The shadow is true - 4 in Telugu Fiction Stories by LRKS.Srinivasa Rao books and stories PDF | నీడ నిజం - 4

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

నీడ నిజం - 4

.‌‌‌‌‌‌‌‌‌‌ఒకసారి సిటీ లో ఉగ్రవాదం పై ఒక సదస్సు జరిగింది. రెండు మతాలకు వేదిక లాంటి ఆ నగరం లో ప్రజల మధ్య సమన్వయం, అవగాహన పెంచే లక్ష్యం తో ఒక ఎన్.జీ.ఓ ఆ సదస్సు నిర్వహించింది . అప్పట్లో విధ్యాదరి ఓ పాపులర్ డైలీ లో ఓకే ప్రత్యెక కాలం నిర్వహించేది . ఆ దిన పత్రిక తరపున సదస్సుకి ఆహ్వానింప బడింది . సదస్సుకు ముఖ్య అతిథి సాగర్. ఆ ఎం.జీ.ఓ మహారాజ పోషకుడు. అ సందర్భం లో విద్యాధరిని చూడడం , మాట్లాడటం జరిగింది .

ఎందఱో ఉగ్రవాదం పై విభిన్న కోణాల్లో మాట్లాడారు . విద్యాధరి కూడా మాట్లాడింది .

అందరితో పోలిస్తే ఆమె భావాల్లో సమస్య పై మరింత స్పష్టత, ఇరు మతాల వారికీ అనుకూలమైన ఆలోచనలు , అభిప్రాయాలూ ఉన్నాయి. ఆమె భావాలూ సదస్సులో చాల మందికి నచ్చాయి . నిజం చెప్పాలంటే ఆమె భావాల కన్నా ఆమె అతడికి బాగా నచ్చింది. ఆ రూపం, సౌష్టవం,చురుకైన చూపులు, మెరుపులాంటి కదలికలు, చెదరని చిరునవ్వు, అభిప్రాయాలు, అవి వ్యక్తం చేసే తీరు—ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో ! తెలివి, తెగువ, అందం, చందం రాశి పోసిన మనోహర రూపం విద్యాధరి అన్న నిర్ణయానికి వచ్చాడు సాగర్ .

సాగర్ ప్రపోజల్ తో ఆశ్చర్య పోయింది విద్యాధరి . ఆమెను ఎలాగైనా పొందాలన్న పట్టుదల తో తల్లిని ఒప్పించి ఆమెతో విద్యాధరి ఇంటికి వచ్చాడు. సాగర్ హంగు, ఆర్భాటం, అంతస్తు చూసి మాధవరావు కంగారు పడిపోయాడు. కానీ-అతడి రూపం ,వినయం, అతడి తల్లి పూర్ణ తిలకం మాట తీరు , మన్నన చూసి స్తిమిత పడ్డాడు . సిరి ఇంటికి వచ్చి తలుపు తట్టింది . లేని పోనీ సందేహాల తో కాదనుకోవటం మూర్ఖత్వం అనిపించింది. కొడుకు మనసు పడ్డ మనువు గనుక పూర్ణ తిలకం కట్న కానుకల విషయం లో పెద్దగా ఆశించలేదు . వారి స్థితిగతులకు అనుకూలం గా నే సర్దుకు పోయింది . మరి మాధవరావుకు తండ్రిగా ఇంత కన్నా ఏమి కావాలి ?

విద్యాధరి సాగర్ల వివాహం పూర్ణ తిలకం సర్వ పర్యవేక్షణ లో వైభవం గా జరిగింది. అత్తగారిల్లు అనే విశాల భవనం లో విద్యాధరి బహూ రాణి హోదాలో అడుగు పెట్టింది బొమ్మరిల్లు లాంటి పుట్టింట్లో ఆకు చాటు పిందేలా పెరిగిన విద్యాదరికి ఆ భవనం మరో లోకం లా, ఉహా ప్రపంచం లా అనిపించింది .

