Five steps to success in Telugu Motivational Stories by Madhu books and stories PDF | విజయానికి ఐదు మెట్లు....

The Author
Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

విజయానికి ఐదు మెట్లు....

1.మొదటి బాగం........
అధ్యాయం:-1

......గెలుపుకి పునాది ఓటమి.....
*****************************

1.... జీవితం ఒక యుద్ధం

జీవితం అంటే గొప్ప గొప్ప త్యాగాలు,భాద్యతలు కాదు,చిన్న చిన్న ఆనందాలూ,కాస్త దయా నిరంతరం చిరునవ్వు....అదీ జీవితం అన్నారు ఒక వేదాంతి...... నిజమే అదే జీవితం కానీ, ప్రస్తుత పరిస్థితులలో అది సాధ్యమా???
నేటి రోజుల్లో మనిషి జీవితం రోజురోజుకీ,ఒక యుద్దంలా మారుతోంది.....
ఇందులో ప్రత్యర్థి అంటూ ఎవరూ ఉండకపోవచ్చు.. పరిస్థితులు, కావచ్చు,ఆకస్మిక విపత్తులు, కావచ్చు,..... ఏదైనా నిరంతరం యుద్ధం చేయవలసినపరిస్థితి మాత్రం,అనివార్యంగా ఉంటుంది........

యుద్ధం ఎందుకు చేయాలి....

యుద్దాలు కేవలం స్వార్థం కోసమే రావు,మనుగడ కోసం కూడా మనం యుద్ధం చేయక తప్పదు,నేను యుద్ధం చేయను,అని కూర్చుంటే శత్రువు మనల్ని
ఆక్రమించేస్తాడు.... ఉదాహణకు,ఒక ఆఫీసులో పని చేసే గుమాస్తాకి, ప్రమోషన్ కోసం,అదే పదవి కోసం,పోటీ పడుతూ ఉన్న మరో వ్యక్తితో,యుద్ధం చేయవలసి రావచ్చు....పెన్షన్ కోసం ఒక వృద్దుడు,ప్రభుత్వంతో పోరాడవలసి రావచ్చు.... అంత వరకూ ఎందుకు స్కూల్లో అప్పుడే చేరిన ఐదు ఏళ్ల కుర్రవాడు,ఆ కొత్త పరిస్థితులలో తాను ఇమడడం కోసం,తనకు తెియకుండానే యుద్ధం చేస్తాడు.....
ఈ విధంగా యుద్ధం అనేది, మనీషి పుట్టినప్పటి నుండి మనీషి జీవితంలో ఒక భాగం అయిపోయింది...ఈ యుద్ధంలో కత్తులు, కఠార్లు, ఆయుధాలు ఏమీ ఉండవు....
తమ జీవితాల్లో అత్యున్నత స్థాయికి చేరుకున్న వారందరూ నిరంతరం యుద్ధం చేసి గెలుస్తూ వచ్చినవాళ్లే..... యుద్ధం ఎక్కడైతే ఆగిపోతుందో ,అక్కడ జీవితంలో నిరాసక్తత ప్రారంభమవుతుంది...m మనం ఒక్కొక్కసారి ఓడిపోవచ్చు.... మానసికంగా మన మరణం కూడా సంభవించి, ఉండవచ్చు ....కానీ అక్కడి నుండి తిరిగి జీవితాన్ని ప్రారంభించి, మనం విజయం సాధించాలి ....అలా సాధించిన వాళ్లే గొప్ప వాళ్ళే గొప్ప వాళ్ళు అయ్యారు.....
ఇటువంటి యుద్ధాల యొక్క అంతిమ విజయం చిరునవ్వు అవును చిరునవ్వే ఈ మనిషి అయితే నిరంతరం ఉల్లాసంగా ఉంటాడో ఏ మనిషి అయితే తన యొక్క మానసిక ఉద్విఘ్నతని ఓటమిని కల్లోలాలని నిరంతరం చేస్తూ ఉంటాడు అతని విజేత కాగలడు విషాదంలోనూ సమస్యలను కూడా ఉల్లాసంగా ఉండగలగడం కన్నా గొప్ప గెలుపు మరొకటి లేదు
మనం మన చుట్టూ ఉన్న వ్యక్తులను గమనిస్తూ ఉన్నట్లయితే కొంతమంది ఎప్పుడు ఎందుకు వచ్చింది రా భగవంతుడా అన్నట్టు, ఈసురోమంటూ ఉండడం మరి కొంతమందికి ఉద్యోగ్యతతో సీరియస్ గా ఉండడం మరి కొంతమంది నిరంతరం విషాదంగా ఉండడం గమనిస్తాం. చాలా కొద్ది మంది మాత్రమే తాము నవ్వుతూ అందరినీ నవ్విస్తూ తమకే కష్టాలు లేవన్నట్లు కనబడతారు ఈ కనబడటం అనేది పైకే కాకుండా మనిషి తన మనసులో కూడా ఫీలైనప్పుడు అతడు నిశ్చయంగా విజయం సాధించినట్లే 2000 సంవత్సరాల క్రితం చైనాలో ఒక పుస్తకం కుప్ప సంచలనాన్ని సృష్టించింది ఆ పుస్తకం పేరు ఈ ఆర్ట్ ఆఫ్ వార్ దీన్ని సంట్జ్యూ అనే వధుడు రాశాడు 2000 సంవత్సరముల క్రితానికి ఇప్పటి పరిస్థితులకు ఏ మార్పు లేదు ఆ మాటకొస్తే ఆటాఫ్ వార్ అన్న విషయాన్ని జీవితానికి అనువయించుకున్న ప్రతి వ్యక్తి విజయాన్ని సాధిస్తూనే వచ్చాడు ఈ పుస్తకపు మొట్టమొదటి వాక్యం ఈ విధంగా కొనసాగుతుంది ఒక దేశానికి కానీ ఒక రాష్ట్రానికి గాని ఒక మనిషికి కానీ యుద్ధం అనేది తప్పనిసరి ఇది జీవితానికి మరణానికి సంబంధించినది నిర్మాణానికి వినాశనానికి సంబంధించినది కాబట్టి ఎటువంటి పరిస్థితులలోనూ ఎవరు ఆ యుద్ధం అనేదాన్ని నిర్లక్ష్యపరచడానికి మీరు లేదు ఐదు వాక్యాల్లో ఒక గొప్ప భావాన్ని ఇమిర్చి ఈ రచయిత వ్రాసిన పుస్తకం మనం నిరంతరం మనకి అన్వయించుకోవలసిన గొప్ప గ్రంథం ఈ పుస్తకపు చివరి వాక్యాలు కూడా ఆ విధంగానే సాగుతాయి తన సైన్యాన్ని ముందుకు నడిపిస్తున్న ప్రతి అధికారి గొప్ప తెలివితేటలు కలవాడై ఉండాలి తన సైన్యంలో ఏ వ్యక్తి ఇందులో నిష్ణాతుడు అన్నది గ్రహించి సరైన సమయంలో సరైన విధంగా నడిపించాలి ఈ పుస్తకపు ఆఖరి పేరాగ్రాఫ్ ని మనం మన జీవితానికి కూడా అన్వయించుకోవచ్చు ఈ విషయాన్ని మరింత వివరంగా మన ఆయుధాలు అనే అధ్యాయంలో చర్చిస్తాము మనకి కొన్ని ఆయుధాలు ఉన్నాయి వాటినన్నిటిని సమీకరించుకొని అవసరమైన చోట అవసరమైన విధంగా ఉపయోగించాలి ఒక ప్రమాదాన్ని డబ్బుతో ఎదురుకోవచ్చు ఒక ప్రమాదాన్ని ఎదిరించడానికి మానసిక శక్తి అవసరం మరొక ప్రమాదాన్ని మనకున్న పలుకుబడి వల్ల స్నేహితుల వల్ల అధికమించుకోవచ్చు కొన్నిచోట్ల మంచితనం పనికిరాదు కట్టుగా ప్రవర్తించవలసి రావచ్చు మరికొన్ని చోట్ల మనలో లేని ఘం బిరియాని ప్రదర్శించవలసిన పరిస్థితులు ఏర్పడవచ్చు ఉదాహరణకి ఒక వ్యక్తి మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు తాగి కత్తితో బెదిరించి మన దగ్గర ఉన్న డబ్బు అంతా ఇమ్మంటే అతడికి మనం ఎంత కష్టపడి ఆ డబ్బులు సంపాదించింది ఎంత నిజాయితీగా సంపాదించింది వివరిస్తూ ప్రభుత్వం బుద్ధుడు పుట్టిన నెలలో ఇటువంటి కత్తులు కటార్లు అంటూ వివరించడం మొదలుపెడితే అతడు మన ఉపన్యాసం పూర్తయ్యే లోపల మనల్ని పొడిచి ఆ డబ్బు తీసుకెళ్లిపోతాడు ఆ విధంగా మనలో ఉన్న ఏ ఏ శక్తుల్ని ఏ ఏ పరిస్థితుల్లో సరైన కాంబినేషన్లో ఉపయోగించుకోవాలి అన్న విషయం సుంజు 2000 సంవత్సరాల క్రితమే చెప్పారు ...
నిజమైన యుద్ధానికి కూడా ఈ నేటి వర్తిస్తుంది మన దేశపు గూడచారి విభాగం మరింత అప్రమత్తంగా ఉంటే బాబ్రీ మసీదు కుల్లగొట్టబడి ఉండేది కాదు 30 సంవత్సరాల క్రితం కృష్ణ మీనన్ డిఫెన్స్ మినిస్టర్ గా ఉన్న రోజుల్లో కొంత దురాలోచన ఉండి ఉంటే చైనా టిబెట్ ని ఆక్రమించుకొని ఢిల్లీ వరకు తన సైన్యాన్ని తీసుకువచ్చి ఉండేది కాదు పాకిస్తాన్ కి కాశ్మీర్లో కొంత భాగాన్ని మనం కోల్పోవలసి ఉన్న ఆగత్యం వచ్చేది కాదు ఒక ప్రమాదం రాగానే కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడం మనం చూస్తూ ఉంటాం జీవితంలో ఓటమికి పరాకాష్ట ఆత్మహత్య అనేది నమ్మశక్యం కాని విషయం ఎందుకంటే ఒక మనిషి ఆత్మహత్య చేసుకోవటాన్ని పది నిమిషాలు ఆపు చేయగలిగితే అతడు ఆ ఆలోచన నుండి బయట పడతాడు అని ప్రముఖ మానసిక శాస్త్రవేత్తలు చాలామంది చెప్పారు దీనినే క్షణికమైన ఆవేశం అంటారు యుద్ధంలో క్షణికమైన ఆవేశం ఎప్పుడు పనికిరాదు ఇటువంటి ప్రమాదాల గురించి ఆత్మహత్యల గురించి తర్వాత తెలుసుకుందాం


