Tension! in Telugu Motivational Stories by Madhu books and stories PDF | టెన్షన్!

The Author
Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

టెన్షన్!

ఒక సమస్య రాగానే కొందరు,రాత్రంతా నిద్రలేకుండా బాధపడుతూ ఉంటారు.....మారి కొందరు ఆలిచిస్తూ ఉంటారు....చాలా మంది బాధపడుతూ దాన్నే ఆలోచన అనుకుంటారు......

అయితే భాదపడటానికి, ఆలోచించటానికి చాలా తేడా ఉంది...భాద బొంగరం లా అక్కడే తిరుగుతూ ఉంటుంది...ఆలోచన పరిష్కారం వైపు పయనం సాగిస్తూ ఉంటుంది......


ప్రతీ మనీషి లోను నూటొక్క,అంతర్గత భయాలుంటాయని సైకాలజిస్టులు అంటూ ఉంటారు.... అగోర ఫోబియా(విశాలమైన శూన్యాన్ని చూస్తే భయం) నుంచి క్షస్ట్రో ఫోబియా(ఇరుకు ప్రదేశాలను చూస్తే భయం )వరకు,ఇంకా అక్రో ఫోబియా(ఎత్తయిన ప్రదేశాలను చూస్తే భయం)నుండి,ఫాటోలో ఫోబియా(వెలుతురుముందు నించో వాలంటే భయం)వరకు మొత్తం 101 భయాలున్నాయని,సైకియాట్రిస్టులు చెప్తూ ఉంటారు....నిరంతరం టెన్షన్ తో, భయపడే వాళ్ళని,భాదపడే వాళ్ళని ,మనం గమనిస్తూనే ఉంటాం.....కొంతమంది వ్యక్తులలో ఈ టెన్షన్ బయటకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటే, మరి కొంతమంది లోలోపలే ఆ జాడ్యంతో బాధపడుతూ ఉంటారు....మొత్తం మీద ఇవి ఎప్పుడో ఒకప్పుడు బయట పడుతూనే ఉంటాయి....

ఈ టెన్షన్ చుట్టూ అయిదు రకాలయిన స్థాయి పెనవేసుకు వుంటాయి.....
1. కోపం............
2.భయం...........
3. ఆందోళన.....
4.విసుగు..........
5.అనుమానం

పై అయిదు మానసిక స్థాయి భావాలలో ఏదో ఒకటి మీకెప్పుడైనా కలిగిందంటే ఆ సమయంలో మీరు ఏదో ఒక టెన్షన్ తో బాధపడుతున్నారన్న మాట......ఒక పని చేస్తూ ఉండగా ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేస్తే కోపం వస్తూ ఉంటుంది...అంటే ఆ పనిపట్ల సరియైన అవగాహన గాని,మధ్యలో ఆ పని ఆగిపోవడం వలన పూ అన్న అనుమానం వల్లే కోపం వస్తుందన్న మాట....అలాగే భయం కూడా......

ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అన్న టెన్షన్ వల్ల భయం కలుగుతుంది....పరీక్ష పాసు అవ్వమేమో అన్న టెన్షన్ వల్ల ఆందోళన కలుగుతుంది.....మనం ఆందోళన ఉన్నప్పుడు,మనని కదిలించబోతే అది విసుగు ద్వారా ప్రకటితమవుతుంది...... ఈ విధంగా కోపం భయం ఆందోళన విసుగు అనుమానం అనే ఐదు మనిషి యొక్క టెన్షన్ కి పుట్టిన అక్రమ సంతానం అని చెప్పవచ్చు......


1.కోపం......

*ఒక తండ్రి తన పిల్లల్ని చావ బాదుతాడు...
* ఒక భర్త కోపం చూసి భార్య భయంతో వణికిపోతుంది....
*ఒక ఇల్లాలు భర్త మీద కోపంతో అలిగి. పుట్టింటికి వెళ్లిపోతుంది....