యవ్వనం, కోరికలు పోటీ పడుతుంటే నూతన దంపతులకు రోజులు క్షణాల్లాగడిచి పోయాయి. విద్యాధరి జీవితం లో అ తోలి రోజులు తొలకరి చినుకుల్లా చల్లటి అనుభూతి మిగిల్చాయి.

క్రమంగా రోజులు గడిచే కొద్దీ ఆ ఇంటి వాతావరణం విద్యాధరికి అర్థం కాసాగింది. అ విశాల భవంతి లో నిత్య రాజ్యమేలేది నిశ్శబ్దం. ఎవరి ధోరణి వారిది.

ఎవరి లోకం వారిది. అందరినీ ఏక సూత్రం తో కలిపే బంధం ఆ ఇంటి వారిలో దాదాపు లేదనే చెప్పాలి . అభిమానం, అనురాగం, ఊపిరిగా సందడిగా సాగిన విద్యాధరి జీవితం

ఆ రా చమందిరం లో కళ తప్పింది. జలపాతం లాంటి గమనం ఒక్కసారిగా స్తంభించి పోయింది.

సాగర్ లో కూడా మార్పు స్పష్టం గా కనిపించ సాగింది. అతడిలో అదోలాంటి నిర్లిప్తత , నిర్లక్ష్యం . ఓ ఫిక్స్డ్ రొటీన్ , కమిట్‌మెంట్ అతడికి బొత్తిగా లేవు. తరగని సంపద , మంది-మార్బలం అతడిని క్రియా శూన్యుడిని చేసాయి. పైగా మితిమీరిన మాతృ విధేయత మరో మైనస్ పాయింట్.

సాగర్ని ఎలాగైనా ఓ బాధ్యత కలిగిన వ్యక్తిగా మార్చాలని విద్యాధరి ఆరాటం. ఇందుకోసం అతడి వ్యక్తిత్వం లో పాజిటివ్ సైడ్ పరిశీలించ సాగింది. అతడిలో దయాగుణం ఫాక్టరీ లో పని చేసే రామారావు తండ్రి, కొడుకు నిర్లక్ష్యం తట్టుకోలేక నిస్సహాయం గా ఆత్మహత్య చేసుకున్న సందర్భం లో బయట పడింది. ఆ సంఘటన కు సాగర్ స్పందన ,ఎజ్ద్ హోం నిర్మించాలన్న నిర్ణయం , అతడి కృషి , పట్టుదల విద్యాధరికి అతడిలో మార్పు కదలిక తేవటానికి చక్కటి అవకాశ్జం లా అనిపించింది. తనూ మన;స్ఫూర్తి గా సపోర్ట్ చేసింది. తన వంతు సహకారం పూర్తి స్థాయి లో అందించింది. ఎజ్ద్ హోం నిర్మాణం లో సాగర్ బిజీ కావటం , తల్లి పట్ల కొద్దిపాటి ఉదాసీనత , అందుకు ఆమె కినుక మౌనం ప్రయోగించి తల్లి అతడి ప్రయత్నాలను భగ్నం చేసే చిత్ర మైన వ్యూహం, కొడుకును మాటల నేర్పు తో మార్చి వేసిన చాతుర్యం, ఆమె విజయం, విద్యాధరి ఓటమి – అన్ని సంగటనలు క్రమ పద్ధతిలో జరిగి పోయాయి .

చిన్మయనండుడిది అఘోరి సంప్రదాయం . అతడిని చేరదీసి సాధకుడిగా మలచిన గురువు అఘోరి.

అఘోరి సంప్రదాయం గురించి భిన్న స్వరాలు వినిపిస్తాయి. వీరు నేపాల్ ప్రాంతం వారని

గొప్ప సాధకులని . అనేక విద్యలలో సిద్ధ హస్తులని,అమిత శక్తి మంతులని , జన జీవనం లో కలవారని ఒక వాదం. మరో వాదం వారిని కైవల్యం కోసం తపించే యోగులని వర్ణిస్తుంది .