మన శత్రువు....

ఇక్కడ శత్రువు అంటే కేవలం మనిషే కాదు సమస్య చిరాకు ఇవ్వండి అసంతృప్తి ఇవన్నీ మనకి శత్రువులే వీటితో పోరాడటమే యుద్ధం శత్రువుని గెలవడానికి మారు సూత్రాలని ఇప్పుడు మనం చర్చించాలి
1...ప్రతి మనిషికి శత్రువులు ఉంటారు...
అవును మహాత్మా గాంధీకి, జీసస్ క్రైస్ట్ కి కూడా శత్రువులు ఉన్నారు ...మనకన్నా పెద్ద శత్రువులు ఉన్నారు ...అందువల్లే గాంధీ బుల్లెట్స్ కి బలి అయ్యాడు... జీసస్ క్రైస్ట్ ని సిలువ ఎక్కించారు.... మన శత్రువుల కన్నా బలమైన ,దుర్మార్గమైన వాళ్ళు .... శత్రువులు లేని వాళ్ళు అంటూ ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు... ముందే చెప్పినట్లు ఇది కేవలం వ్యక్తులకు సంబంధించినదే కాదు ...సమస్య కూడా ఒక శత్రువు అనుకుంటే, అది లేని వాళ్ళు కూడా ఈ ప్రపంచంలో ఎవరూ లేరు... ఏమిటి మీ సమస్య? చదవా???చదువుకునే రోజుల్లో మనందరం పెద్ద వాళ్ళని చూసి, వాళ్లలాగా మనందరం అయిపోతే ఎంత బాగున్నో రాత్రిలో నిద్ర మానేసి చదవక్కర్లేదు కదా,,, అనుకుంటాం... ఈ సమస్యని మరింత పెద్ద ఎత్తునుంచి పరిశీలిద్దాం ..సినిమాలు ,ఆటలు మానేసి రాత్రింబవళ్ళు చదువుతున్న, మీకు చదువు పూర్తి చేసుకున్న వారు, ఉద్యోగం రాక అసంతృప్తితో ఉన్నారే... మీరు నిరుద్యోగులా??? యువకులకి నిరుద్యోగమే సమస్య అయితే ఈ ప్రపంచంలో 90 శాతం నిరుద్యోగులు ఉత్తమ ఉద్యోగాల పట్ల అసంతృప్తులై ఉన్నారు.... అది వారి సమస్య??? ఒకళ్ళ కింద పనిచేయటం అనేది నిరంతర సమస్య.... ఈ ఉద్యోగం కన్నా నరకం మేలు అనుకుంటూ ఉంటారు... అలా అని తమ ఉద్యోగంలో అత్యంత స్థానాన్ని చేరుకుని తమకి పై అధికారులు ఎవరూ లేని వాళ్ళు కూడా అసంతృప్తులై ఉండటం గమనించవచ్చు..... వారి సమస్యలు వారిని ఎలా అజమాయిషిలో ఉంచాలి.... వారి సమస్యలు ఎలా పరిష్కరించా,లి వారితో ఎక్కువ పని ఎలా చేయించా,లి అని వీళ్ళు నిరంతరం ఆలోచిస్తూ ఉంటారు..… ఈ విధులు నుంచి దూరంగా తట్టుకునే హాయిగా ప్రశాంతంగా బ్రతుకితే బాగున్ను.... అనుకుంటూ ఉంటారు ....మరి ఈ సమస్యకి పరిష్కారం రిటైర్మెంట్ ఆ???? అది అన్నిటికైనా పెద్ద సమస్య చాలా మంది ఉద్యోగస్తులు రిటైర్ అవ్వగానే ,అందులోని డిప్రెషన్ కి లోను కావటం ,మనం చూస్తూనే ఉంటాం....
మరెవరు సమస్యలు లేని వాళ్ళు?? జీవితంలో గొప్ప విజయాలు సాధించిన వాళ్ళా??? అది తప్పే!! ఆ మాటకొస్తే ఎక్కువ విజయాలు సాధించిన వాళ్ళకి, మరిన్ని ఎక్కువ సమస్యలు ఉంటాయి... ఎందుకంటే మరొక సమస్య రెడీగా ఉంటుంది