ఇలా మనుషుల మధ్య సంబంధాలను పాడు చేసే కీటకం" కోపం" మీరు అలా ఎందుకు చేస్తున్నారు.... అని పై ముగ్గురిని అడిగితే !!! ఆ ముగ్గురు తమ తమ కారణాలు చెప్పవచ్చు.... కానీ ఈ కారణాలు అన్నింటికి మూలం ఒకటే..... సమస్య నుంచి బయట పడలేకపోవటం.... ఇదంతా ఆశ్చర్యంగా ఉండవచ్చు.... కానీ నిజంగా అదే కారణం....


ఒక తండ్రి కొడుకుని పరీక్షలలో మార్కులు సరిగ్గా రాని కారణంగా కొట్టాడు.....అంటే కొడుకు భవిష్యత్తు పాడైపోతుందేమో,,దానివల్ల తనకి టెన్షన్ కలుగుతుందేమో, అన్న భయాన్ని ప్రకటిస్తున్నాడన్నమాట...ఇంత నిక్కచ్చిగా ఈ విషయం నేను ఎలా చెప్పగలుగుతున్నాను.... అంటే ,కొడుకుకి పరీక్షలలో సరిగా మార్కులు రాకపోవటానికి,తండ్రి అతని కొ ట్టడానికి ఏమాత్రం సంబంధం లేదు.... మార్కులు బాగా రావాలంటే తెలివితేటలు మరింత పెంచుకోవాలి.....మరింత కృషి చేయాలి.....జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవాలి.... పాఠాలు సరిగ్గా అర్థం చేసుకోవాలి.....ఈ కారణాలన్నీ కేవలం కొట్టడం వల్ల రావు.... ఇంత చిన్న విషయం అర్థం చేసుకోలేని తండ్రిని ముందుగా చావబాదాలి....


ఇంట్రావర్ట్ ల కోపం మరొక రకంగా ఉంటుంది....ఒక భర్తకి భార్య మీద కోపం వస్తుంది ....తిడతాడు, మరీ కోపిష్టి అయితే చెంప బ్రద్దలు కొడతాడు..... అదే ఇంట్రావర్ట్ అయితే ఇంటికి రాకుండా బయటెక్కడో గడిపి, ఇంటికి ఆలస్యంగా వస్తాడు...వీటన్నిటి వెనక తండ్రి ఉద్దేశం ఒకటే...తనకి "కోపం" వచ్చిందని, తన భార్యకి తెలియజేయాలన్న ప్రయత్నం......దానికోసం ఇంత శ్రమ పడాలా??? అవతలివాళ్లని ఇంత హింసించాలా??? తనకి ఎందుకు కోపం వచ్చిందో???ఏ కారణం వల్ల ఆమె ప్రవర్త న తనకి నచ్చలేదో... చెప్తే సరిపోతుందిగా.....మరి ఎందుకు అతన్ని తాను హింసించుకుంటూ అవతలి వాళ్ళని హింసించడం.....????


కోపం అనేది మానవ సహజమైన ప్రక్రియే,కాదనటం లేదు,కానీ,మనకి కోపం వచ్చినట్లు అవతలి వాళ్లకు తెలియజేస్తే చాలు....హింసాత్మక పడ్డతుల ద్వారా అవతలి వారిని భాడపెడితే మనకొచ్చే లాభం ఏమిటి????


ఒక ఇంటి యజమాని హింసించండి....ఆ ఇంటికి ఒక గెస్ట్ వస్తున్నడుం..భార్యని డిన్నర్ చేయమని పురమాయించాడు... ఇల్లంతా నీటుగా సర్డమని చెప్పి వెళ్ళిపోయాడు.....సాయంత్రం అతను ఇంటికి వచ్చేసరికి తన భార్య చేసింది...కొడుకు సాధ్యమైనంత రీతిలో ఇల్లంతా శుభ్రం చేశాడు....ఆఖరి గా అతను హాలు సర్దుతూ ఉంటే కిటికీలో ఉన్న ఇంక్ సీసా కిందపడింది....వెంటనే యజమాని లేచి కొడుకుని బలంగా కొట్టి తడిగుడ్డతో నేల శుభ్రం చేమన్నాడు....కూర కొద్దిగా రుచి చూసి ,ఉప్పు తక్కువైనందుకు భార్యను చెడామడా తిట్టాడు.....
ఈ లోపులో అతిధి వచ్చాడు... ముఖం నిండా నవ్వు పులుముకుని ఇంటి యజమాని అతడిని ఆహ్వానించాడు..... సేపు అతడిని ఎంటర్టైన్ చేశాడు....భార్య పిల్లలని పరిచయం చేశాడు....అతడు కూడా వంట చాలా బాగుందని మెచ్చుకున్నాడు.....తర్వాత ఆ అతిథి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు.....
అతిథి ముందు అంత బాగా చిరునవ్వు ముసుగు వేసుకున్న యజమాని తనేం కోల్పోయాడో గ్రహించలేకపోయాడు.....


