The shadow is true - 2 in Telugu Fiction Stories by LRKS.Srinivasa Rao books and stories PDF | నీడ నిజం - 2

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

నీడ నిజం - 2

రోజులు గడుస్తున్నాయి . ఓ నాడు ప్రా త: కాలాన ఋషీకేశ్ లో స్నానాదులు ముగించుకుని ధ్యానం లో కూర్చొన్నాడు చిన్మయుడు . మనసు సమాధి స్థితి పొందినప్పుడు అంతఃచేతనం సహస్ర దళ కమలం గా విప్పారిన వేళ అతడిలో మెరుపు లాంటి “ సంకేత”మొకటి తళుకుమంది . ఆ సంకేతం అతడిని వైకుంఠ ఏకాదశి నాడు తిరుమలకు చేర్చింది . పవిత్ర వైకుంఠ ధామం చేరి , శ్రీనివాసుని ధ్యానించి , సాయం సంధ్య లో బంగారు శిఖరాల వైభవాన్ని , విమాన గోపుర పసిడి కాంతులను అవలోకించే చిన్మయానండు డికి గుదేవుడి భవిష్యవాణి తేటతెల్లమైంది. సందేహాలు సూర్యకాంతి సోకినా పొగమంచులా విడిపోయాయి.”కర్తవ్యం “ స్ఫురించింది.

ఆ పవిత్ర క్షేత్రం లోనే అతడు విద్యాధరిని చూడటం తటస్థించింది .విద్యాదరి తండ్రికి భవిష్యవాణి” వివరించింది అక్కడే ! ఆ తిరుమల గిరిలోనే .

అప్పుడు విద్యాధరికి పదేళ్లు. తెలిసీ తెలియని ఊహ. వయసు. చిన్మయానంద ఆ ఆశ్చర్యకరమైన విషయం తండ్రికి వివరిస్తున్నప్పుడు విద్యాధరి కూడా విన్నది . ఆ పసి మొహం లో చిన్మయుడు ఏ భావము స్పష్టం గా చూడలేకపోయాడు .చక్రాల్లాంటి కళ్ళతో ,చిరుమందహాసంతో , లౌకిక తత్వానికి అందని అతిలోక పారవశ్యంతో అతడిని చూస్తుండిపోయింది. జరగబోయే “ మహా ఘటన”కు తను సూత్రధారి అన్న విషయం ఆ పసి మనసుకు తెలీదు . ఎంత అమాయకంగా , ముద్దుగా కనిపించింది . ఇప్పుడెలా ఉందో. "ఆ సాధకుడి లో కుతూహలం .

ఆ సంఘటన జరిగి పదిహేను సంవత్సరాలయింది . ఇప్పుడు విద్యాధరికి వివాహం అయి ఉండొచ్చు . వయసుతో పాటు జ్ఞానం, విజ్ఞానం పెరిగి ఉండొచ్చు . స్థిరమైన భావాలు, స్పష్టమైన దృక్పథం తో ఆమె నిండుగా కనిపించవచ్చు. ఇప్పుడు మరొకసారి

ఆ సాధకుడికి విద్యాధరి కనిపిస్తే – వారి సమావేశం ఎలా ఉంటుంది.ఏ రీతిలో సాగుతుంది? అతడామెకు మళ్ళీ ఆ భవిష్యవాణి వినిపిస్తాడా / అప్పుడు ఆమె స్పందన ఎలా ఉంటుంది ? కుతూహలాన్ని “ కదన కుతూహల స్థాయిలో పలికించగల వింత స్వరమది.