..అయితే ఆ సమస్య నీ పరిష్కరించుకోవటంలోనే గొప్పవాళ్లు నిరంతరం ఆనందం పొందుతూ ఉంటారు.... కాబట్టి వాళ్లకి జీవితం ఎప్పుడూ ఒక ఛాలెంజ్ గానే ఉంటుంది.... ఈ సమస్య గ్రహించిన మనిషి, విద్యార్థి దశ నుంచి సంతోషంగానే ఉంటాడు... గృహిణి అసూయ పడటం ,ఇంట్లో ఉండే స్త్రీని చూసి వర్కింగ్ లేడీ , ఈర్ష్య పడటం సహజం.... కోపిష్టి భర్త ,నిరాసక్త భర్త ,రెండో భార్య ఉన్న భర్త, ఈ విధంగా బాధలన్నీ గృహిణులకు సామాన్యమైనవేmmm అన్నీ ఉండి కూడా సుఖం లేదనుకునే స్త్రీలు... మనకి కొత్త కాదు... దీన్ని బట్టి తెలిసేది ఏమిటంటే ...మన శత్రువు ఎప్పుడూ మరణించడు.... ఆ శత్రువు మీద నిరంతరం విజయం సాధించడమే,మన సంతృప్తి.....

సమస్య తర్వాత సమస్య వస్తూనే ఉంటుంది.... సమస్య లేకపోతే ఆనందమే లేదు.... మీరు ఒక మనిషి యొక్క స్థితిని గమ్మత్తుగా ఊహించి చూడండి.... అతనికే సమస్యలు లేవనుకోండి, అతను చేయవలసిందిగా కేవలం తినడం, పడుకోవడం ఈ రెండే చేయలు అలా ఊహించండి..... 10 రోజుల కల్లా అతను పిచ్చెక్కిపోవటం ఖాయం........

2...సమస్య వయసు చిన్నది...

అవును సమస్య వయసు నిశ్చయంగా మన ఒక నా చిన్నది మనం పుట్టగానే ఒక సమస్య పుట్టి మరణించే వరకు మనతో పాటు అదే సమస్య ఉండదు. ఈ నిజాన్ని మనం అర్థం చేసుకుంటే మనకి విషాదమే లేదు మీరు ఏ సమస్య అయినా తెలుసుకోండి పరీక్షలు కోర్టు కేసులో మన దగ్గర వాళ్లతో వేదాభిప్రాయాలు రావలసిన డబ్బు చేతికి రాకపోవడం అనారోగ్యం మన దగ్గర వాళ్ళ మరణం ఇవన్నీ సమస్యలనుకుంటే ఇంట్లో ఏది మనతో పాటు జీవితాంతం ఉండబోవడం లేదు కెరటం వచ్చినట్లు ఒక సమస్య వస్తుంది కొంతకాలం ఉదుపుతంగా ఉంటుంది ఆ తర్వాత దాని ఒత్తిడి తగ్గిపోతుంది ఒకప్పుడు మనం ఎంతో పెద్ద సమస్య అనుకున్నది తర్వాత సమస్యగా దోచుక పోవచ్చు ఈ సమస్య నుంచి మనం ఎలా బయటపడగలం అనుకున్న సందర్భాలలో కూడా ఆ పార్టీకే మనం బయటపడే ఉంటాం ఒకప్పటి గొప్ప సమస్యే ,తర్వాత మనకి ఒక అనుభవంగా మిగిలిపోవచ్చు ఇంత పెద్ద సమస్యలో నుంచి బయటపడ్డామా అని మనకు ఆనందం కలిగించవచ్చు లేదా దీన్నే ఇంత పెద్ద సమస్యగా ఊహించుకున్నామా అని నవ్వు కూడా రావచ్చు సమస్య ఎప్పుడూ విజయం సాధించదు మనం దానికి లొంగిపోతే తప్ప ఒక వ్యక్తి చేసిన లేదా చేయని నేరానికి 50 జీవ కారాగార శిక్ష పడిందనుకుంటే కొంత కాలానికి జైలు నుంచి బయటకు వస్తాడు మళ్ళీ జీవితాన్ని ప్రారంభిస్తారు ఆ సమస్య కాల పరిమితి అతని జరిలో ఉన్నంతకాలం మాత్రమే జైల్లో కూడా అతను ఏదో ఒక పని చేస్తూ ఆనందంగా ఉండగలిగితే ఆ సమస్య ప్రభావం ఆ మాత్రం కూడా ఉండదు మనం జీవితాంతం సంపాదించిన డబ్బుంతా చిన్న తప్పు వల్ల కోర్టు కేసులో పోవలసి రావచ్చు ఆ జ్ఞాపకాన్ని పూర్తిగా వదులుకొని మళ్ళీ కొత్త జీవితం ప్రారంభించడం మొదలుపెడితే మళ్ళీ డబ్బు సంపాదించవచ్చ
ప్రేమించిన వ్యక్తితో వివాహం జరగటం లేదని నిద్ర మాత్రలు మింగిన అమ్మాయిలు ఆ తర్వాత చక్కగా సంసారాలు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం కదా కాబట్టి సమస్య యొక్క తీవ్రత మనం బాధపడినంత కాలం మాత్రమే ఉంటుంది మొత్తం ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన తుఫానులు కూడా మూడు నాలుగు రోజుల కన్నా ఎక్కువ కాలం ఉండవు. ఆ తర్వాత మళ్లీ సూర్యుడు వస్తాడు జీవితం యధాతధంగా ,కొనసాగుతుంది...
ఈ విషయం గ్రహించిన మనిషికి జీవితంలో ఇక తిరుగులేదు.......
3.... ప్రతి సమస్య వల్ల ఒక లాభం ఉంటుంది

ఈ విషయం చాలా చిత్రంగా తోచవచ్చు కానీ అక్షరాలా నిజం ప్రతి సమస్య వల్ల మనకి ఏదో ఒక లాభం ఉంటుంది కనీసం అనుభవం వస్తుంది బ్యాంకులో పనిచేసే రోజులలో ఒక కేసు నిమిత్తం నేను మొట్టమొదటిసారి కోర్టుకు వెళ్ళవలసి వచ్చింది. అప్పటివరకు ఓటు అంటే కేవలం సినిమాలలో చూడటమే తప్ప అనుభవం లేదు లాయర్లు బల్లగుద్ది వాదిస్తారని ముద్దాయి బోనులో నిలబడి ఆవేశంతో మాట్లాడుతాడని రకాల అపోహలు నాకు ఉండేవి ఆ రోజుల్లో నేను అభిలాష నవల వ్రాస్తూ ఉండేవాడిని ముద్దాయిని లాయర్లు ప్రశ్నలు వేశారు అన్న విషయం నాకు మొట్టమొదటిసారి అప్పుడే తెలిసింది సినిమాలలో చూసిన కోర్టు సీన్లకి మామూలు కోర్టులకి ఎంత తేడా ఉంటుందో ఆ తర్వాత అర్థమైంది అభిలాష నవల రాస్తున్నప్పుడు నాకు విషయం ఎంతగానో తోడ్పడింది మనకి అత్యంత ఆప్తులైన వారికి హార్ట్ ఎటాక్ వస్తే, మనం కంగారు పడటం విచారించడం సహజం అయితే ఆ అనుభవంతో హార్ట్ ఎటాక్ రాగానే అంబులెన్స్ ని ఎలా పిలవాలి ఎమర్జెన్సీ వార్డులో రోగిని ఎలా అడ్మిట్ చేయాలి మొదలైన విషయాలన్నీ తెలుస్తాయి ఒక సమస్య వల్ల మనకి నష్టం జరగవచ్చు కానీ తప్పకుండా దానివల్ల ఒక మంచి కూడా జరుగుతుంది బ్యాక్టీరియా వైరస్ లు ఇలాంటివన్నీ మనకి కీడు చేసేవే కానీ కొన్ని సంహారక మందులు రోగ నిరోధక టీకాలు చివరికి ఎలుకలు బోన్ తయారు చేసేవారి ఉపాధి వాటి మీదే ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు అన్నాడు సోక్రటీస్ తత్వానికి పరాకాష్ట అయిన ఈ స్టేట్మెంట్ చాలా చేదు సత్యం ప్రపంచంలో మనిషికి కీడు చేసే ఈ ప్రాణులు లేకపోతే కొన్ని కోట్ల మంది నిరుద్యోగులవుతారు చివరికి మరణం కూడా ఓటమి కాదు ఒక మనిషి మరణం ఒక కాటి కాపరిని కట్టెలు అమ్మే వాడిని పోషిస్తుంది అన్న విషయం తెలుసుకుంటే ప్రతి సమస్యకి ఏదో ఒక లాభం ఉండే ఉంటుంది అన్న సత్యం బోధపడుతుంది