అతడు కోల్పోయింది, తన కొడుకు,తన భార్యతో సంభందాన్ని ......

ముక్కూ మొహం తెలియని ఒక అతిథి అంత చిరునవ్వు ముసుగు వేసుకున్న యజమాని ,భార్య బిడ్డల ముందు ఆ ముసుగు తీసివేసి ఒక రాక్షసుడి ఎందుకు ప్రవర్తించాడు...???జీవితాంతం కలిసి ఉండవలసిన తన కుటుంబ సభ్యులతో ,మరింత హుందాగా,మంచివాడి లాగా ప్రవర్తించ వలసిన అవసరాన్ని అతడు గ్రహించలేకపోయాడా????


ఈ విధంగా తార్కికంగా ఆలోచిస్తే మనిషికి కోపం రాదు......

కోపం ద్వారా మనం ఏమి సాదించలేమని,తెలుసుకున్న మనిషి అనవసరమైన టెన్షన్ లకి లోనుకాడు.....

కోపం రావడం అనేది అత్యంత సహజమైన ప్రక్రియ కాబట్టి,దాన్ని తెలియ బరచడం వల్ల ఆరోగ్యంగానూ, ఆనందంగానూ కూడా ఉండవచ్చు....ముందు చెప్పినట్లు మనకి కోసం రావడం వేరు,మనకు కోపం వచ్చినట్లు అవతలి వాళ్ళకి తెలియజేయడం వేరు.....

కొంతమంది వ్యక్తులనీ గమనించి చూడండి....వాళ్ళు మనల్ని తిట్టరు...కొట్టరు కొంచం ముభావంగా ఉన్నా చాలు...విలవిలలాడిపోతాం....ప్రేమ, ఆప్యాయతలతో వాళ్ళు మనల్ని ఆ విధంగా మనల్ని కట్టి పడేస్తారు....

ఆఫీసులలో పనిచేసే వాళ్ళకి ఈ కోపం సంగతి బాగా తెలుస్తుంది....ముఖ్యంగా నౌకర్లు కి..కొంతమంది బాస్ లి అరిచి,తిట్టి ,నౌకర్లు దాన్ని పెద్దగా పట్టించుకోరు.....అదే మరో అధికారి ఏ మాత్రం కొప్పడినా, క్రిండవాళ్లు గజగజ వణికి పోతారు..... అంటే తన స్వభావం ఏమిటో ???ఎలాంటిదో ...తన గత ప్రవర్త ద్వారా కింది వాళ్ళకి అధికారి తెలియజేస్తూ ఉంటాడన్నమాట.... ఎంతో కోపం వస్తే తప్ప ఆయన మాట అనడు ..అని ఒక వ్యక్తి తనపై అధికారి గురించి అన్నాడంటే ...ఆపై అధికారి తన కోపాన్ని కూడా చాలా పొదుపుగా వాడుకుంటున్నాడు అన్నమాట ...ఇలా పొదుపుగా కోపాన్ని వాడుకోకపోతే, మనం ఒక స్టేజి వచ్చేసరికి ,ఆవేశంతో చిందులు తొక్కిన కూడా ,క్రింది వాడికి చీమకుట్టినట్లయినా ఉండదు. ఎంత నవ్వు వచ్చే పరిస్థితి ఇది....