వారి గురించి ప్రచారం లో ఉన్న కొన్ని విషయాలు కేవలం పుకార్లని కొందరి అభిప్రాయం .వారు శ్మశానాల్లో సంచరించటం ,రుద్రభూమిలో క్షుద్ర పూజలు నిర్వహించటం, పసిపిల్లలిని బలుల కోసం అపహరించటం లాంటివి నిజాలు కావని, ఏవో కొన్ని అమానుష శక్తులు అఘోరీ ముసుగు లో ఇలాంటివి నిర్వహిస్తున్నారని వారి వాదన. అఘోరీల లక్ష్యం లోక కల్యాణం. పిల్లల్ని అపహరించటం నిజమే అయినా అ పని చేసేది బలుల కోసం కాదు. తమ వారసత్వం కొనసాగాలని , మరో అఘోరీ సృష్టింప బడాలని వారి ఆశయం. ( చాల కాలం క్రితం చివుకుల పురుషోత్తం గారి పరిశోధనాత్మక నవల”మూడో పురుషార్థం” లో పై విషయాలు విపులం గా చర్చించబడినాయి.

1980 నాటి ఆంధ్ర ప్రభ సచిత్ర వారపత్రిక లో మూడో పురుషార్థం ధారావాహిక గ వెలువడింది )

ఏదేమైనా అఘోరి చిన్మయానందుడు విలక్షణమైన వ్యక్తీ. గురువు శిక్షణ లో అతడు పూర్ణ పురుషుడైనాడు. ఆయన అభిమతం అనుసరించి లోక పర్యటనకు బయలు దేరాడు. అ పర్యటనలో భాగమే తిరుమలగిరి సందర్శన. విద్యాధరి తండ్రి మాధవరావుకు భవిష్యవాణి వినిపించింది అక్కడే. అఘోరి మాటలు విని మాధవరావు నివ్వెర పోయాడు. అయితే అతడు చెప్పింది కట్టుకధలా అనిపించలేదు. భవిష్యవాణి వినిపించిన అఘోరి అయన నుండి ప్రతిఫలం ఆశించలేదు. అతడి మొహం లో మాధవరావుకు తేజస్సు కనిపించింది. మంద్రస్వరం లో మృదు గంభీరంగా విషయం వివరిస్తుంటే మంత్ర ముగ్ధుడిలా వింటూ ఉండి పోయాడు .కార్యా కారణాలకు అందని భావన అది . ఈ సంగటన జరిగి పదిహేను సంవత్సరాలు దాటింది.

ఈ పదిహేను సంవత్సరాల కాలం లో అఘోరి లో భౌతికంగా పెద్ద మార్పు రాలేదు

గాని అనుభవం, లోకపర్యటన వల్లవ్యక్తిత్వం లో నిండుదనం వచ్చింది. ఎందరికో తన ఉపదేశం తో , వర్తనం తో మార్గదర్శకుడైనాడు.

అఘోరి వేషం, వాలకం, సోషల్ స్టేటస్ సమాజం లో అతడికి పెద్దగ గుర్తింపును ఇవ్వలేక పోయాయి. అతడికి ఆశ్రమం లేదు. శిష్య బృందం లేదు .ప్రచారం లేదు . ఎవరిని ఎప్పుడు కలవాలో , ఎవరిని జాగృతం చేస్తే తన లక్ష్యం , గురువుగారి సంకల్పం బహు ముఖం అవుతుందో తెలుసు. అందుకే ప్రచారాలకు , ప్రపంచ హోరుకు దూరంగా సంచరిస్తాడు. అతడు పూర్ణ విరాగి.

చిన్మయనండుడికి మరొక సారి విద్యాధరిని కలిసే అవసరం వచ్చింది. ఆమెను ఒక మహా ప్రస్థానం దిశగా నడిపించే గురుతర బాధ్యత అతడి పై వుంది. ఈ బాధ్యత అతడి ఆలోచన కాదు .గురువుగారి సంకల్పం.

