The shadow is true - 40 in Telugu Fiction Stories by LRKS.Srinivasa Rao books and stories PDF | నీడ నిజం - 40

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

నీడ నిజం - 40

“ నేను పూర్తి స్పృహలో ఉండే మాట్లాడుతున్నాను . ...దయచేసి నన్ను ఆపొద్దు . , రాహుల్! విద్యాధరి స్వరం లో చిరాకు, చిరుకోపం, అభ్యర్ధన పోటీపడుతున్నాయి . రాహుల్ నిస్సహాయంగా చూశాడు .

“ మీ చిన్నాన్న రహస్యం తెలిస్తే నాన్నమ్మకు ఏదో అవుతుందని కదూ నీ భయం ? ..మరి, తెలియకుండా ఎన్నాళ్ళు దాచి పెడతావ్ ? మీ పిన్ని నన్ను చూడలేదు . ... చూసుంటే ? ఎంత గొడవ జరిగేది ?”

రాహుల్ చూపుల్లో మళ్ళీ అదే నిస్సహాయత . “ .... ఎప్పటికైనా నిజం ఆమెకు తెలియాలి . మనం ఆపినా ఆగదు. దాచినా దగదు . ఒక్కసారిగా తెలిసి ఆమె కృం కృం గిపోవటం కంటే ముందుగానే ఆ పరిస్థితికి ఆమెను సిద్ధం చేయటం మంచిది కదా ?””

రాహుల్ కాదనలేక పోయాడు . కానీ, ముందుగా భరత్ రామ్ అనుమతి తీసుకోవాలని అతడి అభిప్రాయం . అందుకు విద్యాధరి ఒప్పుకుంది . తనే ఫోను లో భరత్ రామ్ తో మాటలాడింది . మొదట తను కాదన్నా ఆమె మాట్లాడిన తీరుకు , చూపిన కారణాలకు ఒప్పుకోవలసి వచ్చింది .

“ విద్యా ! నాకు తెలీకుండా ఏదో జరుగుతోంది . నాకు చెప్పకుండా ఏదో దాస్తున్నారు . రుపాదేవికి నీ పునర్జన్మ వివరాలు చెప్పవద్దని రాహుల్ ఆంక్ష పెట్టాడు . ఎప్పుడూ లేంది, ఏ కారణం చెప్పకుండా రూపా నా ఒళ్ళో పడుకొని ఏడ్చింది . ...ఎంతో బాధ ఉంటేనే గాని రూపా ఏడవదు . నా వయసు చూసి భయపడకండి . ఈ గుండె ఎప్పుడో బండబారింది . ఏం చెప్పినా నేను బెదరను . నాకేం కాదు . మీరు చెప్పి తీరాలి . ”! ఆమె స్వరం లో అధికారం, దర్పం .

విద్యా రాహుల్ ను చూసింది . తలవంచాడు . ఆచి, తూచి మాట్లాడుతూ , ముసలావిడ భావోద్వేగం గమనించుతూ, ఎంతో అనునయంగా , జాగ్రత్తగా ఆనాటి సంఘటన వివరించింది . తనలో అశాంతితో , ప్రతీకారం తో తల్లడిల్లిపోతున్న కోమలను ప్రత్యక్షంగా ఆమె కళ్ళ ముందు నిలిపింది . తన లక్ష్యం తెలిపింది .

ముసలావిడ అన్నీ మౌనం గా విన్నది . గదిలో ఘనీభవించిన నిశ్శబ్దం . రాహుల్ ,

అతడి భార్య ఊపిరి బిగపట్టి చూస్తున్నారు . విద్యా పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది . రాయిలా బిగుసుకున్న ఆ వృద్దురాలిలో చలనం ఎప్పుడు, ఎలా కలుగుతుంది ?!

ముసలావిడ తలెత్తి చూసింది . ఆ చూపుల్లో భావాలు , అలజడి ఊహకు ఏమాత్రం అందవు . ఆమె విద్యాని దగ్గరకు తీసుకొని ఆర్తిగా తనలో పొదువుకుంది . కళ్ళు జలపాతం లా వర్షిస్తున్నాయి . పండుటాకు లాంటి ఆమె దేహం ఎంతగా కంపిస్తుందో విద్యాకు స్పష్టం గా తెలుస్తోంది

ఆమె తేరుకుంది . సర్దుకుని కూర్చుంది . మనవడిని దగ్గరకు రమ్మని సైగ చేసింది . రాహుల్ వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు . మనవడి కుడిచెయ్యి విద్యా చేతి లో పెట్టింది . విద్యాకు ఆమె ఆంతర్యం అర్థం కాలేదు .

“ విద్యా ! ఆమె మాటలు స్థిరంగా ఉన్నాయి . తొట్రుపాటు లేదు . అంత షాక్ నుండి నిమిషాల వ్యవధిలో తేరుకోవటం సామాన్యమైన విషయం కాదు . “ రాహుల్ నీ వెంటే నీడలా ఉంటాడు . అజయ్ ను ధైర్యం గా ఎదిరించు .లోకం ముందు అపరాధిలా నిలబెట్టు ! సంప్రదాయం అడ్డుపెట్టుకొని వాడు ఓ నిండు ప్రాణాన్ని బాలి తీసుకున్నాడు . తన అహంకారానికి , మూర్ఖత్వానికి కోమల మంటల్లో ఆహుతి అయి పోయింది . ఆ అమాయకురాలికి న్యాయం జరగాలి . ఆమె ఆత్మ శాంతించాలి . నువ్వు విద్యాధరివి . కోమలవు కావు ! సాధిస్తావ్ !”