ఫీలింగ్స్ ని కప్పి పెట్టి ఉంచడం వల్ల అనారోగ్యాలు, గుండె జబ్బులు రావచ్చు.... మన ఎమోషన్స్ నీ బయటకు కక్కేయడం వల్ల ఎన్నో టెన్షన్లని, బాధలని దూరం చేసుకుని ,అందరితోనూ అర్థవంతమైన బంధాలని పెంపొందించుకోవచ్చు... అయితే ఎమోషన్స్ ని బయటకు వెలిబుచ్చడం వేరు, కోపం వచ్చినప్పుడు కొట్టడం _ చేతికి అందిన వస్తువులని విసిరేయడం వేరు....

మరి కొంతమంది నిశ్శబ్దంగా ఉండి ఎదుటి వాళ్ళని సాధిద్దాం అనుకుంటారు .....తమకి కోపం వచ్చిందని అవతల వాళ్ళకి తెలియజేయడం కోసం వీళ్ళు పడే అవస్థ చాలా హాస్యాస్పదంగా ఉంటుంది.....భోజనం చేయకపోవడం, అవతలి వాళ్లే తనని దగ్గరికి తీసుకొని ఓదార్చే వరకు మాట్లాడకుండా ఉండిపోవడం ,మొదలైనవన్నీ దీనికి ఉదాహరణలుగా పేర్కొనవచ్చు.... మగవాళ్ళ కోపం, ఆడవాళ్ళ కోపం ,వేరువేరు కోణాలలో పయనిస్తాయి... కోపం వచ్చినప్పుడు మగవాడు ఎదురు తిరిగి ప్రతీకారం తీర్చుకుంటే, అతడి రక్తపు పోటు నార్మల్గా వస్తుందట..... అదే ఆడవాళ్ళు అయితే ఎదుటి వాళ్ళ కోపం పెరిగే కొద్దీ వీళ్ళ రక్తపోటు ఎక్కువయ్యి అవతలి వాళ్ళు కామ్ గా అయిపోయాక తగ్గిపోతుందట......


కోపాన్ని తగ్గించడానికి చాలా పురాతనమైన పద్ధతి ఒకటి ఉంది ....ఒకటి నుంచి పది అంకెల వరకు లెక్కపెడుతూ ఉండడం


భార్య భర్తలలో ఈ కీచులాటలు, పోట్లాటలు తప్పవు..... చిన్న చిన్న విషయాలలో సర్దుకుపోవడం, కాస్తంత ముఖ్యమైన విషయాలు అయితే చర్చించుకొని రాజకీ రావడం, నేర్చుకుంటే చాలా ఉత్తమం.... అంతే తప్ప అవతలి వారి మీద మనకు అధికారం ఉన్నది కదా అని, కోపాన్ని ప్రదర్శిస్తే !అది మనల్ని ఒక్కోసారి సిగ్గుతో తలవంచుకునేలా చేస్తాయి.... ఒక్కో సందర్భంలో అవతలి వారిది ఏ తప్పు ఉండదు... కానీ వారి చర్య మనకి కోపం తెప్పిస్తుంది.... అవతలి వారు చేయాలని చేసింది కాదు ....ఆ తప్పు అటువంటి సమయాల్లో కోపం వచ్చినప్పుడు, అది తగ్గడానికి ఏ ప్రయత్నమూ చేయకపోవడం మంచిది.... అది అలా పెరిగి పెరిగి దానంతటదే అవిరైపోతుంది.... ఆ తర్వాత అది ఇంత సిల్లీ విషయము అని మనకి నవ్వు తెప్పిస్తుంది...