భర్తతో ఎజ్ద్ హోమ విష్యం లో ఘర్షణ పడిన తర్వాత విద్యాధరి ఆక్రోశం, ఆవేశం చల్లారాయి. మనసు ప్రశాంతం గ ఉన్నప్పుడు సమస్య గురించి పాజిటివ్ గా ఆలోచించింది . తను తొందర పడితే భర్తను విసిగించి ఇబ్బంది పెడితే నష్టం తనకే . తన మీద కోపం తో , విరక్తి తో అమ్మకు మరీ దగ్గర అవుతాడు. భర్త పై అత్తా గారి పట్టు పెరుగు తుంది . తల్లి మాయాజాలం నుండి సాగర్ని దూరం చేయాలంటే ఓపిక కావాలి. తగిన వ్యూహం కావాలి. అదను కోసం డేగ లా కాచుకొని ఉండాలి. ‘ ఈ ఆలోచన తో విద్య మనసు స్తిమిత పడింది. తేలిక పడ్డ మనసు తో గుడికి వెళ్ళింది. ఆ రోజు గుడిలో అంత రద్దీ లేదు. వాతావరణం ప్రశాంతం గా ఉంది. ప్రదక్షిణం , దైవ దర్శనం త్వరగా ముగించుకొని తనకు ఇష్టమైన పొన్న చెట్టు క్రింద కూర్చున్ది. మనసు ప్రశాంతం గా ఉంది.

పక్కనే అలికిడి కావడం తో తల తిప్పి చూసింది. సమీపం లో అఘోరి ! క్షణం కంగారు పడింది. కానీ అతడి చూపుల్లో ప్రసన్నత, వాత్సల్యం విద్యా కంగారును తగ్గించాయి.అతడిని అలాగే చూస్తుంటే పదేళ్ల బాల్యం గుర్తు వచ్చింది. తిరుమల సంగటన మెరుపులా మెదిలింది. పెదవులపై చిరునవ్వు మెరిచింది.

అఘోరికి విషయం అర్థమైంది. ఆమె తనను గుర్తించింది. “ బేటీ! నువ్వు కారణజన్ము రాలవు. నీ పుట్టుకకు ఓక బలమైన కారణముంది. త్వరలోనే నీ వల్ల ఓ అద్భుతం

జరుగుతుంది. ఆ సంఘటన కొందరిని శిక్షిస్తుంది. ఎందరికో మనస్ఫూర్తినిస్తుంది.

ప్రపంచాన్ని విస్మయ పరుస్తుంది.

అఘోరి మాటలు కలవర పరిచాయి. కోపం తెప్పించాయి. ఇలాంటివి విద్య కు నచ్చవు. వీటిల్లో నిజానిజాలు గురించి ఎప్పుడూఆలోచించలేదు. ఏ సందర్భం లో ఎప్పుడూ వాదించలేదు. అలాంటి సిగపట్లతో ప్రయోజనం ఉండదని ఆమె అభిప్రాయం.

“నిన్ను చూస్తుంటే మంచివాడి లాగే కనిపిస్తున్నావు. కొద్దో గొప్పో జ్ఞానం ఉన్నట్లు కనిపిస్తుంది. మరి ఎందుకీ మోసం ? నీ తెలివిని, జ్ఞానాన్ని పదిమంది కోసం ఉపయోగించరాదా ? ... అసలు నీ సమస్య ఏమిటి ? ... ఎందుకు మళ్ళీ కలిశావు ?నా నుండి ఏదైనా ఆశిస్తున్నావా ? అలాంటి ఉద్దేశం ఉంటే అడిగే పద్ధతి ఇది కాదు . “మాటలు సూటిగా , వాడి గా ఉన్నాయి.

***************************************************

కొనసాగించండి 5లో