4. అపజయం కూడా అనుభవమే....

ఏదైనా సమస్య గురించి ఎవరైనా ఒక సలహా ఇచ్చినప్పుడు, మీకేమిటండి ??డక్కా మొక్కలు తిన్న తర్వాత ఎన్నైనా చెప్పవచ్చు... అని అనటం... మీ అంత వయస్సు అనుభవం నాకు లేదు కదా... అని అనటం జరుగుతుంది.... అంటే అనుభవం వల్ల మనిషికి రాటుదేలతాడు అన్నమాట... ...మరి ప్రతి అనుభవం ఒక కష్టం వల్లే వస్తుంది కదా... కాబట్టి కష్టాల్ని మనం శత్రువులుగా భావించకూడదు.... అయితే కేవలం వయసు వల్లే అనుభవం వస్తుంది అనుకోవడం పొరపాటు.... 50 ఏళ్ళు దాటిన వాళ్లు కూడా చిన్న చిన్న కష్టాలకే బెంబేలెత్తి పోవడం మనం గమనిస్తూ ఉంటాం.... అలాగే కొందరు జీవితంలో పైకి వచ్చిన వాళ్ళు పాతికేళ్ల వయసులోనే ఎంతో నిబ్బరంగా ఎప్పుడూ నవ్వుతూ ఉండడం చూస్తూ ఉంటాం.... కాబట్టి వయసుకి అనుభవానికి సంబంధం లేదు....
అనుభవాన్ని మనం జీవితానికి ఎలా అనుభవించుకుంటాం అన్న పద్ధతి మీదే మన సంపూర్ణత్వం ఆధారపడి ఉంటుంది.....

ఎంతోమంది వ్యక్తుల్ని గమనించి చూడండి.... వారి కష్టాలలో మిమ్మల్ని ఊహించుకోండి... అదే కష్టం మీకు వస్తే మీరు ఎలాగా ప్రతిస్పందిస్తారో? ఆలోచించండి... ప్రతి మనిషి తన అనుభవం వల్లే పాఠాలు నేర్చుకో నక్కరలేదు... అవతల వాళ్ళ అనుభవాల నుండి కూడా మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటుంది.... బజారులో ఐస్ ఫ్రూట్ బండి వాడి కేక వినగానే నాకు అది కావాలి అని ఒక్క ఏడేళ్ల కుర్రవాడు ఏడుస్తూ ఉంటే.... 14 ఏళ్ల వాడి అన్నయ్య, ఒరేయ్... ఐస్ ఫ్రూట్ కోసం అంత ఏడుపు దేనికి అని మందలిస్తాడు... ఆ 14 ఏళ్ల కుర్రవాడు ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయి ఏడుస్తూ ఉంటే, అతడికి ,అక్కయ్య ఒక సబ్జెక్ట్ ఏ కదరా! వచ్చే నెలలో అది రాసి పై తరగతికి వెళ్ళిపోవచ్చు.... దానికోసం ఇంత ఏడుపు దేనికి అంటుంది ...ఆ అక్కయ్య పెళ్లి చూపుల్లో మగ పెళ్లి వారు అమ్మాయి అందంగా లేదండి ,మాకు నచ్చలేదు అని తిరస్కరించి వెళ్ళిపోతే దిండు తడిచేలా ఆమె రాత్రంతా ఏడుస్తూ ఉండడం గమనించవచ్చు.... దీని బాబు లాంటి సంబంధం ఇంకొక్కటి వస్తుంది లేవే అని తల్లి ఆ అమ్మాయిని ఓదారుస్తుంది.... అలాగే తల్లి తన భర్తకి ఇంకొక స్త్రీతో సంబంధం ఉండిందన్న రహస్యం అకస్మాత్తుగా బయటపడి, కుమిలిపోతూ ఉంటే ,ఆవిడ తండ్రీ కూతుర్ని ఎప్పుడో ఏడేళ్ల క్రితం జరిగిన దానికి ఎంత ఏడుపు దేనికే... అని మందలించవచ్చు... దీన్ని బట్టి అర్థమయింది ఏంటంటే ,,మన యొక్క మానసిక స్థితి గతుల మీదే మన ఏడుపు ఆధారపడి ఉంటుంది ....

పరీక్ష పోతే ఏడ్చే వాడికి, ఐస్ ఫ్రూట్ కోసం ఏడ్చే కుట్రాడి ఏడుపు, చాలా చిన్నది అనిపిస్తుంది... అనుభవాలతో రాటుదేలటం అంటే ఇదే.... దీనికి వయసుతో నిమిత్తం లేదు అవగాహన చాలు.......

కష్టం కన్నా పై స్థాయికి వెళ్లి ఆలోచించగలిగితే ఆ కష్టం వల్ల ఏడుపు రాదు.....

5.నష్టం తీవ్రత


ప్రతి యుద్ధంలోనూ మనమే విజయం సాధించలేకపోవచ్చు... కొన్ని కొన్ని సమస్యలు మనల్ని ని లోకం ముంచేయవచ్చు ...ఒక్కోసారి మన శత్రువు మన మీద తిరుగులేని దెబ్బ తీయవచ్చు.... సమస్య నుంచి మనం బయటపడలేని పరిస్థితులు ఎదురవవచ్చు ...అయితే జరిగిన నష్టం వేరు ,అది మనకి కలుగజేసే నష్టం వేరు......దీనికి

ఒక ఉదాహరణ చెబుతాను... ఒక రాజు మరో దేశంపై దండెతాడనుకోండి ...అక్కడేమీ ప్రతిఘటన ఎదురవ్వలేదు... కోట ద్వారాలు తెరిచి సైనికులు నిలబడ్డారు... అతడు తన సైన్యంతో లోపలికి దూసుకుపోయి అంతా చిన్న విన్నం చేశాడు ...అంతఃపురంలోకి వెళ్లి మొత్తం అల్లకల్లోలం సృష్టించాడు... ఆ తర్వాత అతడికి తెలిసింది... అంతకుముందు రోజే ఆ దేశపు రాజు సన్యాసం స్వీకరించి అడవులకి తపస్సు చేసుకోవడానికి వెళ్లిపోయాడని.... ఇక్కడ నష్టం జరిగింది కానీ ,,,,ఓడిపోయిన రాజుకి సంబంధించిన అంతవరకు ఏ నష్టము కలగలేదు ...పై పెచ్చు గెలికిన రాజుకే నష్టం జరిగింది...