యోగ ప్రాక్టీస్ చేసేవాళ్లు, వేదాంతులు, ఈ విధంగానే కోపాన్ని, చిరాకుని జయించే టెక్నిక్స్ నేర్చుకుంటారు.... నిశ్శబ్దం కోపాన్ని బాగా తగ్గిస్తుంది.... కోపం అగ్ని అయితే నవ్వు నీరు..... హ్యూమర్ తెరఫీలో అదే నేర్పుతారు.... బాగా కోపం వచ్చినప్పుడు ఏదైనా జోక్ ని తలుచుకోవటము, చదువుకోవటము, చేయాలి.... అప్పుడు ఆటోమేటిక్గా కోపం చల్లబడుతుంది... మనకి ఏ విషయంలో అయితే కోపం వచ్చిం,దో ఆ విషయం అవతలి వాళ్లకు తెలియజేయడం, ఉత్తమమైన పద్ధతి... ఈ కోపం రెండు రకాలు... మన స్నేహితులు, మనం ప్రేమించిన వాళ్లు ,దగ్గర వాళ్లు, వీళ్ళ మీద వచ్చే కోపం ఒకలాంటిదైతే ,,,అపరిచితుల లేదా కొత్త స్నేహితుల ప్రవర్తన మనకి నచ్చకపోతే, వాళ్ల మీద వచ్చే కోపం మరో రకమైనది ....మొదటిది తాత్కాలిక అయిష్టాన్ని, రెండవది శాశ్వత శత్రుత్వాన్ని సృష్టిస్తుంది.... సాధారణంగా ఒక వ్యక్తికి, మరొక వ్యక్తి కొత్తగా పరిచయమయ్యాడనుకోండి, వారిద్దరికీ కొన్ని విషయాలలో కామన్ ఇంటరెస్ట్ ఉంది అనుకోండి ....ఇద్దరు స్నేహితులయ్యారు... ఆ తర్వాత ఒకరిలోని లోపాలు ఒకరికి తెలిసాయి... అప్పుడు అవతలి వాళ్ళ చిన్న ప్రవర్తనలు కూడా వారికి కోపాన్ని తెప్పిస్తూ ఉంటుంది... కానీ మనసులో దాచుకుంటూ ఉంటారు... అలా నాలుగు ,ఐదు సంఘటనలు అయ్యాక ,ఒకరోజు చిన్న కారణం వల్ల మాట మీద మాట పెరిగి, ఇద్దరూ విడిపోతారు... ఎప్పటినుంచో మనసులో ఉన్నదంతా వెలిగ్రక్కుతారు.... ఫలానా అప్పుడు నువ్వు ఇలా చేశావు, అలా చేసావు ,అని గతం అంతా తవ్వి తీస్తారు... ఆ తరువాత ఇక మొహమొహాలు చూసుకోరు... పేరు చెప్తే కోపంతో మండిపడతారు ....ఈ కోపానికి, భార్యాభర్తల మధ్య కోపానికి ,లేక తండ్రి కొడుకుల మధ్య కోపానికి తేడా ఉంది.... ఇక్కడ విడిపోయే అవకాశం లేదు ..... అదీ తేడా.....


ఏది ఏమైనా ఈ కోపాలన్నీ విషాదానికి దారి తీసేవే....మనసులో దాచుకోవడం వల్ల అవి లోనోపలలే, లావాలా ఉడుకుతూ చివరికి బ్లాస్ట్ అవుతాయి.... అవతలి వారి ప్రవర్తన మనకి నచ్చకపోతే ,దానికి ఇంత ప్రాసెస్ అనవసరం.... స్నేహితుల్లాగానే విడిపోవచ్చు.... ఒకటి మాత్రం నిజం కోపం మనకి ఒక అసహ్యకరమైన అనుభవాన్ని మాత్రమే మిగులుస్తుంది ....ఎదుటి వ్యక్తితో బాంధవ్యం తెగగొట్టుకోవడానికి, కోపం, తిట్టుకోవడం పాత తప్పుల్ని ఎత్తిచూపడం, లాంటి హీనమైన పద్ధతుల్ని అవలంబించడం, చాలా హాస్యాస్పదం.....


ఇదిగో ఫలానా విషయంలో నాకు కోపం వచ్చింది.... దీని గురించి నువ్వేం చెప్పదలుచుకున్నావో చెప్పు.... అని అడగటం అన్నిటికన్నా ఉత్తమమైన మార్గం... అవతలి వారు చెప్పింది నచ్చకపో,,
తే వదిలేయడం మంచిది. మాట్లాడటం వల్ల కోపం ఎక్కువ అవ్వచ్చేమో ,గాని వినడం వలన చాలా సమస్యలు పరిష్కరింపబడతాయి....


