“ నేను పూర్తి స్పృహలో ఉండే మాట్లాడుతున్నాను . ...దయచేసి నన్ను ఆపొద్దు . ,
రాహుల్! విద్యాధరి స్వరం లో చిరాకు, చిరుకోపం, అభ్యర్ధన
పోటీపడుతున్నాయి . రాహుల్ నిస్సహాయంగా చూశాడు . 
“ మీ చిన్నాన్న రహస్యం తెలిస్తే నాన్నమ్మకు ఏదో అవుతుందని కదూ నీ భయం ? ..మరి, తెలియకుండా ఎన్నాళ్ళు
దాచి పెడతావ్ ? మీ పిన్ని నన్ను చూడలేదు . ... చూసుంటే ? ఎంత గొడవ జరిగేది ?”
రాహుల్ చూపుల్లో   మళ్ళీ అదే నిస్సహాయత
. “ .... ఎప్పటికైనా నిజం ఆమెకు తెలియాలి . మనం ఆపినా ఆగదు. దాచినా దగదు .
ఒక్కసారిగా తెలిసి ఆమె కృం కృం గిపోవటం కంటే ముందుగానే ఆ పరిస్థితికి ఆమెను సిద్ధం
చేయటం మంచిది కదా ?””
రాహుల్ కాదనలేక పోయాడు . కానీ, ముందుగా భరత్ రామ్ అనుమతి తీసుకోవాలని అతడి
అభిప్రాయం . అందుకు విద్యాధరి ఒప్పుకుంది . తనే ఫోను లో భరత్ రామ్ తో మాటలాడింది .
మొదట తను  కాదన్నా ఆమె మాట్లాడిన తీరుకు ,
చూపిన కారణాలకు ఒప్పుకోవలసి వచ్చింది . 
“ విద్యా ! నాకు తెలీకుండా ఏదో జరుగుతోంది . నాకు చెప్పకుండా ఏదో దాస్తున్నారు
. రుపాదేవికి నీ పునర్జన్మ  వివరాలు
చెప్పవద్దని రాహుల్ ఆంక్ష పెట్టాడు . ఎప్పుడూ లేంది, ఏ కారణం చెప్పకుండా రూపా నా ఒళ్ళో
పడుకొని ఏడ్చింది . ...ఎంతో బాధ ఉంటేనే గాని రూపా ఏడవదు  . నా వయసు చూసి భయపడకండి . ఈ గుండె ఎప్పుడో
బండబారింది . ఏం చెప్పినా నేను బెదరను  .
నాకేం కాదు . మీరు చెప్పి తీరాలి . ”! ఆమె స్వరం లో అధికారం, దర్పం . 
విద్యా రాహుల్ ను చూసింది . తలవంచాడు . ఆచి, తూచి మాట్లాడుతూ ,
ముసలావిడ భావోద్వేగం గమనించుతూ, ఎంతో అనునయంగా , జాగ్రత్తగా ఆనాటి సంఘటన
వివరించింది . తనలో అశాంతితో , ప్రతీకారం తో తల్లడిల్లిపోతున్న కోమలను
ప్రత్యక్షంగా ఆమె కళ్ళ ముందు నిలిపింది . తన లక్ష్యం తెలిపింది . 
ముసలావిడ అన్నీ మౌనం గా విన్నది . గదిలో ఘనీభవించిన నిశ్శబ్దం . రాహుల్ ,   
  అతడి భార్య ఊపిరి బిగపట్టి చూస్తున్నారు . విద్యా
పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది . రాయిలా బిగుసుకున్న ఆ వృద్దురాలిలో  చలనం ఎప్పుడు, ఎలా కలుగుతుంది ?!
ముసలావిడ తలెత్తి చూసింది . ఆ చూపుల్లో భావాలు , అలజడి ఊహకు ఏమాత్రం అందవు .
ఆమె విద్యాని దగ్గరకు తీసుకొని ఆర్తిగా తనలో పొదువుకుంది . కళ్ళు జలపాతం లా
వర్షిస్తున్నాయి . పండుటాకు లాంటి ఆమె దేహం ఎంతగా కంపిస్తుందో విద్యాకు స్పష్టం గా
తెలుస్తోంది 
ఆమె తేరుకుంది . సర్దుకుని కూర్చుంది . మనవడిని దగ్గరకు రమ్మని సైగ చేసింది .
రాహుల్ వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు . మనవడి కుడిచెయ్యి విద్యా చేతి లో పెట్టింది
. విద్యాకు ఆమె ఆంతర్యం అర్థం కాలేదు .
“ విద్యా !  ఆమె మాటలు స్థిరంగా
ఉన్నాయి . తొట్రుపాటు లేదు . అంత షాక్ నుండి నిమిషాల వ్యవధిలో  తేరుకోవటం 
సామాన్యమైన విషయం కాదు . “ రాహుల్ నీ వెంటే నీడలా ఉంటాడు . అజయ్ ను ధైర్యం
గా ఎదిరించు .లోకం ముందు అపరాధిలా నిలబెట్టు ! సంప్రదాయం అడ్డుపెట్టుకొని వాడు ఓ
నిండు ప్రాణాన్ని బాలి తీసుకున్నాడు . తన అహంకారానికి , మూర్ఖత్వానికి కోమల
మంటల్లో ఆహుతి అయి పోయింది . ఆ అమాయకురాలికి న్యాయం జరగాలి . ఆమె ఆత్మ  శాంతించాలి . నువ్వు విద్యాధరివి . కోమలవు కావు
! సాధిస్తావ్ !”