“ అయితే మీ నిర్ణయం మారదన్నమాట. ?” విద్యాధరి భర్త కళ్ళలో సూటిగా చూస్తూ అడిగింది . సాగర్ మాట్లాడలేదు . ఆ చూపులు తప్పించుకోవడం కోసం

తలవంచాడు . “ మీ రెండుకిలా బిహేవ్ చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు . ఎంతో ఉత్సాహం తో ఆ aged హోం పనులు ప్రారంభించారు . మీ సోషల్ కాజ్ గుర్తించి ఎందఱో మీకు సపోర్ట్ గా ముందుకు వచ్చారు . సిటీ లోనే మీ ప్రాజెక్ట్ కు ఉహించని రీతిలో స్పందన కనిపించింది . ఇది సామాన్యమైన విషయమా ? ఈ ప్రాజెక్ట్ కు ఎంత ఖర్చు పెట్టారు ? ఎంతగా శ్రమించారు ? మీలో ఎంత ఉత్సాహం, పట్టుదల కనిపించాయి / అందరూ మిమ్మలిని కలుస్తూ, మీ కృషిని మెచ్చుకుంటుంటే థ్రిల్లింగా లేదూ ? ఈ అనుభవం , తృప్తి మీరెందుకు కాదనుకుంటున్నారు / చెప్పండి జవాబులు చెప్పలేని నిస్సహాయత సాగర్ కళ్ళలో స్పష్టంగా కనిపించింది.

“ మీకు భగవంతుడు సిరిసంపదల్ని ఇచ్చాడు. చీకు, చింత లేని జీవితం మీది. బ్రతుకుదెరువు కోసం రెక్కలు, ముక్కలు చేసుకునే అవస్థ మీకు లేదు . కావలిసినంత ప్రశాంతత , ఆనందం. జీవితం లో అసాధారణ రీతిలో ఏదైనా సాధించడానికి ఇంతకన్నా మంచి అవకాశం ఉంటుందా ? మళ్ళీ సాగర్ కళ్ళలో అదే నిస్సహాయత . “ మీ నాన్నగారి నుంచి మీకు సంక్రమించిన గొప్ప గుణం దయ . ఒకరు బాధపడుతుంటే మీరు చూడలేరు . అందుకు పాజిటివ్ గా స్పందిస్తారు . వారికి సాయం చేయాలని ఆరాట పడిపోతారు . ...రియల్లీ ఇట్ఈజ్ డివైన్ . ఆ గుణమే నాకు నచ్చింది. అందుకే నేనూ మిమ్మలిని సపోర్ట్ చేసింది . ఆ రోజు మన ఫ్యాక్టరీ లో పని చేసే రామారావు నిర్లక్ష్యానికి ఆత్మహత్య చేసుకున్న అతడి తండ్రి శవాన్ని చూసి మీరు ఎంతగా కదిలి పోయారు ? నిస్సహాయం గా చనిపోతూ ఆయన రాసిన చివరి ఉత్తరం చదివి ఎంత రియాక్ట్ అయారు ? రామారావును, అతడి భార్యను మొహం వాచేలా చీవాట్లు నాకింకా గుర్తుంది . ఆక్షణమే ఎజ్డ్ హోం నిర్మించాలని మీరు అందరిలో అనౌన్సు చేయడం నాకు చాల గొప్పగా అనిపించింది . “ ఆమె క్షణం ఆగింది. అతడు అసహనంగా కదిలాడు . మరి...అంత ఎత్తు నుంచి హఠాత్తుగా ఈ పతనం ఏమిటి? ఎందుకు అంత పెద్ద ప్రాజెక్ట్ ఓ వాలంటరీ ఆర్గనైజేషన్ కు వదిలేసి చేతులు కడుగు కొన్నారు. ...ఈ అస్త్ర సన్యాసానికి కారణం తమరి అమ్మగారేనా ?” ఆ మాటల్లో వాడి, వేడి సాగర్ని చురుక్కుమనిపించాయి.

సాగర్ మనసు ఒక్క క్షణం చివుక్కుమంది. ఇదేమిటి? ఇలా అంటోంది "!. ఇలాంటి సమయంలో ఒక్కటే మార్గం. మౌనం.
అర్థం చేసుకునేంత వరకు నిరీక్షణ. కళ్ళుమూసుకుని కూర్చున్నాడు. . " ఇద్దరూ ఆప్తులే. ఇద్దరి వాదం కరెక్టే వాళ్ళ పరిధుల్లో. ఇద్దరికీ తనంటే ప్రేమ.

***************************************************
కొనసాగించండి 3 లో