ఒక మిత్రుడి ఉదాహరణ చెబుతాను... కారు యాక్సిడెంట్ వల్ల ఒక రోడ్డు కేసులో అతడికి జుల్మానా పడింది ....అతడు ఆ రోజు సాయంత్రం క్లబ్బులో వెయితో వదిలినందుకు పార్టీ ఇస్తూ నాకు ఈ సాయంత్రం ఎంత ఆనందంగా గడపడానికి ఒక అవకాశాన్ని భగవంతుడు ఇచ్చాడు..... అని సంతోషం ప్రకటించాడు... అలా కాకుండా కేసు నడుస్తున్న ఆరేళ్ల కాలం తర్వాత, కేసులో ఓడిపోయినందుకు దాని గురించి ఎంతో మదనపడి పరువు ప్రతిష్టల గురించి ఆలోచించి ఆరు నెలల పాటు మనసు పాడు చేసుకున్న వాళ్లు, కూడా మన చుట్టూ తిరుగుతూనే ఉంటారు....

6. శత్రుసంహారం

శత్రువులు అంటే మనుషులే కాదని శత్రువు ఏ రూపంలో నున్న మనల్ని దెబ్బతీయ వచ్చని ముందు నుంచి చెప్పడం జరిగింది.... శత్రువు యొక్క బలాన్ని తెలుసుకుంటే మనకి అతడు ,లేదా ఆ సమస్య కలిగించబోయే నష్టం యొక్క తీవ్రత తెలుస్తుంది....

ఉదాహరణకి ఒక వ్యక్తికి యాక్సిడెంట్ జరిగి కాలు పూర్తిగా తీసేయవలసిన పరిస్థితి ఏర్పడిందనుకుందాం.... కాలిపోయినందుకు అతడు బాధపడతాడు... కానీ అంతగా భయపడడు కానీ కాలు తీసేసిన తర్వాత ఒక కొయ్య కాలు అమర్చుకొని తిరగాలి... అనుకుంటాడు ఆసుపత్రిలో పక్క మీద పడుకొని భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు.... కొంతకాలానికి కొయ్య కాలుకి అలవాటు పడతాడు ఆ కాలు అతని జీవితంలో ఒక భాగమైపోతుంది...

అదే ఒక వ్యక్తికి ఇంకొక నెల రోజుల్లో ఉద్యోగం పోతుంది... అన్న విషయం తెలిసిందనుకుందాం. ఈ నెల రోజులు నిద్రలేమిటో బాధపడుతూ ఉంటాడు.... తర్వాతే ఏం చేయాలో తన జీవితం ఏమవుతుందో అని ఆలోచిస్తాడు.... తన భార్య, పిల్లలు ,తన భవిష్యత్తు ఏమవుతుందో ....అని దిగులు చెందుతాడు.... నిజానికి ఉద్యోగం పోవటం కన్నా ,కాలు పోవడం పెద్ద విపత్తు అయినా సరే మనిషి రెండో దానికి ఎక్కువ బాధపడతాడు ....

కారణం జరిగిన నష్టం, కలిగించే బాధ కన్నా, జరగబోయే నష్టం...తాలూకు, ఆలోచనల భయం ఎక్కువ...

ఒక వ్యాపారవేతకి ఆకస్మాత్తుగా వ్యాపారంలో నష్టం వచ్చి సర్వం కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందనుకుందాం.... దాన్నుంచి బయటపడడానికి మార్గం ఏమిటి?? భార్యా పిల్లలతో అక్కడి నుంచి పారిపోవటమా? తాగుడుకు అలవాటు పడటమా??? ఆత్మహత్య చేసుకోవటమా?? ఇవేమీ కాపు మరీ దొంగ పద్ధతులలో డబ్బు సంపాదించడం ???అక్రమార్గాలలో ఇవన్నీ పద్ధతులు కాకపోవచ్చు.... ఎందుకంటే వీటి వల్ల మరిన్ని నష్టాలు ఉన్నాయి.... చట్టం వెంటాడవచ్చు... సమాజంలో పరువు పోవచ్చు... పట్టుబడితే జైలుకి వెళ్ళవలసి రావచ్చు... అన్ని కోల్పోయిన జరిగే నష్టం ఏముంటుంది
... మనకి అప్పిచ్చిన వాళ్ళందరినీ కూర్చోబెట్టి జరిగింది... వివరిస్తే వాళ్లు మాత్రం ఏం చేయగలరు న్యాయబద్ధంగా దివాలా పిటిషన్ కోర్టులో వేస్తే ఎవరు మనకి ఏమీ చేయలేరు... అక్కడినుంచి జీవితాన్ని పునర్మి నిర్మించుకోవచ్చు... అలా కాకుండా తాగుడు ఆత్మహత్య లాంటి పద్ధతుల్ని ఆశ్రయిస్తే మన శత్రువు మనల్ని గెలిచాడు అన్నమాట....

ఆ శత్రువు ఎవరో కాదు సమస్య మన యుద్ధం దానితోనే.....

యుద్ధం ఒక కళ


మంచి వాళ్లకే కష్టాలు వస్తాయి... చాలా పాత సినిమా డైలాగు ...

ఇది కష్టాలు వచ్చాయి కాబట్టి ...మనం మంచి వాళ్ళం అనుకోవడం అంతకన్నా స్టుపిడిటీ.... కష్టాలు అందరికీ వస్తాయి... మంచి వాళ్ళకి ,చెడ్డ వాళ్లకి అందరికీ వస్తాయి ....అసలు ఈ ప్రపంచంలో వీళ్లంతా మంచివాళ్ళు ,వీళ్లంతా చెడ్డవాళ్ళు, అని రెండు రకాలు ఉండరు... కేవలం మనుషులు ఉంటారు ... మనుషుల్లాగా కష్టమో సుఖము రెండు ఉంటాయి ...దేవుడు మంచి వాళ్ళని కష్టాల నుంచి బయట పడేస్తాడు... ఇది నిరర్దకరమైన వాదన.... మన మంచితనమే మనల్ని కాపాడుతుంది ....అనుకుంటూ కూర్చుంటే సర్వనాశనం అయిపోతాం. ఈ ప్రపంచంలో ఎవడు నేను మంచివాడిని కాదు అనుకుంటూ... బతకడు కదా!!! అలాగని ప్రతి మనిషి తాను మంచివాడు కాబట్టి కష్టాల నుండి తన మంచితనమే తనని బయటపడేస్తుందనుకోవటం సమస్యకి పరిష్కారం కాదు
..వార్త పత్రికలలో, దినపత్రికలలో, సమస్యలు జవాబులు శీర్షిక నేను నిర్వహించేటప్పుడు, కొన్ని వందల ఉత్తరాలు వచ్చేవి అప్పటివరకు నాకు మనుషులు ఎన్ని రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు.... అన్నా అవగాహన లేదు.. వాటిలో కొన్ని కష్టాలు చాలా తీవ్రమైనవి బాధాకరమైనవి... మరికొన్ని కష్టాలు చాలా హాస్యాస్పదమైనవి... అయితే నేను హాస్యాస్పదం అనుకున్న కష్టాలు కూడా అవి అనుభవించే వారికి చాలా పెద్ద సమస్యలుగా ఉండబట్టే కదా సలహా కోసం రాశారు.... ఈ సంఘటన పరిశీలించండి...

