లాక్కుపోతుంది.



మన హీరో, పొట్టి దాని చేతిని విసిరి కొట్టేస్తాడు..!!
పొట్టి దాన్ని ఫాలో అయ్యి వెళతాడు..!!





@@@@@@@@@

తదుపరి భాగంలో... కథానాయకుడుకి, మన కథానాయిక ఒక్క నిమిషంలో, తన ప్రేమను తెలియజేస్తుంది.

నచ్చిన వారితోపాటు, చదువుతున్న ప్రతి ఒక్కరు మీ రేటింగ్స్, సమీక్షలను అందజేస్తే... మాకు మరింత ప్రోత్సాహకంగా ఉంటుంది.

మళ్లీ కలుద్దాం.
థాంక్యూ సో మచ్.
వర్ణ.