విద్యా అతిశయించిన భక్తిభావం తో ఆమె పాదాలను తాకింది .

“ చిన్నాన్న తను చేసిన తప్పు ఒప్పుకొని చట్టానికి లొంగిపోతే శిక్ష తగ్గిపోతుంది .

నాన్నమ్మా ! “ రాహుల్ ఓదార్పుగా అన్నాడు .

మనవడిని చూసి ముసలావిడ నవ్వింది .

“ నన్ను ఓదార్చాలని చూస్తున్నావురా ?’’’ కంగారుపడకు . ! నాకేం కాదు . అయినా మీ చిన్నాన్న విషయం లో బాధపడి చేసేదేమీ

లేదు . వాడిది పూర్తిగా వారి తాతగారి పోలిక . అదే అహంకారం – అదే మొండితనం . వాడిది స్వయంకృతాపరాధం . అనుభవించక తప్పదు . అయినా – ఓ గొప్ప క్షత్రియ కుటుంబానికి కోడలిగా వచ్చిన దాన్ని కొడుకు చేసిన తప్పును ఎలా సమర్దిస్తాననుకున్నావ్ ? వాడు చేసిన దానికి పశ్చాత్తాప పడితే కొంతవరకు పాపం తగ్గించుకోగలడు . శిక్ష మాత్రం తప్పించుకోలేడు . అలా కోరుకోవటం పాపాన్ని పెంచుకోవటమే .”

జారిన మేలిముసుగు సవరించుకుంటూ ఆమె మౌనంగా ఉంది పోయింది . చివరకు విద్యా కూడా ఆమెను కదిలించే సాహసం చేయలేడు .

విద్యాదరి భర్త నుండి అ నుకూల పవనం . రాహుల్ ప్రవర్తనలో తన పట్ల ప్రేమ , సానుభూతి అత్తగారి ఆదరణ రూపాదేవిని స్థిమితపరచాయి . మనసు కొంత తేలికైంది .

ఇంటికి రాగానే అజయ్ అఘోరి ఆగమనం, అతడి సూచన ప్రకారం తను కోమలాదేవి స్మారక మందిరం నిర్మించాలనుకోవటం చెప్పగానే ఆమెకు పూర్తి స్వస్థత ఏర్పడింది . భర్త పట్ల విముఖత్వం కొంత తగ్గింది . అతడిలో మార్పుకు ఈ నిర్ణయం సంకేతంలా అనిపించింది . మారుమాట్లాడకుండా సంతోషం గా ఒప్పుకుంది .

అజయ్ కు జీవితం లో ఇంతకు మించిన మంచి రోజు ఉండదేమో ! అతడిలో ఉత్సాహం పాలపొంగులా ఎగసింది అందరి నోళ్ళు మూయించేలా , రాజకీయ ప్రత్యర్థుల ఆట కట్టించేలా , తనపై మూగిన అనుమానపు నీలినీడలు చెదిరిపోయేలా శంఖుస్థాపన మహోత్సవం జరిపించాలనుకున్నాడు . అదే అతడు చేసిన తప్పు . అంత ఆర్భాటం, హడావిడి ఎంత తీవ్ర పరిణామానికి దారి తీస్తుందో ఊహించలేకపోయాడు .

ముఖ్యంగా అతడి రాజకీయ ప్రత్యర్థులు ఈ హంగు, ఆర్భాటానికి వింత, వింత రంగులద్దా రు . తన తప్పును కప్పి పుచ్చుకోవటానికి ఇదో ఖరీదైన ముసుగు అని వారి వాదన . గ్రామంలో , పరగణాలో కొన్ని చోట్ల సమావేశాలు ఏర్పాట్లు చేసి మరీ ఊదరగొట్టారు . గ్రామ స్థాయి నుండీ, రాష్ట్ర స్థాయి వరకు అజయ్ వర్గానికి , అతడి రాజకేయ పార్టీకి హోరు, హోరున ప్రచారం జరిగింది . సహగమనం అన్న అంశం చాల సున్నితమైంది . పైగా, ప్రజల మనోభావాలతో ముడిపడిన అంశం గనుక అజయ్ పై బురద చల్లి రాజకీయ లబ్ది పొందాలనుకున్నారు . తరతరాల సంప్రదాయం , సాంఘిక దురాచారం ---సహగమనం రెండు వైపులా పదును ఉన్న

కత్తిలాంటిది . ఎలాగైనా తమ అవసరాలకు తగినట్లు ఉపయోగించు కోవచ్చు . ఆశించిన ఫలితం పొందవచ్చు .

రాజకీయ వేదిక పై నుండి పత్రికా ప్రపంచం లోకి తారాజువ్వలా ఎగసిన ఈ వివాదం, సంగటన అన్ని వర్గాల వారిని ఆకర్షించింది . మేధావులు , మనస్తత్వ నిపుణులు , చరిత్ర కారులు , సామాజిక విశ్లేషకులు , మహిళా జాగృతి సంఘాల సభ్యులు , ప్రెస్ రిపోర్టర్లు – ఇలా ఎందరో !

ఓ మారుమూల గ్రామం లో ఓ స్మారక మందిరానికి సంబంధించిన శంకుస్థాపన

దేశ స్థాయి లో సంచలనం సృష్టించటానికి కారణం కోమలాదేవి పునర్జన్మ . ఆమె సహగమనం వెనుక మిస్టరీ, జస్వంత్ విలక్షణమైన ఆర్టికల్ .

******************************

కొనసాగించండి 41లో