ఒకరోజు ఒక కుర్రవాడు తన సమస్యని చెప్పుకోవటానికి నా దగ్గరికి వచ్చినప్పుడు, మరొక వ్యక్తి కూడా అదే పని మీద రావడ సంభవించింది.... అతని తండ్రి వీలునామా రాయకుండా మరణించాడు ....నలుగురు పిల్లలు ...దాయాదులు అతని మీద
దావా వేసి మొత్తం ఆస్తంతా కోర్టులో నెగ్గారు... కట్టుబట్టలతో వీధిన పడవలసిన పరిస్థితి అతనిది... అతనికి కావలసిన ధైర్యాన్ని అనుసరించవలసిన వ్యూహాన్ని చెప్పి పంపిన తర్వాత ,మొదటి కుర్రవాడితో సంభాషణ కొనసాగించాను.. తను ఒక అమ్మాయిని గత మూడు నెలల నుంచి ప్రేమిస్తున్నానని ప్ర,తి రోజు స్కూలు వరకు ఆమె దింపుతానని ,ప్రస్తుతం ఆమెకి వివాహం నిశ్చయమైంది కాబట్టి, తాను ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నట్లు ఆ కుర్రవాడు చెప్పాడు....

ఆత్మహత్య వల్ల ఉపయోగం ఏముంది... కేవలం మూడు నెలలు ఆ అమ్మాయిని స్కూల్ దగ్గర దింపడం తప్ప నువ్వు కోల్పోయింది ఏముంది ...ఇప్పుడే ఒక వ్యక్తి తన సమస్యను చెప్పడం విన్నావు కదా ఆ సమస్యతో పోల్చుకుంటే..... అని నేను ఇంకా మాట్లాడబోతూ ,,,,,ఉంటే ఆ కుర్రవాడు ఆ సంభాషణని మధ్యలో ఆఫ్ చేసి, నా సమస్యతో పోల్చుకుంటే ,,,అదే ఏం ఉంది సార్ మొత్తం ఆస్తి పోయినా ఎలాగో ఒకలాగా బ్రతకవచ్చు ...ప్రేమలో ఫెయిల్ అయిన తర్వాత బతకడం ఎంత కష్టమో మీకేం తెలుసు ??అన్నాడు ....ఒక గొప్ప పాఠం నేర్చుకున్నట్లు అయింది... నాకు అతని మాటల వల్ల నిజమే ఎవరి సమస్య వారికి చాలా పెద్దది .......కానీ ఏది అధిగమించడానికి వీలైనంత పెద్దది కాదు అదే తెలుసుకోవాల్సింది.... ఈ విషయాన్ని మనం ఈ పుస్తకంలో ముందు ముందు లోతుగా చర్చిద్దాం......

యుద్ధం చేయటం ఒక కళ యుద్ధం లేకుండా గెలవగలిగితే అంతకన్నా కావలసింది ఏమీ లేదు ....ఎందుకంటే ఎక్కడైతే యుద్ధం లేదో అక్కడ ఓటమి లేదు... అలసట లేదు కానీ అలాంటియుద్ధం లేని పరిస్థితులు సమాజంలో కానీ ,జీవితంలో కానీ లేవు... నేను ఏదో ఒక నవల లో ఈ విషయం రాస్తూ చెంఘిజ్ ఖాన్ గురించి ఉదాహరణ ఇచ్చాను.....

మంగోలియా మంచు ఎడారులలో తాను బ్రతకడం కోసం నిరంతరం యుద్ధం చేస్తూ,చెంఘీజ్ ఖాన్ ఎంతోమంది శత్రువులని చంపి వేశాడు... అతని తమ్ముడు ఒక శాంతి దూత అతడికి యుద్ధాల పట్ల ఏ విధమైన ఆసక్తి లేదు... ఆ విధంగా తడుతన అన్నయ్య అని చాలా అసహ్యించుకునేవాడు ...తమ్ముడి కోసం చెంఘీజ్ ఖాన్, ఒక చిన్న సామ్రాజ్యాన్ని స్థాపించి దానికి అతడిని రాజుని చేస్తాడు.... అధికారం దొరకగానే ఆ తమ్ముడు శాంతి ప్రతిష్టించడం కోసం ఎన్నో కార్యాలు చేపడతాడు....

నృత్యాలు, గానాలు విందులో వినోదాలు, రైతులు పచ్చటి ఫైర్లు కళాభివృద్ధి పరిశ్రమలు దేశం సంవత్సరం తిరిగేసరికల్లా కలకలలాడుతూ, అన్ని విధాలా అభివృద్ధి సాధిస్తుంది... ఒకరోజు రాత్రి చింఘిజ్ ఖాన్ వచ్చి తమ్ముడు సైన్యంలో ఉన్నత పదవులలో ,ఉన్న కొన్ని వందల మందిని తన సైన్యంతో ఊచకోత కోయిస్తాడు... పొద్దున లేచి ఆ రక్తపాతం చూసిన తమ్ముడు దిగ్భ్రాంతుడవుతాడు.....

అప్పుడు చెంఘీజ్ ఖాన్, తన తమ్ముడితో ఈ విధంగా అంటాడు... నువ్వు కేవలం అభివృద్ధి వైపే చూశావు ...కానీ దాన్ని రక్షించుకోవడానికి నువ్వే ప్రయత్నం చేయలేదు.... నువ్వు సంవత్సరం పాటుపడిన కష్టమంతా రాత్రికి రాత్రి దోచుకోవడానికి నీ సైన్యంలోనే చాలామంది శత్రువులు చేరారు.... ఎప్పుడైతే నువ్వు బలహీనుడివి అయిపోయావు... నీ కష్ట ఫలితాన్ని అంతా నియమించి నీ సైన్యంలో ఉన్న శత్రువుల జాబితా తీసుకున్నాను... ఆ రక్తపాతానికి కారణం అదే ....

గొప్ప నీతి ఉన్న కథ ఇది ...మనం మంచి వాళ్ళం అనుకుంటూ, మనల్ని దేవుడే రక్షిస్తాడు అనుకుంటూ ,ఉంటే ఈ విధంగానే మనం అన్ని తప్పదు ...అలాగని అవతల వాళ్ళని చంపటమే మన జీవితాశయంగా పెట్టుకోమని చెప్పడం ...నా ఉద్దేశం కాదు... మనల్ని మనం రక్షించుకోవలసిన బాధ్యత మనదే.....

2000 సంవత్సరాల క్రితం సుంజు రాసిన యుద్ధ వ్యూహాపు పుస్తకాన్ని ఒకసారి చూస్తే, అది జీవితానికి ఎలా అన్వయించుకోవాలో కూడా నేను ఒక పుస్తకం లాగా రాసుకున్నాను చాలా సరదా అయిన ఉదాహరణ ఇది.....

సుంజు యుద్ధ వ్యూహం గురించి చెప్తూ ఈ క్రింది పాయింట్లని వివరంగా చర్చించాడు....
ఒకటి : మన సైన్యంలో ఉన్న వాళ్ళు ,అవతల సినికాధి కారుల కన్నా సమర్థులై ఉండాలి....

రెండు:- మంచులో ఎడలో నిగ్రహారాలు లేకపోయినా, పోరాడ కలిగి ఎంత సామర్థ్యంతో మన యుద్ధాన్ని ప్రారంభించాలి...