రెండోది మొదటి దానికన్నా ఉత్తమమైనది... అంతేగాక వింటున్నప్పుడు మామూలుగా ఉన్న రక్తపు పోటు ,మాట్లాడడం మొదలుపెట్టగానే అధికమవుతుందని శాస్త్రీయంగా నిరూపించబడింది...... అందుకనే ఆరోగ్య దృష్ట్యా కూడా మాట్లాడటం కంటే ,వినడమే మంచిది.... మనం తక్కువగా మాట్లాడి, ఎక్కువగా వినడం వల్ల ఎదుటి వ్యక్తిని అతని మనస్తత్వాన్ని అంచనా వేసుకోవచ్చు.... అదే విషయమై మరింతగా మానవ సంబంధాలు. అన్న అధ్యాయంలో వివరిస్తాను ......అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఒకటి గమనించండి....


కోపం వేరు ,శత్రుత్వం వేరు ,మీరు ఎవరిమీదైతే కోప్పడుచున్నారో ,వారంతా మిమ్మల్ని అభిమానించే వారే ,,,నీ కోపాన్ని సహిస్తున్న వారే.... అదేగాని వారు మీ శత్రువులు అయితే,, మీ కోపాన్ని సహించరు తిరగబడతారు .అంటే వారికి మీ పట్ల ఉన్న ప్రేమని మీరు క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు...... అన్నమాట కోల్పోయేది మీరే తప్ప, వారు కాదు.... అందుకనే కోపగించుకోకండి ....అవతలి వారిది తప్పని తెలిస్తే అది మీకు నష్టాన్ని కలిగిస్తే, ఇక తప్పునిసరి అనిపిస్తే ,కోపానికి కేవలం ప్రదర్శించండి.....



కోపాన్ని తగ్గించుకోవడానికి ఒక చిన్న చిట్కా చెప్పి ఈ అధ్యయనాన్ని ముగిస్తాను.... కోపానికి బద్ధ శత్రువు ఓర్పు.... ఓర్పుకి ప్రతీక సాలిపురుగు.... కోపం వచ్చినప్పుడు సాలి పురుగుని గుర్తు చేసుకోండి......
గదిలో ఒకమూల
నిశ్శబ్దంగా_ఓర్పుగా_ఒంటరిగా
అది గూడు కట్టుకుంటుంది....
ఎవరినీ సాయం అడగకుండా
ఎవరినీ బాడించకుందా
తననుంచి తాను విడివడుతూ
తనని తాను త్యాగం చేసుకుంటూ
పోగు తర్వాత పోగు
గొప్ప ఏకాగ్రతతో ఒక శిల్పి చెక్కినట్టు
గొప్ప నైపుణ్యంతో ఒక డాక్టరు నరాల్ని ముళ్ళు వేసినట్టు
తన సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటుంది
ఒక హడావిడి ఉదయాన్నే
నిశ్శబ్ద సాయంత్ర సమయానో
గోడ మీంచి పెద్ద శబ్దంతో వచ్చిన చీపిరి కట్ట ఒక్క వేటుతో
దాని శ్రమనంత సమూలంగా
తుడిచి పెట్టేస్తుంది
సర్వనాశనమైన సామ్రాజ్యంలోంచి సాలెపురుగు అనాధలా నేల మీద పడుతుంది.
ఎవర్ని కుట్టదు
ఎవరిమీద కోపం ప్రదర్శించదు
మళ్లీ తన మనుగడ కోసం
కొత్త వంతెన నిర్మించుకోవడానికి
సహనం పోగుల్ని
నమ్మకం గోడమీద తిరిగి స్రవిస్తుంది
ఎలా బ్రతకాలో
మనిషికి పాఠం చెబుతుంది..








🌹🌹🌹 దన్యవాదములు🌹🌹🌹