విద్యా అతిశయించిన భక్తిభావం తో ఆమె పాదాలను తాకింది . 
“ చిన్నాన్న తను చేసిన తప్పు ఒప్పుకొని చట్టానికి లొంగిపోతే  శిక్ష తగ్గిపోతుంది .
నాన్నమ్మా ! “ రాహుల్ ఓదార్పుగా అన్నాడు . 
మనవడిని చూసి ముసలావిడ నవ్వింది . 
“ నన్ను ఓదార్చాలని చూస్తున్నావురా ?’’’ కంగారుపడకు . !  నాకేం కాదు . అయినా మీ చిన్నాన్న విషయం లో
బాధపడి చేసేదేమీ 
 లేదు . వాడిది పూర్తిగా వారి తాతగారి
పోలిక . అదే అహంకారం – అదే మొండితనం . వాడిది స్వయంకృతాపరాధం . అనుభవించక తప్పదు .
అయినా – ఓ గొప్ప క్షత్రియ కుటుంబానికి కోడలిగా వచ్చిన దాన్ని కొడుకు చేసిన తప్పును
ఎలా సమర్దిస్తాననుకున్నావ్ ?  వాడు చేసిన
దానికి పశ్చాత్తాప పడితే కొంతవరకు పాపం తగ్గించుకోగలడు . శిక్ష మాత్రం
తప్పించుకోలేడు . అలా కోరుకోవటం పాపాన్ని పెంచుకోవటమే .”
జారిన మేలిముసుగు సవరించుకుంటూ ఆమె మౌనంగా ఉంది పోయింది . చివరకు విద్యా కూడా
ఆమెను కదిలించే సాహసం చేయలేడు . 
విద్యాదరి భర్త నుండి అ నుకూల పవనం . రాహుల్ ప్రవర్తనలో తన పట్ల ప్రేమ ,
సానుభూతి అత్తగారి ఆదరణ రూపాదేవిని స్థిమితపరచాయి . మనసు కొంత తేలికైంది . 
ఇంటికి రాగానే అజయ్ అఘోరి ఆగమనం, అతడి సూచన ప్రకారం తను
కోమలాదేవి స్మారక మందిరం నిర్మించాలనుకోవటం చెప్పగానే ఆమెకు పూర్తి స్వస్థత
ఏర్పడింది . భర్త పట్ల విముఖత్వం కొంత తగ్గింది . అతడిలో మార్పుకు ఈ నిర్ణయం
సంకేతంలా అనిపించింది . మారుమాట్లాడకుండా సంతోషం గా ఒప్పుకుంది . 
అజయ్ కు జీవితం లో ఇంతకు  మించిన మంచి
రోజు ఉండదేమో  !  అతడిలో ఉత్సాహం పాలపొంగులా ఎగసింది అందరి
నోళ్ళు మూయించేలా , రాజకీయ ప్రత్యర్థుల ఆట కట్టించేలా , తనపై మూగిన అనుమానపు
నీలినీడలు చెదిరిపోయేలా శంఖుస్థాపన మహోత్సవం జరిపించాలనుకున్నాడు . అదే అతడు చేసిన
తప్పు . అంత ఆర్భాటం, హడావిడి ఎంత తీవ్ర పరిణామానికి దారి తీస్తుందో
ఊహించలేకపోయాడు . 
ముఖ్యంగా అతడి రాజకీయ ప్రత్యర్థులు  ఈ
హంగు, ఆర్భాటానికి
వింత,
వింత రంగులద్దా రు . తన తప్పును కప్పి పుచ్చుకోవటానికి ఇదో ఖరీదైన ముసుగు అని వారి
వాదన .  గ్రామంలో , పరగణాలో  కొన్ని   చోట్ల
సమావేశాలు ఏర్పాట్లు చేసి మరీ ఊదరగొట్టారు . గ్రామ స్థాయి నుండీ, రాష్ట్ర స్థాయి
వరకు  అజయ్ వర్గానికి , అతడి రాజకేయ
పార్టీకి హోరు,
హోరున ప్రచారం జరిగింది . సహగమనం అన్న అంశం చాల సున్నితమైంది . పైగా, ప్రజల మనోభావాలతో
ముడిపడిన అంశం గనుక అజయ్ పై బురద చల్లి రాజకీయ లబ్ది పొందాలనుకున్నారు . తరతరాల
సంప్రదాయం , సాంఘిక దురాచారం ---సహగమనం రెండు వైపులా పదును ఉన్న 
కత్తిలాంటిది . ఎలాగైనా తమ అవసరాలకు తగినట్లు ఉపయోగించు కోవచ్చు . ఆశించిన
ఫలితం పొందవచ్చు . 
రాజకీయ వేదిక    పై  నుండి 
పత్రికా ప్రపంచం లోకి తారాజువ్వలా ఎగసిన ఈ వివాదం, సంగటన అన్ని వర్గాల
వారిని ఆకర్షించింది . మేధావులు , మనస్తత్వ నిపుణులు , చరిత్ర కారులు , సామాజిక
విశ్లేషకులు , మహిళా జాగృతి సంఘాల సభ్యులు , ప్రెస్ రిపోర్టర్లు – ఇలా ఎందరో !
ఓ మారుమూల గ్రామం లో ఓ స్మారక మందిరానికి సంబంధించిన శంకుస్థాపన 
దేశ స్థాయి లో సంచలనం సృష్టించటానికి కారణం కోమలాదేవి పునర్జన్మ . ఆమె సహగమనం
వెనుక మిస్టరీ,
జస్వంత్ విలక్షణమైన ఆర్టికల్ .
******************************
                    కొనసాగించండి 41లో