మూడు:- ఊహించుకొని కోణంలోంచి విపత్తు వస్తే తట్టుకోగలిగే ధైర్యం ఉండాలి...

నాలుగు:- శత్రువు గురించి సరియైన అవగాహనతో అంచనా వేయగలిగి ఉండాలి...

ఐదు:- అప్పుడప్పుడు శత్రువుని మోసం చేసి కూడా గెలవగలిగితే, తెలివితేటలు సంపాదించుకోవచ్చు...
ఆరు:- శత్రువుకి ఎర్ర చూపించి ఉచ్చులోకి లాగానే ....

ఏడు :-శత్రువుకి దొరక్కకుండా ఇబ్బంది పెట్టాలి ....


ఎనిమిది:- సాధ్యమైనంతవరకు ప్రత్యక్షయుద్ధ ప్రకటన చేయకుండా, గెరిల్లా పద్ధతులు అవలంబించాలి ...


9:-శత్రువు యొక్క బలహీనతలు గుర్తించాలి
చుట్టూ విడుపు తప్పనిసరిగా అలవర్చుకోవాలి.....
ఇప్పుడు ఈ యుద్ధ వ్యూహాన్ని మనం ఒక కొత్త పెళ్లి కూతురికి అన్వయించి చూద్దాం...

రణరంగం :----అత్తగారిల్లు

సైనికులు:--- మన తరపున సైన్యం ఎవరూ లేరు... మనము ఒక్కళ్ళమే

శత్రువులు :--, తోడికోడలు ఆడపడుచు, బావ ,మరిది ,మామగారు...

గెలుపు:--- భర్త /సంసారం ...





భగవంతుడు, స్త్రీని సృష్టించినప్పుడు రక రకాల జంతువు నుంచి, వివిధ గుణాలను సేకరించాడు.... కుందేలు నుంచి నాజూకుతనాన్ని, నక్క నుంచి చమత్కారాన్ని, జింక నుంచి వేగాన్ని ,పిల్లి నుంచి కూతూహలాన్ని మిడత నుంచి చురుకుదనాన్ని, కోతి నుంచి అవతలి వారిని ఆనందపరిచే గుణాన్ని ,గాడిద నుంచి బరువు మోసే ఓపికని ,పక్షుల నుంచి గొంతుని, నెమలి నుంచి అందాన్ని, తీసుకొని స్త్రీని సృష్టించాడు.... మెదడు మాత్రం స్త్రీకే వదిలిపెట్టాడు.... కానీ ఎలా మార్చుకోగలిగితే ,అలా మార్చుకో అన్న స్వేచ్చని ఆమెకే అప్పజెప్పాడు


అటువంటి స్త్రీ పెళ్లి అత్తగారింట్లో ప్రవేశించి రుణాల రంగం సిద్ధంగా ఉంది... శత్రువులందరూ, వచ్చిన కొత్త కోడలి మీద అత్తమాధికారాన్ని నిరూపించుకుని ఆదిక్యత జలాయించడం కోసం కత్తులు దూసి సిద్ధంగా ఉన్నారు.... పుట్టింట్లో ఆ అమ్మాయికి కొన్ని అలవాట్లు( ఆలస్యంగా నిద్రలేవటం వగైరా) ఉంటాయి. దీనికోసం "సుంజు" రాసిన యుద్ధ వ్యూహాన్ని ఇక్కడ ఒక్కొక్క పాయింట్ అన్వయించి చూద్దాం....

యుద్ధం లేకుండా గెలవడం చాలా కొంతమంది అదృష్టవంతులైన కొత్త పెళ్లికూతుళ్ళకి మాత్రమే సాధ్యమవుతుంది.... కాబట్టి ఆ పాయింట్ వదిలిపెడదాం....


ఒకటి అవకలి సైన్యంలో మన వైపు సానుభూతిపరులు ఎవరో గ్రహించాలి... సాధారణంగా బావగారు, మామగారు కొత్త పెళ్లికూతురు పట్ల ఆ విధమైన సానుభూతితో ఉంటారు.... వారి మెప్పు పొందటానికి ప్రయత్నించాలి అత్తగారింట్లో ప్రవేశించగానే అక్కడి వ్యక్తుల మనస్తత్వాన్ని అంచనా వేయాలి... ఇంట్లో అప్పటీకే బలి అయిన ఒకరు ఉంటారు... అది అత్తగారు కావచ్చు, తోడికోడలు కావచ్చు, లేదా ఆడపడుచు కావచ్చు, సాధారణంగా వారితో రాజీ చేసుకుంటే సమస్య చాలా వరకు తగ్గిపోతుంది.... కానీ వారుతో రాజీ పడటం అంత సులభంగా ఒప్పుకోరు ....తమకింద అణిగి మణిగి ఉన్నట్టు బానిసత్వం ప్రకటిస్తే తప్ప ....రాజీ సాధ్యం కాదు....

అప్పుడు అదే కుటుంబంలో రెండవ స్థానంలో ఉంటూ పోరాడుతున్న మరొక వ్యక్తికి మనం వెతికి, ఇద్దరూ కలిసి మొదటి స్థానంలో ఉన్న వ్యక్తి బలాన్ని తగ్గించవచ్చు.....

సాధారణంగా తోడికోడలికి ,అత్తగారికి అప్పటివరకు ప్రచ్చన్న యుద్ధం జరుగుతూ ఉంటుంది.... మనం ఎవరి వైపు చేరాలా అన్నది త్వరగా నిర్ణయించుకోవాలి.... అదే పద్ధతిలో నేను యువతని పక్షంలో ఉండడంవల్ల నాకు ఎక్కువ నష్టం కలుగుతుంది ....కాబట్టి నన్ను మంచి చేసుకుని అధికారాన్ని నాకు అప్పగించడం వల్ల నువ్వు లాభం పొందుతాకుని, మొదటి స్థానంలో ఉన్న మన ప్రత్యర్థికి ఇండైరెక్టుగా సూచనలు ఇస్తూ ఉండాలి.... ఈ విధంగా అవతలి సైన్యంలో సామర్థ్యం ఉన్న వాళ్ళని, మన వైపు తిప్పుకోవడం యుద్ధ వ్యూహంలో మొట్టమొదటి ప్రక్రియ ....

రెండు:---- మూడు, నాలుగు నెలలకే యుద్ధం అంతమైపోవచ్చు.... మొత్తం అధికారాలన్నీ మన కప్ప చెప్పి అత్తగారు కృష్ణా, రామా అనుకుంటూ కూర్చోవచ్చు ...కానీ ఇది కూడా చెప్పినంత సులభంగా సాధ్యమయ్యే విషయం కాదు... మనసులో ఎండాలో నిద్ర హారాలు లేకుండా సైనికులు గెలిచే వరకు పోరాడినట్లే ....మనం కూడా చివరి వరకు పోరాడవలసి వస్తుంది..... దానికి సిద్ధపడి ఉండాలి మధ్యలో చేతులు ఎత్తేయకూడదు....

మూడు:---- యుద్ధంలో వచ్చినట్టే కొత్తకోడలికి ఊహించని కోణం నుంచి విపత్తులు సంభవిస్తూ ఉంటాయి..... ఉదాహరణకి అత్తగారింట్లో అడుగుపెట్టగానే ఆడపడుచు తన వీడితే అవ్వటం వల్ల, చాలా మంచి దానిలాగానో, తన స్నేహితురాలిలాగానో, కనపడవచ్చు.... అందువల్ల ఈ కొత్త పెళ్లికూతురు మనసులో మాటలన్నీ ఆమెకి చెప్పుకుంటూ ఉండవచ్చు.... ఏదైనా ఒక చిన్న మనస్పర్ధ వల్ల ఆడపడుచు, వెళ్లి తన తల్లికి కొన్ని చెప్పకూడని విషయాలు చెప్తే అదే ఊహించని ప్రమాదం ....... అలాగే మీరు మీ తోడికోడలతో, మీ అత్తగారి గురించి పాస్ చేసిన ఒక కామెంట్ మరొక సందర్భంలో అగ్నిపర్వతం లాగా పేలిపోయే ప్రమాదం ఉంది ...ఇలా ఒప్పించని కోణాల నుంచి వచ్చే ప్రమాదాన్ని తట్టుకోగలిగే సామర్థ్యం ఉండాలి....

నాలుగు :----శత్రువు గురించి సరైన అంచనా వేయగలగాలి ...అతడి బలహీనతలు గుర్తించాలి.... అవి యుద్ధ వ్యూహంలో చెప్పడం జరిగింది... ప్రతి మనిషికీ కొన్ని బలహీనతలు ఉంటాయి... ఆ బలహీనతలని మనకు అనుగుణంగా, ఉపయోగించుకోవడం ద్వారా మనం సుస్థిర స్థానాన్ని సంపాదించుకోవచ్చు...

ఉదాహరణకు అత్తగారి మార్నింగ్ షోలు, మామగారి భాగవతపఠనం మొదలైనవి....

ఐదు :---అప్పుడప్పుడు శత్రువుని మోసం చేసి, గెలవవలసిన పద్ధతి కూడా ఏర్పడుతుంది... తన,కి తన భర్తకి మధ్య సరైన సంబంధాలు లేవని ,అత్తగారికి సూచనప్రాయంగా తెలియజేస్తూ, ఆమె సానుభూతి పొందుతూ, ఆమెకి పేదరికం ఆపాదించి ,సలహాలను అడుగుతూ మరోవైపు భర్తతో చాలా హాయిగా కాపురం చేసుకునే విధానం, ఈ కోవకే చెందుతుంది.....


ఆరు :----శత్రువుకి ఎర్ చూపించి గెలవడం కూడా యుద్ధ వ్యూహంలో ఒక భాగమే..... ఇలాంటి ఎరలకి సాధారణంగా మమగార్లు బాగా సూట్ అవుతారు ....ఆయనకి ఇష్టమైన పిండివంటలు చేసి పెట్టడం,, ఆయనతో చదరంగం ఆడడం ,ఆయనకి అభిరుచి ఉన్న విషయాల గురించి మాట్లాడటం, మొదలైనవి.... ఈ విధమైన ఎరలే బావలు, మరదలు కూడా ఓకే గాని, ఇందులో కాస్త, ప్రమాదం ఉంది....


ఏడూ:--- ఒక్కొక్కసారి పని అంతా కొత్త కోడలు మీదకే తోసేసి ,మగవాళ్ళకి మాత్రం ఆ పని అంతా తామే చేసినట్లు ప్రకటించుకునే అత్తలు ,తోడికోడళ్ళు కూడా తరచూ కనబడుతూ ఉంటారు..... అలాంటప్పుడు శత్రువుకు దొరకకుండా ఇబ్బంది పెట్టడం, అని "సుంజు" చెప్పిన యుద్ధ వ్యూహం పనికి వస్తుంది....

ఉదాహరణకి ఆఫీసు నుంచి వచ్చిన కొడుకుకి టిఫిన్ ఇస్తూ చాలా కష్టపడి నీకోసమే చేశాను రా ,ఈ టిఫిన్ అని ఇన్ డైరెక్ట్ గా అర్థం వచ్చేట్టు అని అత్తగారు చాలా ఆప్యాయంగా పక్కన కూర్చోబెట్టుకుని తినిపిస్తుందనుకోండి.... నిజానికి అంత కష్టపడింది.... ఆ టిఫిన్ చేసింది మీరే ఆ విషయం భర్తకి తెలియ చెప్పాలంటే, రెండు చెంచాల ఉప్పు అందులో ఎక్కువ వేస్తే చాలు..... అత్తగారి పరిస్థితి బోనులో పడ్డ ఎలుకల తయారవుతుంది....


సాధ్యమైనంత వరకు యుద్ధ ప్రకటన చేయకండి.... అత్తవారితో యుద్ధం ప్రారంభమైతే భర్త ,తల్లి పక్షానే చేరుతాడు.... అందువల్ల గెరిలా యుద్ధమే మంచిది....

అది కాకా నీకు మీ అత్తగారికి మధ్య, పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది అన్న విషయం మీ భర్తకి తెలిస్తే .....అనవసరంగా అతడికి మానసిక క్షోభ......

యుద్ధం లేకుండా సాధ్యమైనంతవరకు మిమ్మల్ని మీ అత్తగారు ఇబ్బంది పెట్టకుండా చూసుకొని ,పరిస్థితిని వదిలిపెట్టడమే మంచిది.... నాతో పెట్టుకోకు, పెట్టుకుంటే పటాస్ అవుతావు ... జాగ్రత్త... అన్న ఇన్ డైరెక్ట్ సజెషన్స్ ఇస్తూ మన స్థానం కాపాడుకోవడం అన్నమాట.... అన్నిటికన్నా చివరిది ముఖ్యమైనది.... రాజీ, పట్టు విడుపు, ఉండాలి... ఇక్కడ మన శత్రువులందరినీ నాశనం చేసి మన సామ్రాజ్యం స్థాపించుకోవడం కాదు... మన ముఖ్య ఉద్దేశం.... మన ఇంటిని నందనవనం చేసుకోవటం, అందరికీ ఆప్యాయత ప్రేమ పంచివటమే, మన ఆశయం మనం నిర్వర్యమముతో ,మనతో ఎవరన్నా సమరం సాగించ దలచుకుంటే, వారితో యుద్ధం చేస్తాం... లేదా స్నేహస్తం చాపుతాం... ఇదే "సుంజు "చెప్పినా ఆఖరి పాయింట్ ....


ఒకసారి మీ ఇంట్లో మీ స్థానాన్ని సుస్థిరం చేసుకున్న తర్వాత, మీరు అత్తగారయ్యే పరిస్థితి వస్తుంది ....అప్పుడు మీ ఇంటికి వస్తున్న కొత్త కోడలు మీ కన్నా తెలివితేలు కలది పెద్ద వ్యూహాన్ని ఇంకా బాగా ఆకలింపు చేసుకున్నది.. అయి ఉండవచ్చు... అప్పుడు మీరు ఆమెతో యుద్ధం ప్రకటించకండి ...స్నేహ హస్తం కి ఆప్యాయంగా ఇంతు పొదిరింటిలోకి ఆహ్వానించండి....

2000 సంవత్సరాల క్రితం ఒక చైనీస్ యోధులు చెప్పినా యుద్ధనీతి ఇది

నిరంతరం మన జీవితాలకు అన్వయించుకోదగ్గది... కౌటిల్యుడి అర్థశాస్త్రం ఎంత గొప్పదో... ఇది కూడా అంత గొప్పదే..


"ఆ టాప్ వార్"

ఈ విధంగా జీవితం ఒక యుద్ధమన్న ప్రతిపాదిక మీద మనం ఇక ముందు జీవితంలో తెలుసుకోవాలి........



*******దన్యవాదములు*******